ఇలాంటి ఏప్రిల్‌ ఫూల్‌ని ఎక్కడా చూసుండరు | Smart Bird Pranks Cat Funny Video Goes Viral on April Fools Day | Sakshi
Sakshi News home page

ఇలాంటి ఏప్రిల్‌ ఫూల్‌ని ఎక్కడా చూసుండరు

Published Thu, Apr 1 2021 8:10 PM | Last Updated on Thu, Apr 1 2021 8:11 PM

Smart Bird Pranks Cat Funny Video Goes Viral on April Fools Day - Sakshi

ఈ రోజు ఏప్రిల్‌ ఫస్ట్‌.. ఫూల్స్‌ డే. చిన్న చిన్న అబద్ధాలు చెప్పి స్నేహితులను ఫూల్స్‌ చేసి తెగ సంబరపడతాం. ఈ రోజు ఫూల్స్‌ డే అని మనకు తెలుసు కనక.. సరదగా ఆటపట్టిస్తాం. మరి ఈ పిట్టకు ఈ రోజు ఫూల్స్‌ డే అని తెలిసి ఇలా చేసిందో.. లేక ప్రాణం కాపాడుకునే ప్రయత్నమో తెలియదు కానీ ఏకంగా పిల్లితోనే ప్రాంక్‌ చేసింది. సమయం చూసుకుని తుర్రుమని ఎగిరిపోయింది. పిట్ట తెలివికి అవాక్కయిన పిల్లి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అది విఫలమయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. 

ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో కడుపుబ్బ నవ్వించడం ఖాయం. ఏప్రిల్‌ ఫూల్‌ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియోలో పిల్లి కాళ్ల కింద ఓ పిట్ట వుంటుంది. చూడ్డానికి అది మరణించనట్లు ఉంటుంది. దాంతో పిల్లి దాన్ని నేల మీద అటూ ఇటూ దొర్లిస్తూ ఆడుతూ ఉంటుంది. సమయం చూసుకుని ఆ పిట్ట ఒక్క ఉదుటున అక్కడ నుంచి తుర్రుమంటుంది. ఊహించని ఈ ఘటనకు షాక్‌ తిన్న పిల్లి.. పిట్టను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది.. కానీ అప్పటికే అది అందనంత దూరం వెళ్లి పోతుంది. 

ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు పిట్ట తెలివిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఇది మన కంటే స్మార్ట్‌.. తెలివైన పిట్ట గెలిచింది.. అతి విశ్వాసం ఉన్న పిల్లి ఓడింది అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.

చదవండి: పులా.. పిల్లా.. ఎందుకిలా చేస్తోంది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement