( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన క్రమంలో స్థానికత, జోనల్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ చేయాల్సిన నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినందున పాత జోనల్ విధానంలో మార్పులు చేసి కొత్త జిల్లాలను కలిపి కొత్త జోన్లు, మల్టీ జోన్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల సంఖ్య 1975కు సవరణ చేసేందుకు ప్రతిపాదిత అంశంపై జవహర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమీక్షలో సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్.. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సంబంధించి స్థానికత, ప్రతిపాదిత నూతన జోనల్ విధానం తదితర అంశాలను వివరించారు.
ఇక, ఈ సమావేశంలో రాష్ట్ర పీఆర్అండ్ఆర్డీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యంటి. కృష్ణబాబు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్,హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్త, అదనపు సీసీఎల్ఏ ఇంతియాజ్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెఎచ్ హరికిరణ్, న్యాయశాఖ కార్యదర్శి జి. సత్య ప్రభాకర రావు, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్, జీఎడీ అదనపు కార్యదర్శి శ్రీనివాస్, తదితర అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: తండ్రి బాటలోనే సీఎం జగన్.. అభివృద్ధి పరుగులు
Comments
Please login to add a commentAdd a comment