zone level
-
‘పంచ’ప్రాణాలు పదిలం
ప్రపంచంలోని అయిదు గ్రామాల్లో మనుషుల జీవిత కాలం సగటున 80 ఏళ్ల నుంచి 100 ఏళ్లు ఉంటుందట. వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇది నిజమని సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఐదు ప్రాంతాల్లో ఈ రకమైన జీవన శైలి కనిపిస్తోందట. అమెరికాకు చెందిన డాన్ బట్నకర్ ఆధ్వర్యంలో జీవిత కాలంపై చేపట్టిన సర్వేలో.. ప్రపంచంలోని ఐదు ప్రాంతాల్లో ప్రజలు అత్యధికంగా వందేళ్ల వరకు జీవిస్తున్నారని గుర్తించారు. దీనికి గల కారణాలను సర్వే నివేదికల్లో వివరించారు. ప్రధానంగా అక్కడి ప్రజలు తినే ఆహారం, వాతావరణ పరిస్థితులు ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతున్నాయని విశ్లేషించారు. ఐదు బ్లూ జోన్స్..ప్రపంచంలో ఐదు ప్రాంతాలను బ్లూ జోన్స్‌గా గుర్తించారు. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సాడీనియా, కాలిఫోరి్నయాలోని లోమాలిండా, గ్రీస్‌లోని ఇకారియా, కోస్టారికాలోని నికోయా ప్రాంతాలు ఈ జాబితాలో చేర్చారు. ఒక్కో జోన్లో కనీసం 20 నుంచి 50 గ్రామాలున్నాయి. ఇక్కడ సుమారు పదివేల మందికి పైగా ప్రజల జీవన శైలిని పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు సరాసరి 80 ఏళ్ల నుంచి 100 ఏళ్లు జీవిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణం, కాలుష్య కారకాలకు దూరంగా జీవించడం ఒక ఎత్తయితే.. తినే ఆహారంలో ఎలాంటి కల్తీ పదార్థాలు లేకపోవడం, నూనె, వేపుడు, పాశ్చాత్య ఆహారానికి దూరంగా ఉండటం, ఆహారపు పంటల్లో క్రిమిసంహారక మందులు వాడకుండా సహజసిద్ధంగా పండించినవి వినియోగించడం మరో కారణమని పేర్కొంటున్నారు. ప్రజలు ఎక్కువగా ఆకు కూరలు తింటున్నారు. ఆకలిగా ఉన్నపుడు సుమారు 80 శాతం పొట్ట నిండేంత వరకు తిని, మిగతా 20 శాతం ఖాళీగా ఉంచుతారు. దానివల్ల నిద్ర మత్తు, పని బద్దకం వంటివి దూరమవుతాయని చెబుతున్నారు. తీపి తినాలనుకునే వారు ప్రకృతి సిద్ధంగా లభించే తేనె వంటివి వినియోగిస్తారే తప్ప చక్కెర వినియోగించరు. కొన్ని ప్రాంతాలు దీవులు కావడంతో సముద్రంలో లభించే చేపలు, ఇతర సీ ఫుడ్‌ను ఎక్కువగా ఆరగిస్తారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలు కావడంతో వివిధ రకాల వ్యవసాయ, ఇతర పనులు చేసుకోవడం వల్ల ప్రత్యేకించి శారీరక వ్యాయామం అవసరం ఉండదు. చికెన్ వంటి మాంసాహారం (రెడ్ మీట్) పూర్తిగా ఇక్కడ నిషేధం. బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్, స్వీట్ పొటాటో, కాకరకాయలు, బీన్స్, గుమ్మడికాయ, కుకుంబర్, తోటకూర, గోంగూర, ఇతర ఆకుకూరలు అధికంగా వినియోగిస్తారు. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగాలు దూరంగా ఉంటాయి. అరుణాచల్‌ప్రదేశ్ అపతానీ ట్రైబ్స్ జీరో వ్యాలీ ప్రాంతంలో ప్రజల జీవిత కాలం 80 ఏళ్ల నుంచి 100 ఏళ్లుగా సర్వే వెల్లడించింది.రెండు నెలల పాటు బ్లూ జోన్ ఫుడ్ హైదరాబాద్ విమానాశ్రయం నోవోటెల్ హోటల్లో రెండు నెలల పాటు బ్లూ జోన్ సంబంధిత ఆహారాన్ని అందుబాటులో ఉంచుతున్నాం. భారత సంప్రదాయ వంటకాల్లోనూ ఈ తరహా రెసిపీలు ఉంటాయి. బ్లూ జోన్ ఫుడ్‌పై మా వినియోగదారులకు అవగాహన కలి్పంచాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ తరహా ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తాం. వందేళ్లు జీవిస్తున్న బ్లూ జోన్ పరిధి ప్రజలు తీసుకునే ఆహారపు అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్థితులను తెలియజేస్తాం. రెండు నెలల పాటు ప్రత్యేక వంటకాలను వినియోగదారులకు పరిచయం చేస్తాం. - ఆమన్నరాజు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెఫ్, నోవోటెల్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు -
నిఫా ఎఫెక్ట్: కంటైన్మెంట్ జోన్లు, స్కూల్స్ బంద్..
తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ విజృంభిస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ బారినపడి ఇప్పటికే రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి వైరస్ సోకింది. ఇందులో తొమ్మిది ఏళ్ల చిన్నారి కూడా ఉంది. దీంతో ప్రభుత్వం కోజికోడ్ జిల్లాలోని ఏడు గ్రామ పంచాయితీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు, కార్యాలయాలను మూసివేయాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నిఫా వైరస్ 130 మందికి సోకిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్‌గా పేర్కొన్న ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.. మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. వ్యాప్తి రేటు తక్కువగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య అధికంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ఏడు గ్రామ పంచాయితీల్లో ఎలాంటి రాకపోకలు జరపరాదని కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఏ గీతా తెలిపారు. ఆతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామాలు కంటైన్మెంట్ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయం తర్వాత దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామశాఖ ఆఫీస్‌లు తక్కువ స్టాఫ్‌తో నడపాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూసివేయాలని కోరారు. కంటైన్మెంట్ జోన్లో మాస్కులు తప్పనిసరి అని తెలిపారు. శానిటైజర్లు వాడాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చెప్పారు. రాష్ట్రంలో నిఫా వైరస్ వ్యాప్తి పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ బృందాలు కేరళకు రానున్నాయి. కోజికోడ్ మెడికల్ కాలేజీలో సంచార ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పందులు, గద్దల నుంచి మనుషులకు వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు చేయనున్నారు. వ్యాప్తి ఇలా... ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్. తాటి జాతికి చెంది డేట్‌పామ్ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్)తో ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించినందున, అలాంటి వృత్తుల్లో ఉండేవారూ అప్రమత్తంగా ఉండాలి. ఇదీ చదవండి: ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు.. -
ఏపీలో త్వరలో కొత్త జోన్లు.. రాష్ట్రపతి ఉత్తర్వులపై సీఎస్ సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన క్రమంలో స్థానికత, జోనల్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ చేయాల్సిన నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినందున పాత జోనల్ విధానంలో మార్పులు చేసి కొత్త జిల్లాలను కలిపి కొత్త జోన్లు, మల్టీ జోన్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల సంఖ్య 1975కు సవరణ చేసేందుకు ప్రతిపాదిత అంశంపై జవహర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమీక్షలో సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్.. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సంబంధించి స్థానికత, ప్రతిపాదిత నూతన జోనల్ విధానం తదితర అంశాలను వివరించారు. ఇక, ఈ సమావేశంలో రాష్ట్ర పీఆర్అండ్ఆర్డీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యంటి. కృష్ణబాబు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్,హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్త, అదనపు సీసీఎల్ఏ ఇంతియాజ్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెఎచ్ హరికిరణ్, న్యాయశాఖ కార్యదర్శి జి. సత్య ప్రభాకర రావు, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్, జీఎడీ అదనపు కార్యదర్శి శ్రీనివాస్, తదితర అధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: తండ్రి బాటలోనే సీఎం జగన్.. అభివృద్ధి పరుగులు -
అమరావతి R-5 జోన్..ఇది పేదల విజయం
-
జో బైడెన్ వార్నింగ్ బేఖాతరు.. చైనా కవ్వింపు చర్యలు
తైవాన్ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కొద్దిరోజుల క్రితం చైనాను హెచ్చరించిన విషయం తెలిసిందే. తైవాన్‌లో చైనా ఆక్రమణకు పాల్పడితే డ్రాగన్ కంట్రీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా హెచ్చరించిన కొద్ది రోజులకే.. చైనా తన అసలు స్వరూపాన్ని చూపించింది. తైవాన్ పరిసర ప్రాంతాల్లో చైనా తన వైమానిక కార్యకలాపాలను పెంచింది. తైవాన్ వైమానిక దళంలోకి చైనా 30 యుద్ధ విమానాలను పంపింది. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకున్నది. అయితే, చైనా కవ్వింపు చర్యకు తైవాన్ ధీటుగానే స్పందించింది. తైవాన్ కూడా యుద్ధ విమానాలను మోహరించినట్లు తాజాగా వెల్లడించింది. అయితే, తన చర్యలను చైనా సమర్ధించుకుంది. సైనిక శిక్షణలో భాగంగానే వైమానిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చైనా పేర్కొంది. కాగా, చైనా వ్యాఖ్యలపై తైవాన్ మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తోంది. తైవాన్ వైమానిక రక్షణ క్షేత్రంలో ఉన్న ప్రటాస్ దీవుల వద్దకు చైనా యుద్ధ విమానాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో 20 ఫైటర్ జెట్స్ ఉన్నట్టు సమాచారం. చైనా చర్యలో తర్వలో మరో యుద్ధాన్ని చూడాల్సి వస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. #China has made the second largest incursion into #Taiwan’s air defense zone this year with 30 jets reportedly entering the area, including more than 20 fighters https://t.co/N4yunKUje8 pic.twitter.com/J9vno2kT4H — Arab News (@arabnews) May 31, 2022 ఇది కూడా చదవండి: నా దుస్తులు అమ్మి అయినా ప్రజలకు చౌకగా గోధుమపిండి అందిస్తా! -
కంటోన్మెంట్ విలీన వాదనతో ఏకీభవిస్తున్నాను : కేటీఆర్
-
జోన్లకు ఆమోదం..3 జిల్లాలతో అమల్లోకి కొత్త జోన్లు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీలో పరి గణనలోకి తీసుకోవాల్సిన కొత్త జోన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 33 జిల్లాలతో కొత్త జోన్లను అమల్లోకి తెస్తూ బుధ వారం సీఎస్ సోమేశ్‌కుమార్ గెజిట్ ఉత్తర్వులు 128 జారీ చేశారు. వీటిని తెలం గాణ పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) సవరణ ఉత్తర్వులు– 2021గా అమలు అవుతాయని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి రానుంది. 2018లోనే మార్పు చేసినా..రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాలను ప్రభుత్వం 31 జిల్లాలుగా మార్పు చేసింది. రెండు జోన్లుగా ఉన్న రాష్ట్రాన్ని 7 జోన్లుగా, రెండు మల్టీ జోన్లుగా 2018లోనే మార్చింది. వాటికి అప్పట్లోనే రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిని అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది ఆగస్టు 30న జీవో 124 జారీ చేసింది. అందులో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లు, పోస్టుల భర్తీలో అనుసరించే విధానాలన్నింటినీ వెల్లడించింది. వాటి ప్రకారం జిల్లా స్థాయి నుంచి మల్టీ జోన్ వరకు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి. 5 శాతం పోస్టులను మాత్రమే ఓపెన్ కోటా కింద పేర్కొంది. ఒకటి నుంచి 7వ తరగతి వరకు ఎక్కువ కాలం ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాలో స్థానికులుగా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఇప్పటివరకు ఉన్న రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇకపై ఉండదు. వాటిని మల్టీ జోన్ పరిధిలోనే భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ములుగు, నారాయణపేట జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో 33 జిల్లాలు అయ్యాయి. వాటితో పాటు గద్వాల జోన్లో ఉన్న వికారాబాద్‌ను చార్మినార్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. వాటికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి కావడంతో ప్రభుత్వం మళ్లీ రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆప్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఉత్తర్వులు–2018కు కేంద్రం సవరణ చేసి, ఈ ఏడాది ఏప్రిల్19న తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) సవరణ ఉత్తర్వులు–2021ను జారీ చేసింది. మల్టీ జోన్–1 కింద కాళేశ్వరం, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి జోన్లు వస్తాయి. మల్టీజోన్– 2 కింద యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ జోన్లు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆదేశాల ప్రకారం ఇకపై వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగాల్లో ఈ జోన్లే ప్రామాణికం కానున్నాయి. పోలీసు శాఖకు మాత్రం ప్రత్యేకంగా జోన్లను ఏర్పాటు చేసింది. పోలీసు కమిషనరేట్ల పరిధి ఒకటికి మించి జిల్లాల్లో విస్తరించి ఉన్న కారణంగా మార్పులు చేసింది. కానిస్టేబుల్ జిల్లాకు, ఎస్సై జోన్‌కు, ఇన్స్పెక్టర్ మల్టీజోన్కు.. పోలీసు నియామకాల్లో కొత్త జోన్లు, మల్టీ జోన్లే ప్రామాణికం కానున్నాయి. ఇకపై చేపట్టనున్న నియామకాల ప్రకారం.. కానిస్టేబుళ్లు ఎంపికైన జిల్లాల వారీగా, ఎస్సైలు ఎంపికైన జోన్లలో పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఇన్స్పెక్టర్ ర్యాంకు ఆఫీసర్లు మల్టీజోన్లకు పరిమితం కావాల్సి ఉంటుంది. అంటే ఇన్స్పెక్టర్లు మల్టీజోన్లలో ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ పని చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 30న జీవో 124 జారీ చేసింది. అందులో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లు, పోస్టుల భర్తీలో అనుసరించే విధానాలన్నింటినీ వెల్లడించింది. వాటి ప్రకారం జిల్లా స్థాయి నుంచి మల్టీ జోన్ వరకు 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి. 5 శాతం పోస్టులను మాత్రమే ఓపెన్ కోటా కింద పేర్కొంది. ఒకటి నుంచి 7వ తరగతి వరకు ఎక్కువ కాలం ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాలో స్థానికులుగా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఇప్పటివరకు ఉన్న రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇకపై ఉండదు. వాటిని మల్టీ జోన్ పరిధిలోనే భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ములుగు, నారాయణ పేట జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో 33 జిల్లాలు అయ్యాయి. వాటితో పాటు గద్వాల జోన్లో ఉన్న వికారాబాద్‌ను చార్మినార్ జోన్ పరిధి లోకి తీసుకొచ్చింది. వాటికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి కావడంతో ప్రభుత్వం మళ్లీ రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆప్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఉత్తర్వులు–2018కు కేంద్రం సవరణ చేసి, ఈ ఏడాది ఏప్రిల్19న తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) సవరణ ఉత్తర్వులు–2021ను జారీ చేసింది. మల్టీ జోన్–1 కింద కాళేశ్వరం, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి జోన్లు వస్తాయి. మల్టీజోన్– 2 కింద యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ జోన్లు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆదేశాల ప్రకారం ఇకపై వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగాల్లో ఈ జోన్లే ప్రామాణికం కానున్నాయి. పోలీసు శాఖకు మాత్రం ప్రత్యేకంగా జోన్లను ఏర్పాటు చేసింది. పోలీసు కమిషనరేట్ల పరిధి ఒకటికి మించి జిల్లాల్లో విస్తరించి ఉన్న కారణంగా మార్పులు చేసింది. -
రోడ్డెందుకు సన్నబడింది!
ఇది ఓ లింకు రోడ్డు కథ. తలాతోక లేకుండా అర్ధంతరంగా నిలిచిపోయిన రహదారి కథ. అధికారుల అవినీతికి, తలతిక్క వ్యవహారాలకు పరాకాష్ట. నార్సింగ్ నుంచి అల్కాపురి టౌన్షిప్ మీదుగా పుప్పాలగూడ వరకు 3.5 కిలోమీటర్ల లింకు రోడ్డును మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. 100 ఫీట్ల వెడల్పుతో దీన్ని నిర్మించడానికి 2015లో హెచ్ఎండీఏ భూసేకరణ చేసింది. ఇదే హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలోని ఓ అవినీతి అనకొండ అన్నీ తెలిసి... రోడ్డు కోసం సేకరించిన భూమిలో ఏకంగా ఓ అపార్ట్మెంట్ కట్టడానికి 2017లో అనుమతులిచ్చేశాడు. నిర్మాణం జరిగిపోయింది. జనం నివాసముంటున్నారు కూడా. ఇవేవీ పట్టించుకోకుండానే గత ఏడాది ఆరు కోట్ల రూపాయలతో గుడ్డిగా రోడ్డు నిర్మాణం మొదలుపెట్టేశారు. 2.5 కిలోమీటర్లు రోడ్డు వేసేశాక... రహదారికి అడ్డంగా అపార్ట్మెంట్ కనపడటంతో నోరెళ్లబెట్టారు. పనులు నిలిపివేశారు. సరైన కనెక్టివిటీ లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఎప్పటికి తేలాలి ఇది? రహదారికి ఎవరైనా ఏదైనా అడ్డంగా పెడితే... ‘తేరా బాప్ కా జాగీర్ హై క్యా?‘అని నిలదీస్తాం. అలాంటిది ఏకంగా రోడ్డునే ఆక్రమించేసి బిల్డింగ్ కడితే? ఎవడబ్బ సొత్తనుకున్నట్లు? అపార్ట్మెంట్ కట్టినోడిదా? అనుమతులిచ్చినోడిదా? -వాంకే శ్రీనివాస్ / ఆలేటి రాజేందర్‌రెడ్డి కంచె చేను మేసింది. మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించిన అధికారులే దానికి తూట్లు పొడిచారు. అందినకాడికి దండుకొని ప్రతిపాదిత రోడ్డు స్థలంలోనే బహుళ అంతస్తుల భవనానికి అనుమతి ఇచ్చేశారు. ఈ భవనం సంగతి పట్టని యంత్రాంగం అద్భుతమైన రోడ్డేసేందుకు ప్లాన్ చేసింది. హైదరాబాద్‌లో.. నార్సింగ్ నుంచి అల్కాపురి టౌన్షిప్ మీదుగా పుప్పాలగూడ వరకు 3.5 కిలోమీటర్ల లింకు రోడ్డును ఆరుకోట్ల రూపాయలతో గత ఏడాది చేపట్టింది. చకచకా రోడ్డు వేసుకొని వెళుతున్న క్రమంలో మధ్యలో భవనం ఉన్న సంగతి తెలిసి నిర్మాణ సంస్థ నోరెళ్లబెట్టింది. ఏం చేయాలో తెలియక రోడ్డు పనులు నిలిపివేసింది. అర కిలోమీటర్ మేర ఆగిపోయిన ఈ పనులతో రేడియల్ రోడ్డు 4 నుంచి 5కు ‘లింక్’కుదరలేదు. దీంతో స్థానికులు అర కిలోమీటరు దూరంలోని గమ్యాన్ని చేరడానికి 3 కి.మీ మేర ప్రయాణించాల్సి వస్తోంది. ఇదిలావుంటే.. ఇదే అలైన్మెంట్లో మరోవైపు ఆర్మీ స్థలం ఉండటంతో అటువైపు కూడా ఈ రోడ్డు పనులు నిలిచిపోయాయి. అర్ధంతరంగా నిలిచిపోయిన ఈ రోడ్డును పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వర్చువల్ పద్ధతిలో ప్రారంభించడం కొసమెరుపు. అసలేం జరిగింది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగర ప్రణాళికను తయారు చేసిన హెచ్ఎండీఏ... 2031 మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించింది. దీంట్లో భూ అవసరాలను పేర్కొంటూ జోన్లను పొందుపరిచింది. దీనికి అనుగుణంగా నివాస, పారిశ్రామిక, కన్జర్వేషన్ తదితర జోన్లను ప్రకటించింది. ఇవేగాకుండా భవిష్యత్తులో రద్దీని దృష్టిలో ఉంచుకొని రోడ్లను కూడా ప్రతిపాదించింది. ప్రతి భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతిలోనూ ఈ మాస్టర్‌ప్లాన్‌ను దిక్సూచిగా ప్రణాళిక విభాగం పరిగణనలోకి తీసుకుంటోంది. అయితే ఈ మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో కీలకభూమిక పోషించిన అధికారే దాన్ని తుంగలో తొక్కాడు. అధికార యంత్రాంగం అవినీతి పుణ్యామాని ఆ మార్గంలో ఆకాశహార్మ్యం వెలిసింది. ఆ తర్వాత తాపీగా రోడ్డేసుకుంటూ వచ్చిన ఇంజనీరింగ్ విభాగం అక్కడ వెలిసిన బహుళ అంతస్తు భవనాన్ని చూసి నివ్వెరపోయింది. చేసేదిలేక పనులు పక్కనపెట్టేసింది. నార్సింగ్ నుంచి అల్కాపురి టౌన్షిప్ మీదుగా పుప్పాలగూడలోని రేడియల్ రోడ్డు నం.5 (షేక్‌పేట నుంచి కోకాపేట ఔటర్‌కు వెళ్లే దారి)ను కలిపేలా ఏడేళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ లింకు రోడ్డు పనులను గతేడాది మొదలుపెట్టారు. పక్కా ప్రణాళికతో.. అల్కాపురి టౌన్షిప్లో 2017లో బహుళ అంతస్తుల భవనానికి హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చింది. భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే క్రమంలో మాస్టర్‌ప్లాన్‌ను నిశితంగా పరిశీలించాల్సిన ప్లానింగ్ విభాగం.. ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో భారీగా ముట్టజెప్పడంతో మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదిత రహదారి మార్గంలోనే అనుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. అసలు విషయమేమింటే 2015లోనే ఇదే హెచ్ఎండీఏ రోడ్డు కోసం భూసేకరణ కూడా చేసింది. రూ. 22.66 కోట్లు పరిహారంగా చెల్లించింది. ఈ విషయాలను మరుగున పెట్టిన ప్లానింగ్ విభాగం.. అపార్ట్మెంటుకు అనుమతులిచ్చేసింది. దీంతో పుప్పాలగూడ ప్రాంతంలో నడిరోడ్డుపై బహుళ అంతస్తుల భవనం పుట్టుకొచ్చింది. ఈ అవినీతి బాగోతంలో గతంలో సస్పెండయిన ప్లానింగ్ విభాగాధిపతి కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. లింకు కుదరక.. దిక్కుతోచక ఏదేనీ రోడ్డు నిర్మాణం చేపట్టేటప్పుడు ఇంజనీరింగ్ అధికారులు సదరు రోడ్డు అలైన్‌మెంట్‌ను నిశితంగా పరిశీలించాల్సి వుంటుంది. క్షేత్రస్థాయిలో సర్వే చేయడం ద్వారా ఏయే ప్రాంతంలో ఎలా నిర్మించాలనే దానిపై స్పష్టత వస్తుంది. ఈ రోడ్డు విషయానికి వస్తే కనీసం రోడ్డు విస్తీర్ణమెంత? మార్గమధ్యంలో వంతెనలు ఏమైనా నిర్మించాలా? కట్టడాలేవైనా ఎదురొస్తున్నాయా? అనేది గమనించకుండానే గుడ్డిగా పనులు మొదలుపెట్టారు. అలైన్‌మెంట్‌ను చూడకుండా నిర్మాణవ్యయం కూడా ఎలా ప్రతిపాదించారనే దానిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు నడిబొడ్డున బహుళ అంతస్తుల భవనం అడ్డు వస్తుండగా... మరోవైపు రక్షణ స్థలం ఉండటంతో పనులు నిలిచిపోయాయి. అటు అర కి.మీ... ఇటు అర కి.మీ వదిలి పూర్తి చేసిన 2.5 కి.మీ రోడ్డు కూడా నిరుపయోగంగా మారింది. 100 ఫీట్ల ఈ లింకు రోడ్డుకు అడ్డంకులను ఎలా అధిగమిస్తారనే దానిపై హెచ్ఆర్డీసీఎల్ ఉన్నతాధికారి జియావుద్దీన్‌ను ఫోన్లో సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు. ఏ ప్రాంతవాసులకు ఉపయోగమంటే ఈ లింకు రోడ్డు పూర్తయితే మణికొండ, అల్కపూర్, పుప్పాలగూడ, నార్సింగి, సెక్రటరీ కాలనీ, నెక్నాంపూర్‌తో పాటు చుట్టూ ప్రక్కల ప్రాంతాల వారికి... ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు వెళ్లేందుకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగం కానుంది. ఈ రోడ్డు మైహోం అవతార్ దగ్గర ఉన్న ఓఆర్ఆర్ సర్వీసురోడ్డుకు కూడా అనుసంధానం అవుతుండటంతో వాహనచోదకుల సాఫీ ప్రయాణానికి వీలవుతుంది. హెచ్ఆర్డీసీఎల్ వారే లింక్ రోడ్డు వేస్తున్నారు హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) రేడియల్ రోడ్డు నంబర్ –4 (నార్సింగి) నుంచి రేడియల్ రోడ్డు నంబర్ 5(పుప్పలగూడ)ని అనుసంధానించే... 3.5 కిలోమీటర్ల 100 ఫీట్ల లింక్ రోడ్డును నిర్మిస్తోంది. మేం 2015లోనే రూ.22.66 కోట్లు పరిహారం చెల్లించి భారీ రహదారి కోసం భూమి సేకరించాం. అయితే గతేడాది ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం హెచ్ఆర్డీసీఎల్ వారే టెండర్లు పిలిచి కరోనా సమయంలో కాంట్రాక్టర్‌తో రోడ్డు నిర్మించారు.అయితే నార్సింగ్ వైపున 500 మీటర్ల మేర ఆర్మీ స్థలం ఉండటంతో వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే పరిష్కరిస్తాం. – బీఎల్ఎన్ రెడ్డి, హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగాధిపతి లింక్ రోడ్డు లేక నరకం రేడియల్ రోడ్ల మధ్య లింక్ రోడ్డు పనులు పూర్తి కాకపోవటంతో మణికొండ, నార్సింగి, నెక్నాంపూర్, పుప్పాలగూడ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఐటీ సంస్థలకు వెళ్లేందుకు ఇరుకు రోడ్ల వెంట ట్రాఫిక్‌లో దుమ్ము,ధూళితో ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సి వస్తోంది. – శ్రీనివాస్, ఐటీ ఉద్యోగి, అల్కాపురి టౌన్షిప్ ఏమర్జెన్సీ వస్తే... అంతే సంగతులు! మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపురి టౌన్‌షిప్‌తో పాటు చుట్టు పక్కల ప్రజలకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఇక అంతే సంగతులు. రోడ్ల కనెక్టివిటీ సరిగా లేకపోవటం, ఉన్న రోడ్లు సైతం మిలట్రీ అధికారులు ఓ వైపు, భవన నిర్మాణంతో మరోవైపు మూసి వేయటంతో అంబులెన్స్ రావాలన్నా బాగా సమయం పడుతోంది. – అనురాగ్, అల్కాపురి టౌన్షిప్ -
‘గురుకుల’ విభజనపై కొత్త చిక్కులు
సాక్షి, హైదరాబాద్ : గురుకుల విద్యాసంస్థల సొసైటీల పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో పోస్టుల విభజనకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమలుకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆ మేరకు పోస్టులను జోన్లు, మల్టీజోన్లు, జిల్లా కేడర్‌వారీగా విభజించాలి. ఆ తర్వాతే కొత్తగా నియామకాలు చేపట్టేందుకు నోటిఫికేషన్లు జారీ చేసే వీలుంటుంది. ఈ క్రమంలో పోస్టుల విభజనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతూ గురుకుల నియామకాల బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల ఆధారంగా వాటిని విభజిస్తే సరిపోతుందని బోర్డు భావించినప్పటికీ ప్రభుత్వ స్పందన భిన్నంగా రావడంతో గురుకుల నియామకాల బోర్డు తలపట్టుకుంది. మీరే స్పష్టత ఇవ్వాలి... రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త జోనల్ విధానం నేపథ్యంలో గురుకుల విద్యాసంస్థల సొసైటీలు కొత్త నిబంధనల పరిధిలోకి వస్తాయా లేదా అనే అంశాన్ని తేల్చుకునేందుకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు గత నెలలో ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు గురుకుల సొసైటీకి వర్తిస్తాయా లేక ప్రత్యేక నిబంధనలకు లోబడి పనిచేస్తాయా చెప్పాలని కోరింది. అయితే అనూహ్యంగా ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయాన్ని బోర్డుకే వదిలేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా బోర్డుకు తిరుగు లేఖ రాశారు. వీలైనంత త్వరగా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీంతో బోర్డు డైరెక్టర్లు తెల్లబోయారు. ప్రభుత్వమే తేల్చాల్సిన అంశాన్ని బోర్డుకు వదిలేయడంపై అయోమయంలో పడ్డారు. ఈ క్రమంలో బోర్డు ఏర్పాటు సమయంలో బైలాస్, నియామకాల్లో పాటించిన విధానాన్ని పరిశీలించి నివేదిక తయారు చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖ సొసైటీ కార్యదర్శులు నిర్ణయించారు. ఇటీవల ప్రత్యేకంగా సమావేశమై ఒక దఫా చర్చలు జరిపిన కార్యదర్శులు మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. -
నేటికీ వదలని ‘ పీడకల’
22 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడి కేబినెట్లో మంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ 371(డి) ప్రకారమే జోనల్ పద్ధతి ఒకే విధంగా కొనసాగాలని నాటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. ‘రాష్ట్రం మొత్తంలో ఏ ప్రాంతపు ఉద్యోగిని మరే ఇతర ప్రాంతానికి బదిలీ చేసినా సరే విధిగా అక్కడికి వెళ్లి పనిచేయాల్సిందే’ అని చెప్పారు. అందుకే, 371(డి) మూడు ప్రాంతాల మూడు ముళ్లబంధంగా కాకుండా ఆరు ఉప రాష్ట్రాల ఆరు ముళ్లబంధంగా ఉమ్మడి రాష్ట్ర విభజన దాకా కొనసాగుతూ వచ్చింది. విభజన జరిగిన పద్ధతితో ఉభయ రాష్ట్రాలలో సమస్యలు మరింత పెరిగిపోయాయి. ఇది ఆర్డర్లు, ఆర్డినెన్సుల జారీవల్ల తేలే సమస్య కాదు. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమ లక్ష్యాల్లో ఒకటి ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వే షన్లు కల్పించడం. ముఖ్యమంత్రి వాదన విని ఫైలుకు సమ్మతించేందుకు ప్రధాని ఒప్పుకున్నారు. దీంతో మూడు మాసాల ఎదురుచూపులు ఫలించాయి. 1975 నాటి 371(డి) ప్రత్యేక రాజ్యాంగ సవరణ ఉత్తర్వుకు రాష్ట్రపతి ఉత్తర్వుతో తెరపడుతుంది. – బి.వినోద్‌కుమార్, టీఆర్ఎస్ ఎంపీ ప్రకటన ఉద్యోగుల భర్తీ కోసమే ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తున్నట్టు కేసీఆర్ చెబుతున్నారు. కానీ, కొత్త జిల్లాల ఆమోదానికే ఆయన ఈ డ్రామాలు ఆడుతున్నారు. గత నాలుగేళ్లలో ఏనాడూ గర్తుకురాని నిరుద్యోగుల సమస్యలు కేసీఆర్‌కు ఇప్పుడే గుర్తుకురావడం అసలు విశేషం. ఆయన పాలనలో నిరుద్యోగులకు నిరాశ మాత్రమే మిగిలింది. – టి.జీవన్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తుకు, ఉభయ ప్రాంతాల ఉద్యోగాల సృష్టికి, వాటి పరిరక్షణకు 1975లో అసాధారణ, ప్రత్యేక రాజ్యాంగ సవరణ ద్వారా అనుల్లంఘనీయ ఏర్పాటుగా 371 (డీ) నిబంధన రూపొందించారు. ఆనాడు ఈ ప్రత్యేక నిబంధనను కేవ లం తెలంగాణ సోదరుల కోసం మాత్రమే చేయలేదు. అది యావత్తు ఆంధ్రప్రదేశ్ లోని విద్య, ఉద్యోగ విషయాల్లో ప్రజలందరికీ వర్తించే ఒక ప్రత్యేక ఏర్పాటు అని మరవరాదు. ఈ అధికరణ ఫలితంగానే మొత్తం రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించారు. ఇతరత్రా చట్టాలన్నింటికీ పూర్తి అతీతంగా ఈ 371(డీ) పనిచేస్తుందని అందులో స్పష్టంచేశారు. ఇంతకూ ఈ ప్రత్యేక అధికరణ(నిబంధన) లక్ష్యం ఏమిటి? ‘‘ప్రభుత్వో ద్యోగాల్లో, విద్యావకాశాల కల్పనలో మొత్తం రాష్ట్రంలోని వివిధ ప్రాంతా లకు చెందిన ప్రజలకు సమాన అవకాశాలు, సౌకర్యాలు కల్పించడం. అందుకుగాను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అవసరాలకు తగిన ఏర్పాట్లు చేయడం. అలాంటి అనుల్లంఘనీయమైన ఐక్యతా నిబంధన పోగొట్టు కుని తెలుగువాళ్లు రెండుగా చీలిపోయారు. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలూ ఒకటిగాదు పలు సమస్యల చిక్కుముడిలో ఇరుక్కు పోయి నాలుగేళ్లయినా తేరుకోలేకపోతున్నాయి. నిజానికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు సాగిన నేపథ్యంలోనే రాజ్యాంగ సవరణ చేశారు. అంతే గాదు, 371(డీ) ప్రత్యేక అధికరణ ద్వారా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర–మూడు ప్రాంతాలనూ సమాంతరంగా అభివృద్ధి చేయాలి, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో 54 శాతం ఓపెన్ కేటగిరీ ద్వారా భర్తీ చేయాలి. మిగతా 46 శాతం ఖాళీలను బీసీ, ఎస్సీ, ఎస్టీలతో నింపాలి. అలాగే, విశ్వవిద్యాలయాల్లో, ఇతర విద్యాసంస్థల్లో సీట్లను సైతం ఇదే దామాషాలో భర్తీ చేయాలి. ఇంకా, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా చీలిపోయినప్పటికీ, రెండింటికీ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగానే హైదరాబాద్ కొనసాగుతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర విభ జన సమయంలోనే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్– 95 ప్రత్యేకించి పేర్కొంది. ఆనాడు కాంగ్రెస్ కేంద్ర నాయకులతో ‘ఇద్దరు చంద్రులు’ (చంద్రబాబు, కేసీఆర్) చేసుకున్న లోపాయికారీ ఒప్పం దాలు లేదా ఏర్పాట్ల ఫలితంగా అడ్డగోలుగా విభజన జరిగిపోయింది. కాని, పదేళ్లు పూర్తయ్యేదాకా ఆ 371(డీ) అధికరణను చెక్కుచెదర్చడానికి వీల్లేదని విభజన చట్టంలోని సెక్షన్–95 స్పష్టంగానే పేర్కొంది. కాబట్టి, పదేళ్లు అంటే 2024 సంవత్సరందాకా ఆ సెక్షన్‌ను ముట్టుకోవడానికి వీల్లేదు. ఆ సెక్షన్ కాలపరిమితి ముగిసిన తర్వాతనే అప్పటిదాకా అమల్లో ఉండే ఉమ్మడి జోనల్ వ్యవస్థ రద్దయి, కొత్త జోన్లు ఏర్పాటు చేసుకోవడానికి మార్గం తేలికవుతుంది. నేడు ఉభయ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకటా, రెండా?! అసమగ్ర విభజన వల్ల ఎక్కడి ప్రధాన సమస్యలు అక్కడే ఉండిపోయాయి. ఓటుకు కోట్లు కేసుతో హడావుడిగా అమరావతికి! పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఆ లోగా ఆంధ్రప్రదేశ్ తన సొంత రాజ ధాని ఏర్పాటుచేసుకోవాలన్న షరతుకు చంద్రబాబు మొదట తలూపివచ్చారు. తర్వాత ఏపీ రాజధాని ఏర్పా టుపై నియమించిన నిపుణుల కమిటీ చైర్మన్ కేసీ శివరామకృష్ణన్ నివేది కను కనీసం అసెంబ్లీలో కూడా చర్చకు రాకుండా చేశారు. అంతటితో ఆగకుండా ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ ద్వారా తనకు అనుకూలమైన నివేదిక ఆధారంగా ఆంధ్ర రాజధానిగా అమరావతిని స్థిరపరిచి నేడు ‘నిర్మాణ దారి ద్య్రం’లో నిండా మునిగి ఉన్నారు. 10–15 అడుగుల్లోనే నీరు ఉబికి వచ్చి ‘మునగానాం, తేలానాం’గా ఉండే లోతట్టు ప్రాంతం ఈ అమరావతి. పట్టుమని నాలుగేళ్లు గడవకుండానే అర్థంతరంగా హైద రాబాద్లోని సెక్రటేరియట్‌ను వదిలి ఉడాయించారు. కేసీఆర్, చంద్ర బాబు మధ్య నడిచిన ‘ఓటుకు కోట్లు’ కేసు డ్రామాలో ‘దొరికిపోవడం’ వల్ల సెక్రటేరియట్‌ను ఆగమేఘాల మీద ఖాళీచేసి పారిపోయినట్ట యింది. అంటే, చట్టం నిర్దేశించిన పదేళ్లలో మిగిలిన ఆరేళ్లు వ్యవధి ముగి యక ముందే, స్థిమితంగా రాజధానిని నిర్మించుకునే సదవకాశాన్ని ‘ఓటుకు కోట్లు’ కేసుతో కోల్పోవలసివచ్చింది. ఇక ఇద్దరు చంద్రులు ఎదుర్కొంటున్న సమస్యలకు అంతే లేదు. నదీ జలాల సమస్య, ప్రాజెక్టుల పంపిణీ, ఉద్యోగుల నియామకాలు, పంపిణీలు, నీటి పంప కాల్లో బచా వత్, బ్రజేష్ కమిటీల సిఫారసుల వివేచనలో కొలిక్కి రాని తగాదాలు, జోనల్ సమస్యలు– ఇవన్నీ ఉభయ ప్రభుత్వాల సంగతేమో గానీ, ప్రజలకు మాత్రం అనంతమైన కష్టాలు తెచ్చిపెట్టాయి. ఉభ యులూ మర్చిపోయిన అంశం–371(డి) ఉమ్మడి రాష్ట్రాన్ని 6 జోన్లుగా మార్చిందంటే, ఏపీ అసలు రూపం ఒక రాష్ట్రం అని కాదు, అది ఆరు ఉప రాష్ట్రాల సమాఖ్య అనే! కనుకనే 1974 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక అభ్యర్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్లను 85 శాతం గానూ, స్థానికేతర కేటగిరీకి 15 శాతంగానూ కేటాయించాలని ఆ అధి కరణలో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ తెలంగాణలో తీసుకున్న ప్రతిపాదన ప్రకారం స్థానికులకు ఈ సీట్ల కేటాయింపు 95 శాతంగానూ, స్థానికేతరులకు కేవలం 5 శాతంగానూ ఉంటుంది. 22 ఏళ్లనాటి కేసీఆర్ మాట ఏమైంది? కానీ, 22 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడి కేబినెట్లో మంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ 371(డి) ప్రకారమే జోనల్ పద్ధతి ఒకే విధంగా కొన సాగాలని నాటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. ‘రాష్ట్రం మొత్తంలో ఏ ప్రాంతపు ఉద్యోగిని మరే ఇతర ప్రాంతానికి బదిలీ చేసినా సరే విధిగా అక్కడికి వెళ్లి పనిచేయాల్సిందే’ అని చెప్పారు. అందుకే, 371(డీ) మూడు ప్రాంతాల మూడు ముళ్లబంధంగా కాకుండా ఆరు ఉప రాష్ట్రాల ఆరు ముళ్లబంధంగా ఉమ్మడి రాష్ట్ర విభజన దాకా కొనసాగుతూ వచ్చింది. విభజనతో సమస్యలు మరింత పెరిగిపోయాయి. నేడు ఉభయ రాష్ట్రాలనూ చుట్టిముట్టిన సమస్యలకు విభజన జరిగిన పద్ధతే ప్రధాన కారణం. గత నాలుగేళ్ల çపరిపాలన వల్ల లబ్ధి పొందినది పాలక కుటుంబాలేననేది ప్రజాభిప్రాయంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఒక ప్రశ్న ప్రజలకు ఎదురవుతోంది. వాజ్‌పేయి నాయకత్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్(ఎన్డీఏ) ప్రభుత్వం 2000 సంవత్సరంలో తన ఉనికి కోసం ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని చిన్న ప్రాంతాలను ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలుగా ఏర్పాటు చేసింది. ఈ చిన్న హిందీ రాష్ట్రాల ఏర్పాటుకు అప్పటి ఏన్డీఏ సర్కారు ఆశ్రయించింది రాజ్యాంగంలోని 2/3/4 అధికరణలనే. అయితే, ఈ మూడు అధికరణల అవతారం గుట్టు– 600 ప్రత్యేక సంస్థానాలుగా భారతదేశం అనైక్యంగా బతికిన కాలాన్ని దృష్టిలో పెట్టుకుని స్వతంత్ర భారత యూనియన్‌లో ఆ సంస్థానాలను విలీనం చేయడంలో ఉంది. ఈ సంస్థానాల విలీనం కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ ప్రత్యేక నిబంధనలను పరాయి పాలనలో రూపొందించారు. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపత్తి విషయంలో రాజ్యాంగంలో కల్పిం చిన ప్రత్యేక నిబంధన 371(డి) వంటిది కొత్త రాష్ట్రాలకు లేదు. కనుకనే ఆ మూడు రాష్ట్రాల ఏర్పాటులో రాజ్యాంగ తగాదా తలెత్తలేదు. ఒకటైన రెండు తెలుగు ప్రాంతాలు చారిత్రక కారణాల వల్ల మళ్లీ విడిపోయాయి. అయినా 2014 విభజన నాటి నుంచీ పాత ఆత్మీయ బంధాల మూలంగా రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి పురోగమిస్తున్నాయి. ఈ దశలో స్వార్థ రాజకీయాల నీడలో ‘కుటుంబ పాలన’ అనేక అనర్థాలకు దారి తీస్తోంది. బహుశా అందుకనే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సైతం 371(డి) అధికరణ విస్తృతాధికారాన్ని వివరిస్తూ, ఇది రాజ్యాంగంలోని 2 నుంచి 4 వరకు ఉన్న అధికరణలు సహా మిగతా రాజ్యాంగ అధికరణల న్నింటినీ తోసిపుచ్చుతోందని వ్యాఖ్యానించవలసి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రత్యేక అధికరణ రద్దుకు అనుకూలంగా పార్లమెంటులో మూడింట రెండొంతులకు పైగా సభ్యులు ఓటేస్తే తప్ప కేసీఆర్ జోనల్ వ్యవస్థను అనుకున్న స్థాయిలో దక్కించుకోవడం కష్టం కావచ్చు. ఇది ఆర్డర్లు, ఆర్డి నెన్సుల జారీవల్ల తేలే సమస్య కాదు. ఆ ప్రత్యేక అధికరణ స్వరూప, స్వభావమే అంత అని గుర్తించడం మంచిది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, రాజ్య సభలో అప్పటి బీజేపీ సీనియర్ సభ్యుడు ఎం. వెంకయ్య ఆపద్ధర్మంగా ప్రక టించిన హామీలన్నీ నీటిమూటలయ్యాయి. ఈసారికి గట్టెక్కితే చాలను కునే పాలకులు చేసే వాగ్దానాలకు ప్రజలు మోసపోరాదన్నదే 70 ఏళ్ల దేశ అవకాశవాద రాజకీయం నేర్పుతున్న గుణపాఠం. ఎటువెళ్లినా 371(డి) నేటికీ వదలని, వదిలించుకోలేని ఓ పీడ కల!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@ahoo.co.in -
పర్మిషన్ @ జోన్!
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్లో భవన నిర్మాణ అనుమతులు ఇక సులభంగా జారీకానున్నాయి. వెయ్యి చదరపు మీటర్ల ప్లాట్ ఏరియా పరిమితితో స్టిల్ట్ ప్లస్ ఐదంతస్తుల వరకు అన్ని రకాల అనుమతులను ఇకపై జోనల్ స్థాయిలోనే ఇవ్వనున్నారు. ప్రస్తుతం 750 చదరపు మీటర్ల పరిమితితో స్టిల్ట్ ప్లస్ ఐదంతస్తుల నివాస భవనాల వరకు మాత్రమే అనుమతులిస్తున్నారు. జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాలను బలోపేతం చేసే పేరిట ఇకపై వాణిజ్య, తదితర భవనాలకు సైతం నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓసీ) అక్కడి నుంచే జారీ చేయనున్నారు. గతం లో జోనల్ కార్యాలయాల్లో స్టిల్ట్ ప్లస్ నాలుగంతస్తుల వరకు మాత్రం అధికారాలుండేవి. గత సం వత్సరం సెప్టెంబర్ నుంచి 750 చ.మీ.ల విస్తీర్ణం వరకు నివాస భవనాలకు స్టిల్ట్ ప్లస్ ఐదంతస్తులకు అనుమతులిచ్చే అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు నివాస భవనాలతోపాటు వాణిజ్య, తదితర భవనాలకు వర్తింపచేయడమే కాక స్థల విస్తీర్ణాన్ని సైతం వెయ్యి చదరపు మీటర్ల వరకు పెంచారు. అంటే భారీ బహుళ అంతస్తులకు సంబంధించిన అనుమతులు మాత్రమే ఇక ప్రధాన కార్యాలయం నుంచి ఇస్తారు. అవినీతి అక్రమాలకు మరింత ఊతం..? జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో స్టిల్ట్ ప్లస్ మూడు అంతస్తుల వరకు అనుమతులిస్తున్నారు. ఆపైవి అంటే..స్టిల్ట్ ప్లస్ నాలుగంతస్తులు, ఐదంతస్తులవి జోనల్ కార్యాలయాల్లో ఇవ్వనున్నారు. సర్కిళ్లు, జోన్లలోని జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం ఇప్పటికే అవినీతిలో మునిగిపోయింది. ప్రతి ఫైలుకూ పైసలు లేనిదే పని జరగదనేది బహిరంగ రహస్యం. ఆన్లైన్ ద్వారానే భవన నిర్మాణఅనుమతుల జారీ..నిర్ణీత వ్యవధిలో అనుమతివ్వకుంటే సంబంధిత అధికారులపై చర్యలనేవి ప్రకటనలకే పరిమితమయ్యాయి. తమ చేయి తడపనిదే ఏదో ఒక కొర్రీ వేసి జాప్యం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ప్రధాన కార్యాలయంలోనూ అవినీతి లేదనలేకున్నా.. కమిషనర్, చీఫ్‌సిటీ ప్లానర్ వంటి ఉన్నతాధికారులు ఉంటారు కాబట్టి జోనల్, సర్కిళ్లతో పోలిస్తే తక్కువ. వెంటనే ఫిర్యాదు చేయడానికి ఉన్నతాధికారులుంటారు కనుక సంబంధిత అధికారులు సైతం దాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తారు. సర్కిళ్లు, జోన్లలో మాత్రం టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఆడిందే ఆట అన్నట్లు సాగుతోంది. భవన నిర్మాణ అనుమతుల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల దాకా అదే తంతు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిక వాణిజ్య భవనాలతో సహ 1000 చ.మీ.ల వరకు స్టిల్ట్ ప్లస్ ఐదంతస్తుల వరకు అక్కడే అధికారం అంటే జోన్లలోని అధికారులకు, సిబ్బందికి పండగే. ఆన్లైన్ ద్వారా అనుమతులిచ్చే బీపీఎంఎస్ (బిల్డింగ్ పర్మిషన్ మేనేజ్మెంట్ స్కీమ్)ద్వారా అవినీతి జరగడం లేదని ఉన్నతాధికారులు భావించడం కేవలం వారి భ్రమేనని పలువురు నిర్మాణదారులు పేర్కొంటున్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ పద్ధతి అమల్లోకి తెచ్చినా ‘చదివింపులు’ లేనిదే పనులు జరగవని, లేనిపోని కొర్రీలు వేస్తూ తీవ్ర జాప్యం చేస్తారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని బిల్డర్ ఒకరు చెప్పారు. తాము సైతం ఎలాగూ చెల్లించక తప్పదు కనుక త్వరితంగా పని కావాలనుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల భవనాల అనుమతుల అధికారాన్ని జోన్లకే బదలాయించడం వారి అవినీతిని మరింత పెంచిపోషించేందుకేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారితోపాటు అన్నిరకాల భవనాలకూ స్థానికంగానే అనుమతులివ్వడం వల్ల కార్పొరేటర్లకు పైరవీల ఆదాయం కూడా మరింత పెరుగుతుందనే అభిప్రాయాలున్నాయి. బలోపేతం ప్రకటనలకే..? జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాలను ఐదు నుంచి ఆరుకు పెంచినందున, వాటిని బలోపేతం చేసేందుకు, ప్రధాన కార్యాలయంలో పనిఒత్తిడి తగ్గించేందుకు ఈ చర్యలని పేర్కొంటున్నా..అంతిమంగా దీనిద్వారా అవినీతి కేంద్రీకృతం కానుందని పలువురు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనల్ని ఆమోదించారు. అమలుకు సంబంధించి త్వరలో ఉత్తర్వు జారీ చేయనున్నారు. రహదారుల విస్తరణలో ఆస్తులు కోల్పోయే వారికిచ్చే మినహాయింపులు వంటివి మాత్రం ఎన్ని అంతస్తులవైనా ప్రధాన కార్యాలయానికే పంపిస్తారు. -
జోన్ల లొల్లి.. వికారాబాద్ బంద్
సాక్షి, వికారాబాద్ : తమ జిల్లాను జోగులాంబ జోన్లో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు బంద్ చేపట్టారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి బస్ డిపో ముందు బైఠాయించడంతో బస్సులు డిపొకే పరిమితమయ్యాయి. వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు జిల్లా బంద్‌లో పాల్గొన్నాయి. కాగా, జోన్ల విషయంలో సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, దీనిపై కాంగ్రెస్ తరపున కేంద్రానికి లేఖ రాస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. వికారాబాద్ జిల్లాను పక్కనే ఉన్నచార్మినార్ జోన్లో కాకుండా ఎక్కడో సుదూరంలో ఉన్న జోగులాంబలో కలపడంపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఎక్కడో దూరంలో ఉన్న జహీరాబాద్ ప్రాంతాన్నే చార్మినార్ జోన్లో కలపగా, పక్కనే ఉన్న వికారాబాద్‌ను మాత్రం జోగులాంబ జోన్ల కలపడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇక్కడి వారు అక్కడికెళ్లి ఉద్యోగాలు చేయడమంటే జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలైన యాదయ్య, సంజీవరావు తదితర నేతలు సైతం సీఎం కేసీఆర్‌ను ఒప్పించే విషయంలో విఫలమయ్యారని జిల్లా వాసులు మండిపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ నిర్ణయం టీఆర్ఎస్కు జిల్లాలో సెల్ఫ్‌గోల్‌గా మారింది. -
‘జోనల్’కు కేబినెట్ ఆమోదం; ఢిల్లీకి సీఎం కేసీఆర్
హైదరాబాద్: నూతనంగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఎల్ఐసీ ద్వారా రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి కూడా పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. విస్తృత చర్చ అనంతరం జోనల్ వ్యవస్థ, బీమా పథకాలను మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రత్యేక ఆహ్వానం మేరకు టీఎన్జీవోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్, గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు వి. శ్రీనివాస గౌడ్, టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డిలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. జోన్ల వ్యవస్థకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని ప్రధానమంత్రిని కోరడానికిగానూ సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేబినెట్ ఆమోదించిన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ► తెలంగాణలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటవుతాయి. ►తెలంగాణలో ఇకపై ఉద్యోగుల నియామకానికి జిల్లా, జోన్, మల్టీ జోన్, స్టేట్ కేడర్లు ఉంటాయి. ►స్టేట్ కేడర్ పోస్టులను ఖచ్చితంగా పదోన్నతి ద్వారానే భర్తీ చేస్తారు. ► ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు విద్యాబ్యాసంలో కనీసం నాలుగు సంవత్సరాలు ఎక్కడ విద్యాబ్యాసం చేస్తారో, ఆ ప్రాంతాన్నే సదరు అభ్యర్థి స్థానిక ప్రాంతం (లోకల్ ఏరియా)గా గుర్తిస్తారు. ►అన్ని పోస్టులకు 95 శాతం లోకల్, 5 శాతం ఓపెన్ కేటగిరిగా ఉంటుంది. ►రాష్ట్రంలోని 18-60 ఏండ్ల వయస్సున్న ప్రతీ రైతుకు రూ.5 లక్షల జీవితబీమా వర్తిస్తుంది. ►ఎల్ఐసీ ద్వారా జీవిత బీమా అమలు చేస్తారు. ప్రతీ రైతుకు రూ.2,271 చొప్పున ప్రతీ ఏడాది ప్రీమియం కడతారు. బీమా ప్రీమియానికి సంబంధించిన సొమ్మును ప్రభుత్వం బడ్జెట్లోనే కేటాయిస్తుంది. జూన్ 2 నుంచి రైతుల నుంచి నామినీ ప్రతిపాదన పత్రాలు సేకరిస్తారు. ఆగస్టు 15 నుంచి బీమా సర్టిఫికెట్లు అందిస్తారు. ►వైద్య ఆరోగ్య శాఖలో టీచింగ్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 65 సంవత్సాలకు పెంచుతారు. ► రాష్ట్ర రైతు సమన్వయ సమితికి ఎండీతో పాటు ఇతర వైద్యసిబ్బందిని నియమిస్తారు. -
కాసుల పంట
లాభాల్లో అమలాపురం ఆర్టీసీ డిపో ఈ ఏడాది రూ.1.32 కోట్లు ఆర్జితం జోన్లో ప్రథమస్థానం రాష్ట్రంలో 4వ స్థానం అమలాపురం రూరల్ : రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉన్నా అమలాపురం డిపో మాత్రం కాసులు కురిపిస్తూ లాభాలు గడిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్æనుంచి ఆగస్టు నాటికి రూ.1.32కోట్ల లాభాన్ని ఆర్జించి విజయనగరం జోన్‌లోని 27 డిపోల్లో ప్రథమస్థానంలో నిలిచింది. డిపో నిర్వహణ ఖర్చు తగ్గించి ఆక్యుపెన్సీని 68 శాతం పెంచడానికి అ«ధికారులు, కార్మికులు శ్రమించారు. 2011లో రూ.75.32 లక్షల లాభాల్లో ఉన్న డిపో 2012 మార్చికి రూ. 9.53 లక్షల నష్టాల్లో ఉంది. 2015 ఆగస్టు నాటికి రూ.1 కోటి లాభాన్ని ఆర్జించింది. రాష్ట్రంలో ఏడు డిపోలు మాత్రమే లాభాల్లో.. రాష్ట్రంలో ఉన్న 126 డిపోల్లో 7 డిపోలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. అవి... అమలాపురం, విజయవాడ, ఆటోనగర్, తిరుపతి, అలిపిరి, కాకినాడ, కనిగిరి. విజయవాడ, అటోనగర్ డిపోలు, çపల్లెవెలుగు బస్సులు నడపడం లేదు. తిరుపతి, అలిపిరి డిపోలు శ్రీవేంకటేశ్వర స్వామి కొండపైకి బస్సులు నడపడం ద్వారా లాభాలు సాధించాయి. డిపో కృషి.. అమలాపురం డిపో నుంచి కోనసీమలోని పలు గ్రామాలకు 40 పల్లెవెలుగు బస్సులు నడపడం ద్వారా కిలోమీటర్‌కు రూ. 12 నష్టం వస్తోంది. పెరిగిన జీతాలు రూ.1.80 కోట్లు, డీజిల్, ఇతర ఖర్చులు కలిపి నెలకు రూ. 6 కోట్ల ఖర్చు అవుతోంది. ఈ నష్టాలు భరిస్తూ డిపోని లాభాల బాటలోకి తీసుకు రావడానికి డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి చర్యలు చేపట్టారు. హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయవాడ రూట్లలో ఆదాయం పెంచడం ద్వారా ఆక్యుపెన్సీ 68 శాతం పెరిగింది. ఏసీ బస్సులను నడుపుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోంది. ఆదాయం వచ్చే రూట్లలో అదనపు బస్సులు తిప్పడం ద్వారా లాభాలార్జించారు. 142 బస్సులున్న డిపోలో 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సమష్టి కృషి ఫలితం ఆదాయం వచ్చే రూట్లలో అదనపు బస్సులను తిప్పుతూ డిపోని లాభాల్లోకి తీసుకుని వచ్చాం. నిర్వహణ ఖర్చు తగ్గించడం ద్వారా ఆదాయాన్ని పెంచాం. కార్మికుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. లాభాలు సాధిస్తున్న డిపో మేనేజర్లను సంస్థ విదేశాలకు పంపిస్తోంది. అమలాపురం నుంచి నాకు కూడా అవకాశం వస్తుంది. – సత్యనారాయణమూర్తి, డిపో మేనేజర్