Security Services
-
రూ.520 కోట్లతో స్థలం కొనుగోలు!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ మహారాష్ట్ర పుణెలోని హింజేవాడి ప్రాంతంలో 16.4 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అందుకోసం ఏకంగా రూ.520 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. ఇండో గ్లోబల్ ఇన్ఫోటెక్ సిటీ ఎల్ఎల్పీ నుంచి ఈ కొనుగోలు చేసినట్లు పేర్కొంది. డేటా సెంటర్ కార్యకలాపాల్లో మైక్రోసాఫ్ట్ వేగంగా విస్తరిస్తోంది. అందుకోసం ఈ స్థలాన్ని ఉపయోగించుకోనున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.మైక్రోసాఫ్ట్ ఇప్పటికే హైదరాబాద్, పుణె, ముంబై, చెన్నై వంటి నగరాల్లో కార్యకాలాపాలు సాగిస్తోంది. దేశీయంగా డేటా సెంటర్లను విస్తరిస్తామని కంపెనీ గతంలో పలుమార్లు తెలిపింది. వివిధ నగరాల్లో స్థలాలు కొనుగోలు చేసి ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తాయనేలా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల పుణె నగరంలో పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో 25 ఎకరాల స్థలాన్ని రూ.328 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాంతో పుణెలో గడిచిన రెండేళ్లలో రూ.848 కోట్ల పెట్టుబడితో రెండు చోట్ల స్థలాలు తీసుకుంది.ఇదీ చదవండి: వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో 48 ఎకరాల భూమిని రూ.267 కోట్లకు కొనుగోలు చేసింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ల ద్వారా వివిధ కంపెనీలకు అధునాతన క్లౌడ్ సొల్యూషన్స్ అందించనున్నారు. వివిధ రంగాల్లోని పరిశ్రమలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలు.. వంటి వాటికి డేటా సెక్యూరిటీ సేవలు అందిస్తారు. ఇదిలాఉండగా, మైక్రోసాఫ్ట్ 2025 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మందికి కృత్రిమమేధ(ఏఐ), డిజిటల్ నైపుణ్యాలు అందించేందుకు సిద్ధమైంది. దీని కోసం ‘అడ్వాంటేజ్ ఇండియా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
కార్మికులకు 7% అధికంగా ఉపాధి
ముంబై: కార్మికులకు (బ్లూ కాలర్) ఉపాధి అవకాశాలు ఈ ఏడాది మార్చి నెలలో 7 శాతం అధికంగా నమోదయ్యాయి. 57,11,154 మంది కార్మికులకు ఉపాధి లభించింది. గతేడాది మార్చి నెలతో పోల్చినప్పుడు ఈ వృద్ది నమోదైంది. ప్రధానంగా సెక్యూరిటీ సేవల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఏర్పడ్డాయి. 2022 మార్చిలో బ్లూకాలర్ కార్మికులకు కొత్తగా 53,38,456 ఉపాధి అవకాశాలు లభించాయి. ఈ వివరాలను క్వెస్‌కార్ప్ సబ్సిడరీ అయిన బిలియన్ కెరీర్స్ అనే డిజిటల్ జాబ్ ప్లాట్‌ఫామ్ విడుదల చేసింది. గడిచిన ఏడాది కాలంలో సెక్యూరిటీ ఉద్యోగాలకు డిమాండ్ 219 శాతం పెరిగింది. ఇది సురక్షితమైన, భద్రతా పని వాతావరణం అవసరాన్ని తెలియజేస్తోందని ఈ నివేదిక పేర్కొంది. సంఘర్షణల పరిష్కారంలో నైపుణ్యాలు, స్నేహపూర్వకంగా మసలుకునే సెక్యూరిటీ గార్డులకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అడ్మిన్, హ్యుమన్ రీసోర్స్ విభాగాల్లో వార్షికంగా 61.75% వృద్ధి నమోదైంది. హెచ్ఆర్ విభాగలో కార్మికులకు బలమైన డిమాండ్ ఉన్నట్టు నివేదిక తెలిపింది. ఈవెంట్ సూపర్వైజర్లు సహా, శ్రమతో చేసే పనివారు అందరూ బ్లూకాలర్ కార్మికుల కిందకే వస్తారు. తన ప్లాట్ఫామ్లో మార్చి నెలలో నమో దైన వివరాల ఆధారంగా బిలియన్ కెరీర్స్ ఈ వివరాలను అందించింది. -
జాన్సన్ కంట్రోల్.. ఓపెన్ బ్లూ సెంటర్.. హైదరాబాద్
అమెరికన్ ఐరీష్ బహుళ జాతి సంస్థ జాన్సన్ కంట్రోల్స్ తన సేవలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో జాన్సన్ కంట్రోల్స్ ఏర్పాటు చేసిన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్‌ను కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలో సెక్యూరిటీకి సంబంధించిన అన్ని రకాల సర్వీసులు లభిస్తాయి. అదే విధంగా వీడియో సర్వైవలెన్స్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. జాన్సన్ కంట్రోల్స్ సంస్థ 135 ఏళ్లుగా సెక్యూరిటీ సర్వీసులు అందిస్తోంది. 150కి పైగా దేశాల్లో ఈ సంస్థకు కస్టమర్లు విస్తరించి ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది ఈ సంస్థలో పని చేస్తున్నారు. IT and Industries Minister @KTRTRS inaugurated the @johnsoncontrols OpenBlue Innovation Center in Hyderabad. OpenBlue Innovation Centre focuses on security products including both intrusion and access control and video surveillance (ACVS) product lines. pic.twitter.com/mNnt1vSrSy — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 14, 2022 చదవండి: హైదరాబాద్ ఈ సిటీలో భారీ ఎత్తున సోలార్ ప్యానెళ్ల తయారీ -
ఎలక్షన్ డ్యూటీ ; జవాను మృతి
కోల్‌కత : ఎన్నికల విధుల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న కేంద్రబలగాలపై దుండగులు కాల్పులు జరిపారు. బగ్నాన్ ప్రాంతంలోని సెక్యురిటీ సిబ్బంది బేస్ క్యాంపుపై ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురవడంతో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఐదో దశ ఎన్నికల్లో భాగంగా మే 6న హౌరా పార్లమెంటరీ స్థానానికి ఎన్నిక జరగనుంది. కాగా, తాజాగా జరిగిన నాలుగో దశ ఎన్నికల్లో బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. భద్రతా సిబ్బంది ఓటర్లను, తృణమూల్ కార్యకర్తలను పోలింగ్ కేంద్రాల వద్ద అడ్డుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. టీఎంసీ నేతలు, స్థానికులు కర్రలు చేతబూని వారికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. -
పిక్కలు నొప్పిగా ఉన్నాయి.. సమస్య ఏమిటి?
వాస్క్యులర్ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. గత 15 ఏళ్లుగా సెక్యూరిటీ సర్వీసెస్‌లో పనిచేస్తున్నాను. మొదట్లో సెక్యూరిటీ గార్డ్‌గా ఉన్నప్పటికీ, ప్రస్తుతం సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నాను. అయితే డ్యూటీలో భాగంగా ఎక్కువసేపు నిలబడే ఉంటాను. నాకు ఇటీవల కాళ్లలో వాపు వస్తోంది. అలాగే పిక్కలు కూడా పట్టేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రిళ్లు ఇబ్బందిపడుతున్నాను. బాధ భరించలేనప్పుడు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడుతున్నాను. రోజురోజుకూ సమస్య పెరుగుతోంది. ఇలాంటి సమస్య గతంలో నాకెన్నడూ లేదు. అసలు నాకు ఏమైంది. దయచేసి సలహా ఇవ్వండి. - రాజు, వైజాగ్ మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీరు వేరికోస్ వెయిన్స్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఈ సమస్య సాధారణంగా ఎక్కువ సేపు నిల్చుని ఉండేవారిలో, అధిక బరువులు మోసేవారిలో ఎక్కువగా ఉంటుంది. వీరికి మొదట్లో కాళ్లలో వాపు రావడం, మంట పుట్టడం, పిక్కలు పట్టేయడం చోటు చేసుకుంటాయి. అనంతరం వీరు నడక అంటేనే బెదిరిపోయేలా సమస్య మరీ తీవ్రమవుతుంది. వ్యాధి దశను బట్టి పూర్తి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు డాక్టర్ నిర్ధారణ చేస్తే, మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక చికిత్స విధానాలతో మీ సమస్యను పూర్తిగా ఉపశమనం కలిగేలా చేయవచ్చు. మొదటి దశ, రెండోదశలో వ్యాధిని గుర్తించి చికిత్స ప్రారంభిస్తే ఎలాంటి సర్జరీ అవసరం ఉండదు. కేవలం డాక్టర్ సూచించిన మేరకు మందులు వాడుతూ వారు అందించే సలహాలను పాటిస్తూ మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకుంటే వ్యాధిని పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. మెరుగైన ఫలితాల కోసం సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. సమస్య నుంచి తాత్కాలికంగా రిలీఫ్ దొరికిన చాలామంది మందులు మానివేయడం లేదా కోర్స్ పూర్తయిన తర్వాత డాక్టర్‌ను సంప్రదించకుండా ఉండటం లాంటివి చేస్తుంటారు. దీనివల్ల వ్యాధి మరింత ముదిరిపోయే అవకాశం ఉంటుంది. ఇక మూడు లేదా నాలుగో దశలో వ్యాధి ఉంటే మాత్రం వాస్క్యులర్, శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. వేరికోస్ వెయిన్స్‌కు మంచి చికిత్స అందుబాటులో ఉంది. కాబట్టి మీరు వెంటనే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులను సంప్రదించి, మీ సమస్యకు కారణాన్ని తెలుసుకోండి. వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే చికిత్స ప్రారంభిస్తే మెరుగైన ఫలితాలను సులువుగా పొందవచ్చు. - డా॥దేవేందర్ సింగ్ సీనియర్ వాస్క్యులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్