CBI Registers FIR In Manipur Viral Video Case After Centre Affidavit - Sakshi
Sakshi News home page

మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపు వీడియో కేసులో సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు 

Published Sat, Jul 29 2023 12:39 PM | Last Updated on Sat, Jul 29 2023 1:43 PM

CBI Registers FIR In Manipur Viral Video Case After Centre Affidavit  - Sakshi

ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సుప్రీం కోర్టు ఈ కేసును చాలా సీరియస్ గా పరిగణించింది. సుప్రీం కోర్టులో అఫిడవిట్ నమోదైన రెండోరోజునే సీబీఐ ఈ కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. 

మహిళలపై అమానుష వైఖరిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఈ కేసును సీబీఐకు అప్పగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్  దాఖలు చేసింది. కేసు సీబీఐకి అప్పగించి నిర్ణీత గడువులో విచారణ పూర్తయ్యేలా చూడాలని కోరింది. సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. 

శుక్రవారం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరగాల్సిన ఉండగా ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేని కారణంగా ట్రయల్ సాధ్యపడలేదు. అంతకుముందు జులై 20న జస్టిస్ చంద్ర చూడ్, పీఎస్ నారసింహ, మనోజ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ సంఘటన విచారణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు పురోగతి సాధించాయన్న దానిపై వివరణ కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రోద్బలంతో సిబిఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం కేసు విచారణలో ప్రాధాన్యత సంతరించుకుంది.  

మణిపూర్ అల్లర్లలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన తాలూకు వీడియో క్షణాల వ్యవధిలో అంతర్జాల మాధ్యమంలో   దావానలంలా వ్యాపించి దేశమంతా కార్చిచ్చు రగిలించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగి ఉక్కిరిబిక్కిరి కావడంతో ఈ కేసును సీబిఐకి బదలాయించడం హర్షణీయం. ఈ కేసులో ఇప్పటికే మణిపూర్ పోలీస్ శాఖ ఏడుగురిని అరెస్టు చేసి రేప్, మర్డర్ అభియోగాయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: 11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు..   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement