ఇండోనేషియాలో పేలిన అగ్ని పర్వతం.. ఆరుగురు మృతి | Volcano Eruption in Indonesia Many Housed Burnt | Sakshi
Sakshi News home page

ఇండోనేషియాలో పేలిన అగ్ని పర్వతం.. ఆరుగురు మృతి

Published Tue, Nov 5 2024 8:01 AM | Last Updated on Tue, Nov 5 2024 8:47 AM

Volcano Eruption in Indonesia Many Housed Burnt

జకర్తా: ఇండోనేషియాలో అగ్ని పర్వతం పేలింది. ఇక్కడి ఫ్లోర్స్ ద్వీపంలోని మౌంట్ లెవోటోబి లాకీ లాకీ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ విపత్తులో పలు ఇళ్లు దగ్ధమయ్యాయని, ఆరుగురు మృతి చెందారని ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ మీడియాకు తెలిపింది.

ఫ్లోర్స్ ద్వీపంలో అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా బూడిద దాదాపు 2000 మీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. సమీపంలోని గ్రామాన్ని వేడి బూడిద చుట్టుముట్టింది. ఈ ఘటనలో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఆరుగురు మృతిచెందారు. ఈ పర్వత విస్ఫోటనం కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రమాదంలో కూలిన ఇళ్ల కింద కొందరు సమాధి అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

వులాంగిటాంగ్ జిల్లాలో సంభవించిన ఈ అగ్నిపర్వతం పేలుడు కారణంగా సమీపంలోని పులులారా, నవోకోటే, హోకెంగ్ జయ, క్లాటన్‌లో, బోరు  కెడాంగ్‌ గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఇండోనేషియాలో గత రెండు వారాల్లో ఇది రెండవ అగ్నిపర్వత విస్ఫోటనం. అక్టోబర్ 27న జరిగిన విస్ఫోటనంలో దట్టమైన బూడిద ఉవ్వెత్తున్న ఎగసిపడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలో సూపర్‌ యాప్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement