blue
-
‘పంచ’ప్రాణాలు పదిలం
ప్రపంచంలోని అయిదు గ్రామాల్లో మనుషుల జీవిత కాలం సగటున 80 ఏళ్ల నుంచి 100 ఏళ్లు ఉంటుందట. వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇది నిజమని సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఐదు ప్రాంతాల్లో ఈ రకమైన జీవన శైలి కనిపిస్తోందట. అమెరికాకు చెందిన డాన్ బట్నకర్ ఆధ్వర్యంలో జీవిత కాలంపై చేపట్టిన సర్వేలో.. ప్రపంచంలోని ఐదు ప్రాంతాల్లో ప్రజలు అత్యధికంగా వందేళ్ల వరకు జీవిస్తున్నారని గుర్తించారు. దీనికి గల కారణాలను సర్వే నివేదికల్లో వివరించారు. ప్రధానంగా అక్కడి ప్రజలు తినే ఆహారం, వాతావరణ పరిస్థితులు ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతున్నాయని విశ్లేషించారు. ఐదు బ్లూ జోన్స్..ప్రపంచంలో ఐదు ప్రాంతాలను బ్లూ జోన్స్‌గా గుర్తించారు. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సాడీనియా, కాలిఫోరి్నయాలోని లోమాలిండా, గ్రీస్‌లోని ఇకారియా, కోస్టారికాలోని నికోయా ప్రాంతాలు ఈ జాబితాలో చేర్చారు. ఒక్కో జోన్లో కనీసం 20 నుంచి 50 గ్రామాలున్నాయి. ఇక్కడ సుమారు పదివేల మందికి పైగా ప్రజల జీవన శైలిని పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు సరాసరి 80 ఏళ్ల నుంచి 100 ఏళ్లు జీవిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణం, కాలుష్య కారకాలకు దూరంగా జీవించడం ఒక ఎత్తయితే.. తినే ఆహారంలో ఎలాంటి కల్తీ పదార్థాలు లేకపోవడం, నూనె, వేపుడు, పాశ్చాత్య ఆహారానికి దూరంగా ఉండటం, ఆహారపు పంటల్లో క్రిమిసంహారక మందులు వాడకుండా సహజసిద్ధంగా పండించినవి వినియోగించడం మరో కారణమని పేర్కొంటున్నారు. ప్రజలు ఎక్కువగా ఆకు కూరలు తింటున్నారు. ఆకలిగా ఉన్నపుడు సుమారు 80 శాతం పొట్ట నిండేంత వరకు తిని, మిగతా 20 శాతం ఖాళీగా ఉంచుతారు. దానివల్ల నిద్ర మత్తు, పని బద్దకం వంటివి దూరమవుతాయని చెబుతున్నారు. తీపి తినాలనుకునే వారు ప్రకృతి సిద్ధంగా లభించే తేనె వంటివి వినియోగిస్తారే తప్ప చక్కెర వినియోగించరు. కొన్ని ప్రాంతాలు దీవులు కావడంతో సముద్రంలో లభించే చేపలు, ఇతర సీ ఫుడ్‌ను ఎక్కువగా ఆరగిస్తారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలు కావడంతో వివిధ రకాల వ్యవసాయ, ఇతర పనులు చేసుకోవడం వల్ల ప్రత్యేకించి శారీరక వ్యాయామం అవసరం ఉండదు. చికెన్ వంటి మాంసాహారం (రెడ్ మీట్) పూర్తిగా ఇక్కడ నిషేధం. బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్, స్వీట్ పొటాటో, కాకరకాయలు, బీన్స్, గుమ్మడికాయ, కుకుంబర్, తోటకూర, గోంగూర, ఇతర ఆకుకూరలు అధికంగా వినియోగిస్తారు. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగాలు దూరంగా ఉంటాయి. అరుణాచల్‌ప్రదేశ్ అపతానీ ట్రైబ్స్ జీరో వ్యాలీ ప్రాంతంలో ప్రజల జీవిత కాలం 80 ఏళ్ల నుంచి 100 ఏళ్లుగా సర్వే వెల్లడించింది.రెండు నెలల పాటు బ్లూ జోన్ ఫుడ్ హైదరాబాద్ విమానాశ్రయం నోవోటెల్ హోటల్లో రెండు నెలల పాటు బ్లూ జోన్ సంబంధిత ఆహారాన్ని అందుబాటులో ఉంచుతున్నాం. భారత సంప్రదాయ వంటకాల్లోనూ ఈ తరహా రెసిపీలు ఉంటాయి. బ్లూ జోన్ ఫుడ్‌పై మా వినియోగదారులకు అవగాహన కలి్పంచాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ తరహా ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తాం. వందేళ్లు జీవిస్తున్న బ్లూ జోన్ పరిధి ప్రజలు తీసుకునే ఆహారపు అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్థితులను తెలియజేస్తాం. రెండు నెలల పాటు ప్రత్యేక వంటకాలను వినియోగదారులకు పరిచయం చేస్తాం. - ఆమన్నరాజు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెఫ్, నోవోటెల్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు -
డ్రోన్ల కలకలం.. ఆగిన మెట్రో రైళ్లు
న్యూఢిల్లీ: డ్రోన్ల కలకలం కారణంగా ఢిల్లీ మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తమ్ నగర్ ఈస్ట్- ఉత్తమ్ నగర్ వెస్ట్ మెట్రో స్టేషన్ల మధ్య ట్రాక్‌లపై అధికారులు డ్రోన్‌ను గుర్తించారు. ఈ నేపధ్యంలో దాదాపు 30 నిమిషాల పాటు మెట్రో సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.ఢిల్లీ మెట్రోలోని బ్లూ లైన్లో బుధవారం ఉత్తమ్ నగర్ ఈస్ట్- ఉత్తమ్ నగర్ వెస్ట్ మెట్రో స్టేషన్ల మధ్య ట్రాక్‌పై డ్రోన్ పడి ఉండటాన్ని చూశామని, ఫలితంగా 30 నిమిషాల పాటు మెట్రో సేవలు దెబ్బతిన్నాయని ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు. ట్రాక్‌లపై నుంచి ఆ డ్రోన్‌ను తొలగించేంత వరకూ మెట్రో సేవలు నిలిచిపోయాయి. అధికారులు పరిస్థితిని చక్కదిద్దాక మెట్రో సేవల పునరుద్ధరణ జరిగింది.ఇదేవిధంగా బుధవారం రాత్రి 8 గంటలకు జనక్‌పురి మెట్రో లైన్‌కు ఎగువన అనుమానాస్పద డ్రోన్ కనిపించడంతో ఆ మార్గంలో మెట్రోను నిలిపివేశారు. దీంతో కాసేపు మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనల గురించి ఢిల్లీ మెట్రో అధికారులు మాట్లాడుతూ డ్రోన్లు కనిపించిన బ్లూ లైన్లో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు. సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాత బ్లూ లైన్లో మెట్రో సేవలను పునరుద్ధరించామన్నారు. ఇది కూడా చదవండి: శోభాయమానంగా ఇంద్రకీలాద్రి -
Deepthi Sunaina: సాగర్ ఒడ్డున దీప్తి సునైన.. ముద్దొచ్చేంత అందంగా! (ఫొటోలు)
-
Microsoft outage: బగ్‌తో పరిహాసమా?!
బ్రస్సెల్స్: మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో బగ్ వల్ల బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ సమస్య తలెత్తడంతో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత సేవలు నిలిచిపోయాయి. కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. సైబర్‌సెక్యూరిటీ సంస్థ క్రౌడ్స్రై్టక్ అందించిన అప్డేట్లో బగ్ వల్లే ఈ సంక్షోభం ఏర్పడింది. ఇది చాలా తీవ్రమైన విషయం కాగా, బెల్జియం వ్యంగ్య రచయిత విన్సెంట్ ఫ్లిబస్టీర్ పరిహాసానికి దిగాడు. నెటిజన్లతో చీవాట్లు తింటున్నాడు. తాను క్రౌడ్స్రై్టక్ సంస్థలో కొత్తగా ఉద్యోగంలో చేరానని, మొదటి రోజు సాఫ్ట్‌వేర్‌లో చిన్న ఆప్డేట్ చేశానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ‘ఎక్స్’లో పలు పోస్టులు పెట్టాడు. కోడ్‌లో కేవలం ఒక లైన్ మార్చడం వల్ల బగ్ ఏర్పడిందని తెలిపాడు. క్రౌడ్‌స్ట్రైక్ ఆఫీసులో దిగిన ఫొటోను కూడా షేర్ చేశాడు. నిజానికి అతడు ఈ సంస్థలో ఉద్యోగి కాదు. కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ఈ ఫొటో సృష్టించాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ మారింది. 3.8 లక్షల లైక్‌లు వచ్చాయి. 37,000 మంది షేర్ చేశారు. కొన్ని గంటల తర్వాత విన్సెంట్ మరో పోస్టు చేశాడు. సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ కారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని బాధపడ్డాడు. ఇది చాలా అన్యాయం అంటూ ఆక్రోశించాడు. తనకు ఎవరైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని దీనంగా వేడుకున్నాడు. ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్‌్కను సైతం కోరాడు. తాను బాధపడుతున్న వీడియోను పంచుకున్నాడు. నెటిజన్లు చాలామంది ఇదంతా నిజమేనని నమ్మేశారు. కానీ, నిజం దాగదు కదా! వాస్తవం ఏమిటో తెలిసిపోయింది. పిచి్చవేషాలు మానుకోవాలంటూ విన్సెంట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. విన్సెంట్ నార్డ్ప్రెస్ అనే బెల్జియన్ పేరడీ న్యూస్ సైట్‌కు వార్తలు రాస్తుంటాడు. -
Tejaswini Gowda: సీతామహాలక్ష్మిలా మురిపిస్తోన్న బుల్లితెర నటి (ఫోటోలు)
-
నీలి వెన్నెల జాబిలీ నిన్ను చూసి మురిసి...
‘బ్లూ మేకప్’ అనేది ఇప్పుడు వైరల్ బ్యూటీ ట్రెండ్. అమెరికన్ సింగర్–సాంగ్ రైటర్ బిల్లీ ఎలీష్ పాట ‘బ్లూ’ నుంచి ఈ మేకప్ ట్రెండ్ మొదలైంది. 2016లో ‘ఓషన్ ఐస్’ ఆల్బమ్ విడుదల అయిన తరువాత ‘బ్లూ’ పాట రాసింది ఎలీష్. లేటెస్ట్గా ఆ పాటను మరింత కొత్తదనంతో రీక్రియేట్ చేస్తే సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంది. ఆ పాటకు వచ్చిన పాపులారిటీ ‘బ్లూ బ్యూటీ ట్రెండ్’కు నాంది పలికింది.ఈ ట్రెండ్‌లో భాగంగా ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలు రకరకాల వీడియోలు చేస్తున్నారు. ఈ ట్రెండ్‌లో భాగంగా కంటెంట్ క్రియేటర్, డాన్సర్ ఆనమ్ దర్బార్ స్విమ్మింగ్‌పూల్ వీడియో చేసింది. బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్ మృణాల్ పాంచాల్ ‘వాటర్’ ఎలిమెంట్‌తో వీడియో చేసింది. ఈ వీడియోలో మృణాల్ నీలిరంగు సీతాకోకచిలకలా కనిపిస్తుంది. మొత్తానికైతే ‘బ్లూ మేకప్ ట్రెండ్’ మన దేశంలోనూ సందడి చేస్తోంది. -
Rashmi Gautam: క్లోజప్ స్టిల్స్.. రష్మి ఇలా ఉందేంటి? (ఫొటోలు)
-
సింగర్ నేహా కక్కర్.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం! (ఫోటోలు)
-
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. అసభ్య వీడియోలు సోషల్ మీడియాలో వైరలైన అనంతరం ఆయన దేశం వదిలి జర్మనీ వెళ్లిపోయారు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.‘ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశాం. ఇంటర్‌పోల్ అన్ని దేశాలకు సమాచారం పంపించింది. ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నా పట్టుకోవాలని ఇంటర్‌పోల్ ఇతర దేశాల పోలీసులకు ఆదేశించింది’ అని కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర ఆదివారం పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవణ్ణను భారత్‌కు తీసుకురావడానికి సిట్ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసు పంపాలని సిట్(SIT)సీబీఐకి విజ్ఞప్తి చేసింది.ఇప్పటికే సిట్.. ప్రజ్వల్ రేవణ్ణపై రెండుసార్లు లుక్ అవుట్ నోటీసుల జారీచేసింది. మరోవైపు.. మహిళా కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తండ్రి హెడ్డీ రేవణ్ణను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవి వైరల్ అయిన అసభ్యకర వీడియోలు, ప్రజ్వల్, ఆయన తండ్రిపై నమోదైన లైంగిక ఆరోపణల కేసు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.బ్లూ కార్నర్ నోటీసులు అంటే?బ్లూ కార్నర్ నోటీసు ఇంటర్ పోల్ నోటీసుల్లో ఒక భాగం. ఇది ప్రపంచ వ్యాప్తంగా నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సమాచారం కోసం ఇతర దేశాలతో హెచ్చరికలు, అభ్యర్థనలకు అనుమతి ఇస్తుంది. ఇతర దేశాల్లోని పోలీసులతో సమన్వయమై.. కీలకమైన నేర సంబంధిత సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతి ఇవ్వబడుతుంది. మొత్తం ఏడు రకాల నోటీసులు ఉంటాయి. రెండ్, ఎల్లో, బ్లూ, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్. నేర దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించి అదనపు సమాచారం సేకరించడానికి, వ్యక్తి గుర్తింపు, ఎక్కడ ఉన్నాడో తెలిపే లొకేషన్ వంటి కీలకమైన విషయాలను తెలుసుకోవడానికి ‘బ్లూ కార్నర్’ నోటీసులు జారీ చేస్తారు. -
బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? ఎలా దరఖాస్తు చేయాలి?
భారతదేశంలోని ప్రతీ ఒక్కరికి ఆధార్ కార్డు ఎంతో అవసరం. అటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలన్నా, ఇటు విద్యా సంబంధిత విషయాలకైనా ఆధార్ తప్పనిసరి. ‘ఆధార్’ అనేది దేశంలోని అన్ని ప్రాంతాల్లో చెల్లుబాటు అయ్యే ప్రధాన గుర్తింపు కార్డు అని చెప్పుకోవచ్చు. ఆధార్ కార్డును దేశంలోని అందరికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేస్తుంది. అయితే బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి? దీనిని ఎవరికి జారీ చేస్తారనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంటుంది. ఈ ప్రత్యేక కార్డును దేశంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలకు జారీ చేస్తారు. ఇది నీలి రంగులో ఉన్న కారణంగానే దీనిని బ్లూ ఆధార్ కార్డు అని అంటారు. సాధారణ ఆధార్ కార్డుకు ఇది భిన్నంగా ఉంటుంది. పెద్దల మాదిరిగా కాకుండా, పిల్లలకు కార్డులు జారీ చేయడానికి బయోమెట్రిక్ డేటా అవసరం లేదు. దీనికి బదులుగా యూఐడీకి లింక్ అయిన ఆ చిన్నారుల తల్లిదండ్రుల సమాచారం, వారి ఫొటోల ఆధారంగా పిల్లలకు బ్లూ ఆధార్ కార్డు జారీ అవుతుంది. అయితే, పిల్లలకు ఐదేళ్లు దాటాక ఆధార్ కార్డు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఫొటో కూడా అవసరమవుతుంది. పిల్లల జనన ధృవీకరణ పత్రం లేదా ఆసుపత్రి డిశ్చార్జ్ స్లిప్‌ను చూపించి నవజాత శిశువుకు సంబంధించిన బాల్ ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. -
బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (ఫిబ్రవరి 1న)వరుసగా ఆరవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌తో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు నిర్మలాసీతారామన్. అంతేగాదు వరుసగా ఐదు బడ్జెట్లు సమర్పించిన ఆర్థిక మంత్రుల జాబితాలో నిర్మలా సీతారామన్ కూడా చేరిపోవడమేగాక ఈ ఏడాది ప్రవేశపెడుతున్న ఆరో బడ్జెట్‌తో సరికొత్త రికార్డుని నెలకొల్పబోతున్నారు కూడా. ఇక సీతమ్మ బడ్జెట్ అనంగానే గుర్తొచ్చేది ఆమె చీరలే. ప్రతి ఏటా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆమె ధరిస్తున్న చీరలదే ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఈసారి 2024 బడ్జెట్ సందర్భంగానూ ఆమె ప్రత్యేక రంగు చీరలో వచ్చారు కూడా. అయితే ఇంతవరకు ఆమె ప్రతి ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎలాంటి చీరలు ధరించారు? వాటి విశేషాలేంటో చూద్దామా!. 2019లో.. 2019లో తొలిసారి ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఆ సమయంలో ఆమె గులాబీ రంగు, బంగారు అంచు మంగళ గిరి చీరను ధరించారు. అలాగే ఆ ఏడాదే సంప్రదాయ బ్రీఫ్ కేస్ స్థానంలో బహీ ఖాతాను ప్రవేశపెట్టి సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు ఆర్థిక మంత్రి. ఈ బహీ ఖాతా కోసం ఎరుపు రంగు సిల్క్ క్లాత్‌తో బడ్జెట్ పేపర్లను చుట్టారు. 2020లో 2020 బడ్జెట్ సమర్పణ కోసం నిర్మలా సీతారామన్ పసుపు రంగు సిల్క్ చీరతో పార్లమెంట్‌కు వచ్చారు. నీలం రంగు అంచుతో పసుపు- బంగారు రంగు చీరను ధరించారు. పసుపును సంప్రదాయానికి, సంపదకు చిహ్నంగా భావిస్తారు. చాలా మంది ప్రత్యేక రోజుల్లో ఈ రంగు చీరలను ధరిస్తుంటారు. 2021 బడ్జెట్లో.. 2021 బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి తెలంగాణలోని పోచంపల్లికి చెందిన చీరను కట్టుకున్నారు. ఎరుపు- హాఫ్ వైట్ సమ్మేళనం అయిన ఇక్కత్ సిల్క్ పోచంపల్లి చీరను ధరించారు. ఈ చీరకు పల్లు ఇక్కత్ పాటర్స్‌తో సన్నటి గ్రీన్ బార్డర్ ఉంటుంది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందిన తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిలో ఈ చీర తయారైంది. 2022 బడ్జెట్లో.. 2022 బడ్జెట్ సమర్పణ సందర్బంగా బ్రౌన్ కలర్ చీర ధరించి పార్లమెంట్ కు వచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఒడిశాలో ఈ చీరలు తయారవుతాయి. రస్ట్ బ్రౌన్ చీరకు మెరూన్ రంగు బార్డర్, సిర్వర్ కలర్ డిజైన్ ఉంది. బ్రౌన్ కలర్ రక్షణ, భద్రతలను సూచిస్తుంది. రెడ్ కలర్ పవర్‌ను సూచిస్తుంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉన్న చీరను ధరించి 2022 బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2023లో.. 2023లో ఐదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నిర్మలా సీతారామన్.. ఎరుపు రంగు టెంపుల్ బార్డర్ చీర ధరించారు. దీని మీద ఎరుపు, నలుపు కలర్ జరీ బార్డర్, టెంపుల్ డిజైన్ ఉంది. ఈ చీరలు ముఖ్యంగా కాటన్ లేదా సిల్క్‌లో మాత్రమే లభిస్తాయి. ప్రత్యేక సందర్భాల్లో మహిళలు వీటిని కట్టుకునేందుకు ఇష్టపడుతుంటారు. మరోవైపు.. ఇదే ఏడాది బహీ ఖాతా స్థానంలో ఎరుపు రంగు డిజిటల్ టాబ్లెట్‌తో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. 2024లో.. ఈ ఏడాది ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్ సమర్పణ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్లూ కలర్ కాంతా వర్క్ టస్సార్ చీరను ధరించారు. ఈ చీర పశ్చిమ బెంగాల్లో తయారైంది. ఇక ఈ నీలం రంగు నీలం మంచి ఆరోగ్యానికి ప్రతీక. పైగా ఇది రక్షణకు, అధికారం, విశ్వాసం,మేధస్సు, ఐక్యత, స్థిరత్వలను సూచిస్తుంది. ఇక ఆర్థిక మంత్రి సీతమ్మకు చేనేత చీరలంటే మహా ఇష్టం. జనవరి 26న, నార్త్ బ్లాక్‌లో జరిగిన ప్రీ-బడ్జెట్ హల్వా వేడుకలో ఆమె ఆకుపచ్చ, పసుపు కంజీవరం చీరలో కనిపించింది. ప్రత్యేక సందర్భాల్లో ఆమె ఎక్కువగా సంబల్పురి, ఇకత్, కంజీవరం చీరలలో కనిపిస్తుంది. చాలా వరకు ఆమె నలుపు రంగుకు దూరంగా ఉంటారని సమాచారం. (చదవండి: నిర్మలమ్మ చీర ప్రత్యేకత ఇదే..) -
బ్లూ సీ డ్రాగన్! అందంగా ఉందని టచ్ చేస్తే అంతే!
బ్లూసీ డ్రాగన్లు(గ్లాకస్ అట్లాంకస్) ఒక రకమైన సముద్రపు జీవి. ఇది చెన్నైలోని బీసెంట్ నగర్‌లోని బీచ్ తీరానికి సమీపంలో కనిపించాయి. ఇవి చూడటానికి నీలిరంగులో ఉండి వింతగా ఉంటాయి. చూస్తే పట్టుకోవాలనిపిస్తునంది. కానీ టచ్ చేశారో ఇక అంతే. చెన్నైని మిచౌంగ్ తుపాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ తుపాను బీభత్సానికి బీచ్‌కి కొట్టుకొచ్చి ఉండవచ్చని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువుగా సముద్రం ఉపరితలంపైనే సంచరిస్తాయి. ఇవి చాలా విషపూరితమైనవని. ఇది కుట్టిందంటే చాలా విపరీతమైన నొప్పి వస్తుందని, ఒక్కోసారి ప్రాణాంతకం కూడా మారుతుందని అంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకున్నారు. మొట్టమొదటిసారిగా ఎన్విరాన్మెంటలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన వత్సన్ రామ్‌కుమార్ ఈ జీవులను బీచ్‌లో గుర్తించారు. బీసెంట్ నగరంలోని బ్రోకెన్ బ్రిడ్జి సమీపంలో ఈ బ్లూసీ డ్రాగన్ సముహాన్ని చూసినట్లు తెలిపారు. అక్కడే కొందరూ వీటి కారణంగా బాధతో విలవిల లాడి ఉన్నారని, మరికొందరు ఇసుకలో చనిపోయిన ఉండటాన్నికూడా చూసినట్లు వెల్లడించారు వత్సన్. ఇవి సముద్రంలో కనిపించడం చాలా అరుదని, ఉప్పెన లేదా తుపాను సమయాల్లోనే ఒడ్డుకు నెట్టబడటంతో కనిపించడం జరుగుతుందని శాస్త్రవేత్త కిజాకుడన్ అన్నారు. ఈ నీలిరంగు డ్రాగన్ విషపూరితమైనవని, బీచ్‌ల వద్దకు వచ్చేవాళ్లకు ఇవి ప్రమాదం కలిగిస్తాయని అన్నారు. అంతేగాదు బీచ్‌ల వద్ద ఇవి కనిపిస్తే టచ్ చేయొద్దని హెచ్చరించారు కూడా. ఈ బ్లూ సీ డ్రాగన్(నీలిరంగు డ్రాగన్)ని పోర్చుగీస్ మ్యాన్ ఓ వార్ (ఫిసాలియా ఫిసాలిస్), మ్యాన్-ఆఫ్-వార్ అని కూడా పిలుస్తారని అన్నారు. ఇది ప్రధానంగా పసిఫిక్ మహాసముద్రంలో కనిపించే పసిఫిక్ మ్యాన్ ఓ' వార్ లేదా బ్లూబాటిల్ జాతిగా పరిగణిస్తారని చెప్పారు. ఇది ఫిసాలియా జాతికి చెందిన ఏకైక జాతి అని శాస్త్రవేత్త కిజాకుడన్ వెల్లడించారు. (చదవండి: ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న ఐదు భారత నగరాలు ఇవే!) -
నింగిలో ‘నీలి సూరీడు’.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
బ్రిటన్ ప్రజలు ఆకాశంలో ఓ ప్రత్యేక దృశ్యాన్ని తిలకించి మురిసిపోయారు. మబ్బుల్లో సూర్యుని రంగు మారిపోవడాన్ని చూసి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో సూర్యుడు నీలిరంగులో కనిపిస్తున్నాడు. అమెరికాలో సంభవించిన అగ్నిప్రమాదమే ఇందుకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. ట్విట్టర్లో ఒక యూజర్ ‘స్కాట్లాండ్లో అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద కారణంగా నూతన నీలి సూర్యుడు కనిపిస్తున్నాడు’ అని అన్నారు. మరొక యూజర్ ఉదయం 10:15 గంటలకు ‘బ్లూ సన్’ కనిపించాడని రాశారు. కాగా గతంలో సూర్యుడు ముదురు ఆరెంజ్ రంగులో కనిపించాడు. 2017లో పోర్చుగీస్ అడవి కార్చిచ్చుకు సంబంధించిన పొగ బ్రిటన్ అంతటా వ్యాపించింది. అయితే ఈసారి సూర్యుడు నీలి రంగులోకి ఎందుకు మారాడనే దానికి వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు సమాధానం తెలిపారు. ఉత్తర అమెరికాలోని అడవి కార్చిచ్చు పొగ బ్రిటన్‌కు చేరుతోంది. వాతావరణంలో మేఘాలు, పొగ కలసిపోవడం కారణంగా సూర్యరశ్మి వివిధ రంగులలో వ్యాప్తి చెందున్నదని ఆయన చెప్పారు. ప్రతి రంగు వేర్వేరు ప్రకాశాలను కలిగి ఉంటుంది. నీలి రంగు అధికంగా వ్యాపిస్తుందని తెలిపారు. పర్పుల్ రంగు తక్కువగా వ్యాపిస్తుందని, ఇది దాదాపు 380 నానోమీటర్లు ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఎరుపు రంగు పొడవైన తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుందని, ఇది దాదాపు 700 నానోమీటర్లు ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అమెరికాను ముంచెత్తిన వరదలు... న్యూయార్క్ అతలాకుతలం! 28th September 2023 Hertfordshire UK Unnatural fog…#chemtrail #geoengineering pic.twitter.com/P37Mc0SYeA — Dan Stevens (@Dan__Stevens) September 28, 2023 -
ఆకాశంలో అద్భుతం.. నేటి సాయంత్రం సూపర్ బ్లూ మూన్ దర్శనం
నేడు(ఆగస్టు 30) ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. అరుదైన సూపర్ బ్లూ మూన్ కనువిందు చేయనుంది. రోజులా కాకుండా ఇవాళ చంద్రుడు పెద్దగా, కాంతివంతంగా దర్శనం ఇవ్వబోతున్నాడు. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు పౌర్ణమి రావడంతో ఈ అద్భుతం జరగనుంది. నేడు చంద్రుడు భూమికి 3,57,244 కిలోమీటర్ల దూరంలో కనిపించనున్నాడు. కాగా బ్లూమూన్ అంటే చంద్రుడు బ్లూ కలర్లో కాకుండా నారింజ రంగులో దర్శనమివ్వనున్నాడు. అయితే ఇది ఈ నెలలో కనిపించే రెండో ఫుల్ మూన్. ఆగస్టు 1న తొలి పౌర్ణమి నాడు బ్లూ మూన్ కనిపించింది. కాబట్టి నేడు కనిపించే చంద్రుడిని సూపర్ బ్లూ మూన్‌గా పిలుస్తున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు సూపర్ బ్లూ మూన్ ఆవిష్కృతం కానుంది. సాధారణంగా ఏడాదిలో రెండు లేదామూడు సూపర్ మూన్‌లు ఏర్పడుతూవుంటాయి. స్పేస్.కామ్ ప్రకారం.. ఈ సూపర్ బ్లూ మూన్ బుధవారం రాత్రి 7.10 గంటలకు కనిపించనుంది. నాసా తెలిపిన దాని మేరకు రెండు గంటల తర్వాత ఇది అత్యంత ప్రకాశవంతంగా పెద్దదిగా కనిపించనుంది. గురువారం ఉదయం 6.46 గంటలకు అస్తమించనుంది. అయితే బయట వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో ఈ మూన్ అందంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండియాలోని ప్రజలు తెల్లవారుజామున దీనిని చూడటం మంచిదని అంటున్నారు. చదవండి: ఆ అధికారం ఉందా?.. జమ్ము విభజనపై సుప్రీం బ్లూ మూన్ అంటే..? బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూలో కనిపించడం కాదు. ఒకే నెలలో రెండోసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మాన్‌గా పిలుస్తుంటారు. ఒకే నెలలో బ్లూ మూన్, సూపర్ మూన్‌లు దర్వనమివ్వడం అరుదనే చెప్పాలి. ఇప్పుడు కనిపించే సూపర్ బ్లూ మూన్ నాలుగు పౌర్ణమిలతో కూడిన సీజన్లో అదనపు చంద్రుడు. బుధవారం ఏర్పడబోయే బ్లూ మూన్ ప్రత్యేకమైనది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు. అరుదుగా బ్లూ మూన్ బ్లూ సూపర్ మూన్ చాలా అరుదుగా వస్తుంది. ఖగోళ పరిస్థితుల కారణంగా ప్రతి పది సంవత్సరాలకు మాత్రం ఇలాంటిది వస్తుందని నాసా తెలపింది.. ఒక్కోసారి బ్లూ సూపర్ మూన్ రావడానికి ఇరవై సంవత్సరాలు కూడా పట్టొచ్చని పేర్కొంది. చివరిసారిగా బ్లూ బూన్ 2009 డిసెంబర్లో ఏర్పడింది. మళ్లీ 2037 జనవరిలో బ్లూ మూన్ కనపించనుందట.. మరొకటి మార్చిలో దర్శనమివ్వనుంది. అంటే మళ్లీ 14 సంవత్సరాల వరకు చూడలేరని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
బ్లూడార్ట్ సేవల విస్తరణ
ముంబై: ఎక్స్‌ప్రెస్ ఎయిర్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ సేవల్లోని బ్లూడార్ట్ విస్తరణపై దృష్టి సారించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 76 పిన్కోడ్లకు తన కార్యకలాపాలను కొత్తగా విస్తరించినట్టు ప్రకటించింది. అలాగే, దేశవ్యాప్తంగా కంపెనీ ఆధీనంలో 15 కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. అలాగే 15 ఫ్రాంచైజీ కలెక్షన్ సెంటర్లు, 15 ఎక్స్‌ప్రెస్ ఏజెంట్లు, 15 ప్రాంతీయ సరీ్వస్ ప్రొడైడైర్ ఫ్రాంచైజీలను నియమించుకున్నట్టు ప్రకటించింది. తద్వారా దేశంలోని ప్రతి పాంతానికీ సేవలు అందించగలమని తెలిపింది. దేశ ప్రజలకు సేవలు అందించే విషయంలో తమ అంకిత భావానికి ఈ సేవల విస్తరణ నిదర్శనంగా కంపెనీ పేర్కొంది. విజయవాడ, సికింద్రాబాద్, మధురై, భువనేశ్వర్, లుధియానా, కోల్‌కతా తదితర పట్టణాల్లోని వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో కొత్త రిటైల్ స్టోర్లు తెరిచినట్టు తెలిపింది. తాజా విస్తరణతో దేశవ్యాప్తంగా 55వేలకు పైగా ప్రాంతాలకు తమ సేవలు చేరువ అయినట్టు వివరించింది. మారుతున్న కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా సేవలు అందించడంపై తమ దృష్టి ఉంటుందని బ్లూడార్ట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కేతన్ కులకర్ణి తెలిపారు. -
ఆ నీలి కళ్ల చాయ్‌వాలా.. మోడలింగ్ తర్వాత లండన్‌లో మొదలెడుతున్న పని ఇదే..
తన ప్రత్యేకమైన నీలి కళ్లతో జనం మనసులు దోచుకున్న ఆ పాకిస్తాన్ చాయ్‌వాలాను ఎవరూ మరచిపోలేరు. ఇంటర్నెట్లో తన ఫొటోతో అందరినీ కట్టిపడేసిన ఆ కుర్రాడి పేరు అర్షద్ ఖాన్. ఫొటోగ్రాఫర్ జియా అలీ తన కెమెరాతో అర్షద్‌కు ఫొటో తీసి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పట్లో ఈ ఫొటో సంచలనాలు నమోదు చేసింది. ఈ ఒక్క ఫొటోతో అతని జీవితమే మారిపోయింది. ఇక జీవితంలో దేనికీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అర్షద్‌కు ఏర్పడలేదు. ఈ నేపధ్యంలో 2020లో అర్షద్ పాక్‌లోని ఇస్లామాబాద్‌లో సొంతంగా టీ కెఫే ప్రారంభించారు. ఆ తరువాత రెండు కెఫేలను లాహోర్‌లో ఒక కెఫెను మురీలో తెరిచారు. తాజాగా అర్షద్ ఏకంగా లండన్‌లో ఒక కెఫె ప్రారంభించనున్నారు. మీడియాతో అర్షద్ మాట్లాడుతూ ‘నా లండన్ ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నన్ను అభిమానించేవారి కోసం టీ తయారుచేయడాన్ని నేను ఇష్టపడతాను. లండన్ రావాలంటూ నాకు రిక్వెస్ట్ వచ్చింది. నా తొలి అంతర్జాతీయ టీ దుకాణం లండన్‌లోని ఇల్ఫోయీ లేన్‌లో ప్రారంభం కానుంది. ఇల్ఫోయి లేన్‌లో పెద్ద సంఖ్యలో పాకిస్తానీయులు, భారతీయుల ఇళ్లు ఉన్నాయి. వారంతా చాయ్‌ని అమితంగా ఇష్టపడతారు’ అని తెలిపారు. లండన్‌లో ప్రారంభించే కెఫే కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో హర్షద్ chaiwalauk_ak పేరుతో ఒక అకౌంట్ తెరిచారు. దీనిలో తన కెఫేకు సంబంధించిన అప్డేట్ అందిస్తున్నారు. అర్షద్ తొలి ఫొటో వైరల్ అయినప్పుడు అతనికి మోడలింగ్‌లో అనేక అవకాశాలు లభించాయి. యూకే బేస్డ్ కంపెనీకి అర్షద్ మోడలింగ్ చేశారు. ఇప్పుడు అర్షద్ లండన్‌లో తన నూతన టీ దుకాణం ప్రారంభంతో మరోమారు చర్చల్లో నిలిచారు. ఇది కూడా చదవండి: ఇంటి గేటు దగ్గర ఎర్రని గుర్తులు.. నెటిజన్ల వివరణలకు మహిళ హడల్! -
అది ‘బ్లూ సిటీ ఆఫ్ ఇండియా’.. ఉదయం, సాయంత్రం వేళల్లో ఏం చూడొచ్చంటే..
భారత దేశంలో విచిత్రమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిని చూసేందుకు జనం ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. వాటిలో ఒకటే ‘బ్లూ సిటీ ఆఫ్ ఇండియా’. ఈ సిటీకి ఈ పేరు ఎందుకు వచ్చిందో.. ఇది ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మనదేశంలో పింక్ సిటీగా పేరొందిన జైపూర్.. రాజస్థాన్‌లో ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. మరి మన దేశంలో బ్లూ సిటీ అని ఏ ప్రాంతాన్ని అంటారో తెలుసా? భారతదేశం భిన్నత్వానికి పేరొందింది. మన దేశంలో ప్రతీ మతానికి చెందినవారూ ఉన్నారు. వివిధ రాష్ట్రల్లో పలు రకాలైన సంస్కృతులు కనిపిస్తాయి. అలాగే దేశంలోని ప్రతీ పట్టణం ఏదోఒక ప్రత్యేకతను కలిగివుంటుంది. మన దేశంలో పింక్ సిటీ మాదిరిగానే బ్లూ సిటీ కూడా ఉంది. ఉదయం సాయంత్రం వేళ్లలో ఇక్కడి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. The city which has my DREAM college AIIMS. The blue City the sun city one and only royal JODHPUR❤️❤️ https://t.co/HuDLrGFEpp— Chatenya Mathur 🦁🇮🇳 (@mathur_chatenya) June 8, 2023 రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ను బ్లూ సిటీ అని అంటారు. దేశంలో జోధ్‌పూర్ నగరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది అందాల నగరంగానూ పేరొందింది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఈ నగరం అందాలు మరింత రెట్టింపు అవుతాయి. జధ్పూర్ను సూర్యనగరి అని కూడా అంటారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే జోధ్‌పూర్‌లో సూర్యుడు అత్యధిక సమయం కనిపిస్తాడు. బ్లూ సిటీగా పేరొందిన ఈ నగరాన్ని సుమారు 558 ఏళ్ల క్రితం రావ్ జోధ్ నిర్మాంచాడని చరిత్ర చెబుతోంది. రావ్ జోధ్.. రాథోడ్ సమాజానికి అధ్యక్షునిగా ఉండేవాడు. 1459లో అతను పట్టణాన్ని నిర్మించారు. రావ్ జోధ్.. జోధ్‌పూర్‌కు 15 రాజు. జోధ్‌పూర్‌ను బ్లూ సిటీ అని పిలవడానికి గత కారణం ఇక్కడి ఇళ్ల నిర్మాణం. ఈ పట్టణంలోని చాలా ఇళ్లు నీలిరంగుతో మెరిసిపోతుంటాయి. భవనాలు కూడా నీలిరంగు రాళ్లలో నిర్మితమై ఉంటాయి. రాజస్థాన్‌లోని ఈ పట్టణాన్ని మొదట్లో మార్వాడా పేరుతో పిలిచేవారు. జోధ్‌పూర్‌లోని అత్యధిక శాతం ఇళ్లు నీలిరంగుతో ఉండటానికి కారణం ఇక్కడి అత్యధిక ఉష్ణోగ్రతలు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇక్కడివారంతా తమ ఇళ్లకు నీలిరంగు పెయింట్ వేయిస్తుంటారు. దూరం నుంచి చూస్తే ఈ పట్టణం నీలిరంగులో కనిపిస్తుంది. ఇది కూడాచదవండి: విడాకుల గుడి ఉందని మీకు తెలుసా.. ఇంతకీ ఎక్కడ ఉందంటే.. -
అది నిగూఢ రహస్యాన్ని దాచుకున్న సరస్సు.. రాత్రి కాగానే..
ప్రపంచంలో అంతుచిక్కని వింతలెన్నో ఉన్నాయి. వీటి రహస్యాల ముడి విప్పాలని శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం లేకపోతోంది. అలాంటి అత్యంత వింత సరస్సు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వింతలు, విశేషాలు అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ కోవలోకి వచ్చే ఒక వింత సరస్సు అటు పరిశోధకులను, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ సరస్సులోని నీటి రహస్యం గురించి తెలుసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. రాత్రయ్యే సరికి ఆ సరస్సులోని నీరు నీలి రంగులోకి ఎందుకు మారిపోతున్నదో ఇంతవరకూ ఎవరికీ అంతుచిక్కలేదు. ఈ నేపధ్యంలో పలువురు శాస్త్రవేత్తలు తమ వాదనలు వినిపించినా, అవి ఇప్పటివరకూ పూర్తిస్థాయి సమాధానాన్ని ఇవ్వలేదు. అదరగొట్టే ఉష్ణోగ్రత.. ఈ సరస్సు ఇండోనేషియాలో ఉంది. దీనిని కవాహ్ ఇజేన్ లేక్ అని అంటారు. ఇది చూసేందుకు ఇతర సరస్సుల మాదిరిగానే కనిపిస్తుంది. ఈ సరస్సులోని నీరు ఎంతో ఉప్పగా ఉంటుందని చెబుతారు. ఈ నీరు 200 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగివుండటం విశేషం. ఉదయం వేళలో ఈ సరస్సులోని నీరు సాధారణంగానే కనిపిస్తుంది. మధ్యరాత్రి సమయానికి గాఢమైన నీలిరంగులోకి మారిపోతుంది. అలాగే మెరుస్తూ కనిపిస్తుంటుంది. ఇది ఎంతో ఆకర్షించే విషయమైనప్పటికీ, టూరిస్టులు ఇక్కడికి రాకపోవడం విశేషం. సరస్సులోని వేడి నీటి కారణంగా ఇక్కడికి వచ్చేవారెవరూ ఎక్కువసేపు ఇక్కడ ఉండలేరు. శాస్త్రవేత్తలు కూడా ఈ కారణంగానే తమ పరిశోధనలు ముందుకు సాగడం లేదని చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితుల వింత ప్రవర్తన రసాయన వాయువులే కారణమా? పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సరస్సుపై లెక్కలేనన్ని పరిశోధనలు సాగించారు. అయితే ఇప్పటి వరకూ ఈ నీటి వెనుకనున్న రహస్యాన్ని ఎవరూ కనుగొనలేకపోయారు. ఈ సరస్సుకు సమీపంలో పలు అగ్నిపర్వతాలు ఉన్నాయని, అవి అప్పుడప్పుడు పేలు తుంటాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అగ్నిపర్వతాలు పేలడం వలన హైడ్రోజన్ ఫ్లోరైడ్, సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ తదితర వాయువులు వెలువడతాయి. ఈ వాయువుల రియాక్షన్ కారణంగానే సరస్సులోని నీటి రంగు మారుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ విధంగా నిరంతరం వాయువులు వెలువడినప్పుడు ఉదయం వేళలో నీటి రంగు మారకుండా, రాత్రివేళలో మాత్రమే నీటి రంగు ఎందుకు మారుతున్నదనే ప్రశ్న అలానే మిగిలిపోయింది. మరి దీనికి సమాధానం ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: ‘తాజ్’ యమ క్రేజ్.. ఆదాయంలో టాప్ వన్! -
కార్మికులకు 7% అధికంగా ఉపాధి
ముంబై: కార్మికులకు (బ్లూ కాలర్) ఉపాధి అవకాశాలు ఈ ఏడాది మార్చి నెలలో 7 శాతం అధికంగా నమోదయ్యాయి. 57,11,154 మంది కార్మికులకు ఉపాధి లభించింది. గతేడాది మార్చి నెలతో పోల్చినప్పుడు ఈ వృద్ది నమోదైంది. ప్రధానంగా సెక్యూరిటీ సేవల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఏర్పడ్డాయి. 2022 మార్చిలో బ్లూకాలర్ కార్మికులకు కొత్తగా 53,38,456 ఉపాధి అవకాశాలు లభించాయి. ఈ వివరాలను క్వెస్‌కార్ప్ సబ్సిడరీ అయిన బిలియన్ కెరీర్స్ అనే డిజిటల్ జాబ్ ప్లాట్‌ఫామ్ విడుదల చేసింది. గడిచిన ఏడాది కాలంలో సెక్యూరిటీ ఉద్యోగాలకు డిమాండ్ 219 శాతం పెరిగింది. ఇది సురక్షితమైన, భద్రతా పని వాతావరణం అవసరాన్ని తెలియజేస్తోందని ఈ నివేదిక పేర్కొంది. సంఘర్షణల పరిష్కారంలో నైపుణ్యాలు, స్నేహపూర్వకంగా మసలుకునే సెక్యూరిటీ గార్డులకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అడ్మిన్, హ్యుమన్ రీసోర్స్ విభాగాల్లో వార్షికంగా 61.75% వృద్ధి నమోదైంది. హెచ్ఆర్ విభాగలో కార్మికులకు బలమైన డిమాండ్ ఉన్నట్టు నివేదిక తెలిపింది. ఈవెంట్ సూపర్వైజర్లు సహా, శ్రమతో చేసే పనివారు అందరూ బ్లూకాలర్ కార్మికుల కిందకే వస్తారు. తన ప్లాట్ఫామ్లో మార్చి నెలలో నమో దైన వివరాల ఆధారంగా బిలియన్ కెరీర్స్ ఈ వివరాలను అందించింది. -
బ్లూ జోన్స్.. బిందాస్‌గా వందేళ్లు బతికేయొచ్చు..
ఎక్కడైనా మనుషులు సగటున 60–70 ఏళ్లు బతుకుతారు. కొందరైతే వందేళ్లూ పూర్తి చేసుకుంటారు. కానీ భూమ్మీద కొన్ని ప్రాంతాల్లో మాత్రం జనం మిగతా అన్నిచోట్ల కన్నా ఎక్కువ కాలం జీవిస్తారు. అవే ‘బ్లూ జోన్స్’. మరి ప్రాంతాలేవి? ఎక్కువకాలం బతకడానికి కారణాలేమిటి, వారి ఆహార అలవాట్లు ఏమిటో తెలుసుకుందామా.. ‘ఆయుర్దాయం’పై అన్వేషణలో.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వయసున్నవారు, ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవిస్తున్నవారు ఉండే ప్రాంతాలను ‘బ్లూ జోన్’లుగా పిలుస్తున్నారు. అమెరికాకు చెందిన అన్వేషకుడు, రచయిత డాన్ బ్యూట్నర్ ఈ పేరు పెట్టారు. ప్రపంచంలో ఎక్కువ ఆయుర్దాయం ఉన్న జన సమూహాలు, వాటి మధ్య పోలికలను గుర్తించేందుకు నేషనల్ జియోగ్రఫిక్ చానల్, ఇతర నిపుణులు నిర్వహించిన అన్వేషణ కార్యక్రమానికి డాన్ బ్యూట్నర్ నేతృత్వం వహించారు. తమ అధ్యయనంలో పలు ‘బ్లూ జోన్’లను గుర్తించి ఆ వివరాలను నివేదికగా విడుదల చేశారు. కనీసం.. పదేళ్లు ఎక్కువే.. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న లోమా లిండా ప్రాంతం బ్లూజోన్లలో ఒకటి. ఇక్కడ నివసించే ‘సెవంత్ డే అడ్వెంటిస్ట్స్’ఆధ్యాతి్మక బృందం సభ్యులు.. సగటు అమెరికన్ల కంటే కనీసం పదేళ్లు ఎక్కువకాలం జీవిస్తారు. పూర్తిగా శాకాహారులు. మద్యపానానికి దూరంగా ఉంటారు. సింపుల్‌గా.. 90 ఏళ్లు.. కోస్టారికాలోని నికోయా ద్వీపకల్ప ప్రాంత ప్రజల్లో చాలా మంది 90 ఏళ్ల వరకు చలాకీగా బతికేస్తారు. ఆధ్యాతి్మకత, కుటుంబానికి ప్రాధాన్యతనిస్తూ.. శారీరక శ్రమతో కూడిన జీవన శైలిని అనుసరిస్తారు. చికెన్, చేపలు, బీఫ్, బీన్స్, అన్నం ప్రధాన ఆహారం. అయితే రిఫైన్డ్, ప్రాసెస్ చేసిన ఫుడ్‌కు పూర్తి దూరంగా ఉంటారు. ఆయుష్షులో.. మహిళామణులు జపాన్‌లోని ఒకినావా ద్వీపం ప్రపంచంలో అత్యధికకాలం జీవించే మహిళలకు (వందేళ్లదాకా) కేంద్రం. జపాన్, అమెరికాలతో పోల్చితే.. ఒకినావా వాసులకు వృద్ధాప్యంతో వచ్చే సమస్యలు, గుండె జబ్బులు, కేన్సర్లు బాగా తక్కువ అని అధ్యయనాల్లో తేలింది. ఆయుష్షులో.. ‘మగా’నుభావులు.. ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలు/ప్రాంతాలతో పోల్చితే.. ఇటలీలోని సార్డీనియా ద్వీపంలో పురుషులు అత్యధిక కాలం (వందేళ్ల దాకా) జీవిస్తారు. చాలా వరకు శాకాహారం, ప్రకృతిలో మమేకమై, శారీరక శ్రమతో కూడిన జీవనశైలిని అనుసరిస్తారు. సామాజిక జీవనం.. చిన్న కునుకు.. ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించే జనానికి గ్రీస్‌లోని ఇకారియా ద్వీపం కేరాఫ్ అడ్రస్. ఇక్కడ 90ఏళ్లు పైబడిన ప్రతి పది మందిలో ఆరుగురు ఇప్పటికీ వ్యవసాయం, వృత్తి పనులు చేస్తుంటారని అధ్యయనంలో గుర్తించారు. వీరిలోనూ శాకాహారం, శారీరక శ్రమ మామూలే అయినా.. బంధుమిత్రులతో కలసి గడిపే/పనిచేసే సామాజిక జీవనశైలి, మధ్యాహ్నం పూట చిన్నకునుకు తీసే అలవాటు ప్రత్యేకం. ‘బ్లూజోన్’లలో దీర్ఘాయుష్షు వీటితోనే.. ►బ్లూజోన్లుగా గుర్తించిన అన్ని ప్రాంతాల్లో కామన్‌గా కనిపించిన లక్షణం.. అంతా ఇంటి పనులు, ఇతర శారీరక శ్రమలో నిమగ్నమై ఉండటం. ►క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయడం. ►కుటుంబ బంధాలు, సామాజిక జీవనానికి, పెద్ద వయసు వారికి తోడుగా నిలవడానికి ప్రాధాన్యత. ►ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం, మత సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం. చదవండి: ఎకనమిక్ కారిడార్‌కు లైన్‌క్లియర్ -
అభివృద్ధిలో ‘బ్లూ ఎకానమీ’ కీలకపాత్ర
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ‘బ్లూ ఎకానమీ’ కీలక పాత్ర పోషించనుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) గిరీష్ చంద్ర (జీసీ) ముర్ము విశ్లేషించారు. సుస్థిర వృద్ధి, సామాజిక, ఆర్థిక సంక్షేమం వంటి అంశాల విసృత ప్రాతిపదికన ఎకానమీ పురోగతికి సంబంధించి మున్ముందు బ్లూ ఎకానమీ కీలకం కానుందని ఆయన అన్నారు. బ్లూ ఎకానమీ ఇస్తున్న అవకాశాలు, సవాళ్లు అన్న అంశంపై ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ► భారత్ 7,517 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది తొమ్మిది తీరప్రాంత రాష్ట్రాలు, 1,382 ద్వీపాలను కలుపుతోంది. సముద్ర తీవ్ర ప్రాంత ఆర్థిక వ్యవస్థ 40 లక్షలకు పైగా మత్స్యకారులకు, ఇతర తీర ప్రాంత వర్గాలకు చక్కటి ఆర్థిక అవకాశాలను అందిస్తోంది. ► ఇక దాదాపు 199 ఓడరేవులు ఉన్నాయి, వీటిలో 12 ప్రధాన ఓడరేవులు ప్రతి సంవత్సరం సుమారు 1,400 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు దోహదపడుతూ, దేశ పురోగతిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ► రెండు మిలియన్ చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి క్రూడ్, సహజవాయువులుసహా విస్తారమైన వనరులను కలిగిఉంది. ► సుస్థిర అభివృద్ధి లక్ష్యం (ఎస్డీజీ) సాధనకు బ్లూ ఎకానమీ కీలక భూమికను పోషించనుంది. బ్లూ ఎకనమీ అంటే.. ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం క్లుప్తంగా బ్లూ ఎకానమీ అర్థాన్ని పరిశీలిస్తే... ఇది సము ద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ. సముద్ర పర్యావరణ వ్యవస్థను పరిరక్షించుకుంటూ ఇందుకు అనుగుణమైన ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవనోపాధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం దీని లక్ష్యం. ఉపాధి కల్పన మెరుగుదలకు సముద్ర వనరుల ను స్థిరంగా, పటిష్ట స్థాయిలో వినియోగించుకోవడాన్ని ఇది సూచిస్తుంది. ‘‘సముద్రాలు, సముద్ర తీరాలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలే బ్లూ ఎకానమీ’’ అని యూరోపియన్ కమిషన్ నిర్వచించింది. 2022–2023లో భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టడంతో, ఈ సందర్భంగా బ్లూ ఎకానమీకి సంబంధించి జరుగుతున్న ఎస్ఏఐ20 సదస్సు బాధ్యతలను కాగ్ నిర్వహిస్తున్నారు. బ్లూ ఎకానమీపై అధ్యయనంపై ఈ సదస్సు దృష్టి పెట్టనుంది. సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన అభివృద్ధికి ప్రభుత్వాలు తమ ప్రయత్నాలను, విధానాలను ఎలా రూపొందించవచ్చు, అమలుచేయవచ్చు వంటి అంశాలపై ఎస్ఏఐ20 అధ్యయనం చేస్తుంది. -
బ్లూసఫైర్ థ్రెట్ రిసర్చ్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ టూల్స్ డెవలపర్ బ్లూ సఫైర్... అడ్వాన్స్డ్ థ్రెట్ రిసర్చ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. అలాగే మూడు రకాల సెక్యూరిటీ సాఫ్ట్వేర్లను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకింగ్, బీమా, ఫైనాన్స్ కంపెనీలు లక్ష్యంగా వీటిని అభివృద్ధి చేసింది. సైబర్ ముప్పును గుర్తించి, విశ్లేషించి మిల్లీ సెకనులోనే ఈ సాఫ్ట్వేర్ స్పందిస్తుందని కంపెనీ ఫౌండర్ కిరణ్ వంగవీటి ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు. సైబర్ సెక్యూరిటీ కోసం కంపెనీలు చేస్తున్న వ్యయం తమ ఉత్పాదనతో 30 శాతం దాకా తగ్గుతుందన్నారు. బ్లూ సఫైర్‌లో ప్రస్తుతం 40 మంది పనిచేస్తున్నారు. కంపెనీకి అవసరమైన మానవ వనరుల కోసం శిక్షణ కేంద్రాన్ని సైతం ప్రారంభిస్తోంది. రెండు మూడేళ్లలో సిబ్బంది సంఖ్యను 500కు పెంచుకుంటామని సేల్స్ డైరెక్టర్ వేణు తోటకూర చెప్పారు. -
మళ్ళీ చైనాకు వర్షాల ముప్పు!
బీజింగ్ః చైనాను వర్షాల ముప్పు వదలడం లేదు. మళ్ళీ వానలు ముంచెత్తే అవకాశం ఉండటంతో ప్రభుత్వం బ్లూ అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం తీవ్రమైన గాలి, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ.. దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా ఎడ తెరపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో దక్షిణ చైనా ప్రాంతం అతలాకుతలమౌతోంది. కాస్త తెరపి ఇచ్చిందనుకునే లోపే మళ్ళీ వర్షాలు మొదలవ్వడంతో ప్రభుత్వం బ్లూ అలర్ట్ ప్రకటించింది. దక్షిణ చైనాల్లో గాలి, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ముందు జాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేశారు. గుయ్జౌ గువాంగ్జి, హునాన్, జియాంగ్జి, జెజియాంగ్, పుజియాన్, హెబీ, హెనాన్, యున్నాన్ ప్రాంతాల్లో.. రాగల 24 గంటల్లో తుపాను సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. వర్షం థాటికి మట్టి కరిగిపోవడం, కొండచరియలు విరిగి పడటం, వరద నీరు ఊళ్ళను ముంచెత్తడం వంటి అనేక ప్రమాదాలతోపాటు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఇళ్ళనుంచీ బయటకు రావద్దని సూచించిన అధికారులు, ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. చైనాలో ఎరుపు, నారింజ, పసుపు, నీలం వంటి నాలుగు రంగులతో వాతావరణ హెచ్చరికల వ్యవస్థ అమల్లో ఉంది. అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో రెడ్ (ఎరుపు) అలర్ట్ ఇస్తారు. ఆ తర్వాత స్థాయిని బట్టి ఆరెంజ్, ఎల్లో, బ్లూ వంటి హెచ్చరికలు జారీ చేస్తారు. బుధవారం నాటికి కురిసిన కుండపోత వర్షాలకు చైనాలో ఇప్పటికే 237 మంది చనిపోగా, 93 మంది వరకూ కనిపించకుండా పోయారు. వర్షాలు, వరదలకు వేల కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది. -
ఆ నగరమంతా ‘బ్లూ’
జోధ్‌పూర్: ఓ గుర్రపు బంగీని తోలుకుంటూ ఓ కుర్రాడు వేగంగా దూసుకుపోవడం, ఓ మహిళ బెంచీ మీద కూర్చొని తాపీగా తేనీరు సేవిస్తుండడం, ఇంటి ప్రాంగణంలో ఓ బాలుడు బడలికతో పడుకొని ఉండడం, ఓ వీధి వాకిట గోడకు చేరగిలబడి కొంత మంది పెద్దవాళ్లు పిచ్చాపాటు మాట్లాడుకోవడం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో మనకు నిత్యం కనిపించే దశ్యాలు. ఈ దశ్యాల అన్నింటివెనకాల బ్యాక్‌గ్రౌండ్ మాత్రం ఒక్కటే కావడం విశేషం. అదే నీలి రంగు. నగరంలో ఎక్కడ చూసిన ఇళ్లకు, లోగిళ్లకు నీలి రంగే వేసి ఉంటుంది. జైపూర్‌ను పింక్ సిటీ అని పిలిచినట్లుగా జోధ్‌పూర్ ను బ్లూ సిటీ అని పిలవాల్సిందే. 15వ శతాబ్దంలో మహారాజా మాన్సింగ్ నగరంలో నిర్మించిన మెహ్రాన్‌గఢ్ కోట లోపల అద్దాలు కూడా నీలి రంగువే ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఎక్కువ మంది తమ ఇళ్లకు నీలి రంగు వేస్తారు అన్న ప్రశ్నకు ఇక్కడు రెండు ప్రధాన కారణాలు చెబుతారు. నగరంలో నివసించే హిందూ అగ్రవర్ణాల్లో మెజారిటీలైన బ్రాహ్మణులు తమ ఇళ్లకు నీలి రంగు వేసుకునే ఆచారాన్ని మొదట ప్రారంభించారట. దొంగతనాల నుంచి తమ ఇళ్లను రక్షించుకోవడం కోసం బ్రాహ్మణలు ఈ చిట్కాను ఉపయోగించారట. ఎక్కువ మంది విద్యావేత్తలు, పూజారులు ఉండే బ్రాహ్మణులను గౌరవించాలని, వారి ఇళ్లను దోచుకుంటే పాపం చుట్టుకుంటుందన్న నమ్మకం అప్పట్లో ప్రజల్లో ఉండేదట. అందుకని దొంగలకు తమ ఇళ్లని తెలియడం కోసం బ్రాహ్మణులు ఇళ్లకు నీలి రంగు వాడేవారట. ఒకప్పుడు బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన ఈ రంగు రానురాను నగరమంతటా విస్తరిస్తూ పోయింది. ఇతర కమ్యూనిటీ ప్రజలు కూడా ఈ రంగును ఎక్కువ ఉపయోగించడం మొదలు పెట్టారు. గోడలకు, తలుపులకు నీలి రంగు వేయడం వల్ల పురుగు, పుట్ర రాదని, చెదలు పట్టవన్న విశ్వాసంతో వారు ఈ రంగు ఉపయోగిస్తున్నారట. నీలి రంగులో ఉండే కాపర్ సల్ఫేట్ వల్ల చెదలు రావని కొందరు చెబుతున్నారు. నీలి రంగు వల్ల సూర్య కిరణాలు పరావర్తనం చెందుతాయని, ఫలితంగా నీలి రంగు వేసుకుంటే ఇల్లు చల్లగా ఉంటుందని చదువుకున్న వారు చెబుతున్నారు. -
నీలివజ్రం కొత్త రికార్డు!
హాంకాంగ్: వేలం పాటలో ఓ నీలి వజ్రం సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ వజ్రం సోథెబేస్ట్ మార్కెట్లో 205 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి జ్యువెలరీ మార్కెట్లో ఇంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరుగని రికార్డును సాధించింది. అలాగే మరో పెయింటింగ్ కూడా వందలకోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది. డీబీర్స్ మిలీనియమ్ జ్యువెల్ 4 లో 10.10 క్యారెట్ల గోళాకార ఫాన్సీ వివిద్ బ్లూ డైమండ్... ఆసియాలో మరే ఇతర ఆభరణాల వేలంలోనూ తెచ్చి పెట్టని అత్యధిక డబ్బును తెచ్చిపెట్టిందని ఆక్షన్ హౌస్ వెల్లడించింది. ఆ అరుదైన నీలి వజ్రాన్ని ఓ బిడ్డర్ ఫోన్ ద్వారా వేలంలో కొనుగోలు చేసినట్లు దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు చైనీస్ కళాకారుడు ఝాన్ డాక్వియన్ సృష్టించిన 'పీచ్ బ్లౌజమ్ స్పింగ్' కళాత్మక పెయింటింగ్ .. అసలు ధర 8.3 మిలియన్ డాలర్లు ఉండగా... అంచనాలను అధిగమించి సుమారు 230 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ కళారూపం కేవలం 50 నిమిషాల్లో 100 కంటే ఎక్కువ బిడ్లను పొంది.. షాంఘై లాంగ్ మ్యూజియంకు అత్యంత అధిక ధర పలికింది. ఝాన్ వేసిన ఈ పెయింటింగ్ ఈ స్థాయిలో ధర పలకడం ఇదే మొదటిసారి.