జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఓ లగ్జరీ కారు బీభత్సం సృష్టించింది. వివరాలు జోధ్‌పూర్‌లోని రహదారిపై డ్రైవర్ అదుపు తప్పడంతో.. పలు ద్విచక్ర వాహనాల మీదకు కారు దూసుకెళ్లింది. బైకుల మీదకు దూసుకెళ్లిన కారు చివరికి రోడ్డు పక్కనున్న దుకాణాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జోధ్‌పూర్‌లోని మధురదాస్ మాథుర్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: వైరల్: తొలిసారి పిజ్జా తిన్న బామ్మ.. ‘అబ్బే బాలేదురా మనవడా’..
ఈ ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ ఘటన దురదృష్టకరమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా ఎయిమ్స్‌కు చేరుకున్నారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడని సీఎం వెల్లడించారు. మృతులకు సీఎం గెహ్లాట్ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదం బాధాకరమని, క్షతగాత్రులకు సరైన వైద్యం అందిస్తామని భరోసానిచ్చారు.
చదవండి: చికెన్ కర్రీ అదరగొట్టిన రణు మండల్ .. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment