ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం అనే ఐదు మూలకాలు ఆక్సిజన్ కుటుంబానికి చెందుతాయి. వీటిని ‘చాల్కోజన్‌లు’ అని కూడా అంటారు. ఇది ‘బ్రాస్’ (ఇత్తడి)ను తెలిపే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఇత్తడిలోని ముఖ్య లోహం కాపర్. కాపర్ ముడి ఖనిజాల్లో ఆక్సిజన్ లేదా సల్ఫర్ లేదా ఈ గ్రూపులోని ఇతర మూలకాలు ఉంటాయి. ఆవర్తన పట్టికలో ఈ మూలకాలను 16వ గ్రూపులో చేర్చారు. వీటిలో పొలోనియం రేడియోధార్మిక మూలకం.
ఆక్సిజన్ కుటుంబం
భూ పటలంలో లభించే మూలకాలన్నింటిలో అత్యంత సమృద్ధిగా లభించేది ఆక్సిజన్. భూ పటలంలో ఆక్సిజన్ ద్రవ్యరాశి శాతం 46.6. వాతావరణంలో ఘనపరిమాణాత్మకంగా ఇది 20.95 శాతం ఉంటుంది (పొడిగాలిలో). భూ పటలంలో సల్ఫర్ శాతం కేవలం 0.03-0.1. భూ గర్భంలో సల్ఫర్ మూలక రూపంలో అమెరికా, జపాన్, సిసిలీలో విస్తృతంగా లభిస్తుంది. బొగ్గు, పెట్రోలియం ఉత్పన్నాల్లో సల్ఫర్ స్వ ల్పంగా ఉంటుంది. ఉల్లి, వెల్లుల్లి, గుడ్లు, గోళ్లు, వెంట్రుకలు, ఆవాలు, క్యాబేజీలలో కూడా తక్కువ పరిమాణంలో సల్ఫర్ ఉంటుంది.
సల్ఫర్ సమ్మేళన రూపంలో సల్ఫేట్లు, సల్ఫైడ్‌లుగా లభిస్తుంది. పెరైటీస్ ఖనిజాల్లో సల్ఫర్ సల్ఫైడ్ రూపంలో ఉంటుంది.
ఉదా: కాపర్ పెరైటీస్, ఐరన్ పెరైటీస్.
సల్ఫేట్ రూపంలోని ఖనిజాలు:
జిప్సం (కాల్షియం సల్ఫేట్)
ఎప్సం లవణం (మెగ్నీషియం సల్ఫేట్)
బెరైటీస్ (బేరియం సల్ఫేట్)
సల్ఫైడ్ ధాతువుల్లోనే సెలీనియం, టెలూరియంలు కూడా సమ్మేళన స్థితిలో ఉంటాయి. థోరియం, యురేనియం ఖనిజాల క్షయాజన్య ఉత్పన్నం (ఈ్ఛఛ్చిడ ్కటౌఛీఠఛ్టి)గా పొలోనియం ఏర్పడుతుంది.
ఆక్సిజన్
ఆక్సిజన్ ద్విపరమాణుక అణువు (ై2). దీన్ని డై ఆక్సిజన్ అని కూడా అంటారు. ఆక్సిజన్ స్వయంగా మండదు (దహనశీలి కాదు), కానీ మండటానికి దోహదపడుతుంది (దహన దోహదకారి). మూలకాలన్నింటిలో ఫ్లోరిన్ తర్వాత ఆక్సిజన్‌కు అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉంటుంది.
పొటాషియం క్లోరేట్ (ఓఇై3), పొటాషియం పర్మాంగనేట్ (ఓకై4) లాంటి ఆక్సిజన్ ఉండే లవణాలను వేడిచేస్తే విఘటనం చెంది ఆక్సిజన్‌ను ఇస్తాయి.
మాంగనీస్ డై ఆక్సైడ్ లేదా లోహ ఉత్ప్రేరకాల సమక్షంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ విఘటనం చెంది నీరు, ఆక్సిజన్‌లను ఇస్తుంది.
నీటిని విద్యుద్విశ్లేషణ చేసినప్పుడు ఆనోడ్ వద్ద ఆక్సిజన్, కాథోడ్ వద్ద హైడ్రోజన్‌లు వస్తాయి.
ఆక్సిజన్.. హైడ్రోజన్‌తో కలిసి ఏర్పరిచే సమ్మేళనాల్లో ప్రధానమైంది నీరు (ఏ2ై). బలమైన హైడ్రోజన్ బంధాల కారణంగా నీరు ద్రవస్థితిలో ఉంటుంది. ఇదే గ్రూపులోని సల్ఫర్ హైడ్రోజన్‌తో కలిసి ఏర్పరిచే హైడ్రోజన్ సల్ఫైడ్ (ఏ2)లో హైడ్రోజన్ బంధాలు లేని కారణంగా వాయుస్థితిలో ఉంటుంది. మురికి కాల్వల నుంచి వచ్చే కుళ్లిన కోడిగుడ్ల వాసన ఉన్న వాయువు హైడ్రోజన్ సల్ఫైడ్.
ఆక్సిజన్ హైడ్రోజన్‌తో ఏర్పరిచే మరో సమ్మేళనం హైడ్రోజన్ పెరాక్సైడ్. దీన్ని గాయాలను కడగడానికి యాంటీసెప్టిక్‌గా, జుట్టును విరంజనం (బ్లీచింగ్) చేయడానికి ఉపయోగిస్తారు.
ఆక్సిజన్ రూపాంతరం ఓజోన్ (ై3). దీని పరమాణుకత మూడు. హరిత గృహ ప్రభావం (ఎట్ఛ్ఛ ఏౌఠట్ఛ ఉజజ్ఛఛ్టి) కలు గజేసే వాయువుల్లో ఇది కూడా ఒకటి. స్ట్రాటోస్ఫియర్‌లో విస్తరించి ఉన్న ఓజోన్ పొర సూర్యరశ్మిలోని హానికారక అతి నీలలోహిత (్ఖగ) కిరణాలను భూమిని చేరకుండా ఫిల్టర్ చేస్తుంది.
ఓజోన్‌ను నీటిని శుద్ధి చేయడానికి, సినిమా హాళ్లను క్రిమిరహితం చేయడానికి ఉపయోగిస్తారు.
రాకెట్‌లలో వాడే ఇంధనమైన హైడ్రజీన్ దహన ప్రక్రియలో ఆక్సిజన్ ఆక్సీకరణిగా పనిచేస్తుంది.
ఓజోన్ సోకితే ‘మెనిస్కస్’ను కోల్పోవడం వల్ల మెర్క్యూరీకి గాజుకు అంటుకునే ధర్మం వస్తుంది. దీన్నే‘టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ’ అంటారు.
సల్ఫర్
ప్రాచీన కాలం నుంచి సల్ఫర్‌ను ఔషధాల తయారీలో వాడుతున్నారు. ముఖ్యంగా దీన్ని చర్మ వ్యాధుల నివారణ కోసం ఉపయోగిస్తారు. రాంబిక్ సల్ఫర్, మోనోక్లినిక్ సల్ఫర్, ప్లాస్టిక్ సల్ఫర్ అనేవి దీని రూపాంతరాలు. వీటికి రసాయన ధర్మాలు ఒకే విధంగా ఉండి, భౌతిక ధర్మాలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో రాంబిక్ సల్ఫర్ అత్యంత స్థిరమైంది. ఇది నీటిలో కరగదు. కార్బన్ డై సల్ఫైడ్ ద్రావణిలో కరుగుతుంది.
8 సల్ఫర్ పరమాణువులు కలిసి (8) వలయంగా ఏర్పడి కిరీటం (ఇటౌఠీ) ఆకృతిని ఇస్తాయి. రాంబిక్ సల్ఫర్‌ను 98నిఇ (సల్ఫర్ పరివర్తన ఉష్ణోగ్రత) వద్ద వేడిచేస్తే మోనోక్లినిక్ సల్ఫర్‌గా మారుతుంది. సల్ఫర్ 119నిఇ వద్ద ద్రవీకరణం చెందుతుంది. మరింత వేడిచేస్తే 160నిఇ వద్ద చిక్కని ద్రవం ఏర్పడుతుంది. దీన్ని చల్లని నీటిలో పోస్తే మెత్తని రబ్బరు లాంటి గుణం ఉన్న ప్లాస్టిక్ సల్ఫర్ ఏర్పడుతుంది. సల్ఫర్ ద్రవాన్ని 444నిఇ కు వేడిచేస్తే బాష్పీభవనం చెందుతుంది. ఈ భాష్పాలను చల్లార్చితే ఏర్పడే సల్ఫర్‌ను ’ఊౌఠ్ఛీటట ౌజ ఠఞజిఠట’ అంటారు.
సల్ఫర్‌ను గాలిలో మండిస్తే సల్ఫర్ డై ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇది విరంజన కారిగా పనిచేస్తుంది.
సల్ఫర్‌ను టపాకాయలు, అగ్గిపెట్టెల పరిశ్రమల్లో వాడతారు.
గన్‌పౌడర్ తయారీలో సల్ఫర్ ఉపయోగపడుతుంది. గన్ పౌడర్ అనేది సల్ఫర్, బొగ్గుపొడి (చార్‌కోల్), పొటాషియం నైట్రేట్ల మిశ్రమం.
మెత్తని, జిగురైన రబ్బర్‌ను సల్ఫర్‌తో నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వేడిచేస్తే గట్టిదనం వస్తుంది. ఈ ప్రక్రియనే సల్ఫర్ వల్కనీకరణం అంటారు.
చర్మవ్యాధుల చికిత్సకు వాడే ఆయింట్‌మెంట్ల తయారీలో సల్ఫర్ లేదా మెర్క్యూరిక్ సల్ఫైడ్‌లను ఉపయోగిస్తారు. కీటక నాశనుల తయారీలో సల్ఫర్‌ను వాడతారు.
ఆయిల్ రిఫైనరీలు, థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గును మండించినప్పుడు, అగ్ని పర్వతాల నుంచి వాతావరణంలోకి సల్ఫర్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. మధురలోని చమురుశుద్ధి కర్మాగారం నుంచి విడుదలైన సల్ఫర్ డై ఆక్సైడ్ కారణంగానే పాలరాతితో నిర్మించిన తాజ్‌మహల్ పసుపు రంగులోకి మారింది. దీన్ని చక్కెర పరిశ్రమలో విరంజన కారిగా, వస్త్ర పరిశ్రమలో క్లోరిన్‌ను తొలగించడానికి యాంటీక్లోర్‌గా వాడతారు.
సల్ఫ్యూరికామ్లం
సల్ఫర్ ముఖ్యమైన సమ్మేళనం సల్ఫ్యూరికామ్లం (గంధకీకామ్లం). దీన్ని రసాయనాల రాజు (కింగ్ ఆఫ్ కెమికల్స్) అంటారు. స్పర్శా పద్ధతిలో దీని తయారీలో ‘వెనేడియం పెంటాక్సైడ్’ ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది.
సల్ఫ్యూరికామ్లాన్ని తయారు చేస్తే వినియోగించుకునే పరిమాణం ఆధారంగా ఒక దేశ పారిశ్రామిక పురోగతిని అంచనా వేస్తారు.
దీన్ని అమ్మోనియం సల్ఫేట్ లాంటి ఎరువులు, డిటర్జెంట్‌ల తయారీలో వాడతారు.
సల్ఫూరికామ్లాన్ని బ్యాటరీల్లో నిక్షేపకంగా ఉపయోగిస్తారు.
హైపో
హైపో రసాయన నామం సోడియం థయోసల్ఫేట్.
హైపోను ఫొటోగ్రఫీలో, సిరా మరకలను తొలగించడంలో వినియోగిస్తారు.
ప్రయోగశాలలో ‘కిప్పు’ పరికరం ద్వారా హైడ్రోజన్ సల్ఫైడ్‌ను తయారు చేస్తారు.
మాదిరి ప్రశ్నలు
2. వాతావరణంలో ఆమ్లజని శాతం ఎంత?
(పోలీస్ కానిస్టేబుల్ - 2011)
1) 18% 2) 72%
3) 11% 4) 21%
3. పొటాషియం పర్మాంగనేట్‌ను వేడిచేస్తే విడుదలయ్యే వాయువేది?
1) ఆక్సిజన్ 2) హైడ్రోజన్
3) ఓజోన్ 4) క్లోరిన్
4. గ్లాస్ బ్లోయింగ్‌కు ఉపయోగించే మంట కోసం వాడే వాయువు?
1) ఆక్సిజన్ 2) హైడ్రోజన్
3) ఆక్సిజన్ + ఎసిటలీన్
4) వాటర్‌గ్యాస్
5. కిందివాటిలో సల్ఫైడ్ ధాతువు ఏది?
1) జిప్సం 2) బెరైటీస్
3) ఐరన్ పెరైటీస్ 4) బాక్సైట్
6. అగ్గిపుల్లల తయారీలో వాడే మిశ్రమం?
1) సల్ఫర్ + పొటాషియం పర్మాంగనేట్
2) సల్ఫర్ + పొటాషియం క్లోరేట్
3) ఎర్ర భాస్వరం + సల్ఫర్
4) ఎర్ర భాస్వరం+పొటాషియం క్లోరేట్
7. భూ పటలంలో అత్యధికంగా లభించే మూలకం?
1) ఆక్సిజన్ 2) అల్యూమినియం
3) సిలికాన్ 4) నైట్రోజన్
8. వెల్డింగ్ షాపుల్లో లోహాలను కోయడానికి లేదా అతకడానికి ఉపయోగించే ఆక్సీహైడ్రోజన్ మంటలో గరిష్ఠ ఉష్ణోగ్రత?
1) 1000నిఇ 2) 2400నిఇ
3) 3000నిఇ 4) 100నిఇ
9. ఫొటోగ్రఫీలో వాడే హైపో రసాయన నామం?
1) సోడియం సల్ఫేట్ (ూ్చ2ై4)
2) సోడియం థయోసల్ఫేట్ (ూ్చ22ై3)
3) పొటాషియం పర్మాంగనేట్ (ఓకై4)
4) సోడియం పెరాక్సైడ్
10. దేనిని వేడి చేయడం ద్వారా ఆక్సిజన్‌ను తయారు చేయవచ్చు?
11. నీటి విద్యుద్విశ్లేషణలో ఆనోడ్ వద్ద వెలువడే వాయువు?
1) హైడ్రోజన్ 2) ఆక్సిజన్
3) నైట్రోజన్ 4) ఏదీకాదు
12. గన్ పౌడర్ దేని మిశ్రమం?
(ఎస్సై- 2012)
1) పొటాషియం, సోడియం నైట్రేట్
2) పొటాషియం, మెగ్నీషియం సల్ఫేట్
3) పొటాషియం సల్ఫేట్, పొటాషియం నైట్రేట్
4) చార్‌కోల్, సల్ఫర్, పొటాషియం నైట్రేట్
13. బ్యాటరీల్లో సాధారణంగా నిల్వ ఉండే ఆమ్లం ఏది?
(పోలీస్ కానిస్టేబుల్-2011)
1) సల్ఫ్యూరిక్ ఆమ్లం 2) నైట్రిక్ ఆమ్లం
3) హైడ్రోక్లోరికామ్లం
4) ఎసిటిక్ ఆమ్లం
14. సల్ఫర్ ఏ ద్రావణిలో కరుగుతుంది?
1) నీరు 2) కార్బన్ డై సల్ఫైడ్
3) ఆల్కహాల్ 4) ఏదీకాదు
సమాధానాలు
1) 4; 2) 4; 3) 1; 4) 3; 5) 3;
6) 2; 7) 1; 8) 2; 9) 2; 10) 4;
11) 2; 12) 4; 13) 1; 14) 2.
అగ్గిపుల్లల తయారీలో వాడే మిశ్రమం?
Published Thu, Oct 16 2014 8:12 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement