tata motors company
-
టాటా మోటార్స్ నష్టాలు రూ.188 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.188 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. దేశీయ మార్కెట్లో నెలకొన్న మందగమనం ఈ కంపెనీపై బాగానే ప్రభావం చూపించినప్పటికీ, గత క్యూ2లో వచి్చన నష్టాలు(రూ.1,009 కోట్లు)తో పోలి్చతే నష్టాలు బాగానే తగ్గాయి. గత క్యూ2లో రూ.71,981 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.65,432 కోట్లకు తగ్గిందని టాటా మోటార్స్ తెలిపింది. అయితే స్డాండ్‌అలోన్ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.109 కోట్ల నికర లాభం రాగా ఈ క్యూ2లో మాత్రం రూ.1,282 కోట్ల నికర నష్టాలు వచ్చాయని టాటా మోటార్స్ సీఈఓ గుంటర్ బశ్చెక్ చెప్పారు. దేశీయంగా హోల్‌సేల్స్ వాహన విక్రయాలు 44 శాతం తగ్గి 1,06,349కు తగ్గాయని తెలిపారు. సుదీర్ఘ మందగమనం కారణంగా వాహన విక్రయాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం, కొత్త యాక్సిల్ లోడ్ నిబంధనలు, నిధుల కొరత, వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉండటం... ఇవన్నీ ప్రభావం చూపుతున్నాయన్నారు. ఫలించిన ‘ప్రాజెక్ట్ ఛార్జ్’..... లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) హోల్‌సేల్స్ అమ్మకాలు 3 శాతం పెరిగి 1,34,489 కు పెరిగాయని జేఎల్ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాల్ఫ్ స్మెత్ చెప్పారు. రూ.10,000 కోట్ల సమీకరణ రూ.10,000 కోట్ల నిధుల సమీకరణకు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని టాటా మోటార్స్ వెల్లడించింది. మాతృ కంపెనీ టాటా సన్స్‌కు ఒక్కో షేర్‌ను రూ.150 ధరకు ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన షేర్లు, వారంట్ల జారీ ద్వారా రూ.6,494 కోట్లు సమీకరిస్తామని, అలాగే విదేశీ వాణిజ్య రుణాల ద్వారా రూ.3,024 కోట్లు చొప్పున ఈ నిధులను సమీకరిస్తామని తెలిపింది. ఆరి్థక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా మోటార్స్ షేర్ 5 శాతం నష్టంతో రూ.127 వద్ద ముగిసింది -
కొత్త మోడళ్ల కోసం భారీగా పెట్టుబడులు
టాటా మోటార్స్ వార్షిక నివేదికలో మిస్త్రీ వెల్లడి ముంబై : టాటా మోటార్స్ కంపెనీ కొత్త మోడళ్ల కోసం భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ప్రయాణికుల, వాణిజ్య వాహనాల సెగ్మెంట్లో మరిన్ని కొత్త మోడళ్లను అందించనున్నామని కంపెనీ చైర్మన్ సైరస్ మిస్త్రీ పేర్కొన్నారు. వినియోగదారుల వివిధ అవసరాలకు తగ్గట్లుగా కొత్త టెక్నాలజీలతో కార్లను అందించనున్నామని కంపెనీ 70వ వార్షిక నివేదికలో ఆయన పేర్కొన్నారు. గత మూడేళ్లుగా ఈ కంపెనీ భారీ నష్టాల్లోనే ఉందని, ఈ ఏడాది మార్చినాటికి కంపెనీ కన్సాలిడేటెట్ నికర రుణం రూ.73,600 కోట్లుగా ఉందని తెలిపారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3,000-4,000 కోట్ల రేంజ్లో మూలధన పెట్టుబడులు పెట్టనున్నామన్నారు. -
టాటా సఫారి స్టార్మ్‌లో కొత్త వేరియంట్
ధరలు రూ.9.99 లక్షల నుంచి... న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) సఫారి స్టార్మ్‌లో అప్డేటెడ్ వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధరలు రూ.9.99 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ హొరైజన్ నెక్స్ట్వ్యూహాంలో భాగంగా ఈ కొత్త సఫారి స్టార్మ్‌ను అందిస్తున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) గిరీష్ వాఘ్ చెప్పారు. ఈ కొత్త సఫారి స్టార్మ్‌లో ఎక్స్టీరియర్స్ను, ఇంటీరియర్స్‌ను కొత్తగా డిజైన్ చేశామని, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డ్యుయల్ ఎయిర్-కండీషనింగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లున్నాయని వివరించారు. 1998లోనే సఫారి ఎస్‌యూవీని మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటివరకూ 1.2 లక్షల యూనిట్లను విక్రయించామని పేర్కొన్నారు. -
టాటా మోటార్స్ నుంచి 2 కొత్త మోడళ్లు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ సోమవారం రెండు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. వాహన మార్కెట్లో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందడం లక్ష్యంగా ఈ జెస్ట్(కాంపాక్ట్ సెడాన్) బోల్ట్(హ్యాచ్‌బ్యాక్)లను తెస్తోంది. వీటి విక్రయాలను ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. టాటా మోటార్స్ కొత్తగా డెవలప్ చేసిన రెవోట్రాన్ ఇంజిన్లతో ఈ రెండు కార్లు నడుస్తాయి. విస్టా, మాంజా కార్లు తయారైన ఎక్స్1 ప్లాట్‌ఫామ్‌ను మరింత మెరుగుపరచి ఈ కార్లను అందిస్తున్నామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్) రంజిత్ యాదవ్ చెప్పారు. భారత్, ఇంగ్లండ్, కొరియా ఇంజనీర్లు అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కార్లను డిజైన్ చేశారని వివరించారు. ఈ రెండు కార్లతో మార్కెట్ వాటా మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండికా, ఇండిగోలు పటిష్టమై బ్రాండ్లని, వీటి అమ్మకాలను కొనసాగిస్తామని, వీటిని మార్కెట్ నుంచి ఉపసంహరింబోమని ఆయన స్పష్టం చేశారు. టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా కొత్త మోడళ్ల ఆవిష్కరణతో కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో పోటీ వేడెక్కుతోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10లో కాంపాక్ట్ సెడాన్‌ను నేడు(మంగళవారం) ప్రవేశపెట్టనుంది. వీటితో మారుతీ సుజుకి డిజైర్, హోండా అమేజ్ కార్లకు గట్టి పోటీ ఎదురవుతుందనేది పరిశ్రమ వర్గాల అంచనా. జెస్ట్ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో... బోల్ట్ పెట్రోల్ ఇంజిన్‌తో లభ్యమవుతాయి. జెస్ట్ డీజిల్ వేరియంట్ ఎఫ్-ట్రానిక్ 90 పీఎస్ పవర్డ్ ఇంజిన్‌తో రూపొందించారు. ఎలక్ట్రానిక్ పవర్ అసిస్టెట్ సిస్టమ్(ఈపాస్) వంటి కొత్త ఫీచర్లతో ఈ రెండు కార్లను డెవలప్ చేశామని టాటా మోటార్స్ పేర్కొంది. జెస్ట్, బోల్ట్ రెండు కార్లలలో 5 అంగుళాల టచ్‌స్క్రీన్, బ్లూటూత్ టెక్నాలజీ, స్మార్ట్ వాయిస్ రికగ్నిషన్, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్, టచ్‌ఫోన్ నియంత్రిత ఇంటర్ఫేస్ తదితర ఫీచర్లున్నాయి. జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, 15 అంగుళాల అలాయ్ వీల్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.