న్యూఢిల్లీ: పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. మెరుగైన చికిత్స కోసం అతడ్ని ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈక్రమంలో రోడ్డు మధ్యలో అంబులెన్స్ సడన్‌గా ఆగిపోయింది. డ్రైవర్‌కు ఏం చేయాలో తోచలేదు.
ఇంతలో ఇద్దరు యువకులు బైక్‌లపై వచ్చారు. కాళ్లతో అంబులెన్సును నెట్టుతూ బైక్‌లను వేగంగా ముందుకు పోనిచ్చారు. ఇలా 12 కిలోమీటర్లు ప్రయాణించి రోగిని ఆస్పత్రికి చేర్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బీజేపీ నేత తజీందర్ పాల్ బగ్గా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఢిల్లీ హరినగర్‌లోని డీడీయూ ఆస్పత్రి నుంచి ఆర్‌ఎంల్ ఆస్పత్రికి ఓ పేషంట్‌ను తరలిస్తుండగా.. అంబులెన్స్ ఆగిపోతే ఇద్దరు సిక్కు యువకులు సాయం చేశారని చెప్పుకొచ్చారు. బైక్‌పై కూర్చొని కాళ్లతో నెట్టుకుంటూ అంబులెన్సును ఆస్పత్రికి తీసుకెళ్లారని కొనియాడారు.
While transferring a critical patient from DDU Hospital,Hari Nagar,Delhi to RML Hospital,the Ambulance broke down & was pushed by Two Sikh Motorcyclists for about 12 km at midnight. pic.twitter.com/4P5gs4eCrc
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) December 21, 2022
చదవండి: కరోనా బీఎఫ్.7 వేరియంట్.. భయం వద్దు.. జాగ్రత్తలు చాలు
Comments
Please login to add a commentAdd a comment