ఆయన పెళ్లికి ఈ శుభలేక ‘ఆధార్’ం
Published Sun, Jan 22 2017 10:07 PM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
మనిషన్నాక.. కూతంత కళాపోషణ ఉండాలి.. ఓ సినిమాలో రావు గోపాలరావు చెప్పే ఫేవరెట్ డైలాగ్.. దాన్ని ఫాలో అయ్యాడు కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన న్యాయవాది కొత్తపల్లి మూర్తి.. రోటీ¯ŒSగా కాకుండా కాస్త వెరైటీగా శుభలేఖలు ముద్రించాడు. ప్రతి ఒక్కరికి అవసరమైన ఆధార్‌కార్డు రూపంలో ఫిబ్రవరి ఒకటో తేదీన జరిగే తన పెళ్లి శుభలేఖను ముద్రించి అందరినీ అబ్బురపరిచాడు. ప్రతి ఇంటికి వెళ్లి మూర్తి తన స్నేహితులకు ఇస్తుండగా అందరూ ముందు ఆధార్‌కార్డు ఇస్తున్నారేంటి? అని ఆశ్చర్యపోతున్నారట.
– రాజమహేంద్రవరం రూరల్
Advertisement
Advertisement