లావా.. వహ్వా..
సీన్ అదిరింది కదూ.. అగ్నిపర్వతం బద్దలై.. నీలి రంగులో లావా వెలువడతున్న ఈ అద్భుత దృశ్యాన్ని మీరెక్కడైనా చూశారా? ఇండోనేసియాలోని తూర్పు జావా ప్రాంతంలో ఉన్న కావాహిజెన్ అగ్ని పర్వతం వద్దకు వెళ్తే.. అక్కడ మీరీ సన్నివేశాన్ని వీక్షించవచ్చు. దీనికి కారణమేమిటంటే.. ఈ ప్రాంతంలో గంధకం ఎక్కువగా ఉండటం వల్ల నీలి రంగులో మంటలు వెలువడతాయి. ఇందులోని కొన్ని వాయువులు ద్రవరూపంలోకి మారి.. ఇలా లావాలా వెలువడతాయి. అంతే తప్ప.. ఇది నిజమైన లావా కాదని నిపుణులు చెబుతున్నారు.