sulfur
-
చంద్రుడిపై సల్ఫర్ నిజమే
బెంగళూరు: అత్యంత విలువైన సల్ఫర్ నిల్వలు చందమామ ఉపరితలంపై ఉన్నట్లు చంద్రయాన్–3 మిషన్ ఇప్పటికే గుర్తించింది. అయితే, ఈ విషయాన్ని మరో విభిన్నమైన పరీక్ష ద్వారా రోవర్ ప్రజ్ఞాన్ మరోసారి నిర్ధారించింది. రోవర్‌లోని అల్ఫా పార్టికల్ ఎక్స్–రే స్పెక్ట్రోస్కోప్(ఏపీఎక్స్ఎస్) సల్ఫర్‌ను స్పష్టంగా గుర్తించిందని ఇస్రో వెల్లడించింది. అంతేకాకుండా మరికొన్ని చిన్నపాటి మూలకాలను కనిపెట్టిందని తెలియజేసింది. అయితే, చంద్రుడి మట్టిలోకి సల్ఫర్ ఎలా వచి్చందన్నది కనిపెట్టాల్సి ఉందని పేర్కొంది. అగి్నపర్వతం పేలడం వల్ల ఏర్పడిందా? లేక గ్రహశకలాల ద్వారా వచి్చందా? అన్నది సైంటిస్టులు తేల్చాలని వెల్లడించింది. జాబిల్లిపై ప్రజ్ఞాన్ చక్కర్లు చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై రోవర్ ప్రజ్ఞాన్ చక్కర్లు కొడుతున్న వీడియోను ఇస్రో ‘ఎక్స్’లో షేర్ చేసింది. Chandrayaan-3 Mission: The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera. It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately. Isn't it?🙂 pic.twitter.com/w5FwFZzDMp — ISRO (@isro) August 31, 2023 -
సల్ఫర్ ఎరువుపై రాయితీ 84 పైసలు పెంపు
న్యూఢిల్లీ: సల్ఫర్ ఎరువుపై రాయితీని కేజీకి 84 పైసలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ప్రస్తుతం ఆ రాయితీ కేజీకి రూ. 2.72 ఉండగా, దానిని రూ. 3.56కు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే యూరియాయేతర, ఇతర పోషక ఎరువులకు ఇస్తున్న రాయితీలో మార్పులేమీ లేవని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో యూరియాయేతర ఎరువులకు రాయితీ ఇచ్చేందుకు వెచ్చించే మొత్తం రూ. 22,875.5 కోట్లుగా ఉంటుందని ఆయన చెప్పారు. జవదేకర్ మాట్లాడుతూ ‘దేశంలో యూరియా వాడకం ఎక్కువగా ఉంది. అయితే వ్యవసాయానికి యూరియా ఎంత ముఖ్యమో ఎన్పీకేఎస్ (ఎన్–నైట్రోజన్, పీ–ఫాస్ఫాటిక్, కే–పొటాసిక్, ఎస్–సల్ఫర్) కూడా అంతే ముఖ్యం. ఎన్పీకేఎస్ పోషకాలకు కూడా ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. సల్ఫర్(ఎస్)పై రాయితీని కేజీకి ప్రస్తుత రూ. 2.72 నుంచి రూ. 3.56కు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. అయితే ఎన్,పీ,కేలపై రాయితీల్లో మార్పులేమీ ఉండవు’ అని వివరించారు. ప్రస్తుతం నైట్రోజన్(ఎన్)పై కేజీకి రూ. 18.9, ఫాస్ఫాటిక్(పీ)పై కేజీకి రూ. 15.21, పొటాసిక్(కే)పై కేజీకి రూ. 11.12లను కేంద్రం రాయితీగా ఇస్తోంది. యూరియాయేతర ఎరువులు రైతులకు అందుబాటు ధరల్లోనే ఉండాలనే ఉద్దేశంతో సల్ఫర్పై రాయితీని పెంచినట్లు జవదేకర్ చెప్పారు. కాగా, కేంద్రం ఓ ప్రకటన విడుదల చేస్తూ సల్ఫర్పై రాయితీని పెంచుతున్నట్లు ఏ రోజు నోటిఫికేషన్ విడుదల అవుతుందో ఆ రోజు నుంచే కొత్త రాయితీ అమల్లోకి వస్తుందనీ, అప్పటి వరకు ప్రస్తుత రేట్లే ఉంటాయని స్పష్టం చేసింది. యూరియాయేతర ఎరువులైన డీఏపీ (డై–అమ్మోనియం ఫాస్ఫేట్), ఎంవోపీ (మ్యురియేట్ ఆఫ్ పొటాష్), ఎన్‌పీకేల ధరలను వాటి తయారీదారులే నిర్ణయించుకుంటారు. అయితే ప్రభుత్వం వాటిపై కొంత రాయితీని మాత్రం ఇస్తుంది. ఆ రాయితీ ఎంతనేది ఏయేటికాయేడు కేంద్రం నిర్ణయిస్తుంది. కశ్మీర్ ఈడబ్ల్యూఎస్ కోటాకు ఓకే ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కశ్మీర్‌కు చెందిన ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న రిజర్వేషన్లకు తోడుగా ‘కశ్మీర్ ఈడబ్ల్యూఎస్’ కోటాను అమలుచేస్తారని ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. మరోవైపు, ఓబీసీల్లో ఉపవర్గాలపై అధ్యయ నానికి ఏర్పాటైన కమిటీ కాల పరిమితిని వచ్చే ఏడాది జనవరి 31 వరకు గడువు పెంచింది. సుప్రీం జడ్జీలు 34మంది దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మరింత పరిపుష్టంకానుంది. కోర్టు జడ్జీల గరిష్ట సంఖ్యను 34కు పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుందని కేబినెట్ భేటీ తర్వాత కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో చెప్పారు. సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్య దాదాపు 60,000కు చేరుకున్న నేపథ్యంలో జడ్జీల పరిమితి పెరగడం గమనార్హం. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి అనుమతించిన సుప్రీం జడ్జీల సంఖ్య 30గా ఉంది. జడ్జీల గరిష్ట పరిమితిని పెంచాలని గతంలో ప్రధాని మోదీకి సీజేఐ జస్టిస్ గొగోయ్ లేఖరాయడం తెల్సిందే. ‘ మూడు దశాబ్దాల క్రితం 1988లో సీజేఐని మినహాయించి జడ్జీల సంఖ్య పరిమితిని 18 నుంచి 25కు పెంచారు. తర్వాత మరో రెండు దశాబ్దాలకు 2009లో 30కి పెంచారు. పోగుబడుతున్న కేసులను త్వరగా తేల్చాలన్నా, ప్రజలకు సరైన సమయానికి న్యాయం దక్కాలన్నా, రాజ్యాంగ ధర్మాసనాల ఏర్పాటు జరగాలన్నా జడ్జీల సంఖ్య పెంచడం తప్పదు’ అని మోదీకి రాసిన లేఖలో సీజేఐ పేర్కొన్నారు. -
కాజా టోల్గేట్ వద్ద సల్ఫర్ ట్యాంకర్ బోల్తా
-
లావా.. వహ్వా..
సీన్ అదిరింది కదూ.. అగ్నిపర్వతం బద్దలై.. నీలి రంగులో లావా వెలువడతున్న ఈ అద్భుత దృశ్యాన్ని మీరెక్కడైనా చూశారా? ఇండోనేసియాలోని తూర్పు జావా ప్రాంతంలో ఉన్న కావాహిజెన్ అగ్ని పర్వతం వద్దకు వెళ్తే.. అక్కడ మీరీ సన్నివేశాన్ని వీక్షించవచ్చు. దీనికి కారణమేమిటంటే.. ఈ ప్రాంతంలో గంధకం ఎక్కువగా ఉండటం వల్ల నీలి రంగులో మంటలు వెలువడతాయి. ఇందులోని కొన్ని వాయువులు ద్రవరూపంలోకి మారి.. ఇలా లావాలా వెలువడతాయి. అంతే తప్ప.. ఇది నిజమైన లావా కాదని నిపుణులు చెబుతున్నారు. -
అగ్గిపుల్లల తయారీలో వాడే మిశ్రమం?
ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం అనే ఐదు మూలకాలు ఆక్సిజన్ కుటుంబానికి చెందుతాయి. వీటిని ‘చాల్కోజన్లు’ అని కూడా అంటారు. ఇది ‘బ్రాస్’ (ఇత్తడి)ను తెలిపే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఇత్తడిలోని ముఖ్య లోహం కాపర్. కాపర్ ముడి ఖనిజాల్లో ఆక్సిజన్ లేదా సల్ఫర్ లేదా ఈ గ్రూపులోని ఇతర మూలకాలు ఉంటాయి. ఆవర్తన పట్టికలో ఈ మూలకాలను 16వ గ్రూపులో చేర్చారు. వీటిలో పొలోనియం రేడియోధార్మిక మూలకం. ఆక్సిజన్ కుటుంబం భూ పటలంలో లభించే మూలకాలన్నింటిలో అత్యంత సమృద్ధిగా లభించేది ఆక్సిజన్. భూ పటలంలో ఆక్సిజన్ ద్రవ్యరాశి శాతం 46.6. వాతావరణంలో ఘనపరిమాణాత్మకంగా ఇది 20.95 శాతం ఉంటుంది (పొడిగాలిలో). భూ పటలంలో సల్ఫర్ శాతం కేవలం 0.03-0.1. భూ గర్భంలో సల్ఫర్ మూలక రూపంలో అమెరికా, జపాన్, సిసిలీలో విస్తృతంగా లభిస్తుంది. బొగ్గు, పెట్రోలియం ఉత్పన్నాల్లో సల్ఫర్ స్వ ల్పంగా ఉంటుంది. ఉల్లి, వెల్లుల్లి, గుడ్లు, గోళ్లు, వెంట్రుకలు, ఆవాలు, క్యాబేజీలలో కూడా తక్కువ పరిమాణంలో సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ సమ్మేళన రూపంలో సల్ఫేట్లు, సల్ఫైడ్లుగా లభిస్తుంది. పెరైటీస్ ఖనిజాల్లో సల్ఫర్ సల్ఫైడ్ రూపంలో ఉంటుంది. ఉదా: కాపర్ పెరైటీస్, ఐరన్ పెరైటీస్. సల్ఫేట్ రూపంలోని ఖనిజాలు: జిప్సం (కాల్షియం సల్ఫేట్) ఎప్సం లవణం (మెగ్నీషియం సల్ఫేట్) బెరైటీస్ (బేరియం సల్ఫేట్) సల్ఫైడ్ ధాతువుల్లోనే సెలీనియం, టెలూరియంలు కూడా సమ్మేళన స్థితిలో ఉంటాయి. థోరియం, యురేనియం ఖనిజాల క్షయాజన్య ఉత్పన్నం (ఈ్ఛఛ్చిడ ్కటౌఛీఠఛ్టి)గా పొలోనియం ఏర్పడుతుంది. ఆక్సిజన్ ఆక్సిజన్ ద్విపరమాణుక అణువు (ై2). దీన్ని డై ఆక్సిజన్ అని కూడా అంటారు. ఆక్సిజన్ స్వయంగా మండదు (దహనశీలి కాదు), కానీ మండటానికి దోహదపడుతుంది (దహన దోహదకారి). మూలకాలన్నింటిలో ఫ్లోరిన్ తర్వాత ఆక్సిజన్‌కు అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉంటుంది. పొటాషియం క్లోరేట్ (ఓఇై3), పొటాషియం పర్మాంగనేట్ (ఓకై4) లాంటి ఆక్సిజన్ ఉండే లవణాలను వేడిచేస్తే విఘటనం చెంది ఆక్సిజన్‌ను ఇస్తాయి. మాంగనీస్ డై ఆక్సైడ్ లేదా లోహ ఉత్ప్రేరకాల సమక్షంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ విఘటనం చెంది నీరు, ఆక్సిజన్లను ఇస్తుంది. నీటిని విద్యుద్విశ్లేషణ చేసినప్పుడు ఆనోడ్ వద్ద ఆక్సిజన్, కాథోడ్ వద్ద హైడ్రోజన్లు వస్తాయి. ఆక్సిజన్.. హైడ్రోజన్‌తో కలిసి ఏర్పరిచే సమ్మేళనాల్లో ప్రధానమైంది నీరు (ఏ2ై). బలమైన హైడ్రోజన్ బంధాల కారణంగా నీరు ద్రవస్థితిలో ఉంటుంది. ఇదే గ్రూపులోని సల్ఫర్ హైడ్రోజన్‌తో కలిసి ఏర్పరిచే హైడ్రోజన్ సల్ఫైడ్ (ఏ2)లో హైడ్రోజన్ బంధాలు లేని కారణంగా వాయుస్థితిలో ఉంటుంది. మురికి కాల్వల నుంచి వచ్చే కుళ్లిన కోడిగుడ్ల వాసన ఉన్న వాయువు హైడ్రోజన్ సల్ఫైడ్. ఆక్సిజన్ హైడ్రోజన్‌తో ఏర్పరిచే మరో సమ్మేళనం హైడ్రోజన్ పెరాక్సైడ్. దీన్ని గాయాలను కడగడానికి యాంటీసెప్టిక్‌గా, జుట్టును విరంజనం (బ్లీచింగ్) చేయడానికి ఉపయోగిస్తారు. ఆక్సిజన్ రూపాంతరం ఓజోన్ (ై3). దీని పరమాణుకత మూడు. హరిత గృహ ప్రభావం (ఎట్ఛ్ఛ ఏౌఠట్ఛ ఉజజ్ఛఛ్టి) కలు గజేసే వాయువుల్లో ఇది కూడా ఒకటి. స్ట్రాటోస్ఫియర్‌లో విస్తరించి ఉన్న ఓజోన్ పొర సూర్యరశ్మిలోని హానికారక అతి నీలలోహిత (్ఖగ) కిరణాలను భూమిని చేరకుండా ఫిల్టర్ చేస్తుంది. ఓజోన్ను నీటిని శుద్ధి చేయడానికి, సినిమా హాళ్లను క్రిమిరహితం చేయడానికి ఉపయోగిస్తారు. రాకెట్లలో వాడే ఇంధనమైన హైడ్రజీన్ దహన ప్రక్రియలో ఆక్సిజన్ ఆక్సీకరణిగా పనిచేస్తుంది. ఓజోన్ సోకితే ‘మెనిస్కస్’ను కోల్పోవడం వల్ల మెర్క్యూరీకి గాజుకు అంటుకునే ధర్మం వస్తుంది. దీన్నే‘టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ’ అంటారు. సల్ఫర్ ప్రాచీన కాలం నుంచి సల్ఫర్‌ను ఔషధాల తయారీలో వాడుతున్నారు. ముఖ్యంగా దీన్ని చర్మ వ్యాధుల నివారణ కోసం ఉపయోగిస్తారు. రాంబిక్ సల్ఫర్, మోనోక్లినిక్ సల్ఫర్, ప్లాస్టిక్ సల్ఫర్ అనేవి దీని రూపాంతరాలు. వీటికి రసాయన ధర్మాలు ఒకే విధంగా ఉండి, భౌతిక ధర్మాలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో రాంబిక్ సల్ఫర్ అత్యంత స్థిరమైంది. ఇది నీటిలో కరగదు. కార్బన్ డై సల్ఫైడ్ ద్రావణిలో కరుగుతుంది. 8 సల్ఫర్ పరమాణువులు కలిసి (8) వలయంగా ఏర్పడి కిరీటం (ఇటౌఠీ) ఆకృతిని ఇస్తాయి. రాంబిక్ సల్ఫర్‌ను 98నిఇ (సల్ఫర్ పరివర్తన ఉష్ణోగ్రత) వద్ద వేడిచేస్తే మోనోక్లినిక్ సల్ఫర్‌గా మారుతుంది. సల్ఫర్ 119నిఇ వద్ద ద్రవీకరణం చెందుతుంది. మరింత వేడిచేస్తే 160నిఇ వద్ద చిక్కని ద్రవం ఏర్పడుతుంది. దీన్ని చల్లని నీటిలో పోస్తే మెత్తని రబ్బరు లాంటి గుణం ఉన్న ప్లాస్టిక్ సల్ఫర్ ఏర్పడుతుంది. సల్ఫర్ ద్రవాన్ని 444నిఇ కు వేడిచేస్తే బాష్పీభవనం చెందుతుంది. ఈ భాష్పాలను చల్లార్చితే ఏర్పడే సల్ఫర్‌ను ’ఊౌఠ్ఛీటట ౌజ ఠఞజిఠట’ అంటారు. సల్ఫర్‌ను గాలిలో మండిస్తే సల్ఫర్ డై ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇది విరంజన కారిగా పనిచేస్తుంది. సల్ఫర్‌ను టపాకాయలు, అగ్గిపెట్టెల పరిశ్రమల్లో వాడతారు. గన్‌పౌడర్ తయారీలో సల్ఫర్ ఉపయోగపడుతుంది. గన్ పౌడర్ అనేది సల్ఫర్, బొగ్గుపొడి (చార్కోల్), పొటాషియం నైట్రేట్ల మిశ్రమం. మెత్తని, జిగురైన రబ్బర్‌ను సల్ఫర్‌తో నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వేడిచేస్తే గట్టిదనం వస్తుంది. ఈ ప్రక్రియనే సల్ఫర్ వల్కనీకరణం అంటారు. చర్మవ్యాధుల చికిత్సకు వాడే ఆయింట్మెంట్ల తయారీలో సల్ఫర్ లేదా మెర్క్యూరిక్ సల్ఫైడ్లను ఉపయోగిస్తారు. కీటక నాశనుల తయారీలో సల్ఫర్‌ను వాడతారు. ఆయిల్ రిఫైనరీలు, థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గును మండించినప్పుడు, అగ్ని పర్వతాల నుంచి వాతావరణంలోకి సల్ఫర్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. మధురలోని చమురుశుద్ధి కర్మాగారం నుంచి విడుదలైన సల్ఫర్ డై ఆక్సైడ్ కారణంగానే పాలరాతితో నిర్మించిన తాజ్‌మహల్ పసుపు రంగులోకి మారింది. దీన్ని చక్కెర పరిశ్రమలో విరంజన కారిగా, వస్త్ర పరిశ్రమలో క్లోరిన్‌ను తొలగించడానికి యాంటీక్లోర్గా వాడతారు. సల్ఫ్యూరికామ్లం సల్ఫర్ ముఖ్యమైన సమ్మేళనం సల్ఫ్యూరికామ్లం (గంధకీకామ్లం). దీన్ని రసాయనాల రాజు (కింగ్ ఆఫ్ కెమికల్స్) అంటారు. స్పర్శా పద్ధతిలో దీని తయారీలో ‘వెనేడియం పెంటాక్సైడ్’ ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. సల్ఫ్యూరికామ్లాన్ని తయారు చేస్తే వినియోగించుకునే పరిమాణం ఆధారంగా ఒక దేశ పారిశ్రామిక పురోగతిని అంచనా వేస్తారు. దీన్ని అమ్మోనియం సల్ఫేట్ లాంటి ఎరువులు, డిటర్జెంట్ల తయారీలో వాడతారు. సల్ఫూరికామ్లాన్ని బ్యాటరీల్లో నిక్షేపకంగా ఉపయోగిస్తారు. హైపో హైపో రసాయన నామం సోడియం థయోసల్ఫేట్. హైపోను ఫొటోగ్రఫీలో, సిరా మరకలను తొలగించడంలో వినియోగిస్తారు. ప్రయోగశాలలో ‘కిప్పు’ పరికరం ద్వారా హైడ్రోజన్ సల్ఫైడ్ను తయారు చేస్తారు. మాదిరి ప్రశ్నలు 2. వాతావరణంలో ఆమ్లజని శాతం ఎంత? (పోలీస్ కానిస్టేబుల్ - 2011) 1) 18% 2) 72% 3) 11% 4) 21% 3. పొటాషియం పర్మాంగనేట్‌ను వేడిచేస్తే విడుదలయ్యే వాయువేది? 1) ఆక్సిజన్ 2) హైడ్రోజన్ 3) ఓజోన్ 4) క్లోరిన్ 4. గ్లాస్ బ్లోయింగ్‌కు ఉపయోగించే మంట కోసం వాడే వాయువు? 1) ఆక్సిజన్ 2) హైడ్రోజన్ 3) ఆక్సిజన్ + ఎసిటలీన్ 4) వాటర్‌గ్యాస్ 5. కిందివాటిలో సల్ఫైడ్ ధాతువు ఏది? 1) జిప్సం 2) బెరైటీస్ 3) ఐరన్ పెరైటీస్ 4) బాక్సైట్ 6. అగ్గిపుల్లల తయారీలో వాడే మిశ్రమం? 1) సల్ఫర్ + పొటాషియం పర్మాంగనేట్ 2) సల్ఫర్ + పొటాషియం క్లోరేట్ 3) ఎర్ర భాస్వరం + సల్ఫర్ 4) ఎర్ర భాస్వరం+పొటాషియం క్లోరేట్ 7. భూ పటలంలో అత్యధికంగా లభించే మూలకం? 1) ఆక్సిజన్ 2) అల్యూమినియం 3) సిలికాన్ 4) నైట్రోజన్ 8. వెల్డింగ్ షాపుల్లో లోహాలను కోయడానికి లేదా అతకడానికి ఉపయోగించే ఆక్సీహైడ్రోజన్ మంటలో గరిష్ఠ ఉష్ణోగ్రత? 1) 1000నిఇ 2) 2400నిఇ 3) 3000నిఇ 4) 100నిఇ 9. ఫొటోగ్రఫీలో వాడే హైపో రసాయన నామం? 1) సోడియం సల్ఫేట్ (ూ్చ2ై4) 2) సోడియం థయోసల్ఫేట్ (ూ్చ22ై3) 3) పొటాషియం పర్మాంగనేట్ (ఓకై4) 4) సోడియం పెరాక్సైడ్ 10. దేనిని వేడి చేయడం ద్వారా ఆక్సిజన్‌ను తయారు చేయవచ్చు? 11. నీటి విద్యుద్విశ్లేషణలో ఆనోడ్ వద్ద వెలువడే వాయువు? 1) హైడ్రోజన్ 2) ఆక్సిజన్ 3) నైట్రోజన్ 4) ఏదీకాదు 12. గన్ పౌడర్ దేని మిశ్రమం? (ఎస్సై- 2012) 1) పొటాషియం, సోడియం నైట్రేట్ 2) పొటాషియం, మెగ్నీషియం సల్ఫేట్ 3) పొటాషియం సల్ఫేట్, పొటాషియం నైట్రేట్ 4) చార్కోల్, సల్ఫర్, పొటాషియం నైట్రేట్ 13. బ్యాటరీల్లో సాధారణంగా నిల్వ ఉండే ఆమ్లం ఏది? (పోలీస్ కానిస్టేబుల్-2011) 1) సల్ఫ్యూరిక్ ఆమ్లం 2) నైట్రిక్ ఆమ్లం 3) హైడ్రోక్లోరికామ్లం 4) ఎసిటిక్ ఆమ్లం 14. సల్ఫర్ ఏ ద్రావణిలో కరుగుతుంది? 1) నీరు 2) కార్బన్ డై సల్ఫైడ్ 3) ఆల్కహాల్ 4) ఏదీకాదు సమాధానాలు 1) 4; 2) 4; 3) 1; 4) 3; 5) 3; 6) 2; 7) 1; 8) 2; 9) 2; 10) 4; 11) 2; 12) 4; 13) 1; 14) 2. -
ఈ వారం వ్యవసాయ సూచనలు
కంది, కొర్ర,, వేరుశనగ సాగు మేలు * ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని కంది, కొర్ర, రాగి, వేరుశనగ, పత్తి, పశుగ్రాసాలు సాగు చేసుకోవచ్చు. * విత్తే ముందు రైతులు తమ సొంత విత్తనాన్ని వాడుకున్నట్లయితే తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి లేదా శుద్ధి చేసిన విత్తనాన్ని మార్కెట్లో కొనుగోలు చేయాలి. * వర్షాధారపు పంటలన్నింటిలోనూ సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడడం వలన భూసారం పెరగడమే కాకుండా నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, వేరుశనగ చెక్క, వేప చెక్క, కానుగ చెక్కలను వాడుకోవచ్చు. * నూనె గింజ పంటలకు తప్పనిసరిగా సల్ఫర్ ఉన్న భాస్వరపు ఎరువులను వాడాలి. అన్ని పంటలకు మొత్తం భాస్వరపు ఎరువును ఆఖరి దుక్కిలోనే వేయాలి. భూసార పరీక్షను అనుసరించి ఎరువులను వేసుకోవడం వల్ల ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. * వర్షాలు తక్కువ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందుకుగాను, వాలుకు అడ్డంగా విత్తుకోవడం, వాలును అనుసరించి మడులను చిన్నవిగా చేసుకోవడం, వాలు ఎక్కువగా ఉన్నచోట్ల లోతైన గొడ్డు చాళ్లను ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ వాలు ఉన్న చోట్ల మట్టితోగాని, రాతి కట్టడంతో లేదా జీవ కంచెతో గాని అడ్డు ఏర్పాటు చేసుకోవడం వలన నీటిని అక్కడే ఇంకేలా చేసుకోవడమే కాకుండా మట్టి కొట్టుకు పోకుండా నివారించవచ్చు. * వర్షాకాలంలో కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి విత్తిన 24 గంటల్లోపు ఆయా పంటలకు సిఫారసు చేసిన కలుపు పైమందులను ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. * కంది పంటకు పెండిమిథాలిన్ 1 నుంచి 1.5 లీటర్లు లేదా అలాక్లోర్ 1 లీటరు. ఆముదం పంటకు పెండిమిథాలిన్ 1.3 - 1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 800 మి.లీ. నుంచి ఒక లీటరు. పత్తిలో విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ 1 లీటరు/ విత్తిన తర్వాత పెండిమిథాలిన్ 1.3 నుంచి 1.6 లీ./ అలాక్లోర్ 1.5-2 లీటర్లను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
‘అనంత’లో అరేబియన్ పంట
ప్రయోగాత్మకంగా ఖర్జూరం సాగు ఖర్జూరం పండులో క్యాల్షియం, సల్ఫర్, ఇనుము, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, రాగి, మెగ్నీషియం పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నివారించే శక్తి ఈ పండుకు ఎక్కువ. ఖర్జూరం శాస్త్రీయ నామం ఫీనిక్స్డాక్టిలిఫెరా. తాటిచెట్టు మాదిరిగా పెరిగే ఈ చెట్లు ఆడ, మగ వేరువేరుగా ఉంటాయి. రాయదుర్గం : అరబ్ దేశాల్లో పండించే ఖర్జూరం పంట ఇప్పుడు మన ప్రాంతానికీ విస్తరించింది. కరువు పీడిత ప్రాంతంగా పేరొందిన ‘అనంత’ నేలలో పండించేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం బెణకల్లుకు చెందిన రామక్రిష్ణారెడ్డి తన స్నేహితుడి సలహా మేరకు ఆరేళ్ల క్రితం 15 ఎకరాల విస్తీర్ణంలోని నల్లరేగడిలో దాదాపు 1500 మొక్కలు నాటాడు. రెండు వ్యవసాయబోర్ల ద్వారా మొక్కలకు బిందు సేద్యం ద్వారా నీటిని అందిస్తున్నాడు. మొదట్లో ఇరుగుపొరుగు రైతులు ఎగతాళి చేసినా పట్టించుకోకుండా కంటికి రెప్పలా ఖర్జూరం మొక్కలను కాపాడుకుంటూ వచ్చాడు. పశువుల ఎరువును ఎక్కువశాతం వాడుతూ, అడపాదడపా క్రిమిసంహారక మందు కూడా తక్కువ మోతాదులో ఉపయోగిస్తున్నాడు. మొక్కకూ.. మొక్కకూ 20 అడుగుల దూరం పాటించాడు. కట్టెల నుంచి కాల్చిన బొగ్గును కూడా ఎరువుగా ఉపయోగిస్తున్నాడు. ప్రస్తుతం వంద ఖర్జూరం చెట్లు కాపుకొచ్చాయి. ఆరు నెలల క్రితం అంతర్ పంటగా 1500 దానిమ్మ మొక్కలు నాటాడు. ఫలదీకరణ ప్రక్రియ :ఖర్జూరం పంట మొగ్గదశలో మగచెట్ల పరాగరేణువులను తీసుకుని, ఆడ ఖర్జూర చెట్లకు సంబంధించిన పండ్ల గుత్తిలో పెట్టి వల ఏర్పాటు చేస్తారు. 50 ఆడ చె ట్లను ఫలవంతం చేయడానికి ఒక మగచెట్టు పరాగరేణువులు ఉపయోగపడుతాయి. ఈ పంట 5 నుంచి 8 సంవత్సరాలకు కాపుకొస్తుంది.