ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం పేలడంతో స్థానికుల్లో భయాందోళనలు చెలరేగుతున్నాయి. ఈ పేలుడు దరిమిలా సునామీ ముప్పు పొంచివుంది. పేలుడు కారణంగా అగ్నిపర్వతంలోని కొంత భాగం సముద్రంలో పడిపోనున్నదని, ఫలితంగా 1871లో సంభవించిన మాదిరిగా భారీ సునామీ వచ్చే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు.
ఇండోనేషియాలోని రుయాంగ్ అగ్నిపర్వతం గత కొన్ని రోజులుగా యాక్టివ్‌గా ఉంది. బూడిద, పొగను వెదజల్లుతోంది. అగ్నిపర్వతంలోని కొంత భాగం బలహీనంగా మారిందని, అది ఎప్పుడైనా సముద్రంలో పడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది జరిగితే, ఇది భారీ సునామీ సంభవిస్తుందని, ఇది సమీపంలోని తీర ప్రాంతాలలో భారీ విధ్వంసం కలిగించవచ్చని స్థానిక అధికారులు అంటున్నారు.
ALERT: Indonesia volcano eruption sparks tsunami fears, alert level raised to highest — Officials worry that part of the volcano could collapse into the sea and cause a tsunami, as happened in 1871. pic.twitter.com/idTYAjuImo
— Insider Paper (@TheInsiderPaper) April 17, 2024
సునామీ ముప్పు నేపధ్యంలో తీర ప్రాంతాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. అలాగే బీచ్‌లను సందర్శించడం, సముద్రంలోకి వెళ్లడం లాంటి పనులు చేయకూడదని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థలు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment