cbi fir
-
మణిపూర్ మహిళల వీడియో కేసులో సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు
ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సుప్రీం కోర్టు ఈ కేసును చాలా సీరియస్ గా పరిగణించింది. సుప్రీం కోర్టులో అఫిడవిట్ నమోదైన రెండోరోజునే సీబీఐ ఈ కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. మహిళలపై అమానుష వైఖరిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఈ కేసును సీబీఐకు అప్పగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేసు సీబీఐకి అప్పగించి నిర్ణీత గడువులో విచారణ పూర్తయ్యేలా చూడాలని కోరింది. సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. శుక్రవారం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరగాల్సిన ఉండగా ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేని కారణంగా ట్రయల్ సాధ్యపడలేదు. అంతకుముందు జులై 20న జస్టిస్ చంద్ర చూడ్, పీఎస్ నారసింహ, మనోజ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ సంఘటన విచారణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు పురోగతి సాధించాయన్న దానిపై వివరణ కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రోద్బలంతో సిబిఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం కేసు విచారణలో ప్రాధాన్యత సంతరించుకుంది. Central Bureau of Investigation registers FIR in Manipur viral video case: CBI official pic.twitter.com/a1WdwYydyF — ANI (@ANI) July 29, 2023 మణిపూర్ అల్లర్లలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన తాలూకు వీడియో క్షణాల వ్యవధిలో అంతర్జాల మాధ్యమంలో దావానలంలా వ్యాపించి దేశమంతా కార్చిచ్చు రగిలించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగి ఉక్కిరిబిక్కిరి కావడంతో ఈ కేసును సీబిఐకి బదలాయించడం హర్షణీయం. ఈ కేసులో ఇప్పటికే మణిపూర్ పోలీస్ శాఖ ఏడుగురిని అరెస్టు చేసి రేప్, మర్డర్ అభియోగాయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: 11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు.. -
ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు.. విచారణకు రాను!: కవిత
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘సీబీఐ తన వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ని క్షుణ్ణంగా పరిశీలించాను, అందులో పేర్కొన్న నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలో నా పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నాను.’ అని పేర్కొన్నారు కవిత. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దానికి స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్సైట్లో ఉందని సమాధానమిచ్చారు. దాంతో తాను ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీనా తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు. తేదీని ఖరారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత పునరుద్ఘాటించారు. దర్యాప్తునకు సహకరించడానికిగానూ పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని లేఖలో తెలిపారు. ఇదీ చదవండి: సీబీఐ స్పందన తర్వాతే..! -
నేడు హైకోర్టుకు హాథ్రస్ బాధిత కుటుంబం
లక్నో/హాథ్రస్: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో కామాంధుల రాక్షసత్వానికి ప్రాణాలు కోల్పోయిన దళిత యువతి కుటుంబ స భ్యులు సోమవారం అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ముందు హాజరు కానున్నారు. పటిష్టమైన భద్రత మధ్య వారిని న్యాయస్థానానికి తీసుకెళ్లేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. యువతిపై అత్యాచారం, హత్య కేసు లో బాధిత కుటుంబ సభ్యుల వాదనను కోర్టు నమోదు చేయనుంది. జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ రంజన్ రాయ్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును సోమవారం విచారించనుంది. ధర్మాసనం ముందు హాజరు కావాలని యూపీ అదనపు చీఫ్ సెక్రెటరీ(హోం), డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీని సైతం హైకోర్టు ఆదేశించింది. ప్రభు త్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వీకే సాహిని హాజరుకానున్నారు. రంగంలోకి దిగిన సీబీఐ.. హాథ్రస్ ఘటనను విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. ఆదివారం ఉదయం సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సామూహిక అత్యాచారం, హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసింది. సీబీఐ ఘజియాబాద్‌కు చెందిన ప్రత్యేక టీమ్ ఈ కేసును విచారిస్తుందని అధికారులు తెలిపారు. -
కర్ణాటక మంత్రిపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: కర్ణాటకకు చెందిన డిప్యూటీ ఎస్పీ ఎంకే గణపతి అనుమానాస్పద మృతి కేసులో ఆ రాష్ట్ర మంత్రి కేజే జార్జ్, మరో ఇద్దరు మాజీ పోలీసు అధికారులను సీబీఐ ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చింది. గణపతి గతేడాది జూలై 7న చనిపోయారు. జార్జ్, మాజీ ఐజీపీ (లోకాయుక్త) ప్రణవ్ మొహంతీ, మాజీ అదనపు డీజీపీ ఏఎం ప్రసాద్‌లు తనను వేధిస్తున్నారనీ, తనకేమైనా జరిగితే అందుకు వారిదే బాధ్యతని మరణించడానికి ముందు గణపతి చెబుతుండేవారు. అనుమానాస్పద పరిస్థితుల్లో గణపతి మృతి చెందిన అనంతరం ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన తండ్రి హైకోర్టును ఆశ్రయించగా కోర్టు తిరస్కరించింది. దీనిని సవాల్ చేస్తూ గణపతి తండ్రి సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. తాజాగా సీబీఐ తన ఎఫ్ఐఆర్లో జార్జ్‌తోపాటు అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. -
13 మంది తృణమూల్ నేతలపై సీబీఐ కేసు
నారదా స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో 13 మంది తృణమూల్ కాంగ్రెస్ నేతలపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. వారిలో పార్టీ సీనియర్ నాయకులు సౌగత రాయ్, ముకుల్ రాయ్, మదన్ మిత్రా సహా పలువురు ఉన్నారు. నెలరోజుల్లోగా ఈ కేసు విషయం తేల్చాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ గడువు సోమవారంతో ముగుస్తుండటంతో సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. పలువురు తృణమూల్ మంత్రులు, ఎంపీలు అవినీతి నిరోధక చట్టం కింద నేరం చేశారని, దాంతోపాటు కుట్రలకు కూడా పాల్పడ్డారని ఈ కేసులో పేర్కొన్నారు. నారదా చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ తాలుకు వీడియో ఫుటేజిని కూడా సీబీఐ క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ కేసులో ఇంకా.. సుల్తాన్ అహ్మద్, ఇక్బాల్ అహ్మద్, కకోలి ఘోష్, ప్రసూన్ బెనర్జీ, సుశేందు అధికారి, సోవన్ చటర్జీ, సుబ్రత ముఖర్జీ, సయ్యద్ హుస్సేన్ మీర్జా, ఫిర్హాద్ హకీమ్ తదితరులున్నారు. చిట్‌ఫండ్ స్కాంతో సంబంధం ఉన్న ఇద్దరు ఎంపీలు సుదీప్ బెనర్జీ, తపస్ పాల్ ఇప్పటికే సీబీఐ అదుపులో ఉన్నారు. తృణమూల్ నాయకులు తమ పదవులను అడ్డుపెట్టుకుని లంచాలు తీసుకున్నారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని సీబీఐ అధికారులు తెలిపారు. త్వరలోనే వారిని ప్రశ్నిస్తామన్నారు. ఈ కేసును పూర్తిగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తారు. స్టింగ్ ఆపరేషన్ సమయంలో వాళ్లు డబ్బులు ఇచ్చిన నారద న్యూస్ ప్రతినిధి మాథ్యూ శామ్యూల్‌ను ఇప్పటికే సీబీఐ ప్రశ్నించింది. -
సిండికేట్ బ్యాంక్ స్కామ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్
వెయ్యి కోట్ల ఫ్రాడ్‌పై బ్యాంకు శాఖల్లో సోదాలు న్యూఢిల్లీ: దాదాపు రూ. 1,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి సిండికేట్ బ్యాంక్ శాఖల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. జైపూర్, ఢిల్లీ ఎన్సీఆర్, ఉదయ్‌పూర్‌లోని పది చోట్ల సోదాలు జరిపిన సీబీఐ అయిదుగురు అధికారులు, నలుగురు వ్యాపారవేత్తలపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. బ్యాంక్ సిబ్బందితో కుమ్మక్కై రాజస్తాన్‌లో సిండికేట్ బ్యాంక్‌కి చెందిన మూడు శాఖల్లో వీరు ఏకంగా 386 ఖాతాలు తెరిచారని ... నకిలీ చెక్కులు, లెటర్ ఆఫ్ క్రెడిట్లు, ఎల్ఐసీ పాలసీలతో రూ. 1,000 కోట్ల మోసానికి పాల్పడ్డారని అభియోగాలు చేసింది. 2011-16 మధ్య కాలంలో చోటుచేసుకున్న ఈ అవకతవకలు బ్యాంక్ సిబ్బంది సహకారం లేకుండా సాధ్యపడేవి కావని సీబీఐ వర్గాలు తెలిపాయి. వ్యాపారవేత్తలు నకిలీ చెక్కులు డిపాజిట్ చే సి, ఆ తర్వాత వాటిని డిస్కౌంటింగ్పై క్యాష్ చేసుకునేవారని (ఉదాహరణకు చెక్కు విలువ రూ. 100 అయితే, డిస్కౌంటు పోగా తక్షణం రూ.90 చేతికి వస్తుంది) వివరించాయి. ఎక్కువగా రూ. 2.5 కోట్ల నుంచి రూ. 4 కోట్ల విలువ చేసే చెక్కులు జమయ్యేవని సీబీఐ వర్గాలు తెలిపాయి. సీబీఐ సోదాల దరిమిలా బుధవారం ఎన్ఎస్ఈలో సిండికేట్ బ్యాంక్ షేరు ధర 1.78 శాతం క్షీణించి రూ. 60.75 వద్ద ముగిసింది. -
ఎందుకు రాజీనామా చేయలేదు?: మేకపాటి
సబ్బం హరికి వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి సూటిప్రశ్న సబ్బంహరి చెబుతున్నవన్నీ అవాస్తవాలే సీబీఐ ఎఫ్ఐఆర్లో వైఎస్ పేరును చేర్చినందుకు నిరసనగా రాజీనామా చేస్తానన్నారు ఢిల్లీకి వెళ్లాక మాత్రం ఏ కారణాల వల్లో రాజీనామా లేఖ ఇవ్వలేదు జగన్ లక్ష్యంగా కుట్ర జరుగుతోంది సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చినందుకు నిరసనగా తనతో పాటు ఎంపీ సబ్బం హరి కూడా రాజీనామా చేయాలని భావించారని.. కానీ, ఏ కారణాల వల్లోగానీ ఢిల్లీ వెళ్లిన తర్వాత ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కో-ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణతో కలిసి మేకపాటి సోమవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. 2011 ఆగస్టు 11న సీబీఐ వైఎస్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చినందుకు నిరసనగా.. తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించి ఢిల్లీ వెళ్లామన్నారు. సబ్బంహరి మొదట తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా పంపించారని.. తర్వాత రాజీనామాను నేరుగా స్పీకర్‌కు సమర్పించేందుకు ఆగస్టు 24న ఢిల్లీకి తనతో కలిసి వచ్చాడని, తాను మాత్రమే లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇవ్వగా సబ్బంహరి ఇవ్వలేదని చెప్పారు. సబ్బంహరి తమకు పాత మిత్రుడని, ఈ రోజుకూ మిత్రుడేనని... అయితే ఆయన జగన్మోహన్రెడ్డిపై ఎందుకు విషం కక్కుతున్నారో అర్థం కావడం లేదని మేకపాటి పేర్కొన్నారు. సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ ఏడు లక్షలకు పడిపోయిందని సబ్బంహరి చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదని.. ఏబీసీ (ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్) వివరాల ప్రకారం సాక్షి పత్రిక సర్క్యులేషన్ 12,50,664 అని మేకపాటి వెల్లడించారు. దీన్ని బట్టి సబ్బంహరి చెబుతున్నవాటిలో వాస్తవమెంతో తెలుస్తోందన్నారు. అప్పట్లో డిసెంబర్ 20న ఒకసారి, తర్వాత ఫిబ్రవరి 25, 26 తేదీల తర్వాత కూడా రాజీనామా విషయంలో స్పీకర్ తనను వివరణ కోరగా... తన వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేశానని, దాంతో రాజీనామాను ఆమోదించారని మేకపాటి చెప్పారు. రాజీనామా ఇచ్చిన రోజు నుంచీ తాను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ సమావేశాలకు కూడా హాజరు కాలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చి ఏఐసీసీ సమావేశాలకు హాజరై డ్రామాలు చేస్తున్నట్లుగా తాను చేయలేదన్నారు. జగన్‌పై కుట్ర.. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజిస్తున్న కాంగ్రెస్, తెలంగాణ ఏర్పాటుకు లేఖ ఇచ్చిన టీడీపీల నేతలు కలిసి... సమైక్యం కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కుట్ర చేస్తున్నారని మేక పాటి దుయ్యబట్టారు. జగన్ విభజన వాది అంటూ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మబోరని, జగన్ గ్రాఫ్ ప్రజల్లో ఏమాత్రం తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. ఇది తాను ప్రజల్లో పర్యటించి వచ్చి చెబుతున్న మాట అని, ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించడానికి కంకణబద్ధులై ఉన్నారని చెప్పారు. జగన్‌పై ప్రజల్లో ఉన్న అభిమానం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి తిరునాళ్లుగా మారుతుందన్నారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగే అవకాశముంది కనుక తెలంగాణలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ చెప్పుకోదగిన సంఖ్యలో సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు.