భీమవరంలో ‘ద్రుష్ట’ ప్రారంభం
భీమవరంలో ‘ద్రుష్ట’ ప్రారంభం
Published Wed, Sep 21 2016 9:55 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM
భీమవరం :చేపల రాము సమర్పణలో వినయ్ ఆర్ట్స్ క్రియేషన్స్ విదీష ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున ్న ‘ద్రుష్ట’ సినిమా షూటింగ్ బుధవారం భీమవరంలో ప్రారంభమైంది. అరుంధతీ శ్రీను దర్శకత్వంలో కె.లోకేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో రుషి, స్నేహ పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నట్టు దర్శకుడు చెప్పారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో 20 రోజుల పాటు షూటింగ్ జరపనున్నట్టు తెలిపారు.
Advertisement
Advertisement