క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా | CS Jawahar Reddy reacts on Janasena Corporator Peethala Murthy Yadav | Sakshi
Sakshi News home page

క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా

Published Sun, May 26 2024 3:56 AM | Last Updated on Sun, May 26 2024 3:56 AM

CS Jawahar Reddy reacts on Janasena Corporator Peethala Murthy Yadav

జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తికి సీఎస్‌ జవహర్‌రెడ్డి హెచ్చరిక

విశాఖలో అసైన్డ్‌ భూములు కొనుగోలు చేయలేదు

సాక్షి, అమరావతి: జనసేన కార్పొరేటర్‌  పీతల మూర్తి యాద­వ్‌ తనపైన, తన కుమారుడిపైన చేసిన నిరాధార తప్పు­డు ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.­ఎస్‌.జవహర్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేర­కు శనివారం సీఎస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆరోపణలను వెనక్కి తీసు­కుని క్షమా­పణలు చెప్పాలని మూర్తి యాదవ్‌ను ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే వ్యక్తిగతంగా పరువు నష్టం దావా వేయడంతో పాటు చట్ట ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని సీఎస్‌ హెచ్చరించారు. రెండు నెలలుగా ఒక పథకం ప్రకా­రం వ్యక్తిత్వ హననం చేసే కుట్రలో భాగంగా చేస్తున్న ప్రచారమే ఈ ఆరో­ప­ణ­లని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

విశా­ఖ పరిసర ప్రాంతాల్లో తాను గానీ, తన కుమారుడు, బంధువులు ఎలాంటి అసైన్డ్‌ భూములు కొనలేదని స్పష్టం చేశా­రు. తన స్నేహితుడైన రిటైర్డ్‌ ఆర్మీ అధికారి కుమార్తె వివాహం ఏప్రి­ల్‌లో జరిగిందని, ఎన్నికల దృష్ట్యా ఆ వివాహా­నికి హాజరు కాలేకపోయినందున రెండు రోజుల విశాఖ పర్యటలో భాగంగా ఆది­వారం కొత్త దంపతులను ఆశీర్వదించడా­నికి వెళ్లా­నని సీఎస్‌ తెలిపారు. ఆ మరు­సటి రోజు భోగా­పురం విమా­నాశ్రయ నిర్మాణ పను­లను పరిశీలించానన్నారు. ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్ల రూపా­యల విలువైన 800 ఎకరాలు అసైన్డ్‌ భూములు కొట్టేసి­నట్లు యాదవ్‌ చేసిన ఆరోపణలను ఆయ­న తీవ్రంగా ఖండించారు.

అసైన్డ్‌ భూముల చట్ట సవరణకు సంబంధించి అసెంబ్లీ­లో 2023 అక్టోబర్‌లో సభ ఆమో­దం తెలిపిందని, ఆ సవరణను అనుసరించి అసై­న్డ్‌ భూము­­ల­పై జీవో 586ను రెవెన్యూ శాఖ జారీ చేసిందని సీఎస్‌ పేర్కొ­న్నారు. చట్ట సభ ఆమోదం మేరకే జీవో జారీ అయితే దాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆపా­ది­ంచ­డం ఎంత వర­కు సబబని ఆయన ప్రశ్నించారు. ఈ జీవో ఆధారంగా తన కుమా­రుడి ద్వారా విశాఖ­లో 800 ఎకరాలకు పైగా భూములు కొనుగోలుకు డీల్స్‌ చేసిన­ట్లు చేసిన ఆరోపణ పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే 400 ఎకరాల అసైన్డ్‌ భూము­లను తన కుమారుడిని అడ్డంపెట్టుకుని బినామీల పేరిట చేజిక్కించుకు­న్నా­న­న­డంలో ఎంత మాత్రం నిజం లేదన్నారు.

మరో 400 ఎకరాలను రిజి­స్రే­్టషన్‌ చేయించేందుకు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాననడం పూర్తిగా అవా­­స్తవ­మని సీఎస్‌ తెలి­పా­రు. ఈ భూముల రిజిస్ట్రేషన్లను పూర్తి చేసేందుకు విశా­ఖ, విజయనగరం జిల్లాల అధికారులపై ఒత్తిడి చేశాననడాన్నీ ఆయన తీవ్రంగా ఖండించారు. ఐదేళ్లలో తన కుమారుడు విశాఖకు గానీ, ఉత్తరాంధ్ర­లో ఏ జిల్లాకూ గాని వెళ్లలేదని సీఎస్‌ స్పష్టం చేశారు. మరో వైపు భోగాపురం విమా­నా­శ్రయ పనుల పరిశీలన పేరుతో సీఎం జగన్‌ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లపై తాను సమీక్షించానని చేసిన ఆరోపణా అసంబద్ధమేనని ఖండించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement