
ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కత : ఎన్నికల విధుల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న కేంద్రబలగాలపై దుండగులు కాల్పులు జరిపారు. బగ్నాన్ ప్రాంతంలోని సెక్యురిటీ సిబ్బంది బేస్ క్యాంపుపై ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురవడంతో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఐదో దశ ఎన్నికల్లో భాగంగా మే 6న హౌరా పార్లమెంటరీ స్థానానికి ఎన్నిక జరగనుంది. కాగా, తాజాగా జరిగిన నాలుగో దశ ఎన్నికల్లో బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. భద్రతా సిబ్బంది ఓటర్లను, తృణమూల్ కార్యకర్తలను పోలింగ్ కేంద్రాల వద్ద అడ్డుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. టీఎంసీ నేతలు, స్థానికులు కర్రలు చేతబూని వారికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment