భారత దేశంలో విచిత్రమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిని చూసేందుకు జనం ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. వాటిలో ఒకటే ‘బ్లూ సిటీ ఆఫ్ ఇండియా’. ఈ సిటీకి ఈ పేరు ఎందుకు వచ్చిందో.. ఇది ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
మనదేశంలో పింక్ సిటీగా పేరొందిన జైపూర్.. రాజస్థాన్‌లో ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. మరి మన దేశంలో బ్లూ సిటీ అని ఏ ప్రాంతాన్ని అంటారో తెలుసా? భారతదేశం భిన్నత్వానికి పేరొందింది. మన దేశంలో ప్రతీ మతానికి చెందినవారూ ఉన్నారు. వివిధ రాష్ట్రల్లో పలు రకాలైన సంస్కృతులు కనిపిస్తాయి. అలాగే దేశంలోని ప్రతీ పట్టణం ఏదోఒక ప్రత్యేకతను కలిగివుంటుంది. మన దేశంలో పింక్ సిటీ మాదిరిగానే బ్లూ సిటీ కూడా ఉంది. ఉదయం సాయంత్రం వేళ్లలో ఇక్కడి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి.
The city which has my DREAM college AIIMS. The blue City the sun city one and only royal JODHPUR❤️❤️ https://t.co/HuDLrGFEpp
— Chatenya Mathur 🦁🇮🇳 (@mathur_chatenya) June 8, 2023
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ను బ్లూ సిటీ అని అంటారు. దేశంలో జోధ్‌పూర్ నగరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది అందాల నగరంగానూ పేరొందింది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఈ నగరం అందాలు మరింత రెట్టింపు అవుతాయి. జధ్‌పూర్‌ను సూర్యనగరి అని కూడా అంటారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే జోధ్‌పూర్‌లో సూర్యుడు అత్యధిక సమయం కనిపిస్తాడు.
బ్లూ సిటీగా పేరొందిన ఈ నగరాన్ని సుమారు 558 ఏళ్ల క్రితం రావ్ జోధ్ నిర్మాంచాడని చరిత్ర చెబుతోంది. రావ్ జోధ్.. రాథోడ్ సమాజానికి అధ్యక్షునిగా ఉండేవాడు. 1459లో అతను పట్టణాన్ని నిర్మించారు. రావ్ జోధ్.. జోధ్‌పూర్‌కు 15 రాజు.
జోధ్‌పూర్‌ను బ్లూ సిటీ అని పిలవడానికి గత కారణం ఇక్కడి ఇళ్ల నిర్మాణం. ఈ పట్టణంలోని చాలా ఇళ్లు నీలిరంగుతో మెరిసిపోతుంటాయి. భవనాలు కూడా నీలిరంగు రాళ్లలో నిర్మితమై ఉంటాయి. రాజస్థాన్‌లోని ఈ పట్టణాన్ని మొదట్లో మార్వాడా పేరుతో పిలిచేవారు.
జోధ్‌పూర్‌లోని అత్యధిక శాతం ఇళ్లు నీలిరంగుతో ఉండటానికి కారణం ఇక్కడి అత్యధిక ఉష్ణోగ్రతలు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇక్కడివారంతా తమ ఇళ్లకు నీలిరంగు పెయింట్ వేయిస్తుంటారు. దూరం నుంచి చూస్తే ఈ పట్టణం నీలిరంగులో కనిపిస్తుంది.
ఇది కూడాచదవండి: విడాకుల గుడి ఉందని మీకు తెలుసా.. ఇంతకీ ఎక్కడ ఉందంటే..
Comments
Please login to add a commentAdd a comment