
కృతీ సనన్
ముంబైలోని బ్రేకింగ్ న్యూస్‌లన్నీ తనకే ముందు తెలియాలనుకుంటున్నారు కృతీసనన్. ఎందుకంటే తన తర్వాతి చిత్రంలో మీడియా ప్రొఫెషనలిస్ట్‌గా నటించబోతున్నారామె. ‘పరజానియా’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న రాహుల్ ధోలాకియా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ వర్క్‌షాప్స్‌తో పాల్గొంటున్నారు కృతీసనన్. ‘‘ఒక మంచి ఫిమేల్ డ్రివెన్ సినిమా కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. రాహుల్‌గారు మంచి స్క్రిప్ట్ సమకూర్చారు. నా నెక్ట్స్ చిత్రంలో నేను మీడియా ప్రొఫెషనలిస్ట్‌గా నటించబోతున్నాను.ఆగస్టులో ఈ సినిమాను స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని కృతీ పేర్కొన్నారు. ఎక్కువభాగం ముంబైలో ఈ సినిమా షూటింగ్‌ను ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సౌత్ కొరియాకు చెందిన ఓ సంస్థ గ్రాఫిక్ వర్క్ చేయనుందట. ప్రస్తుతం ‘అర్జున్ పటియాలా, హౌస్‌ఫుల్4, పానిపట్’ సినిమాలతో ఫుల్‌బిజీగా ఉన్నారు కృతీ. అన్నట్లు ‘అర్జున్ పటియాలా’లో కూడా కృతీ న్యూస్ రిపోర్టరే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment