Breaking News
-
వెబ్ సిరీస్ నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్
-
పర్సనల్ బాండ్ తీసుకుని విడుదల చేయాలని ఆదేశం
-
Breaking News: మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ
-
తెలుగు రాష్ట్రాల్లో కంపించిన భూమి.. 20 ఏళ్ల తర్వాత భూ ప్రకంపనలు (ఫొటోలు)
-
పుప్పాలగూడలోని ఓ అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు
-
ఇండోనేషియాలో పేలిన అగ్ని పర్వతం.. ఆరుగురు మృతి
జకర్తా: ఇండోనేషియాలో అగ్ని పర్వతం పేలింది. ఇక్కడి ఫ్లోర్స్ ద్వీపంలోని మౌంట్ లెవోటోబి లాకీ లాకీ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ విపత్తులో పలు ఇళ్లు దగ్ధమయ్యాయని, ఆరుగురు మృతి చెందారని ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ మీడియాకు తెలిపింది.ఫ్లోర్స్ ద్వీపంలో అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా బూడిద దాదాపు 2000 మీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. సమీపంలోని గ్రామాన్ని వేడి బూడిద చుట్టుముట్టింది. ఈ ఘటనలో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఆరుగురు మృతిచెందారు. ఈ పర్వత విస్ఫోటనం కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రమాదంలో కూలిన ఇళ్ల కింద కొందరు సమాధి అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.వులాంగిటాంగ్ జిల్లాలో సంభవించిన ఈ అగ్నిపర్వతం పేలుడు కారణంగా సమీపంలోని పులులారా, నవోకోటే, హోకెంగ్ జయ, క్లాటన్లో, బోరు కెడాంగ్ గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఇండోనేషియాలో గత రెండు వారాల్లో ఇది రెండవ అగ్నిపర్వత విస్ఫోటనం. అక్టోబర్ 27న జరిగిన విస్ఫోటనంలో దట్టమైన బూడిద ఉవ్వెత్తున్న ఎగసిపడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్ -
తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ కౌన్సిలింగ్ వాయిదా
-
హన్మకొండ జిల్లా కాజీపేటలో కారు ఆక్సిడెంట్..మహిళ అక్కడిక్కడే..!
-
ప్రధాన వార్తలు @9 October 2023 @ 5:00 PM
-
ఇందిరాపార్కు వద్ద ANMల ఉద్రిక్తత
-
ఇజ్రాయెల్ లోకి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు
-
మణిపూర్ మహిళల వీడియో కేసులో సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు
ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సుప్రీం కోర్టు ఈ కేసును చాలా సీరియస్ గా పరిగణించింది. సుప్రీం కోర్టులో అఫిడవిట్ నమోదైన రెండోరోజునే సీబీఐ ఈ కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. మహిళలపై అమానుష వైఖరిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఈ కేసును సీబీఐకు అప్పగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేసు సీబీఐకి అప్పగించి నిర్ణీత గడువులో విచారణ పూర్తయ్యేలా చూడాలని కోరింది. సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. శుక్రవారం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరగాల్సిన ఉండగా ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేని కారణంగా ట్రయల్ సాధ్యపడలేదు. అంతకుముందు జులై 20న జస్టిస్ చంద్ర చూడ్, పీఎస్ నారసింహ, మనోజ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ సంఘటన విచారణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు పురోగతి సాధించాయన్న దానిపై వివరణ కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రోద్బలంతో సిబిఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం కేసు విచారణలో ప్రాధాన్యత సంతరించుకుంది. Central Bureau of Investigation registers FIR in Manipur viral video case: CBI official pic.twitter.com/a1WdwYydyF — ANI (@ANI) July 29, 2023 మణిపూర్ అల్లర్లలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన తాలూకు వీడియో క్షణాల వ్యవధిలో అంతర్జాల మాధ్యమంలో దావానలంలా వ్యాపించి దేశమంతా కార్చిచ్చు రగిలించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగి ఉక్కిరిబిక్కిరి కావడంతో ఈ కేసును సీబిఐకి బదలాయించడం హర్షణీయం. ఈ కేసులో ఇప్పటికే మణిపూర్ పోలీస్ శాఖ ఏడుగురిని అరెస్టు చేసి రేప్, మర్డర్ అభియోగాయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: 11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు.. -
హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందూజా కన్నుమూత
SP Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందూజా కన్నుమూశారు. 87 ఏళ్ల వయసున్న ఎస్పీ హిందూజా అనారోగ్యం కారణంగా లండన్‌లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ‘హిందూజా కుటుంబ పెద్ద, హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందూజా బుధవారం (మే17) మృతి చెందారని తెలియజేస్తున్నందుకు చింతిస్తున్నాం’ అని హిందూజా కుటుంబ ప్రతినిధి అధికారికంగా తెలియజేశారు. ‘దివంగత పీడీ హిందూజా వ్యవస్థాపక సూత్రాలు, విలువలను కొనసాగించి ఎస్పీ హిందూజా మా కుటుంబానికి మార్గదర్శకుడిగా నిలిచారు. తాను ఉంటున్న యూకే, స్వదేశమైన భారత్‌ల మధ్య బలమైన సంబంధాన్ని నిర్మించడంలో తన సోదరులతో కలిసి చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు’ అని హిందూజా కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. సిరిచంద్ పరమానంద్ హిందూజా.. నలుగురు హిందూజా బ్రదర్స్‌లో పెద్దవాడు. హిందూజా గ్రూప్ సంస్థలకు చైర్మన్‌గా ఉన్న ఆయన లండన్‌లో ఉంటూ బ్రిటిష్ పౌరసత్వం పొందారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
పొంగులేటి,జూపల్లికి బిగ్ షాక్.. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్
-
Evening Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్‌ను అరెస్టు చేసిన ఈడీ శివసేన ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన కొద్ది గంటలకే అదుపులోకి తీసుకున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. రాష్ట్రపతి అంటే మర్యాద లేకుండా మాట్లాడారు.. స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాలి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి. గురువారం పార్లమెంటులో రాష్ట్రపతి అంటే గౌరవం లేకుండా ఆమె మాట్లాడారని ఆరోపించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. లోన్ యాప్స్ ఆగడాలపై పూర్తి స్థాయిలో నిఘా: ఏపీ డీజీపీ లోన్ యాప్స్ ఆగడాలపై లోతుగా విచారణ చేస్తున్నామని.. వీటిపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించిన నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అమెరికాలో మంకీపాక్స్ కలకలం... అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు అమెరికాలో మంకీపాక్స్ కలకలం సృష్టించింది. ఈ మేరకు అమెరికాలోని న్యూయార్క్ నగరం మంకీపాక్స్ వ్యాప్తికి కేంద్రంగా ఉందని, దాదాపు లక్ష మందికి పైగా ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మీరు ప్రాణాలతో ఉన్నారంటే ప్రధాని మోదీనే కారణం.. పాకిస్థాన్ పరిస్థితి చూడండి.. ప్రధాని నరేంద్రమోదీని ఆకాశానికి ఎత్తారు బిహార్ మంత్రి, బీజేపీ నేత రామ్ సూరత్ రాయ్. ప్రజలు ఇప్పుడు బతికున్నారంటే అది మోదీ చలవే అన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ తయారు చేసి, ప్రజలందరికీ ఉచితంగా టీకా డోసులు అందించి అందరి ప్రాణాలను ప్రధాని కాపాడారని పేర్కొన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆగస్ట్ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..! ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంపై ప్రభావం చూపేలా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఆగస్ట్ 1 నుంచి మారబోయే అంశాలేంటో తెలుసుకుందాం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. కోహ్లిని ఆసియాకప్‌కు ఎంపిక చేయకపోవచ్చు: పాక్ మాజీ ఆటగాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి సెంచరీ సాధించి మూడేళ్ల దాటిపోయింది. ఐపీఎల్లో నిరాశపరిచిన కోహ్లి.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలోనూ తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అనసూయ స్థానంలో కొత్త యాంకర్, ఎవరో తెలుసా? అనసూయ.. డేరింగ్ అండ్ డాషింగ్ యాంకర్.. అటు సినిమాలు చేసుకుంటూనే ఇటు బుల్లితెరపైనా పలు షోలతో అలరిస్తోంది. తనకు నచ్చినట్లుగా రెడీ అవుతూ ఎవరేమన్నా పట్టించుకోకుండా ముందుకెళ్లిందీ ముద్దుగుమ్మ. అయితే కొన్నేళ్లుగా యాంకర్‌గా కొనసాగుతున్న ఓ కామెడీ షోకు అనసూయ ఇటీవలే గుడ్‌బై చెప్పేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పిట్ట రెట్టలతోనూ ప్రమాదమే.. జర భద్రం..! గాలిలో, వాతావరణంలో, పరిసరాల్లో వ్యాపించే మనకు సరిపడని అనేక రేణువులూ, వాసనలూ, వస్తువులతో వచ్చే ఊపిరితిత్తుల సమస్యే ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్’. తాజాగా ఇప్పుడు తొలకరి కూడా మొదలైంది. దాంతో గడ్డి తడిసి ఒకరకమైన వాసన వచ్చే ఈ సీజన్లో ఈ ముప్పు మరింత ఎక్కువ. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Viral Video: వీల్‌చైర్‌లో ఫుడ్ డెలివరీ.. నెటిజన్ల ప్రశంసలు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు అధికమవ్వడంతో డెలివరీ బాయ్‌లు కూడా పెరిగిపోయారు. చాలా మంది యువత పార్ట్‌టైం జాబ్ కింద డెలివరీబాయ్‌లా పనిచేస్తూ ఆదాయాన్ని సృష్టించుకుంటున్నారు. తాజాగా వీల్‌చైర్‌లో కూర్చొని ఫుడ్ డెలివరీ చేస్తున్న ఓ దివ్యాంగుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. మంకీపాక్స్‌పై కేంద్రం అలర్ట్.. ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమావేశం దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. దీనిపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జరనల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరిగింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్: జైరాం రమేశ్ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్. బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా.. శనివారం ఓ జాతీయ ఛానల్లో మాట్లాడుతూ సోనియా గాంధీపై పరుషపదజాలన్ని ఉపయోగించడంపై మండిపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. నీరజ్ చోప్రాకు సీఎం జగన్ అభినందనలు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2022లో అద్వితీయ ప్రదర్శన కనబరిచి సిల్వర్ మెడల్ సాధించిన భారత జావెలిన్ స్టార్, ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్ నోయువర్ కస్టమర్) తప్పని సరి అయింది. ఈ ఏడాది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం అందజేసే రూ.2వేల చొప్పున ఏటా రూ.6వేలు జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘అప్పుడు అవహేళన చేశారు.. ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు’ సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో నెల్లూరు కస్తూరిబా కళాక్షేత్రంలో ‘థ్యాంక్యూ సీఎం సార్’ ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఒప్పందం చేసుకున్న మరుసటి రోజే ఒడెస్సా పోర్ట్‌పై రష్యా దాడులు ఆహార సంక్షోభాన్ని అడ్డుకునేందుకు నల్ల సముద్రం మీదుగా ఆహార ధాన్యాలను చేరవేసేలా రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అయితే.. ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఆ మరుసటి రోజే ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టుపై రష్యా క్షిపణులు విరుచుకుపడ్డాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. మగ బిడ్డకు జన్మనిచ్చిన కృనాల్ పాండ్యా భార్య పంఖురి శర్మ టీమిండియా ఆల్‌రౌండర్, హార్ధిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా తండ్రి అయ్యాడు. కృనాల్ భార్య పంఖురి శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కృనాల్ ఇవాళ (జులై 24) మధ్యాహ్నం ట్విటర్ వేదికగా రివీల్ చేశాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. నగ్నంగా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) సినిమాల మాట ఎలా ఉన్నా తన డ్రెస్సింగ్ స్టైల్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఇప్పటికే అతను వేసుకున్న డ్రెస్‌లపై నెటిజన్లు ఘోరమైన కామెంట్లు మీమ్స్ చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ప్రమాద ఘటనలో కుట్ర కోణం.. పోలీసులను ప్లాన్ ప్రకారమే చంపేశారా? పూతలపట్టు మండలం పి.కొత్తపేట రైల్వే అండర్ బిడ్జి వద్ద జరిగిన ప్రమాద ఘటనలో కుట్ర కోణం ఉందా?. స్కెచ్ ప్రకారం డ్రగ్స్ నిందితులే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఎస్ఐ అవినాష్, కానిస్టేబుల్ అనిల్, డ్రైవర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు వింత పెళ్లి సంప్రదాయాలు మీకోసం.. అయ్యో.. తప్పుగా అనుకోకండి. దక్షిణ కొరియాలోని పెళ్లి కొడుక్కి తప్పకుండా చేయాల్సిన మర్యాద ఇది. అంటే వధువు చెప్పుతో వరుడిని కొట్టడం కాదండీ! కట్టుకున్న భార్యను తనతోపాటు తీసుకెళ్లాలంటే వరుడు తన కాళ్లకున్న చెప్పులు తీసి.. అతని కుటుంబమో.. లేక అతని స్నేహితులతోనో తన అరికాళ్ల మీద కొట్టించుకోవాలి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈవెనింగ్ టాప్ 10 తెలుగు ట్రెండింగ్ న్యూస్
1. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష.. పలు కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించేందుకు వీలుగా ఏర్పాటు చేయనున్న డిజిటల్ డిస్ప్లేలకు సంబంధించి వివిధ కంపెనీలు ఉపకరణాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. తెలుగు సినిమాలకు అవార్డుల పంట కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్‌కు షాక్.. లిజ్ ట్రస్‌కే జై కొడుతున్న టోరీ సభ్యులు! బ్రిటన్ ప్రధాని రేసులో మొదటి ఐదు రౌండ్లలో రిషి సునాక్ తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. అత్యధికంగా 137 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆయనకే మద్దతుగా నిలిచారు. దీంతో రిషి సునాక్ ప్రధాని అవ్వడం ఖాయం అని అంతా భావించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శుక్రవారం కీలక ప్రకటన చేసింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే చేసి తీరుతామని ఉత్సవ సమితి చీఫ్ భగవంత్ రావు వెల్లడించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘గోదారమ్మ శాంతించింది కాబట్టే.. టీడీపీ నేతలు బతికి బయటపడ్డారు’ వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు చీప్ పాలిట్రిక్స్ చేద్దామని చూశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోదారమ్మకు చంద్రబాబు అంటే ఎందుకో ఆగ్రహం అంటూ ఎద్దేవా చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి రాజగోపాల్‌రెడ్డి! తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగలనుంది. పార్టీ మార్పుపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరికపై పరోక్షంగా సంకేతాలు అందించారు ఆయన. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఇంగ్లండ్‌లో క్రికెట్ గ్రౌండ్‌కు టీమిండియా దిగ్గజం పేరు.. చరిత్రలో తొలిసారి టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌లోని లీస్టర్‌షైర్ క్రికెట్ గ్రౌండ్‌కు 'గవాస్కర్ గ్రౌండ్'గా నామకరణం చేశారు. రిపోర్ట్స్ ప్రకారం ఇంగ్లండ్ లేదా యూరప్ గడ్డపై ఉన్న క్రికెట్ గ్రౌండ్‌కు ఒక ఇండియన్ క్రికెటర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ‘కలర్ ఫోటో’కు జాతీయ అవార్డు.. హీరో సుహాస్ ఏమన్నాడంటే.. కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించింది. జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. మూడు సినిమాలకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. నాట్యం సినిమాకు రెండు, కలర్ ఫోటో, అల వైకుంఠపురం సినిమాకు ఒక్కో అవార్డు లభించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. మోస్ట్ పవర్ఫుల్ హోండా 2023 సివిక్ టైప్-ఆర్ ఆవిష్కారం హోండా కొత్త సివిక్ వాహనాన్ని లాస్ ఏంజిల్స్‌లో గ్లోబల్‌గా ఆవిష్కరించింది. ‘హెండా సివిక్ టైప్-ఆర్ 2023’ను పరిచయం చేసింది. త్వరలోనే వీటి ధరలు, ఫీచర్లు వెలుగులోకి రానున్నాయి. 30 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత శక్తివంతమైన ఆర్ బ్రాండెడ్ మోడల్ అని హోండా వెల్లడించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈవెనింగ్ టాప్ 10 తెలుగు ట్రెండింగ్ న్యూస్
1. పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం: సీఎం జగన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేసీఆర్ కోరినట్లు తెలిపిన కేంద్ర గిరిజన సంక్షేమం, జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు.. కాళేశ్వరానికి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదని, అందుకే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేదని పేర్కొన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. విష ప్రచారం.. బురద జల్లడమే ‘ఈనాడు’ పని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేరుస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీలో పాలన కొనసాగుతోందన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ముగిసిన ఎంపీ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లోనూ ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్లో పది రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. 1,138 ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటి మొత్తం విలువ 1,49,575.. ఇందులో ద్రౌపది ముర్ముకు1,05,299 విలువగల 809 ఓట్లు. యశ్వంత్ సిన్హాకు 44,276 విలువ గల 329 ఓట్లు పడ్డాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. జో బైడెన్‌కు క్యాన్సరా? పొరపాటున నోరు జారారా లేక నిజమా? వైట్ హౌస్ క్లారిటీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకు క్యాన్సర్ ఉందని మాట్లాడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో చూసి అమెరికన్లు షాక్ అయ్యారు. ఆయన చెప్పింది నిజమా, లేక ఎప్పటిలాగే పొరపాటుగా నోరుజారారా? అని తెగ చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై శ్వేతసౌధం క్లారిటీ ఇచ్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. బీజేపీ నేతలకు మమత వార్నింగ్.. ‘ఇక్కడకు రావొద్దు రాయల్ బెంగాల్ టైగర్ ఉంది’ 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందని జోస్యం చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆ పార్టీకి మెజారిటీ రాదన్నారు. కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన అమరవీరుల దినోత్సవం కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. అరంగేట్రంలోనే అదుర్స్! 5 వికెట్లు.. ద్రవిడ్ తర్వాత ఆ ఘనత సైనీదే! కానీ.. టీమిండియా పేసర్ నవదీప్ సైనీ కౌంటీ చాంపియన్‌షిప్ ఎంట్రీలోనే అదరగొట్టాడు. కెంట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అరంగేట్రంలోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా కెంట్.. వార్విక్షైర్తో తలపడుతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పారిశుధ్య కార్మికులకు భారీ డిమాండ్..కిటికీ అద్దాలు తుడిస్తే చాలు ఏడాదికి కోటి రూపాయిల జీతం! శానిటైజేషన్ వర్క్‌ర్ల(పారిశుధ్య కార్మికులు)కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో ఆయా కంపెనీలు పోటీ పడి మరి భారీ ఎత్తున జీతాల్ని చెల్లిస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డాక్టర్లకు చెల్లించే జీతం కంటే ఎక్కువగానే ఆఫర్ చేస్తున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Netflix: ఓటీటీ స్ట్రీమింగ్కి రెడీ అవుతున్న నయన్-విఘ్నేశ్‌ల పెళ్లి వీడియో నయనతార, విఘ్నేశ్ శివన్‌లకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ షాకిచ్చిందని, వారి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ ఒప్పందాన్ని రద్దు చేసుకుందంటూ గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలు. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్ తాము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నయన్ దంపతులకు నోటీసులు కూడా ఇచ్చిందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లకు చెక్ పెట్టింది నెట్‌ఫ్లిక్స్. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆఫ్రికా నుంచి వచ్చిన భర్త.. ప్రియుడి మోజులో భార్య.. దూరంగా ఉండలేమని.. విశాఖలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి కోసం ఓ మహిళ.. భర్తనే చంపేసింది. 18 ఏళ్ల వయసున్న ప్రియుడితో కలిసి కుక్కర్‌తో కొట్టి హత్య చేసింది. విశాఖలోని మధురవాడలో బుడుమూరు మురళి కుటుంబం నివాసం ఉంటుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సాక్షి స్పీడ్ న్యూస్ @08:00 PM 20 జూలై 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ @07:30 PM 17 జూలై 2022
-
టాప్ 25 న్యూస్ @04:30 PM 17 జూలై 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ @07:30 PM 16 జూలై 2022
-
టాప్ 25 న్యూస్ @12:30 PM 14 జూలై 2022
-
టాప్ 25 న్యూస్ @7:30 AM 14 జూలై 2022
-
టాప్ 60 న్యూస్ @7:00 AM 14 జూలై 2022