రాజధానిలో 'ఖయ్యూం భాయ్' షూటింగ్
రాజధానిలో 'ఖయ్యూం భాయ్' షూటింగ్
Published Sat, Dec 17 2016 10:47 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM
చిత్ర దర్శకుడు పారేపల్లి భరత్
ప్రకాశం బ్యారేజి (తాడేపల్లి రూరల్): రాజధాని నిర్మాణం చేపట్టిన తరువాత చిత్రీకరించిన మొట్టమొదటి సినిమా 'ఖయ్యూం భాయ్' అని చిత్ర దర్శకుడు పారేపల్లి భరత్ అన్నారు. శనివారం ఖయ్యూం భాయ్ చిత్ర విశేషాలు తెలిపేందుకు ప్రకాశం బ్యారేజీ చాంపియన్ క్లబ్ బోటులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సాయి ఊహా క్రియేషన్స్ పతాకంపై మందడం గ్రామానికి చెందిన కట్టా రాంబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం నయీం జీవితం ఆధారంగా తీస్తున్నామని, హీరోగా తారకరత్న నటిస్తున్నారని తెలిపారు. నిర్మాత కట్టా శారద చౌదరి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు సహకారం అందించాయని, జనవరిలో ఈ చిత్రం విడుదల చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి గంజి చిరంజీవి, జెడ్పీ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement