ప్రపంచవ్యాప్తంగా అయిదు గ్రామాల్లో జీవిత కాలం ఎక్కువ
బ్లూ జోన్ పరిధిలో జీవిత కాలం 90 నుంచి 100 ఏళ్లు
అక్కడ తినే ఆహారం, వాతావరణ పరిస్థితులే కారణం
ప్రపంచంలోని అయిదు గ్రామాల్లో మనుషుల జీవిత కాలం సగటున 80 ఏళ్ల నుంచి 100 ఏళ్లు ఉంటుందట. వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇది నిజమని సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఐదు ప్రాంతాల్లో ఈ రకమైన జీవన శైలి కనిపిస్తోందట. అమెరికాకు చెందిన డాన్ బట్నకర్ ఆధ్వర్యంలో జీవిత కాలంపై చేపట్టిన సర్వేలో.. ప్రపంచంలోని ఐదు ప్రాంతాల్లో ప్రజలు అత్యధికంగా వందేళ్ల వరకు జీవిస్తున్నారని గుర్తించారు. దీనికి గల కారణాలను సర్వే నివేదికల్లో వివరించారు. ప్రధానంగా అక్కడి ప్రజలు తినే ఆహారం, వాతావరణ పరిస్థితులు ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతున్నాయని విశ్లేషించారు.
ఐదు బ్లూ జోన్స్..
ప్రపంచంలో ఐదు ప్రాంతాలను బ్లూ జోన్స్‌గా గుర్తించారు. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సాడీనియా, కాలిఫోరి్నయాలోని లోమాలిండా, గ్రీస్‌లోని ఇకారియా, కోస్టారికాలోని నికోయా ప్రాంతాలు ఈ జాబితాలో చేర్చారు. ఒక్కో జోన్‌లో కనీసం 20 నుంచి 50 గ్రామాలున్నాయి. ఇక్కడ సుమారు పదివేల మందికి పైగా ప్రజల జీవన శైలిని పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు సరాసరి 80 ఏళ్ల నుంచి 100 ఏళ్లు జీవిస్తున్నారు.
ప్రశాంతమైన వాతావరణం, కాలుష్య కారకాలకు దూరంగా జీవించడం ఒక ఎత్తయితే.. తినే ఆహారంలో ఎలాంటి కల్తీ పదార్థాలు లేకపోవడం, నూనె, వేపుడు, పాశ్చాత్య ఆహారానికి దూరంగా ఉండటం, ఆహారపు పంటల్లో క్రిమిసంహారక మందులు వాడకుండా సహజసిద్ధంగా పండించినవి వినియోగించడం మరో కారణమని పేర్కొంటున్నారు. ప్రజలు ఎక్కువగా ఆకు కూరలు తింటున్నారు. ఆకలిగా ఉన్నపుడు సుమారు 80 శాతం పొట్ట నిండేంత వరకు తిని, మిగతా 20 శాతం ఖాళీగా ఉంచుతారు. దానివల్ల నిద్ర మత్తు, పని బద్దకం వంటివి దూరమవుతాయని చెబుతున్నారు. తీపి తినాలనుకునే వారు ప్రకృతి సిద్ధంగా లభించే తేనె వంటివి వినియోగిస్తారే తప్ప చక్కెర వినియోగించరు. కొన్ని ప్రాంతాలు దీవులు కావడంతో సముద్రంలో లభించే చేపలు, ఇతర సీ ఫుడ్‌ను ఎక్కువగా ఆరగిస్తారు.
ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలు కావడంతో వివిధ రకాల వ్యవసాయ, ఇతర పనులు చేసుకోవడం వల్ల ప్రత్యేకించి శారీరక వ్యాయామం అవసరం ఉండదు. చికెన్ వంటి మాంసాహారం (రెడ్ మీట్) పూర్తిగా ఇక్కడ నిషేధం. బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్, స్వీట్ పొటాటో, కాకరకాయలు, బీన్స్, గుమ్మడికాయ, కుకుంబర్, తోటకూర, గోంగూర, ఇతర ఆకుకూరలు అధికంగా వినియోగిస్తారు. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగాలు దూరంగా ఉంటాయి. అరుణాచల్‌ప్రదేశ్ అపతానీ ట్రైబ్స్ జీరో వ్యాలీ ప్రాంతంలో ప్రజల జీవిత కాలం 80 ఏళ్ల నుంచి 100 ఏళ్లుగా సర్వే వెల్లడించింది.
రెండు నెలల పాటు బ్లూ జోన్ ఫుడ్
హైదరాబాద్ విమానాశ్రయం నోవోటెల్ హోటల్‌లో రెండు నెలల పాటు బ్లూ జోన్ సంబంధిత ఆహారాన్ని అందుబాటులో ఉంచుతున్నాం. భారత సంప్రదాయ వంటకాల్లోనూ ఈ తరహా రెసిపీలు ఉంటాయి. బ్లూ జోన్ ఫుడ్‌పై మా వినియోగదారులకు అవగాహన కలి్పంచాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ తరహా ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తాం. వందేళ్లు జీవిస్తున్న బ్లూ జోన్ పరిధి ప్రజలు తీసుకునే ఆహారపు అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్థితులను తెలియజేస్తాం. రెండు నెలల పాటు ప్రత్యేక వంటకాలను వినియోగదారులకు పరిచయం చేస్తాం.
- ఆమన్నరాజు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెఫ్, నోవోటెల్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు
Comments
Please login to add a commentAdd a comment