fools day
-
ఇలాంటి ఏప్రిల్ ఫూల్‌ని ఎక్కడా చూసుండరు
ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్.. ఫూల్స్ డే. చిన్న చిన్న అబద్ధాలు చెప్పి స్నేహితులను ఫూల్స్ చేసి తెగ సంబరపడతాం. ఈ రోజు ఫూల్స్ డే అని మనకు తెలుసు కనక.. సరదగా ఆటపట్టిస్తాం. మరి ఈ పిట్టకు ఈ రోజు ఫూల్స్ డే అని తెలిసి ఇలా చేసిందో.. లేక ప్రాణం కాపాడుకునే ప్రయత్నమో తెలియదు కానీ ఏకంగా పిల్లితోనే ప్రాంక్ చేసింది. సమయం చూసుకుని తుర్రుమని ఎగిరిపోయింది. పిట్ట తెలివికి అవాక్కయిన పిల్లి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అది విఫలమయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో కడుపుబ్బ నవ్వించడం ఖాయం. ఏప్రిల్ ఫూల్ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో పిల్లి కాళ్ల కింద ఓ పిట్ట వుంటుంది. చూడ్డానికి అది మరణించనట్లు ఉంటుంది. దాంతో పిల్లి దాన్ని నేల మీద అటూ ఇటూ దొర్లిస్తూ ఆడుతూ ఉంటుంది. సమయం చూసుకుని ఆ పిట్ట ఒక్క ఉదుటున అక్కడ నుంచి తుర్రుమంటుంది. ఊహించని ఈ ఘటనకు షాక్ తిన్న పిల్లి.. పిట్టను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది.. కానీ అప్పటికే అది అందనంత దూరం వెళ్లి పోతుంది. April fool😊 pic.twitter.com/2lbUAkhzP1 — Susanta Nanda IFS (@susantananda3) April 1, 2021 ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు పిట్ట తెలివిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఇది మన కంటే స్మార్ట్.. తెలివైన పిట్ట గెలిచింది.. అతి విశ్వాసం ఉన్న పిల్లి ఓడింది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: పులా.. పిల్లా.. ఎందుకిలా చేస్తోంది? -
గ్రహాంతరవాసులకూ ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఏప్రిల్ 1న ఫూల్స్డే సందర్భంగా ప్రధాని మోదీ వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యంగా స్పందించింది. బ్రేకింగ్ న్యూస్ పేరిట 70 సెకన్ల నిడివి గల ఆ వీడియోలో ‘నోట్ల రద్దుతో దేశంలో అవినీతి అంతమైంది. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకున్న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను ఊడ్చేశారు. మోదీ 200 కోట్ల ఉద్యోగాలను సృష్టించారు. దీంతో ప్రస్తుతం అరుణగ్రహంపై ఉన్న గ్రహాంతరవాసులూ భారత్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కేంద్రం కట్టిన స్మార్ట్ నగరాలను శుభ్రం చేయడానికి ఇప్పుడు రోబోలనే ఉపయోగిస్తున్నారు. గంగా నదీ ఎంత స్వచ్ఛంగా మారిందంటే అందులోకి తొంగిచూస్తే మీకు మోదీ ముఖం కన్పిస్తుంది’ అని వెటకారమాడింది. ప్రతి భారతీయుని బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ అయినా.. నగదు మాత్రం సున్నాగా కన్పిస్తోందని ఎద్దేవా చేసింది. కాగా, కాంగ్రెస్ పార్టీ విమర్శల్ని తిప్పికొట్టిన బీజేపీ ఫూల్స్ డేను పప్పూ దివస్‌గా అభివర్ణించింది. -
ఫూల్స్ డే
ఏప్రిల్ ఫస్ట్.. ఫూల్స్డే! ప్రాక్టికల్ జోక్స్‌తో ఫ్రెండ్స్‌ని ఫూల్స్ చేస్తాం. లేదంటే ఎవరో ఒకరి చేతిలో ఫూల్స్ అవుతాం. కానీ చిన్నచిన్న మిస్టేక్స్తో, మన బిహేవియర్‌తో మనల్ని మనమే ఫూల్స్‌ని చేసుకుంటున్న సందర్భాలు సిటీలో నిత్యకృత్యమవుతూనే ఉన్నాయి. ‘మెట్రో సిటిజన్’గా మనమెంత హుందాగా ఉంటున్నాం? మన డిసిప్లేన్ ఎలా ఉందో ఒక్కసారి రివ్యూ చేసుకుంటే.. ..:: కేకే చెత్తకుండీ దాకా వెళ్తాం. చెత్తను కుండీలో కాకుండా బయట పడేస్తాం. చెత్త ఎత్తేవాళ్లకు ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని మరుస్తాం. ట్రాఫిక్ సిగ్నల్ జంప్‌చేస్తే ఎదురుగా వచ్చేవారికి ఇబ్బంది. అయినా పట్టించుకోం. ‘ఎదురే నాకు లేదు.. నన్నెవరూ ఆపలేరు’ అని ఈల వేసుకుంటూ బ్రేక్ వేయకుండా దూసుకెళ్తాం. రూల్స్ బ్రేక్ చేయడమే ట్రెండ్ అనుకుంటాం. నియమాలు పాటించక నగరవాసులు జరిమానాగా ఏటా రూ. కోట్లాది రూపాయలు చెల్లించడమే ఇందుకు నిదర్శనం. రోడ్డు దాటే పిల్లలు, వృద్ధులకోసం... కాసేపు ఆగాలన్న ఆలోచన రాదు. నా దారి రహదారి అనుకుంటూ ముందుకు పోతాం. ‘డోంట్ స్ప్లిట్ హియర్’ అని ఉన్న దగ్గరే ఉమ్మి వస్తుంది. రాసి ఉన్నది చదివి మరీ ఉమ్మేస్తాం. బస్సులోనో, ఇతర వెహికిల్స్లోనో వెళ్తూ పక్కన ఉన్నవారిని పట్టించుకోం. అంతేనా... గవర్నమెంట్ ఆఫీసులు, ఆస్పత్రుల పరిస్థితి చెప్పక్కర్లేదు. స్టెప్స్ ఎక్కే దగ్గర మూలల్లో ఎర్రని రంగేస్తాం. ఇక పార్కుల పరిస్థితి మరీ అధ్వాన్నం. ‘యూజ్మీ’ అంటూ డస్ట్‌బిన్ నోరెళ్లబెట్టి చూస్తున్నా... మన చేతిలోని చెత్తమాత్రం లాన్‌లోనే పడుతుంది!. స్కూల్, హాస్పిటల్ జోన్లలో హారన్ కొట్టకూడదన్న నిబంధన ఉంది. అయినా ధిక్కరిస్తాం. మనం ఉల్లంఘనులమని ఘంటా బజాయించి మరీ చాటుతాం! ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ‘బ్రాండ్ హైదరాబాద్’ను క్రియేట్ చేసే దిశగా పయనిస్తున్న మనం.. కనీసం స్ట్రీట్స్‌ను నీట్‌గా ఉంచుకోలేకపోతున్నాం. తెలిసీ.. తెలియక చేస్తున్న పొరపాట్లు మనల్ని చిన్నబుచ్చుతాయి. ఈ ఫూల్స్డే నుంచైనా ఇటువంటి వాటికి గుడ్‌బై చెబుదాం!