కొత్త మోడళ్ల కోసం భారీగా పెట్టుబడులు
టాటా మోటార్స్ వార్షిక నివేదికలో మిస్త్రీ వెల్లడి
ముంబై : టాటా మోటార్స్ కంపెనీ కొత్త మోడళ్ల కోసం భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ప్రయాణికుల, వాణిజ్య వాహనాల సెగ్మెంట్లో మరిన్ని కొత్త మోడళ్లను అందించనున్నామని కంపెనీ చైర్మన్ సైరస్ మిస్త్రీ పేర్కొన్నారు. వినియోగదారుల వివిధ అవసరాలకు తగ్గట్లుగా కొత్త టెక్నాలజీలతో కార్లను అందించనున్నామని కంపెనీ 70వ వార్షిక నివేదికలో ఆయన పేర్కొన్నారు. గత మూడేళ్లుగా ఈ కంపెనీ భారీ నష్టాల్లోనే ఉందని, ఈ ఏడాది మార్చినాటికి కంపెనీ కన్సాలిడేటెట్ నికర రుణం రూ.73,600 కోట్లుగా ఉందని తెలిపారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3,000-4,000 కోట్ల రేంజ్‌లో మూలధన పెట్టుబడులు పెట్టనున్నామన్నారు.