న్యూఢిల్లీ: ఏప్రిల్ 1న ఫూల్స్‌డే సందర్భంగా ప్రధాని మోదీ వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యంగా స్పందించింది. బ్రేకింగ్ న్యూస్ పేరిట 70 సెకన్ల నిడివి గల ఆ వీడియోలో ‘నోట్ల రద్దుతో దేశంలో అవినీతి అంతమైంది. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకున్న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను ఊడ్చేశారు. మోదీ 200 కోట్ల ఉద్యోగాలను సృష్టించారు.
దీంతో ప్రస్తుతం అరుణగ్రహంపై ఉన్న గ్రహాంతరవాసులూ భారత్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కేంద్రం కట్టిన స్మార్ట్ నగరాలను శుభ్రం చేయడానికి ఇప్పుడు రోబోలనే ఉపయోగిస్తున్నారు. గంగా నదీ ఎంత స్వచ్ఛంగా మారిందంటే అందులోకి తొంగిచూస్తే మీకు మోదీ ముఖం కన్పిస్తుంది’ అని వెటకారమాడింది. ప్రతి భారతీయుని బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ అయినా.. నగదు మాత్రం సున్నాగా కన్పిస్తోందని ఎద్దేవా చేసింది. కాగా, కాంగ్రెస్ పార్టీ విమర్శల్ని తిప్పికొట్టిన బీజేపీ ఫూల్స్ డేను పప్పూ దివస్‌గా అభివర్ణించింది.
Comments
Please login to add a commentAdd a comment