murthy
-
ఆకట్టుకుంటున్న ‘కోర’ టీజర్
యాక్షన్ జానర్, పీరియాడిక్ డ్రామాతో వస్తున్న చిత్రాలకు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనే కన్నడ నుంచి మరో యాక్షన్ మూవీ రాబోతోంది. ఒరాటశ్రీ దర్శకత్వంలో సునామీ కిట్టి హీరోగా ‘కోర’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చరిష్మా, పి.మూర్తి ప్రధాన పాత్రలను పోషించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్ బ్యానర్ల మీద డా.ఎ.బి.నందిని, ఎ.ఎన్.బాలాజీ, పి.మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ కోర మీద అంచనాలు పెంచేశాయి.తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ మూవీ టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తూ టీంకు అభినందనలు తెలిపారు. ఇక కోర టీజర్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో సరైన పాన్ ఇండియన్ మూవీలా కోర తెరకెక్కింది. టీజర్లో చూపించిన విజువల్స్, కెమెరా వర్క్, ఆర్ఆర్, యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియెన్స్‌కు ఐ ఫీస్ట్‌లా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సెల్వం మాతప్పన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తుండగా.. బిఆర్ హేమంత్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కె.గిరీష్ కుమార్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. -
నారాయణ మూర్తిని మించిన సేనాపతి
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తిని సంపద పరంగా అదే సంస్థకు చెందిన మరో సహవ్యవస్థాపకులు సేనాపతి గోపాలకృష్ణన్ మించిపోయారు. ఇటీవల వెలువడిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం భారత్‌లో 334 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ సంఖ్య గతేడాది కంటే 75 ఎక్కువ. వారి సామూహిక సంపద రూ.159 లక్షల కోట్లకు చేరింది. ఈ లిస్ట్‌లో ఈసారి నారాయణ మూర్తి(సందప రూ.36,600 కోట్లు)ని సేనాపతి గోపాలకృష్ణన్ అధిగమించారు. రూ.38,500 కోట్ల నికర సంపదతో ఈ ఘనత దక్కించుకున్నారు.ఇన్ఫోసిస్‌ను 1981లో నారాయణ మూర్తి, ఎన్ఎస్ రాఘవన్, అశోక్ అరోరా, నందన్ నీలేకని, ఎస్డీ శిబులాల్, కే.దినేష్, సేనాపతి గోపాలకృష్ణన్ కలిసి స్థాపించారు. ఇది తరువాతి కాలంలో ఇన్ఫోసిస్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఐటీ సంస్థల్లో ఒకటిగా మారింది. 2023లో 18.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,51,762 కోట్లు ) ఆదాయాన్ని ఆర్జించింది.ఇదీ చదవండి: యాపిల్ తయారీకి మరో కంపెనీలో వాటా కొనుగోలుసేనాపతి గోపాలకృష్ణన్సేనాపతి గోపాలకృష్ణన్(69) ఇన్ఫోసిస్ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అతను 2007 నుంచి 2011 వరకు కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కంపెనీ విస్తరణ, ఆవిష్కరణల్లో ఇన్ఫోసిస్‌ను ముందుండి నడిపించారు. గోపాలకృష్ణన్ 2011 నుండి 2014 వరకు సంస్థకు వైస్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇన్ఫోసిస్‌లో తన కార్యకలాపాల నుంచి వైదొలిగిన తర్వాత గోపాలకృష్ణన్ కొత్త వ్యాపారాలపై దృష్టి సారించారు. అతను ప్రస్తుతం యాక్సిలర్ వెంచర్స్ ఛైర్మన్‌గా ఉన్నారు. యాక్సిలర్ వెంచర్స్ గుడ్‌హోమ్, కాగాజ్, ఎన్కాష్ వంటి స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టింది. -
మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్యకు గురయ్యాడా?
కొరుక్కుపేట: పెళ్లయిన ఆరు నెలలకే భార్య తీరుపై అనుమానంతో ఓ టైలర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. చైన్నెలోని వడపళని పిల్లియార్ కోయిల్ వీధికి చెందిన మూర్తి (41) టైలర్‌గా జీవనం చేసేవాడు. అతను 6 నెలల క్రితం తల్లిదండ్రుల అంగీకారంతో సత్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. సత్య వడపళనిలోని బుక్‌బైండింగ్ షాపులో పనిచేస్తోంది. పెళ్లి జరిగిన రోజు నుంచి సత్య తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడేవారు.. ఇది భర్త మూర్తికి నచ్చలేదు. సత్య ప్రవర్తనపై మూర్తికి అనుమానం వచ్చింది. దీంతో రోజూ పని ముగించుకుని తాగి ఇంటికి వచ్చేవాడు. ఎప్పటి లాగే గురువారం రాత్రి మూర్తి మద్యం తాగి వచ్చి భార్య ప్రవర్తనపై అనుమానం ఉందని వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం చెందిన మూర్తి ఏం చేయాలో తెలియక కత్తెరతో పొడుచుకున్నాడు. కొద్దిసేపటికే రక్తస్రావం జరిగి స్పృహ తప్పి పడిపోయాడు. భార్య సత్య ఇరుగుపొరుగు వారు సహాయం కోసం 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడి కి చేరుకుని మూర్తిని పరీక్షించగా, అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న వడపళని పోలీసులు మూర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేకే నగర్ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతుడి భార్య సత్యను విచారిస్తున్నారు. మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్యకు గురయ్యాడా? అనేది పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే తేలనుందని పోలీసులు తెలిపారు. -
The Great Indian Kapil Show: చూతము రారండీ
వయసుతో సంబంధం లేకుండా మహిళల్లో పెద్దరికం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్నవాళ్ళయినా, పెద్దవాళ్ళయినా పెద్దరికం అన్నది మహిళలకు ఒక సొగసు. మళ్లీ మగవాళ్లు అలాక్కాదు. వాళ్లకెంత వయసు వచ్చినా కూడా మాటల్లో, చేతల్లో చిన్నవాళ్లే... మహిళలతో పోలిస్తే’!సుధామూర్తి వయసు 74. మూర్తి గారి వయసు 78. ఆమె ఆగస్టు 19 న పుడితే, ఆయన ఆగస్టు 20 న జన్మించారు. తేదీలను బట్టి చూసినా సుధ ఆయన కన్నా ఒకరోజు ‘పెద్దరికం ’ ఉన్నవారు. (తమాషాకు లెండి). సరే, సంగతి ఏమిటంటే... ఈ దంపతులిద్దరూ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కు ఆహ్వానం వస్తే వెళ్లారు. సాధారణంగా కపిల్ బాలీవుడ్ సెలబ్రిటీలను తన టాక్ షో కు పిలుస్తుంటారు. అందుకు భిన్నంగా ఈసారి ఈ బిజినెస్ దిగ్గజ దంపతుల్ని ఒప్పించి రప్పించారు. వారితో టాక్ షో సరదాగా నడిచింది. భర్త గురించి భార్యను, భార్య గురించి భర్తను కొన్ని ప్రశ్నలు అడిగారు యాక్టర్ కమ్ కమెడియన్ కపిల్ శర్మ. వాటిల్లో ఒక ప్రశ్న : ‘మొదటిసారి సుధాజీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీకెలా అనిపించింది?’ అని అడిగారు కపిల్. దానికి మూర్తి గారు చాలా గంభీరంగా, నిజాయితీగా సమాధానం ఇచ్చారు. ‘ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే.. ఒక స్వచ్ఛమైన గాలి పరిమళం నా శ్వాసలోనికి వెళ్లినట్లుగా...’ అన్నారు. ఆ మాటకు వెంటనే సుధామూర్తి... ‘అప్పుడు ఆయన వయసులో ఉన్నారు కదా’ అన్నారు జోకింగ్‌గా. దెబ్బకు ఆడియెన్స్ భళ్లుమన్నారు. నిజానికి సుధామూర్తి ఉద్దేశ్యం ఆడియెన్స్‌ని నవ్వించడం కాదు, భర్తలోని కవితాత్మక భావోద్వేగాన్ని కాస్త నెమ్మది పరచటం. పైగా అంతమంది ఎదుట భర్త తనను అంతగా ‘అడ్మైర్’ చెయ్యటంతో ఆమెలోని పెద్దరికం మధ్యలోనే కల్పించుకుని ఆయన్ని ఆపవలసి వచ్చినట్లుంది. ఆపకపోతే... ఇంకా ఏం చెబుతారో అని. అసలే వాళ్ళది లవ్ మ్యారేజ్. ఈ నెల 9న నెట్‌ఫ్లెక్స్‌లో స్ట్రీమ్ ఆయ్యే ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ ఎపిసోడ్లో మూర్తి గారి ఈ అమాయకత్వాన్ని, సుధామూర్తి పెద్దరికాన్ని కనులారా వీక్షించవచ్చు. (డాటర్ ఆఫ్ ఆలియ : రాహా ‘ఆహా’ అంటూ వింటుంది)ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు -
గల్ఫ్ దేశాల్లో ఎందుకు మలయాళీలు ఎక్కువ?
కేరళ ప్రజలు అత్యధికంగా గల్ఫ్ దేశాల్లో ప్రవాసం ఉండే విషయం తెలిసిందే. కువైట్‌లో ఉండే విదేశీయుల్లో 80 శాతం దాకా మన దేశంలోని కేరళ నుంచి వెళ్ళినవారే. గల్ఫ్ దేశాల్లోని అవకాశాల్ని మొట్టమొదటగా గుర్తించి వాటిని అంది పుచ్చుకోవడం వల్ల వారి ఆధిపత్యం అక్కడ అనేక రంగాల్లో కొనసాగుతోంది. 1972 నుంచి 1983 మధ్య కాలంలో వచ్చిన గల్ఫ్ బూమ్‌ను మలయాళీలు బాగా వినియోగించుకున్నారు. అక్షరాస్యత ఎక్కువగా ఉండటం, సాంకేతిక నైపుణ్యం గల కోర్సులు చేయడం వల్ల చాలామంది క్లర్కులుగా, ఆర్కిటె క్టులుగా, నిర్మాణ రంగంలో సూపర్వైజర్లుగా, ఇంజినీర్లుగా మంచి అవకాశాల్ని పొందగలిగారు. మొదటితరం వారు ఆ తర్వాత తమ బంధువుల్ని, స్నేహితుల్ని తీసుకువెళ్లారు. యూఏఈలో 7,73,624 మంది, కువైట్‌లో 6,34,728 మంది, సౌదీ అరేబియాలో 4,47,440 మంది, ఖతర్‌లో 4,45,000 మంది, ఒమన్‌లో 1,34,019 మంది, బహ్రెయిన్‌లో 1,01,556 మంది మలయాళీలు ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు పంపించే విదేశీ మారకద్రవ్యం వల్ల కేరళ రాష్ట్రపు ఆర్థిక చిత్రపటం మారిపోయిందని చెప్పాలి. ప్రతి ఏటా రమారమి 60,000 కోట్ల రూపాయలు కేరళకు వస్తుంటాయి. తాము ఆ దేశాల్లో పనిచేసి సంపాదించిన ధనంలో ప్రతి ఒక్కరు కొంత వెనక్కి తమ కుటుంబాలకు పంపిస్తుంటారు. మిగతా దేశాలతో పోలిస్తే మలయాళీ ప్రజలు గల్ఫ్‌లో ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నో శతాబ్దాల నుంచి అరబ్బు దేశాలతో కేరళకు సముద్ర మార్గాల ద్వారా వ్యాపారం జరగడం ప్రధాన కారణం. కేరళలో పెద్ద పరిశ్రమలు తక్కువ. పర్యావరణంపై ప్రజల చైతన్యం ఎక్కువ. ట్రేడ్ యూనియన్ల ప్రభావం వల్ల పెద్ద పెట్టుబడిదారులు రావడానికి వెనకడుగు వేస్తుంటారు. కాబట్టి మంచి సంపాదన ఎక్కడ ఉన్నా సగటు మలయాళీ ప్రవాసిగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. యువతులు కూడా దూర ప్రదేశాలు వెళుతుంటారు. కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, ఇంకా దేశంలో ఎక్కడ అవకాశాలు ఉన్నా వెళుతుంటారు. ముఖ్యంగా నర్సింగ్ వృత్తి పరంగా చూస్తే దేశ విదేశాల్లో కేరళ నర్సులకు మంచి డిమాండ్ ఉంది. దేశంలో ఏ కార్పొరేట్ ఆసుపత్రిని చూసినా అత్యంత ఎక్కువ సంఖ్యలో కేరళ నర్సులే ఉంటారు. గల్ఫ్ సంపద కేరళలో ఎంత ప్రధాన పాత్ర కలిగి ఉందంటే చాలామంది మలయాళీ కోటీశ్వరులు ఆ దేశాల్లోనే వ్యాపారం చేసి, తర్వాత మిగతా దేశాలకు తమ వ్యాపారాలను విస్తరించారు. ముథూట్ గోల్డ్ ఫైనాన్స్ గానీ, జాయ్ అలుక్కాస్ గోల్డ్ కంపెనీ గానీ గల్ఫ్ దేశాల సంపదతో విస్తరించినవే. యూసుఫ్ ఆలీ (లూలూ గ్రూప్), షంషేర్ వయలిల్ (వీపీఎస్ హెల్త్ కేర్), సన్నీ వర్కీ (జెమ్స్ ఎడ్యుకేషన్), పి.ఎన్.సి. మీనన్ (శోభ గ్రూప్) లాంటి మలయాళీ కుబేరులంతా వ్యాపారం గల్ఫ్ దేశాల్లో చేసి ఆ తర్వాత మన దేశంలో విస్తరించినవారే. ఇప్పటికీ వారి ప్రధాన కేంద్రాలు అక్కడే ఉన్నాయని చెప్పాలి. కేరళ ప్రభుత్వానికి రెవెన్యూ ద్వారా ఒక ఏడాదికి ఎంత ధనం వస్తుందో దానికి రమారమి రెండింతలు గల్ఫ్ నుంచి వస్తుంది. గల్ఫ్ నుంచి వచ్చీ పోయే ప్రయాణీకుల కోసం కేరళలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వారి బాగోగులు చూడటానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఉంది. కొచ్చి, కోజీకోడ్, మలప్పురం, కన్ననూర్ వంటి ప్రాంతాల్లో గల్ఫ్ నుంచి వచ్చే అనేక వస్తువుల్ని ధారాళంగా అమ్ముతుంటారు.గల్ఫ్ నుంచి వచ్చే ధనం వల్ల వినిమ యతత్వం బాగా పెరిగిందనే ఒక ఆరోపణ ఉన్నది. గల్ఫ్ నుంచి వచ్చిన లేదా అక్కడ పనిచేసే యువకులకు పెళ్ళి విషయంలో మంచి డిమాండ్ ఉన్నది. మరి అక్కడ విషాధ గాథలు లేవా అంటే ఉన్నాయి. స్థానికంగా ఉన్న ఆస్తి తాకట్టు పెట్టి గల్ఫ్ వెళ్ళి అనుకున్న పని దొరక్క పడరాని పాట్లు పడేవారూ ఉన్నారు. అక్కడి పత్రికల్లోనూ, టీవీ చానెళ్ళలోనూ అలాంటివారి కోసం ప్రత్యేకంగా కొంత స్పేస్ కేటాయిస్తారు. ఇటీవల వచ్చిన ‘ఆడు జీవితం’ (గోట్ లైఫ్) సినిమా అలాంటి వారి బాధల్ని చిత్రించిందన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా కేరళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచి, లక్షలాది మధ్య తరగతి ప్రజలకు ఉపాధి చూపిన గల్ఫ్ దేశాల చమురు నిల్వలు ఇంకా చాలా కాలం ఉండాలని ఆశిద్దాం.మూర్తి కెవివిఎస్వ్యాసకర్త రచయిత, అనువాదకుడుమొబైల్: 78935 41003 -
ఆ 5 కోట్లు ఎవరెవరు పంచుకుంటారంటే..!
-
ముసుగులో మూర్తి.. అసలు రంగు వేణు స్వామి వీడియో..
-
టీవీ5 మూర్తి.. 5 కోట్లు డిమాండ్..వీణా శ్రీవాణి సంచలన వ్యాఖ్యలు
-
ముసుగులో మూర్తి.. అసలు రంగు
-
జర్నలిజం ముసుగులో రూ. 5 కోట్లు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: మీడియా ముసుగులో కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన టీవీ 5 మూర్తి, ఆయన బృందం బండారంపై ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి, ఆయన భార్య వీణాశ్రీవాణి సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ మేరకు వారు ఇన్‌స్టా్రగామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో టీవీ 5 మూర్తి అనుచరుడు జర్నలిస్టు అమర్, వీణాశ్రీవాణితో జరిగిన ఆడియో సంభాషణను కూడా జత చేశారు. రూ.5 కోట్లు ఇవ్వకపోతే మీ స్తోమత ఎంత.? ఎంతిస్తారో.? చెప్పండంటూ అమర్ ఆమెను ప్రశ్నించడం స్పష్టంగా రికార్డు అయ్యింది. జ్యోతిషం చెప్పుకునే వేణుస్వామికి అంతమొత్తం ఇవ్వడం సాధ్యంకాదని, ఆయన భార్య వివరిస్తున్నా.. అమర్ వినిపించుకోకుండా రూ. 50 లక్షలు ఇస్తారా? లేక రూ. కోటి ఇస్తారా.. ఏదో ఒకటి చెబితే వారితో సమావేశం ఏర్పాటు చేస్తానంటూ బదులివ్వడం గమనార్హం. రూ. 5 కోట్లలో జర్నలిస్టు ప్రేమ, రాంబాబుతోపాటు మీడియా హెడ్స్‌కు, సంస్థ అధినేత బీఆర్.నాయుడుకు వాటాలు ఉంటాయని అమర్ స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. మీడియా ముసుగులో తమని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వేణుగోస్వామి తన సతీమణితో కలిసి ఆరోపించారు. తాము ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చారు: వేణుస్వామి ‘టీవీ5 జర్నలిస్ట్ మూర్తి ఒకప్పుడు మహాటివీలో పనిచేసేవారు. అప్పుడు నాపై దాడి చేసేందుకు ఆయన ప్రయతి్నంచాడు. నన్ను నాశనం చేయడానికి ఆ సమయంలోనే చాలా ప్రయత్నాలు చేశాడు. మూర్తి డిమాండ్ చేసిన డబ్బు నేను ఇవ్వలేదు. అయితే, చాలారోజుల తర్వాత ఇప్పుడు డబ్బు కోసం మూర్తి, ఆయన టీమ్ నన్ను ఇబ్బంది పెడుతోంది. ఒక పథకం ప్రకారం టీవీ5లో నా గురించి డిబెట్లు ఏర్పాటు చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నాడు. ఎంతోమంది కష్టాలను తొలగించిన నాకు చివరకు ఆత్మహత్య చేసుకునే స్థితికి మూర్తి వల్ల వెళ్లాను. వారు పెడుతున్న టార్చర్ భరించలేకపోతున్నాను’అంటూ వేణుస్వామి ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆపై మూర్తి అనుచరుడు జర్నలిస్ట్ (అమర్) ఫోన్ కాల్‌ను తన ఇన్‌స్ట్రాగామ్‌లో వేణుస్వామి షేర్ చేశారు. అందులో వారు రూ. 5 కోట్లు డిమాండ్ చేయడం అంత ఇవ్వకపోతే.. ఎంత ఇస్తారో చెప్పండంటూ సంభాషణ ఉంది. ఇలా వచ్చే డబ్బును ఎవరెవరు..? పంచుకుంటారో కూడా చెప్పుకొచ్చారు. చానల్ అధినేత బీఆర్.నాయుడు నుంచి ఆ సంస్థలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న వారికి, జర్నలిస్టు ప్రేమ, రాంబాబుకు వెళతాయని అమర్ ఆ ఆడియోలో వెల్లడించారు. మమ్మల్ని వారు తప్పకుండా చంపేస్తారు: వీణా శ్రీవాణి వేణుస్వామి సతీమణి వీణాశ్రీవాణి కూడా టీవీ5 సంస్థతోపాటు జర్నలిస్ట్ మూర్తి గురించి మాట్లాడుతూ ‘మమ్మల్ని రూ.5 కోట్లు అడుగుతున్నారు. అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తీసుకురాగలం. నా బంగారంతోపాటు, నా కూతురు బంగారం అమ్మినా ఐదు శాతం డబ్బు రాదు. ఇచ్చే వరకు మమ్మల్ని వదిలేలా లేరు. దీంతో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాం. కానీ, మేము అలా చేస్తే దానిని కూడా వారు తప్పుగా క్రియేట్ చేస్తారు. సోషల్ మీడియాలో వస్తున్న దుష్పచారాన్ని తట్టుకోలేక చనిపోయారని మళ్లీ వారే వార్తలు ఇస్తారు. ఈ వీడియో బయటకు వచ్చాక మాకు ఎలాగూ ప్రమాదం పొంచి ఉంటుంది. తప్పకుండా మమ్మల్ని వారు చంపేస్తారు. ఈలోపు వారు (టీవీ5 మూర్తి, టీమ్) ఎలాంటి వారో ఇలా ముందే ఈ ప్రపంచానికి తెలుపుతున్నాం. ఆడపిల్ల ప్రేమకు, రోజు నాకు మెసేజ్‌లు చేసే రాంబాబుకు వాటాలున్నాయంటే.. నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏమైనా పెట్టుకోండి. మా దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. ఒక ఆడపిల్లను అనుకోండి లేదా కుటుంబం అనుకోండి ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులు, బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ చేస్తాయా? చదువుకున్న వారు సపోర్ట్ చేస్తారా? పోలీసులు, లాయర్లు, సుమోటోగా తీసుకొని సపోర్ట్ చేస్తారా? జోతిష్యం చెప్పుకుంటే రూ.ఐదు కోట్లు డిమాండ్ చేస్తారా? బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే ..లేనివారిని ఎలా వేధిస్తున్నారు. మమ్మల్ని కాపాడుకుంటే..మరిన్ని వీడియోలు బయటపెడతాం. లేదంటే ఇదే ఆఖరి వీడియో. ఆత్మహత్య చేసుకుంటాం.’అని ఆ వీడియోలో స్పష్టం చేశారు. -
క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
సాక్షి, అమరావతి: జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనపైన, తన కుమారుడిపైన చేసిన నిరాధార తప్పుడు ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం సీఎస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని మూర్తి యాదవ్‌ను ఆయన డిమాండ్ చేశారు. లేదంటే వ్యక్తిగతంగా పరువు నష్టం దావా వేయడంతో పాటు చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటానని సీఎస్ హెచ్చరించారు. రెండు నెలలుగా ఒక పథకం ప్రకారం వ్యక్తిత్వ హననం చేసే కుట్రలో భాగంగా చేస్తున్న ప్రచారమే ఈ ఆరోపణలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో తాను గానీ, తన కుమారుడు, బంధువులు ఎలాంటి అసైన్డ్ భూములు కొనలేదని స్పష్టం చేశారు. తన స్నేహితుడైన రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె వివాహం ఏప్రిల్‌లో జరిగిందని, ఎన్నికల దృష్ట్యా ఆ వివాహానికి హాజరు కాలేకపోయినందున రెండు రోజుల విశాఖ పర్యటలో భాగంగా ఆదివారం కొత్త దంపతులను ఆశీర్వదించడానికి వెళ్లానని సీఎస్ తెలిపారు. ఆ మరుసటి రోజు భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించానన్నారు. ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్ల రూపాయల విలువైన 800 ఎకరాలు అసైన్డ్ భూములు కొట్టేసినట్లు యాదవ్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.అసైన్డ్ భూముల చట్ట సవరణకు సంబంధించి అసెంబ్లీలో 2023 అక్టోబర్‌లో సభ ఆమోదం తెలిపిందని, ఆ సవరణను అనుసరించి అసైన్డ్ భూములపై జీవో 586ను రెవెన్యూ శాఖ జారీ చేసిందని సీఎస్ పేర్కొన్నారు. చట్ట సభ ఆమోదం మేరకే జీవో జారీ అయితే దాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆపాదించడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఈ జీవో ఆధారంగా తన కుమారుడి ద్వారా విశాఖలో 800 ఎకరాలకు పైగా భూములు కొనుగోలుకు డీల్స్ చేసినట్లు చేసిన ఆరోపణ పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే 400 ఎకరాల అసైన్డ్ భూములను తన కుమారుడిని అడ్డంపెట్టుకుని బినామీల పేరిట చేజిక్కించుకున్నాననడంలో ఎంత మాత్రం నిజం లేదన్నారు.మరో 400 ఎకరాలను రిజిస్రే్టషన్ చేయించేందుకు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాననడం పూర్తిగా అవాస్తవమని సీఎస్ తెలిపారు. ఈ భూముల రిజిస్ట్రేషన్లను పూర్తి చేసేందుకు విశాఖ, విజయనగరం జిల్లాల అధికారులపై ఒత్తిడి చేశాననడాన్నీ ఆయన తీవ్రంగా ఖండించారు. ఐదేళ్లలో తన కుమారుడు విశాఖకు గానీ, ఉత్తరాంధ్రలో ఏ జిల్లాకూ గాని వెళ్లలేదని సీఎస్ స్పష్టం చేశారు. మరో వైపు భోగాపురం విమానాశ్రయ పనుల పరిశీలన పేరుతో సీఎం జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లపై తాను సమీక్షించానని చేసిన ఆరోపణా అసంబద్ధమేనని ఖండించారు. -
బండారు కథ కంచికి!
పెందుర్తి (విశాఖ జిల్లా): బండారు సత్య నారాయణమూర్తి... 40 ఏళ్ల రాజకీయానుభవం. ఐదుసార్లు ఎమ్మెల్యే. ఒకసారి మంత్రి.. కానీ ఏం లాభం. చంద్రబాబు ఛీ పొమ్మన్నారు. టికెట్ లేదనేశారు. ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత పంచకర్లకు టికెట్ దాదాపు ఖరారైనట్లు వార్తలు రావడంతో బండారు భవిష్యత్తు డోలాయమానంలో పడింది. బీసీలపై చంద్రబాబు చూపించే కపట ప్రేమకు బండారు ఉదంతమే తాజా ఉదాహరణ అని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు మెప్పు కోసం అధికార పక్షంపై, మహిళా మంత్రి రోజాపై బండారు నోరు పారేసుకుని అభాసుపాలయ్యారు. పార్టీ కోసం చేతి చమురు వదిలించుకున్నారు. అయినా వాడుకుని వదిలేసే చంద్రబాబు చివరకు అదే చేశారు. తన అల్లుడైన శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్నాయుడు, వియ్యంకుడైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుల సిఫార్సులు కూడా బండారును గట్టెక్కించలేక పోయాయి. దీంతో టికెట్ రేసు నుంచి తప్పుకుని పత్తాలేకుండా పోయారు. రెండు వారాలుగా కార్యకర్తలకు అందుబాటులో లేరు. ముఖ్యమైన ఏ సమావేశంలోనూ కనిపించడం లేదు. ఇటీవల టీడీపీ–జనసేన ఉమ్మడిగా నిర్వహించిన జెండా, జయహో బీసీ సభలకు కూడా దూరంగా ఉండడంతో కేడర్‌కు ఏమీ పాలుపోవడంలేదు. ఒక్కసారిగా సీన్ రివర్స్ పెందుర్తి నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కోనేందుకు ప్రతిపక్షాలు ఆపసోపాలు పడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ–జనసేన పొత్తు పెట్టుకోవడంతో గత కొన్నాళ్లుగా ‘టికెట్ మాదంటే మాది’ అంటూ జనసేన, టీడీపీలు ప్రచారం చేసుకున్నాయి. ముఖ్యంగా రాజకీయ చరమాంకంలో ఉన్న టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి గంపెడాసలు పెట్టుకున్నారు. జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుతో టికెట్ రేసులో పోటీ పడ్డారు. ‘తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఇదే ఆఖరి కదా.. చంద్రబాబు కూడా అవకాశం ఇస్తారు’ అన్న నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో కేడర్‌తో సమావేశాలు నిర్వహించారు. బహిరంగ వేదికలపై అధికార పక్షంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వచ్చారు. మంత్రి రోజాను అసభ్య పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో టికెట్ బండారుదేనని టీడీపీ కేడర్ కూడా ధీమాగా ఉంది. అయితే పెందుర్తి టికెట్ కోసం పంచకర్ల రమేష్‌బాబు పట్టుపట్టడం, సీట్ల పంపకాల్లో కచ్చితంగా పెందుర్తిని జనసేనకే కేటాయిస్తారని బలమైన సంకేతాలు రావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పంచకర్ల కూడా నియోజకవర్గంలో జోరు పెంచడంతో అవమానభారంతో కేడర్‌కు బండారు మొహం చూపించట్లేదు. వరుస ఓటములతో అవమానం ఒకప్పుడు రాజకీయంగా వైభవం చూసిన బండారులో 2014లో టీడీపీ అధికారం చేపట్టిన తరువాత మరింత జోష్ కనిపించింది. అయితే టీడీపీ ప్రభుత్వం హయాంలో నియోజకవర్గంలో లెక్కలేని అవినీతి.. కొడుకు అప్పలనాయుడు వ్యవహారశైలి కారణంగా సత్యనారాయణమూర్తి గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్ చేతిలో దాదాపు 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2022పంచాయతీ ఎన్నికల్లో స్వగ్రామం వెన్నెలపాలెంలో సర్పంచ్‌గా పోటీ చేసిన ఆయన భార్య మాధవీలత సహా పంచాయతీలో పది వార్డుల్లోనూ బండారు అనుచరులు చిత్తుగా ఓడిపోయారు. దెబ్బ మీద దెబ్బ.. చందంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వెన్నెలపాలెం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. అయితే ప్రజాతీర్పును గౌరవించని బండారు ఆ తరువాత పూర్తిగా అదుపు తప్పారు. వరుస ఓటముల అవమానభారంతో అధికార పార్టీపై నోరు పారేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పొత్తులో భాగంగా అని బయటకు ప్రచారం చేసుకుంటున్నా.. జనంలో పూర్తిగా గుర్తింపు కోల్పోయారన్న కారణంతోనే బండారును చంద్రబాబు పక్కన పెట్టారని టీడీపీ నాయకులే అంటున్నారు. -
‘చైనాను చూసి నేర్చుకోండి’.. మరోసారి ఇన్ఫోసిస్ మూర్తి షాకింగ్ కామెంట్స్
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటారు. వారంలో 72 గంటలు పనిచేయాలని ఇటీవల వ్యాఖ్యలు చేయడంతో కొందరు ప్రముఖులు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరు టెక్ సమ్మిట్‌లో నారాయణమూర్తి మాట్లాడారు. ప్రస్తుతం చైనా జీడీపీ 19 ట్రిలియన్లుగా ఉందని, చైనా మోడల్‌ను అధ్యయనం చేసి అక్కడ అవలంబిస్తున్న పద్ధతులను దేశంలో అనుసరించాలని సూచించారు. దాంతోపాటు ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. అయితే అందుకు బదులుగా సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలని ఆయన కోరారు. ఆయన ఉచితాలకు వ్యతిరేకం కాదని పరిస్థితులను అర్థం చేసుకోగలనని అన్నారు. తాను పేద కుటుంబానికి చెందినవాడినని, ఉచిత రాయితీలను పొందిన వారు సమాజానికి తమ బాధ్యతగా కొంత తిరిగి ఇవ్వాలన్నారు. ఉదాహరణకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తే అందుకు బదులుగా పిల్లలను బడికి పంపించి బాగా చదివేలా చూడాలన్నారు. ఏదీ ఉచితంగా ఉండకూడదని, ఏదో రూపకంగా సమాజానికి తిరిగి ఇవ్వాలన్నారు. ఇదీ చదవండి: రూ.12 వేల కోట్ల వ్యాపారాధిపతి.. రూ.200 కోసం బేకరీలో పని..! చైనా జీడీపీ 19 ట్రిలియన్ డాలర్లుగా ఉందన్నారు. భారత్ జీడీపీ మాత్రం 3.4-4 ట్రిలియన్‌లోనే ఉందని చెప్పారు. ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు చైనాలోనూ ఉన్నాయి. కానీ భారత్ కంటే 5-6 రెట్లు జీడీపీ అధికంగా ఉందన్నారు. చైనా మోడల్‌ను అధ్యయనం చేసి, ఉత్పత్తి పెంచి సమాజానికి లబ్ధి చేకూరే విషయాలు ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. -
బెయిల్ కోసం బాబు అడ్డదారులు.. ‘నెవర్ బిఫోర్’
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేసి జైలుపాలైన చంద్రబాబు ఇప్పుడు దాని నుంచి ఎలాగైనా బయటపడాలని బెయిల్ కోసం అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకోసం గతం నుంచి తాను అనుసరిస్తున్న తన ట్రేడ్‌మార్క్ అస్త్రం ‘నాట్ బిఫోర్’ ను ఆయన మరోసారి బయటకు తీశారు. తమ పార్టీకి, తమ లీగల్ సెల్‌కు ఏ సంబంధం లేని జీవీఎల్ మూర్తి అనే న్యాయవాదిని తెరపైకి తెచ్చారు. ఆయనతో తన తరఫున చంద్రబాబు కన్సెంట్ వకాలత్ (అప్పటికే దాఖలు చేసిన కేసులో వకాలత్ వేసిన న్యాయవాది అనుమతితో మరో న్యాయవాది కూడా వకాలత్ దాఖలు చేయడం) దాఖలు చేయించారు. చంద్రబాబు తరఫు న్యాయవాది జి.బసవేశ్వరరావు వకాలత్ వేసి ఉండగానే.. మూర్తితో వకాలత్ దాఖలు చేయించడం గమనార్హం. సాధారణంగా ఇలా వకాలత్ దాఖలు చేసిన కేసులో ఏ మాత్రం సంబంధం లేని మరో న్యాయవాది వకాలత్ దాఖలు చేసేందుకు ఏ న్యాయవాది ఒప్పుకోడు. కాగా చంద్రబాబు తరఫున వకాలత్‌లు దాఖలు చేసిన బసవేశ్వరరావు గానీ, మూర్తి గానీ వాదనలు వినిపించకపోవడం ఇందులో అసలు ట్విస్టు. శుక్రవారం జరిగిన విచారణకు మూర్తి రాలేదు కూడా. దీన్ని బట్టి చంద్రబాబు ఇక్కడ మూర్తిని ఓ నిర్దిష్ట ప్రయోజనం నిమిత్తం వాడుకోవాలని నిర్ణయించి, ఆయనతో వకాలత్ దాఖలు చేయించారని ఇట్టే అర్థమైపోతోంది. మూర్తి వెనుక ఉంది వారే.. జీవీఎల్ మూర్తితో వకాలత్ దాఖలు చేయించడం ద్వారా నిబంధనలకు అనుగుణంగా, ముక్కుసూటిగా నడుచుకుంటారనే పేరున్న న్యాయమూర్తి జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ముందు తన బెయిల్ పిటిషన్‌ను రాకుండా చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. జస్టిస్ జ్యోతిర్మయి ముందు ఎవరు ‘నాట్ బిఫోర్’ న్యాయవాదులు ఉన్నారో ముందుగానే తెలుసుకుని, అందుకనుగుణంగా మూర్తితో వకాలత్ దాఖలు చేయించారు. వాస్తవానికి ఈ మూర్తిది కూడా చంద్రబాబు సామాజికవర్గమే. పెద్దగా ప్రాక్టీస్ ఉన్న న్యాయవాది కాదు. చిన్న చిన్న కేసులు, ఉద్యోగ వివాదాలకు సంబంధించిన కేసులను వాదిస్తుంటారు. ఎప్పుడూ టీడీపీ కేసులను కూడా వాదించింది లేదు. కాగా ఎల్లో మీడియాకు చెందిన ఓ న్యూస్ చానెల్ యజమానికి మూర్తి అత్యంత సన్నిహితుడు. జస్టిస్ జ్యోతిర్మయి ముందు మొత్తం నలుగురు న్యాయవాదులు ‘నాట్ బిఫోర్’గా ఉన్నారు. ఈ నలుగురిలో ముగ్గురు న్యాయవాదులు తమ ఉచ్చులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో తమవాడే అయిన మూర్తిని చంద్రబాబు అండ్ కో విజయవంతంగా తమవైపు తిప్పుకుంది. ఎల్లో మీడియా న్యూస్ చానెల్ యజమాని, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి.. ఈ విషయంలో మూర్తిని ఒప్పించారు. అంతేకాకుండా చంద్రబాబు అండ్ కో ఆయనకు భారీ మొత్తంలో ఫీజును ఆశగా చూపింది. జస్టిస్ నిమ్మగడ్డ లేదా జస్టిస్ అడుసుమిల్లి.. ప్రస్తుతం హైకోర్టుకు దసరా సెలవులు. ఈ నేపథ్యంలో అత్యవసర కేసులను విచారించేందుకు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, జస్టిస్ జ్యోతిర్మయిలు వెకేషన్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. జస్టిస్ జ్యోతిర్మయి విచారణ నుంచి తప్పుకుంటే చంద్రబాబు బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు లేదా జస్టిస్ అడుసుమిల్లి రవీంద్ర బాబు ముందుకు వస్తాయి. చంద్రబాబు అండ్ కో కూడా ఇదే ఉద్దేశంతో మూర్తితో వకాలత్ దాఖలు చేయించి తమ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసింది. అయితే జస్టిస్ నిమ్మగడ్డ లేదా జస్టిస్ అడుసుమిల్లిల్లో ఎవరికి చంద్రబాబు కేసును అప్పగించాలన్నది పూర్తిగా ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సెలవులు కావడంతో సీజే అందుబాటులో లేరు. సోమవారం నుంచే హైకోర్టు తిరిగి తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఎప్పుడైతే జస్టిస్ జ్యోతిర్మయి ఈ వ్యాజ్యాలను సోమవారం నాడు విచారణకు వచ్చేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారో అప్పుడే చంద్రబాబు అండ్ కో గతుక్కుమంది. అప్పటికే ఆన్లైన్లో ఉన్న చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, కోర్టు హాలులో ఉన్న మరో సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వెంటనే జోక్యం చేసుకున్నారు. సోమవారం అనే పదాన్ని ఉత్తర్వుల నుంచి తొలగించాలని జస్టిస్ జ్యోతిర్మయిని కోరారు. కేసును తగిన బెంచ్ ముందు ఉంచేందుకు వీలుగా ఫైల్‌ను సీజే ముందు ఉంచాలని మాత్రమే ఉత్తర్వుల్లో పేర్కొనాలన్నారు. లేకపోతే రిజిస్ట్రీ ముందు తాము సీజే అనుమతి కోసం అభ్యర్థించలేమన్నారు. అయితే వారి అభ్యర్థన పట్ల న్యాయమూర్తి జోతిర్మయి సుముఖత వ్యక్తం చేయలేదు. రిజిస్ట్రీ ముందు అత్యవసర విచారణ నిమిత్తం అభ్యర్థించేందుకు ‘సోమవారానికి విచారణ వాయిదా’ అనేది ఎంత మాత్రం అడ్డంకి కాదని తేల్చిచెప్పారు. చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవచ్చునని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో చేసేదేమీ లేక చంద్రబాబు న్యాయవాదులు ఉసూరుమంటూ కోర్టు బయటకు వచ్చారు. ఆ వెంటనే రిజిస్ట్రార్ వద్దకు వచ్చారు. చంద్రబాబు బెయిల్‌ను మరో న్యాయమూర్తికి నివేదించేందుకు వీలుగా సీజే అనుమతి తీసుకోవాలని రిజిస్ట్రార్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చినా వారి పప్పులు ఉడకలేదు. 19 నుంచే వ్యూహానికి పదును.. కాగా వాస్తవానికి చంద్రబాబు అండ్ కో ‘నాట్ బిఫోర్’ అస్త్రాన్ని తన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రయోగించాలని గతంలోనే నిర్ణయించింది. అయితే దానిని ఈ నెల 19న నుంచే అమలు చేయడం ప్రారంభించింది. 19న చంద్రబాబు బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోసం వేసిన అనుబంధ పిటిషన్ జస్టిస్ సురేష్‌రెడ్డి ముందుకు వచ్చాయి. చంద్రబాబు అనారోగ్య కారణాలను సాకుగా చూపుతూ ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరఫు సీనియర్ న్యాయవాదులు లూథ్రా, దమ్మాలపాటి గట్టిగా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుని, సుప్రీంకోర్టు చంద్రబాబు చేసిన మధ్యంతర బెయిల్ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించలేదని జస్టిస్ సురేష్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ పట్ల సానుకూలంగా స్పందించని నేపథ్యంలో తాను కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వలేనని జస్టిస్ సురేష్‌రెడ్డి స్పష్టంగా చెప్పేశారు. దీంతో భోజన విరామం తర్వాత వ్యూహాన్ని మార్చేసిన చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను వెకేషన్ కోర్టు ముందు పోస్ట్ చేయాలని న్యాయమూర్తిని కోరారు. ఇందుకు జస్టిస్ సురేష్‌రెడ్డి అంగీకరించి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పలుకుబడితో ముందే తెలుసుకుని.. కాగా చంద్రబాబు న్యాయవాదులు తమ వ్యూహం ఎందుకు మార్చుకున్నారంటే వెకేషన్ కోర్టుల్లో ఎవరెవరు జడ్జీలు ఉండబోతున్నారో తమ పలుకుబడిని ఉపయోగించి ముందుగానే తెలుసుకోగలిగారు. ఆ వెకేషన్ కోర్టులో జస్టిస్ జ్యోతిర్మయి కూడా ఉన్నారని నిర్ధారించుకున్నారు. వాస్తవానికి వెకేషన్ కోర్టులో ఏ న్యాయమూర్తులు ఉండబోతున్నారనది చివరి నిమిషం వరకు బయటకు వచ్చే అవకాశం ఉండదు. అయితే వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు అండ్ కో వెకేషన్ కోర్టులో ఎవరెవరు ఉండబోతున్నారో ముందుగానే తెలుసుకుంది. దానికి అనుగుణంగానే తమ వ్యూహాలకు పదును పెట్టింది. జస్టిస్ జ్యోతిర్మయి ముందు ఎవరెవరు నాట్ బిఫోర్‌గా ఉన్నారో తెలుసుకోగలిగింది. నలుగురు న్యాయవాదులు ఉన్నట్లు తెలుసుకుని, అందులో తమ సామాజిక వర్గానికే చెందిన జీఎల్ఎన్ మూర్తితో ఆట మొదలుపెట్టింది. అయితే ఆటలో చివరకు ఓటమే ఎదురైంది. నైతిక విలువలకు కట్టుబడ్డ జస్టిస్ జ్యోతిర్మయి కాగా మూర్తి సతీమణి ఇందిరా ప్రియదర్శిని కింది కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. న్యాయాధికారి కావడంతో ఎంతో కాలంగా ఆమె జస్టిస్ జ్యోతిర్మయికి తెలుసు. తనకు మూర్తి సతీమణితో పరిచయం ఉన్న నేపథ్యంలో హైకోర్టులో మూర్తి తన ముందు దాఖలు చేసే కేసులను విచారించకూడదని నైతిక విలువలకు కట్టుబడి జస్టిస్ జ్యోతిర్మయి నిర్ణయం తీసుకున్నారు. అందుకనుగుణంగా మూర్తిని తన నాట్ బిఫోర్ జాబితాలో చేర్చారు. అయితే ఆమె నైతిక విలువలనే చంద్రబాబు ఓ అవకాశంగా మలుచుకున్నారు. ఆమె ముందు తన బెయిల్ పిటిషన్ రాకుండా చేసేందుకు మూర్తితో చంద్రబాబు విజయవంతంగా వకాలత్ దాఖలు చేయించారు. మూర్తి వకాలత్ వేస్తే ఆ పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్ జ్యోతిర్మయి నిరాకరిస్తారని తెలిసే ఆ పని చేశారు. నిబంధనల ప్రకారం వెళితే చంద్రబాబుకు బెయిల్ దొరకడం కష్టమని ఆయన తరఫు న్యాయవాదులకు బాగా తెలుసు. అందుకే తమకే సొంతమైన ‘నాట్ బిఫోర్’ అస్త్రాన్ని బయటకు తీశారు. మూర్తి దాఖలు చేసిన కేసును విచారించనని జస్టిస్ జ్యోతిర్మయి ఓపెన్ కోర్టులో చెప్పడంతో చంద్రబాబు అండ్ కో తమ పాచిక పారిందని సంతోషించారు. అయితే ఇంతలోనే సీజే అనుమతి తీసుకుని చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లలో విచారణను సోమవారానికి వాయిదా వేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ జస్టిస్ జ్యోతిర్మయి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చంద్రబాబు అండ్ కో బిత్తరపోయింది. -
విషాదం.. జబర్దస్త్ కమెడియన్ కన్నుమూత
జబర్దస్త్‌లో అందరినీ నవ్విస్తూ.. నవ్వుతూ తనకంటూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న మిమిక్రీ కళాకారుడు, కమెడియన్ కొమ్ము నర్సిమూర్తి(48) అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో ఆయన స్వగ్రామం హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో విషాదం అలుముకుంది. ఎన్నో స్టేజి షోలు.. అనేక సినిమాల్లో నటించిన మూర్తికి జబర్దస్త్ ద్వారా మంచి పేరు, ప్రఖ్యాతలు వచ్చాయి. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన సినీ రంగంలో వస్తున్న అవకాశాలతో భార్య అంజలి, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కేన్సర్ బారిన పడ్డాడు. దీంతో మూడేళ్లుగా జబర్దస్త్ షోకు దూరంగా ఉంటూ.. ఏపీ మంత్రి, నటి రోజా, తన తోటి నటులు, స్నేహితులు అందించిన ఆర్థికసాయంతో చికిత్స తీసుకుంటున్నాడు. ఇప్పటికే రూ.16 లక్షలు చికిత్స కోసం ఖర్చు చేశారు. మరో రూ.20లక్షలు చికిత్సకు అవసరం కావాల్సి ఉంది. ఈ క్రమంలో వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో ఆరోగ్యం మరింత క్షీణించి చికిత్స పొందతూనే మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా జబర్దస్త్ కమెడియన్ వెంకట్‌తో పాటు సహానటులు, గ్రామస్తులు తరలివచ్చి నివాళులర్పించారు. నాగారంలో బుధవారం మధ్యాహ్నం మూర్తి అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
స్వరణీయం
‘భలే చాన్సులే భలే చాన్సులే’ అంటూ ఇల్లరికంలో ఉన్న మజాను తన గొంతుతో మన కళ్ల ముందుంచినా... ‘సరదా సరదా సిగరెట్టు’ అని పాడుతూ ధూమపానం అనర్థాల గురించి హెచ్చరించినా... ‘భళి భళి భళి భళి’ దేవా అంటూ తత్త్వాన్ని బోధించినా...‘అయయో జేబులో డబ్బులు పోయెనే’ అంటూ పేకాట గురించి సరదాగా వాపోయినా...‘వివాహ భోజనంబు’ పాట చెవిన పడ్డా, మాధవపెద్ది సత్యం స్వరం మన చెవులలో ఇంపుగా వినిపిస్తుంది. నేడు మాధవపెద్ది వర్థంతి. ఈ సందర్భంగా తండ్రిని స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు ఆయన పిల్లలు నాగలక్ష్మి, వెంకటనారాయణ మూర్తి. నాగలక్ష్మి: నాన్నగారు ఆ రోజుల్లో వృత్తిపరంగా చాలా బిజీగా ఉన్నా, చాలా సాదాసీదాగా ఉండటానికి ఇష్టపడేవారు. ఆర్భాటాలు, విలాసాలు ఆయనకు నచ్చేవి కాదు. మమ్మల్ని కూడా అతి సామాన్యుల్లాగే పెంచారు. జీవితంలో అన్నీ తెలుసుకోవాలని చెప్పేవారు. కష్టపడితే ఫలితం వస్తుందన్న సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన వ్యక్తి మా నాన్న. మూర్తి: నాన్నగారు బాపట్ల తాలూకా బ్రాహ్మణ కోడూరులో పుట్టారు. మా అమ్మ ప్రభావతి. వాళ్లది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు. నాన్నగారికి పేకాట అంటే బాగా ఇష్టం. అలాగని అది డబ్బులకు ఆడే వ్యసనం కాదు. ఇంట్లో అందరం కలిసి సరదాగా ఆడుకోవటానికి ఇష్టపడేవారు. చెన్నై టి–నగర్లో మా పక్కింట్లోనే పెద్దనాన్న గోఖలే గారి ఇల్లు. పెద్దనాన్న, దొడ్డమ్మ అందరూ కలిసి ఆడుకునేవారు. పేకాట ఉంటే నాన్నకు ఇంకేమీ అక్కర్లేదు నాగలక్ష్మి: నాన్నకి ‘నేను ఏదో సాధించాను’ అని కించిత్తు కూడా గర్వం ఉండేది కాదు. మన కర్తవ్యం మనం నిర్వహించాం అనుకోవడం ఆయన సిద్ధాంతం. తనకు వచ్చిన గౌరవ పురస్కారాలను ఎప్పుడూ ప్రదర్శించుకోలేదు. కారు కూడా ఎక్కేవారు కాదు. మాయాబజార్లో నాన్న పాడిన ‘వివాహ భోజనంబు’ పాట ‘సాంగ్ ఆఫ్ ద మిలీనియమ్’గా ఎంపికయినా ఏ మాత్రం గర్వించలేదు. ఆయన సినిమా పరిశ్రమలో యాభై ఏళ్లకు పైగా ఉన్నప్పటికీ విజిటింగ్ కార్డు కూడా ఉండేది కాదు. మూర్తి: ఆ రోజుల్లో సినిమా వాళ్లని చూడటం ఒక క్రేజ్. అభిమానులు బస్సులు వేసుకుని మరీ చెన్నై వచ్చేవారు. ఇలా కొందరు నాన్నగారిని చూడటానికి వచ్చే సమయానికి, నాన్న మా తోటలోని గడ్డిని తీస్తున్నారు. వారిని చూసి ఆయన మారుమాట్లాడకుండా ఇంటి వెనుకవైపుకు వెళ్లి చేతులు కడుక్కుని, ముందువైపునుంచి వచ్చారు. వారు ఆశ్చర్యపోతుంటే ‘ఇంటిపని చేసుకోవడం నాకు అలవాటు!’ అన్నారు సింపుల్‌గా. ఇంటి పనుల్లో అమ్మకి సాయం చేసేవారు. నాగలక్ష్మి: ‘అపస్వరమే తెలియని గాయకుడు మా బాబాయ్’ అని నాన్న గురించి ఎస్. పి. బాలు అన్నారు. నాన్న సంగీతం పెద్దగా నేర్చుకోలేదు. తన పెదనాన్న వెంకటరామయ్యగారి దగ్గర పద్యాలతో ప్రభావితులయ్యారు. పాట రికార్డింగ్ పూర్తయ్యి ఇంటికి రాగానే ఒక బైండ్ పుస్తకం తీసుకుని, అందులో ఆ రోజు పాడిన పాట సాహిత్యం, అలాగే ఆ పాట ఏ శృతిలో, ఏయే గాయకులతో, ఎవరి సంగీత దర్శకత్వంలో, ఏ నటుడికి పాడారు.. వంటి విషయాలన్నీ రాసుకునేవారు. ఆ తరవాతే భోజన ం. మూర్తి: నాన్నగారు నాటకాలలో కూడా నటించేవారు. నాటకం పూర్తయ్యాక, పాటలు పాడేవారు. అలాగే రైలులో సెకండ్ క్లాసులోనే ప్రయాణించేవారు. గోంగూర పులుసు, వెన్నపూస, ఉల్లిపాయ కలిపి తినేవారు. పండుగకి గారెలు కావాలనేవారు. తెలుగు వంటలంటేనే ఇష్టం. నాగలక్ష్మి: అందరం కలిసి కూర్చుని భోజనం చేయటానికి ఇష్టపడేవారు. ఇంట్లో ఉన్నప్పుడు నలుగురం పీటల మీద కూర్చుని తినేవాళ్లం. కుండలో నీళ్లు మాత్రమే ఇష్టపడేవారు. మూర్తి: మా అక్కని అస్సలు కొట్టేవారు కాదు. నన్ను మాత్రం రెండుసార్లు కొట్టారు. ఒకసారి నేను సర్కస్‌కి వెళ్లొచ్చి, తాళ్లు పట్టుకుని వేలాడి కిందపడ్డాను. గడ్డం కింద దెబ్బ తగిలింది. నా అల్లరి భరించలేక గట్టిగా ఒక్కదెబ్బ వేశారు. మరోసారి షాపింగు కోసం పాండీ బజార్‌కి వెళ్దామన్నారు. నేను బీచ్‌కి వెళ్దామని ఏడ్చాను. అంతే! నా వీపు పగిలింది (నవ్వు) నాగలక్ష్మి: నాన్నకు క్రమశిక్షణ అంటే ప్రాణం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నాన్న చెప్పిన మాటలను నేటì కీ ఆచరిస్తూనే ఉన్నాను. మూర్తి: ఘంటసాలగారిని మాస్టారూ అని పిలిచేవారు. ఆయన నాన్నను ఉరై అనేవారు. అలాగే నాన్నగారు ఎస్వీ రంగారావుగారి కోసమే పుట్టారేమో అని అందరూ అనుకునేవారు. ఒకసారి నాన్న, నేను ఎస్వీ రంగారావుగారి ఇంటికి వెళ్లాం. కబురు పంపగానే, ఆయన వెంటనే మమ్మల్ని పైకి రప్పించారు. నన్ను చూడగానే‘ఉరై డింభకా ఇలా కూర్చోరా’ అని ప్రేమగా ఒళ్లో కూర్చోపెట్టుకున్నారు. నాన్నగారంటే ఆయనకు ఎంతో గౌరవం. నాన్న జీవితమంతా సంబరంగా, అర్థవంతంగా గడిచిపోయింది. ఏ ప్రభుత్వమూ నాన్నగారికి అవార్డులు ఇవ్వకపోయినా బాధపడలేదు. 2006లో నేను అందుకున్న కలైమామణి పురస్కారాన్ని నాన్నకి అంకితం చేశాను. – సంభాషణ: వైజయంతి పురాణపండ, ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల మూర్తి: నా పేరు వెంకటనారాయణమూర్తి. ఎంవిఎన్‌మూర్తి అంటారు. ముద్దుగా బాజీ అని పిలుస్తారు. నేను బి.ఎస్సీ కెమిస్ట్రీ చదివాను. ఎయిర్‌లైన్స్ కోర్సు చేశాను. జర్మనీ నేర్చుకున్నాను. వెంపటి చినసత్యంగారి దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను. పాతికేళ్లుగా శివ ఫౌండేషన్ పేరుతో డాన్స్ స్కూల్ నడుపుతున్నాను. 1999లో అమ్మ, 2000లో నాన్న మరణించారు. అమ్మానాన్నల పేరు మీద హృదయాంజలి సంగీత విభావరిని 18 మంది గాయనీ గాయకులతో పాడించాను. బాలమురళి ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రస్తుతం వారి పేరు మీద ‘మాధవపెద్ది సత్యం – మాధవపెద్ది ప్రభావతి’ పురస్కారాలు అందిస్తున్నాను. త్వరలో నాన్నగారి పుస్తకం ఆవిష్కరించాలనుకుంటున్నాను. నాగలక్ష్మి: బి.ఏ. హిస్టరీ చదివాను. పెళ్లయ్యాక బి.ఈడి చేశాను. మావారు ఉండవల్లి రవికుమార్ జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేశారు. వైజాగ్‌లో ఒక కాన్వెంట్లో కాలక్షేపానికి పనిచేశాను. నాన్నకి నేనంటే కొండంత ప్రేమ. కొండ మీద కోతిని అడిగినా తెచ్చేవారు. నో అనే వారు కాదు. కంచంలో అన్నీ ఆయనే వడ్డించి అన్నానికి పిలిచేవారు. నాన్నగారి చివరి రోజులలో హాస్పిటల్‌కి రోజూ వెళ్లి కూర్చునేదాన్ని. అలాగైనా ఆయన ఋణం తీర్చుకోవాలనుకున్నాను. అక్కడ కూడా ఆయన నాతో ఏమీ చేయించుకోలేదు. -
ఆ వార్త తెలిసి ఆశ్రమానికి...
భాగ్యనగరం అదృష్టం చేసుకుంది. చీకటి భారతంలోవెలుగులు నింపిన మహాత్ముడికి ఆతిథ్యం ఇచ్చింది. ఆయన అడుగుజాడలనుపదిలంగా భద్రపరుచుకుంది. ఆ మహనీయుడి జ్ఞాపకాల గని ఇప్పటికీ ఇక్కడుంది.నేడు ఆయన 150వ జయంతి... బాపూఘాట్ మహాత్మాగాంధీ అస్థికలను దేశంలోని ఐదు ప్రాంతాల్లో నదుల్లో కలపగా... ఇందుకు దక్షిణాది నుంచి హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. అయితే అప్పుడు నిజాం పాలన ఉండడంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ నవాబుతో మాట్లాడగా ఆయన సంతోషంగా ఆహ్వానించారు. అస్థికలనుబొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో రెండు రోజులు ప్రజల సందర్శనార్థం ఉంచారు. తర్వాతలంగర్‌హౌస్‌లోని త్రివేణి సంగమంలో కొన్ని కలిపి...మరికొన్ని అస్థికలను కలశంలో పెట్టి ఒడ్డున సమాధి నిర్మించారు.అదే బాపూఘాట్. అడుగులో.. అడుగై... అతనో 17 ఏళ్ల కుర్రాడు. 1945 మార్చి 8న మద్రాస్‌లోని మైలాపూర్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన గాంధీజీని కలిశాడు. ‘నేను దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను. మీతోపాటే సేవాగ్రామ్‌కు వస్తాన’ని చెప్పాడు. గాంధీ ‘ఇంత చిన్న వయసులోనే ఎందుకు?’ అని ప్రశ్నించగా... దేశం కోసం అని బదులిచ్చాడు. అప్పుడు గాంధీతోనే మహారాష్ట్ర వార్దాలోని సేవాగ్రామ్‌కు వెళ్లిన ఆ కుర్రాడు... మహాత్ముడితోనే చాలాకాలం ఉన్నాడు. ఆయనే శ్రీపాద సూర్యనారాయణమూర్తి. 92 ఏళ్ల ఈ పెద్దాయన ఇచ్చిన ఇంటర్వ్యూ ‘సాక్షి’కి ప్రత్యేకం... ‘గోల్డెన్’ బస మహాత్ముడి జ్ఞాపకాలెన్నో నగరంలో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. ఆయన నగరానికి ఎప్పుడొచ్చినా సరోజినీ నాయుడు ఇంట్లో (గోల్డెన్ త్రెషోల్డ్)నే బస చేసేవారు. ఇక్కడ ఒక మామిడి మొక్కను నాటగా... అది మహావృక్షమైంది. బాపూజీ విశ్రాంతి తీసుకున్న మంచం ఇప్పటికీ పదిలంగా ఉంది. ఉద్యమ ఉప్పెన 1934 మార్చి 9... నగరంలోని కర్బలా మైదానం.. సాయంత్రం 4గంటలు... గ్రౌండ్ మొత్తం జనసందోహం... ఒక్కసారిగా అభిమానుల హర్షాతిరేకాలతో మైదానమంతా దద్దరిల్లింది. మహాత్ముడి రాకతో భాగ్యనగరం పుల కించింది. అస్పృశ్యతపై ఆనాడు నిర్వహిం చిన ఈ సభలో గాంధీ హరిజనోద్ధరణపై చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. అది 1945, మార్చి 8వ తేదీ... అప్పటికే మద్రాస్‌లోని మైలాపూర్ ఎంతో సందడిగా ఉంది. వేలాది మంది బాపూజీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎటు చూసినా జన సందోహమే. ‘స్వాంతంత్య్ర’ నినాదమే. ప్రతి ఒక్కరిలో జాతీయోద్యమ స్ఫూర్తి. ఎంతోమంది దేశభక్తులు గాంధీజీ కోసం ఎదురు చూస్తున్నట్లుగానే ఓ పదిహేడేళ్ల కుర్రాడు సైతం ఎదురు చూస్తున్నాడు. బాపూజీతో రెండు నిమిషాల పాటు మాట్లాడవలసిన అవసరం ఉంది. ఆ రెండు నిమిషాల కోసమే అతడు ట్రిప్లికేన్ మైలార్‌పల్లికి వచ్చాడు. ఆ రోజు అక్కడ హిందూ ప్రచార సభ, ఆంధ్రమహిళా సభ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు గాంధీజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక్కసారిగా ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొంది. కానీ ఆ కుర్రాడికి మాత్రం టెన్షన్‌గా ఉంది. గాంధీజీతో మాట్లాడే అవకాశం లభిస్తుందో లేదోనని. ఎలాగైతేనేం, ఆ అవకాశం లభించింది. ‘దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను. మీతో పాటే సేవాగ్రామ్‌కు వచ్చేస్తాను. నన్ను తప్పకుండా తీసుకెళ్లండి.’ అని అడిగాడు. ‘ఇంత చిన్న వయసులో ఎందుకు’ అన్నారు గాంధీజీ. దేశం కోసం పని చేయాలని ఉంది.’ అన్నాడు. అలా గాంధీతో పాటే మహారాష్ట్ర వార్ధాలోని సేవాగ్రామ్‌కు వెళ్లిన అతడు ఆ ఆశ్రమానికి కార్యదర్శిగా, ఖాదీ ఉద్యమ ప్రచారకుడిగా, కుష్టువ్యాధిగ్రస్తుల సేవకుడిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనే శ్రీపాద సూర్యనారాయణ మూర్తి(ఎస్ఎస్ఎన్ మూర్తి). బాపూజీ బాటలో నడిచారు. ప్రస్తుతం 92 ఏళ్ల వయసులోనూ బాపూజీ జ్ఞాపకాలు ఎంతో పదిలంగా ఉన్నాయని చెబుతారాయన. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...‘సేవ’ తప్ప మరో ధ్యాస లేదు... పశ్చిమ గోదావరి జిల్లా గుమ్మలూరు మాది. పాలకొల్లు, తణుకులలో ఉన్నత విద్యను పూర్తి చేసిన తరువాత మా కుటుంబం మద్రాస్‌కు తరలి వెళ్లడంతో ఇంటర్మీడియట్ అక్కడే చదివాను. పోలీస్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో 1946 నుంచి 1948 వరకు గ్రేడ్–2 అధికారిగా పని చేశాను. కానీ మొదటి నుంచి నా ధ్యాసంతా దేశ సేవపైనే ఉంది. చదువుకొనే రోజుల్లో గాంధీజీ మద్రాస్‌కు వచ్చినప్పడు ఆయనతో పాటే సేవాగ్రామ్‌కు వెళ్లాను. కానీ 2 నెలల కంటే ఎక్కువ కాలం ఉండలేకపోయాను. అప్పటికి దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆశ్రమాన్ని బెంగాల్‌కు మార్చనున్నట్లు గాం«ధీ చెప్పారు. ఇంటికి తిరిగి వెళ్లాలని చెప్పారు. దాంతో మద్రాస్ వచ్చేశాను. అలా రెండేళ్ల పాటు ఉద్యోగం చేశాను. కానీ ఆ రెండు నెలల్లో గాంధీజీతో చక్కటి అనుబంధం ఏర్పడింది. ఆయన బాపూ కుటీర్‌లో ఉండేవారు. ఆయనను కలిసేందుకు వచ్చేవారి వివరాలు తెలుసుకొని పంపించడం నాకు అప్పగించిన పని. అలా నెహ్రూ, పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్ వంటి ఎంతోమంది మహానుభావులను పరిచయం చేసుకొనే అవకాశం లభించింది. పైగా గాంధీజీ కూడా పరిచయం చేసేవారు. ఆ కుటీర్ బాపూజీ సెక్రెటేరియట్. ఎలాంటి భూకంపాలనైనా తట్టుకోగలిగే సామర్ధ్యంతో కేవలం మట్టితోనే కట్టించిన ఆశ్రమం అది. అరుగుపైన చాప పరుచుకొని బాపూ కూర్చునేవారు. ఎవరు వచ్చినా ఆ అరుగుపైనే సమావేశాలు జరిగేవి. ఉదయం 4.30 గంటలకు, సాయంత్రం 6 గంటలకు బాపూతో కలిసి సర్వమత ప్రార్ధనలలో పాల్గొనడం గొప్ప అనుభూతి. రెండు పూటలా నడక, మితాహారం, చర్ఖాపైన దారం వడకడం, ఆశ్రమంలో పారిశుధ్య పనులు, క్రమశిక్షణతో చక్కటి జీవన విధానం అలవడింది. మొత్తం 70 మందిమి ఉండేవాళ్లం ఆశ్రమంలో. అప్పటికే కస్తూర్బా గాంధీ చనిపోయారు. ఆమె నివాసం ఉన్న ఆది కుటీర్‌లో నేను ఉండేందుకు అవకాశం లభించడం నా అదృష్టం. సేవాగ్రామ్‌ను బెంగాల్‌కు మార్చనున్నట్లు చెప్పడం వల్లనే తిరిగి మద్రాస్‌కు రావలసి వచ్చింది. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఎంతో కాలం కొనసాగలేకపోయాను. మరోసారి ఆశ్రమానికి వెళ్లాను. గాంధీజీ చెప్పినట్లు వార్ధా నుంచి బెంగాల్‌కు మారలేదు. ఆ వార్త తెలిసి ఆశ్రమానికి... ఆ రోజు 1948 జనవరి 30. షాకింగ్ న్యూస్. మహాత్ముడు ఇక లేరు. హత్యకు గురయ్యారు. రేడియోలో ఆ వార్త విన్నాను. బాధతో చలించిపోయాను. వెంటనే వెళ్లిపోవాలనిపించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు, చివరకు ఆ ఏడాది మార్చి 30న ఉద్యోగానికి రాజీనామా చేసి, ఏప్రిల్ ఒకటో తేదీన వార్ధాకు చేరుకున్నాను. గాంధీజీ తరువాత ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను చేపట్టిన శ్రీకృష్ణదాస్ జాజీ, జమన్‌లాల్ బజాజ్‌ల మార్గదర్శకత్వంలో సేవాగ్రామ్ కార్యదర్శిగా పనిచేశాను. ఖాదీ పరిశ్రమకు నిలయమైన సేవాగ్రామ్‌తో పాటు, కుష్టురోగులకు సేవలందజేసే దత్తపూర్, గ్రామీణ పరిశ్రమలకు కేంద్రమైన మగన్‌వాడీలలో పని చేశాను. కుష్టు రోగులకు సేవలందజేయడం గొప్ప అదృష్టంగా భావించాను. నా భార్య మైత్రి వినోబాభావే స్ఫూర్తితో సర్వోదయ ఉద్యమంలో క్రియాశీలమైన కార్యకర్తగా పని చేస్తే దత్తపూర్ అనుభవంతో బొబ్బిలి సమీపంలోని చిలకలపల్లిలో కుష్టువ్యాధిగ్రస్తుల సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి 10 గ్రామాలను దత్తతీసుకొని కుష్టు నిర్మూలన, అవగాహన కార్యక్రమాలను ఉద్యమ స్థాయిలో చేపట్టాం..’ అని ముగించారు. -
ప్రమాదంలో గాయపడ్డ ఎన్నారై శ్రీరామమూర్తి
కాన్ టౌన్షిప్ (పెన్సిల్వేనియా) : ప్రముఖ సైక్లిస్టు శ్రీరామమూర్తి కయ్యలముడి (48) కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. జూన్ 29న జరిగిన ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక పోలీసులు వాషింగ్టన్‌లోని పావోలి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడుకు, వెన్నముకు, ఊపిరితిత్తులకు తీవ్ర గాయాలయ్యాయని.. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చికిత్స అందిస్తున్న వైద్యులు డాక్టర్లు తెలిపారు. తెలుగు వాడైన శ్రీరామమూర్తి పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. స్వతహాగా సేవా దృక్పథం కలిగిన వ్యక్తం కావడంతో.. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనేవారు. అరోగ్యకరమైన జీవితం కోసం అందరూ జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్ చేయాలని అందరినీ ప్రోత్సహిస్తుండేవారని సన్నిహితులు చెబుతున్నారు. శ్రీరామమూర్తి స్వయంగా పాల్గొని ఎన్నో ప్రతిష్టాత్మకమైన మారథాన్లు కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అయితే అందరికీ ఆదర్శంగా ఉండే శ్రీరామమూర్తి ఇలా ప్రమాదానికి గురికావడంతో.. ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఇటువంటి ఉన్నతమైన వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వైద్య చికిత్స కోసం ఎన్నారై సంస్థలు ఫండ్ రైజింగ్ చేపట్టారు. ఫండ్ రైజింగ్ కోసం.... https://www.gofundme.com/f/help-murthy-to-run-again -
మరోసారి పోలీసుల ముందుకు మూర్తి
-
ఆయన పెళ్లికి ఈ శుభలేక ‘ఆధార్’ం
మనిషన్నాక.. కూతంత కళాపోషణ ఉండాలి.. ఓ సినిమాలో రావు గోపాలరావు చెప్పే ఫేవరెట్ డైలాగ్.. దాన్ని ఫాలో అయ్యాడు కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన న్యాయవాది కొత్తపల్లి మూర్తి.. రోటీ¯ŒSగా కాకుండా కాస్త వెరైటీగా శుభలేఖలు ముద్రించాడు. ప్రతి ఒక్కరికి అవసరమైన ఆధార్‌కార్డు రూపంలో ఫిబ్రవరి ఒకటో తేదీన జరిగే తన పెళ్లి శుభలేఖను ముద్రించి అందరినీ అబ్బురపరిచాడు. ప్రతి ఇంటికి వెళ్లి మూర్తి తన స్నేహితులకు ఇస్తుండగా అందరూ ముందు ఆధార్‌కార్డు ఇస్తున్నారేంటి? అని ఆశ్చర్యపోతున్నారట. – రాజమహేంద్రవరం రూరల్ -
జీబీకే మూర్తికి నాటా జర్నలిజం అవార్డు
సాక్షి, హైదరాబాద్: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఏర్పడి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా నాటా జర్నలిజం-పబ్లిక్ రిలేషన్స్ అవార్డుకు కవి, రచయిత, సీనియర్ జర్నలిస్ట్, పబ్లిక్ రిలేషన్స్ ఎక్స్పర్ట్ జీబీకే మూర్తిని ఎంపిక చేసినట్లు నాటా అధ్యక్షులు డాక్టర్ మోహన్ మల్లం ఓ ప్రకటనలో తెలిపారు. మే 27-29 తేదీల్లో డల్లాస్‌లో జరిగే నాటా కన్వెన్షన్‌లో అవార్డు ప్రదానం చేస్తామన్నారు. -
ద్రవిడియన్ వర్సిటీ లీలలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రా లకు చెందిన పీహెచ్డీ స్కాలర్లు (2007-08, 2008- 09 బ్యాచ్‌లకు చెందినవారు) తమ పరిశోధనా గ్రం థాలను ద్రవిడియన్ యూనివర్సిటీకి నాలుగేళ్ల క్రిత మే సమర్పించినా వాటిని మూల్యాంకనకు ఇంతవర కు పంపలేదని తెలిసింది. కొంత మంది స్కాలర్లు హైకోర్టు నుండి ‘మూల్యాంకన’ ‘వైవా’లను వెంటనే జరపమని ఆర్డర్లు తెచ్చుకున్నా, డీయూ వారు ఖాత రు చేయడం లేదు. యూనివర్సిటీ ఎదుట ధర్నాలు చేయగా ఈ ఏడాది జనవరి- ఫిబ్రవరి నెలలో రీసెర్చి స్కాలర్ల గైడ్లను డీయూకు రప్పించుకుని వారి సర్టిఫి కెట్లను పరిశీలించి పంపారు. ఇది జరిగి ఐదు నెలలు గడచినా ఫలితం సున్నా. కోర్టు తీర్పు రాలేదనే వంక తో స్కాలర్ల జీవితాలతో ద్రవిడియన్ విశ్వవిద్యాల యం ఆడుకుంటున్నది. స్కాలర్ల ప్రమోషన్లు, ఆర్థిక వెసులుబాట్లు ఆగిపోయాయి. కొందరు రిటైరయ్యా రు. ఈ స్కాలర్లలో ఎక్కువ భాగం దక్షిణాది రాష్ట్రాల వారు కావడం వల్ల - ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులం దరూ తక్షణ చర్యలు తీసుకోవాలని మనవి. ఆంధ్ర ఫ్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలోనే (చిత్తూరు జిల్లా) ద్రవిడి యన్ యూనివర్సిటీ ఉన్నది. ముఖ్యమంత్రిని హైద రాబాద్‌లో కొందరు స్కాలర్లు గత సంవత్సరం జూలై 7న స్వయంగా కలసి, పరిస్థితిని వివరించి వినతి పత్రాన్ని ఇచ్చి, వారి నుంచి హామీ పొందినా, తదు పరి వారికి ఎన్ని రాతపూర్వక విన్నపాలు చేసుకున్నా ఏళ్లు గడుస్తున్నా- రీసెర్చి స్కాలర్లకు న్యాయం లభిం చకపోవడం లేదు. దక్షిణాది స్కాలర్ల ప్రయోజనా లను కాపాడేందుకు ఏపీ ముఖ్యమ్రంతి డీయూపై దృష్టి పెట్టాలని మా అభ్యర్థన. ఎన్.ఎస్.ఆర్.మూర్తి రీసెర్చి స్కాలర్ (రిటైర్డ్ ఎంప్లాయి), హైదరాబాద్ 94900 56843 -
మూర్తి.. సేవా స్ఫూర్తి
రక్త, నేత్రదానాలతో ప్రోత్సాహం పేదలకు ఆర్థికంగా చేయూత 25 ఏళ్లుగా సేవే పరమావధిగా.. రామచంద్రపురం :ఆయన పేరు తొగరు మూర్తి.. కాలేజీ వయస్సు నుంచి సేవే పరమావధిగా ముందుకుసాగుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా అడుగులేస్తున్నారు. 25 ఏళ్లుగా సేవా స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. ఎవరైనా రక్తం కావాలని అడగడమే తరువాయి. వెంటనే స్పందించే గుణం ఆయనది... సేవా ప్రస్థానం ప్రారంభం ఇలా.. మూర్తి బీకాం చదువుతున్న రోజుల్లో కాలేజీ బయట తన స్నేహితుడు శ్రీధర్ ప్రమాదానికి గురయ్యాడు. రక్తం కావాల్సి వస్తే తన స్నేహితులు నలుగురితో కలిసి మూర్తి రక్తాన్ని అందించారు. తమ కుమారునికి పునర్జన్మ ప్రసాదించారంటూ శ్రీధర్ తల్లిదండ్రులు ప్రదర్శించిన కృతజ్ఞతాభావం మూర్తిలో సేవా భావాన్ని తట్టిలేపింది. రక్తం లేక ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని తెలుసుకున్న మూర్తి వెంటనే తన నలుగురు స్నేహితులతో కలిసి ఏర్పాటు చేసిన రక్షా ఫౌండేషన్ ద్వారా గత 25 ఏళ్లలో జిల్లావ్యాప్తంగా సుమారుగా 12వేల మందికి రక్తాన్ని అందించారు. మూర్తిగానే సుపరిచితులు తొగరు ఆదినారాయణ, మంగామణి దంపతుల పెద్దకుమారుడు తొగరు సత్యనారాయణమూర్తి. ఆయన అందరికీ మూర్తిగానే సుపరిచితులు. 1989 నుంచి రక్షా ఫౌండేషన్ ద్వారా యువకులకు, రక్త, నేత్రదానంపై అవగాహన కల్పించడంతోపాటుగా ఇప్పటివరకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు 11 జతల నేత్రాలను కూడా అందించారు. గత 25 ఏళ్లుగా ఇప్పటివరకు మూర్తి 50సార్లు స్వయంగా రక్తదానం చే సి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. రోటరీ క్లబ్ మేనేజర్ డాక్టర్ కామరాజు, సినీ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌తో పాటుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి నుంచి కూడా మూర్తి ప్రశంసలదుకున్నారు. పేదలకు సాయం చేయడంలోనూ ముందు రక్తదానమే కాకుండా పేదలకు సాయం చేయటంలోనూ మూర్తి ముందుంటారు. ఎందరో నిరుపేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించి ఉపాధి మార్గాన్ని చూపించారు. పేదవారి వివాహాలకు కూడా ఆర్థిక సాయాలు అందించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే సంజీవిని 108ను ఉంచేందుకు చోటు లేకపోతే. పట్టణంలోని డీసీసీబీ బ్యాంకు వద్ద రూ.10వేలతో షెడ్డును ఏర్పాటు చేశారు. ఓటరు అవగాహన సదస్సుల ఏర్పాటుతోపాటు, బాల కార్మికుల సంక్షేమం గురించి పోరాటం చేయడంలోనూ మూర్తి ముందుంటారు. స్థానిక వైఎస్సార్ నగర్లో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించారు. స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడాప్రాంగణంలో వాకర్స్ క్లబ్ గౌరవాధ్యక్షునిగా కూడా మూర్తి పనిచేస్తున్నారు. క్రీడాప్రాంగణంలో సదస్సులు ఏర్పాటు చేసి నడకతో కలిగే ప్రయోజనాలు, యోగా ద్వారా కలిగే ఆరోగ్య ఉపయోగాల గురించి తెలియజేస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే తలంపుతోనే సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు మూర్తి చెబుతున్నారు. -
టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటుచేయాలి
దుబ్బాక రూరల్: దుబ్బాక ప్రాంతంలో చేనేత కార్మికుల ఉపాధి కోసం టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటుచేయాలని ఆల్ఇండియా హ్యాండ్లూమ్ బోర్డ్ సభ్యు లు, చేనేత కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎన్.ఎన్ మూర్తి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం దుబ్బాక చేనేత కార్మికుల స్థితిగతులను తెలుసుకోవడానికి ఆల్ ఇండియా హ్యాం డ్లూమ్ బోర్డు సభ్యులు పర్యటించారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు పొద్దంత పని చేసిన 100 రూపాయలు కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 45లక్షల మంది చేనేత కార్మికులు ఉన్నారన్నారు. ప్రభుత్వాలు మారినా చేనేత కార్మికుల రాత మారడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. దుబ్బాక చేనేత కార్మికుల కోసం పవర్ లూం మగ్గాలను ఏర్పాటు చేయాలన్నారు. అంతే కాకుండా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలపై దేశ ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు నివేదికను అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డ్ సభ్యులు ఎడ్ల గీత, పాము యాదగిరి, వేంకటేశ్వర్లు, శ్రీనివాస్‌మూర్తి, చేనేత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు శ్రీరాం రామకృష్ణప్రభు, గోనే మధు, రవికాంత్, గాజులభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.