ముంబై: కార్మికులకు (బ్లూ కాలర్) ఉపాధి అవకాశాలు ఈ ఏడాది మార్చి నెలలో 7 శాతం అధికంగా నమోదయ్యాయి. 57,11,154 మంది కార్మికులకు ఉపాధి లభించింది. గతేడాది మార్చి నెలతో పోల్చినప్పుడు ఈ వృద్ది నమోదైంది. ప్రధానంగా సెక్యూరిటీ సేవల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఏర్పడ్డాయి. 2022 మార్చిలో బ్లూకాలర్ కార్మికులకు కొత్తగా 53,38,456 ఉపాధి అవకాశాలు లభించాయి. ఈ వివరాలను క్వెస్‌కార్ప్ సబ్సిడరీ అయిన బిలియన్ కెరీర్స్ అనే డిజిటల్ జాబ్ ప్లాట్‌ఫామ్ విడుదల చేసింది.
గడిచిన ఏడాది కాలంలో సెక్యూరిటీ ఉద్యోగాలకు డిమాండ్ 219 శాతం పెరిగింది. ఇది సురక్షితమైన, భద్రతా పని వాతావరణం అవసరాన్ని తెలియజేస్తోందని ఈ నివేదిక పేర్కొంది. సంఘర్షణల పరిష్కారంలో నైపుణ్యాలు, స్నేహపూర్వకంగా మసలుకునే సెక్యూరిటీ గార్డులకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అడ్మిన్, హ్యుమన్ రీసోర్స్ విభాగాల్లో వార్షికంగా 61.75% వృద్ధి నమోదైంది. హెచ్‌ఆర్ విభాగలో కార్మికులకు బలమైన డిమాండ్ ఉన్నట్టు నివేదిక తెలిపింది. ఈవెంట్ సూపర్‌వైజర్లు సహా, శ్రమతో చేసే పనివారు అందరూ బ్లూకాలర్ కార్మికుల కిందకే వస్తారు. తన ప్లాట్‌ఫామ్‌లో మార్చి నెలలో నమో దైన వివరాల ఆధారంగా బిలియన్ కెరీర్స్ ఈ వివరాలను అందించింది.
Comments
Please login to add a commentAdd a comment