టాటా సఫారి స్టార్మ్‌లో కొత్త వేరియంట్ | Tata Safari Storme Facelift Launched; Prices Start at Rs. 9.99 Lakh | Sakshi
Sakshi News home page

టాటా సఫారి స్టార్మ్‌లో కొత్త వేరియంట్

Published Wed, Jun 3 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

టాటా సఫారి స్టార్మ్‌లో కొత్త వేరియంట్

టాటా సఫారి స్టార్మ్‌లో కొత్త వేరియంట్

ధరలు రూ.9.99 లక్షల నుంచి...
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) సఫారి స్టార్మ్‌లో అప్‌డేటెడ్ వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధరలు రూ.9.99 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ హొరైజన్ నెక్స్ట్‌వ్యూహాంలో భాగంగా ఈ కొత్త సఫారి స్టార్మ్‌ను అందిస్తున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) గిరీష్ వాఘ్ చెప్పారు.

ఈ కొత్త సఫారి స్టార్మ్‌లో ఎక్స్‌టీరియర్స్‌ను, ఇంటీరియర్స్‌ను కొత్తగా డిజైన్ చేశామని, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డ్యుయల్ ఎయిర్-కండీషనింగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లున్నాయని వివరించారు. 1998లోనే సఫారి ఎస్‌యూవీని మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటివరకూ 1.2 లక్షల యూనిట్లను విక్రయించామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement