చంద్రుడిపై సల్ఫర్‌ నిజమే | Chandrayaan-3: ISRO Shares Video Of Pragyan Rover Frolicking On Moon, Video Viral - Sakshi
Sakshi News home page

Chandrayaan 3 Latest Video: చంద్రుడిపై సల్ఫర్‌ నిజమే

Published Fri, Sep 1 2023 6:10 AM | Last Updated on Fri, Sep 1 2023 12:08 PM

Chandrayaan-3: ISRO shares video of Pragyan rover frolicking on moon - Sakshi

బెంగళూరు: అత్యంత విలువైన సల్ఫర్‌ నిల్వలు చందమామ ఉపరితలంపై ఉన్నట్లు చంద్రయాన్‌–3 మిషన్‌ ఇప్పటికే గుర్తించింది. అయితే, ఈ విషయాన్ని మరో విభిన్నమైన పరీక్ష ద్వారా రోవర్‌ ప్రజ్ఞాన్‌ మరోసారి నిర్ధారించింది. రోవర్‌లోని అల్ఫా పార్టికల్‌ ఎక్స్‌–రే స్పెక్ట్రోస్కోప్‌(ఏపీఎక్స్‌ఎస్‌) సల్ఫర్‌ను స్పష్టంగా గుర్తించిందని ఇస్రో వెల్లడించింది.

అంతేకాకుండా మరికొన్ని చిన్నపాటి మూలకాలను కనిపెట్టిందని తెలియజేసింది. అయితే, చంద్రుడి మట్టిలోకి సల్ఫర్‌ ఎలా వచి్చందన్నది కనిపెట్టాల్సి ఉందని పేర్కొంది. అగి్నపర్వతం పేలడం వల్ల ఏర్పడిందా? లేక గ్రహశకలాల ద్వారా వచి్చందా? అన్నది సైంటిస్టులు తేల్చాలని వెల్లడించింది. జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ చక్కర్లు చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై రోవర్‌ ప్రజ్ఞాన్‌ చక్కర్లు కొడుతున్న వీడియోను ఇస్రో ‘ఎక్స్‌’లో షేర్‌ చేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement