sparrow
-
నీ కోసం కథలు రాసి
‘ఇంటి మూలన వంట గది’ ‘అడవిలో హరిణి’ ‘సంధ్య వెలుతురు’... సి.ఎస్.లక్ష్మి అనే చిత్తూరు సుబ్రహ్మణ్యం లక్ష్మి కథల సంపుటాల పేర్లు ఇవి. ‘అంబై’ కలం పేరుతో తమిళంలో స్త్రీల పారంపరిక బంధనాలను ప్రశ్నించే కథలు రాస్తున్న సి.ఎస్.లక్ష్మికి ప్రతిష్టాత్మక ‘టాటా లిటరేచర్ లైఫ్‌టైమ్ అవార్డు’ ఈ సంవత్సరానికి ప్రకటించారు. ‘స్పారో’ అనే సంస్థను స్థాపించి మహిళా సాహిత్యకారుల చరిత్రను నిక్షిప్తం చేస్తున్న లక్ష్మి పరిచయం... ఆలోచనలు... ‘నన్ను మహిళా రచయిత అని ప్రత్యేకంగా పిలవొద్దు. పురుషులు ఏం రాసినా వారిని పురుష రచయిత అంటున్నారా? మమ్మల్ని మాత్రం మహిళా రచయితలు అనడం ఎందుకు? మమ్మల్ని కూడా రచయితలు అనే పిలవండి’ అంటారు సి.ఎస్.లక్ష్మి. ‘అంబై’ కలం పేరుతో తమిళ పాఠకులకు సుదీర్ఘకాలంగా అభిమాన రచయిత్రిగా ఉన్న సి.ఎస్.లక్ష్మి ఒకటీ రెండు నవలలు రాసినా ఎక్కువగా అంకితమైంది కథలకే. అదీ స్త్రీల కథలకి. తమిళంలో స్త్రీవాద దృక్పథంతో రాసి ఒక కదలిక తేగలిగిన రచయితల్లో సి.ఎస్.లక్ష్మి ప్రముఖులు. సుదీర్ఘ కాలంగా తాను ఆశించిన స్త్రీ వికాసం కోసం కలాన్ని అంకితం చేయడం వల్లే ఆమెకు ‘టాటా లిటరేచర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ 2023 సంవత్సరానికి ప్రకటించారు. టాటా సన్స్ ప్రతినిధి హరీష్ భట్ ఈ విషయాన్ని తెలియచేస్తూ ‘స్త్రీలు తాము మోయక తప్పని మూసలను లక్ష్మి తన కథల ద్వారా బద్దలు కొడుతూనే వచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును గతంలో అందుకున్న వారిలో వి.ఎస్.నైపాల్, మహాశ్వేతా దేవి, రస్కిన్ బాండ్, గిరిష్ కర్నాడ్ తదితరులు ఉన్నారు. ఊరు కోయంబత్తూరు కోయంబత్తూరులో జన్మించిన అంబై ఢిల్లీలోని జె.ఎన్.యు నుంచి పిహెచ్.డి పట్టా పొందారు. తమిళనాడులో అధ్యాపకురాలిగా పని చేస్తూ కథలు రాశారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ విష్ణు మాథూర్‌ని వివాహం చేసుకుని తర్వాతి కాలంలో ముంబైలో స్థిరపడ్డారు. 18 ఏళ్ల వయసులో తొలిసారి పిల్లల కోసం ‘నందిమలై చరలిలె’ (నందిమల కొండల్లో) అనే డిటెక్టివ్ నవలతో ఆమె రచనా జీవితం మొదలైనా 1967లో రాసిన ‘సిరగుగల్ మురియుమ్’(రెక్కలు విరిగిపోతాయి) అనే కథతో సిసలైన బాట పట్టారు. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, స్త్రీవాద దృక్పథం గురించి తమిళంలో తొలిసారి గొంతు విప్పిన రచయిత్రి ఆమేనని విమర్శకులు అంటారు. సంప్రదాయం, ఆచారాలు మహిళల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అణచివేస్తున్నాయో ఆమె తన కథల్లో వివరించే ప్రయత్నం చేశారు. తప్పక చదవాల్సిన తమిళ కథల్లో అంబై రాసిన ‘వీట్టిన్ మూలై ఒరు సమేలరై’, ‘అమ్మా ఒరు కొలై సెయ్దల్’, ‘కరుప్పు కుదిరై చతుక్కుమ్’ కథలు ఉంటాయని రచయిత జయమోహన్ పేర్కొన్నారు. 2021లో అంబైకు సాహిత్య అకాడెమీ పురస్కారం దక్కింది. కలం పేరు వెనుక కథ తన కలం పేరు ‘అంబై’గా మార్చుకోవడానికి వెనకున్న కథను గతంలో వెల్లడించారామె. శుక్రవారం పుట్టే ఆడపిల్లలకు ‘లక్ష్మి’ అనే పేరు పెడతారని, తనకూ అదే పేరు పెడితే ఆ పేరుతోనే కథలు రాయాలపించలేదని చెప్పారు. తమిళ సీనియర్ రచయిత దేవన్ రాసిన ‘పార్వతిన్ సంగల్పం (పార్వతి సంకల్పం)’ నవలలో భర్త చేత అణచివేతకు గురైన ఓ భార్య తన పేరును అంబైగా మార్చుకొని రాయడం మొదలు పెడుతుందని, అదే తనకు స్ఫూర్తినిచ్చి కలం పేరును అంబైగా మార్చుకున్నానని తెలిపారు. సాహితీ కార్యకర్త సి.ఎస్.లక్ష్మి కేవలం రాయడమే కాదు చాలా సాహితీ కార్యక్రమాలు చేస్తారు. తమిళంలో మహిళా సాహిత్యం గురించి ఆమె చేసిన పరిశోధన ముఖ్యమైనది. 1994లో చెన్నైలో స్థాపించిన రోజ ముత్తయ్య రీసెర్చ్ లైబ్రరీ ఏర్పాటు వెనుక అంబై కీలకంగా నిలిచారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రైవేటు లైబ్రరీల్లో ఇదీ ఒకటి కావడం విశేషం. ప్రస్తుతం ఇక్కడ మూడు లక్షల పుస్తకాల దాకా ఉన్నాయి. అలాగే 1988లో SPARROW (Sound and Picture Archives for Research on Women) అనే ఎన్జీవో ప్రారంభించారు. మహిళా రచయితలు, మహిళా కళాకారుల రచనలు, ప్రతిభ, వారి కృషిని డాక్యుమెంట్ చేయడం, నిక్షిప్తం చేయడం ఆ సంస్థ లక్ష్యం. ప్రస్తుతం ఆమె ఆ సంస్థకు అధ్యక్షురాలిగా ఉన్నారు. తన సంస్థ తరఫున అనేక పుస్తకాలు ప్రచురించారు. -
World Sparrow Day 2023: పిచ్చుకల జీవిత కాలమెంతో తెలుసా?
వేకువ జామున కిలకిలారావాలతో మేలుకొలుపు పాడే పిచ్చుకలను చూస్తే మనసుకు కాసింత హాయి.. చూరుకు వేలాడదీసిన వరి కంకులు తింటూ ‘కిచ కిచ’ మంటూ గోల చేసే చిట్టి పిట్టలు కలిగించే ఉత్సాహం మాటల్లో చెప్పలేం.! ఇసుక, మట్టిలో పొర్లాడే దృశ్యాలు.. అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోతూ పిట్టలు సందడి చేసిన క్షణాలు ఎంతో మందికి తీపి జ్ఞాపకాలు. మనిషికి దగ్గరగా ఉంటూ మన కుటుంబంలో ఒకరుగా ఉన్న పిచ్చుకలు.. మానవజాతి చేస్తున్న తప్పిదాలకు బలైపోతున్నాయి. ప్రపంచంలో వేగంగా అంతరిస్తున్న పక్షుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న పిచ్చుకలను రక్షించుకోకపోతే జీవవైవిధ్యానికి పెనుముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయి. నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా వాటి విశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. పూర్వం మధ్యదరా ప్రాంతంలో ఆవాసముండే పిచ్చుకలు కాలక్రమంలో ప్రపంచమంతటా విస్తరించాయి. అడవుల్లో కాకుండా మానవులకు దగ్గరగా ఉండేందుకే అవి ఇష్టపడతాయి. గూడుకు ముప్పు వస్తుందనుకుంటే ఇతర జాతుల పక్షులపై దాడి చేసేందుకూ వెనుకాడవు. మగ, ఆడ పిచ్చుకలు అదే వర్గానికి చెందిన పక్షులపై మాత్రమే దాడి చేయడం ఇక్కడ విశేషం. ►65 ఏళ్ల క్రితం అంటే 1958లో చైనా పాలకుడు మావో జెడాంగ్ పిచ్చుకలపై బ్రహ్మస్త్రం సంధించాడు. పంటలు నాశనం చేస్తున్నాయనే నెపంతో లక్షల సంఖ్యలో పిట్టలను కాల్చిపడేయించాడు. పంటల వద్ద పళ్లేలతో చైనీయులు చేసిన శబ్ధాల ధాటికి పిచ్చుకలు బతుకుజీవుడా అనుకుంటూ దూరంగా వెళ్లి తలదాచుకున్నాయి. ►ఆ తర్వాత పంటలను చీడపీడలు ఆశించడంతో తిండిగింజలు కరువయ్యాయి. రెండేళ్లలోనే తాము చేసిన తప్పు చైనీయులకు తెలిసొచ్చింది. పిట్టలు బతికుంటేనే పంటకు రక్ష అని గుర్తించిన చైనీయులు వాటిని సంరక్షించడం మొదలుపెట్టారు. జీవవైవిధ్యానికి పిచ్చుకలు ఎంతలా దోహదపడతాయో తెలిపేందుకు ఇదొక ఉదాహరణ. ఖండాలు దాటి వచ్చే చిన్ని పిచ్చుక.. ►చూడటానికి పిచ్చుకల్లా ఉండే ఈ పక్షులు ఏటా శీతాకాలంలో పశ్చిమ దేశాల నుంచి నల్లమల అభయారణ్యానికి లక్షల సంఖ్యలో వలస వస్తుంటాయి. వీటితోపాటు వలస వచ్చే హారియర్స్ అనే గద్ద జాతి పక్షులు గ్రేటర్ షార్ట్ టోడ్ లార్క్లను వేటాడి తింటాయి. ►పిచ్చుకలు అంతరించిపోతుండటానికి కారణాలు అనేకం. భూతాపోన్నతి నుంచి రక్షణ కోసం మానవ జాతి వినియోగిస్తున్న అన్లెడెడ్ పెట్రోల్ అందులో ఒకటి. ఈ పెట్రోల్‌ను మండించినప్పుడు విడుదలయ్యే మిౖథెల్ నైట్రేట్.. చాలారకాల క్రిమికీటకాలకు విషంలా మారుతోందని, ఫలితంగా పిచ్చుకలకు ఆహారం దొరకకుండా పోతోందని ఆర్నితాలజిస్టులు(పక్షి శాస్త్రవేత్తలు) తమ పరిశోధనల ద్వారా గుర్తించారు. ►పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణ శైలి మారడంతో పిచ్చుకలకు గూళ్లు కట్టుకునే అవకాశాలు తగ్గాయి. పెరటి తోటలు అంతంతమాత్రంగా ఉండటం, వాహనాల రణగొణధ్వనులు, సెల్ టవర్ల రేడియేషన్, పంటల సాగులో రసాయనాలు అధికంగా వినియోగించడం తదితర కారణాలు పిచ్చుకల జీవనానికి ముప్పుగా పరిణమించాయి. ►ప్రపంచంలో ఏటా పిచ్చుకల సంఖ్య తగ్గిపోతుండటంతో ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ తయారు చేసిన రెడ్‌లిస్ట్ జాబితాలోకి పిచ్చుకలను చేర్చింది. మన దేశంలోనూ పిచ్చుకల్ని సంరక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ►పిచ్చుకల జీవిత కాలం నాలుగు నుంచి ఐదేళ్లు. ► బరువు 35 నుంచి 40 గ్రాములు. ►ఎగిరే వేగం గంటకు 38.5 నుంచి 50 కి..మీ. ►ఐదు నుంచి ఎనిమిది గుడ్లు పెడతాయి. 10 నుంచి 15 రోజుల్లో పొదుగుతాయి. ►ప్రత్యర్థుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు నీళ్లలో ఈదగలదు. ►ఆడ పిచ్చుకల్ని ఆకర్షించేందుకు మగ పిచ్చుకలే గూళ్లు కడతాయి. -
సేవ్ స్పారో
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): పిచ్చుక గూడు నిర్మాణమే ఓ అద్భుతం. ప్రకృతి తీర్చిదిద్దిన గొప్ప ఇంజనీర్లుగా పిచ్చుకలు పేరొందాయి. రేడియేషన్, వాతావరణ పరిస్థితులలో మార్పుల కారణంగా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. పట్టణాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న తరుణంలో చెట్లు లేక పిచ్చుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి. పల్లెల్లో చెట్లు ఉన్నా.. అరకొరగానే పిచ్చుక గూళ్లు కనిపిస్తున్నాయి. కాపాడుతున్న పక్షి ప్రేమికులు గతంలో పట్టణాలలో పూరిళ్లు, పెంకుటిళ్లలో గూళ్లు ఏర్పాటు చేసుకుని పిచ్చుకలు సంతానాన్ని వృద్ధి చేసుకునేవి. నగరీకరణ నేపథ్యంలో ఇపుడా పరిస్థితి కనిపించడం లేదు. ఆహార పంటల స్థానే వాణిజ్య పంటలు సాగు చేస్తుండటంతో పిచ్చుకలు ఆహారానికి ఇబ్బందులు పడుతున్నాయి. సంతానోత్పత్తి మాట అలా ఉంచి ప్రాణాలు కాపాడుకోవడానికే ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగర వాసుల్లో పక్షుల పట్ల ప్రేమ పెరుగుతోంది. ముఖ్యంగా పిచ్చుకల కిచకిచలు వినాలని.. వాటికి ఆవాసాలు ఏర్పాటు చేయాలన్న స్పృహ చాలా మందిలో పెరిగింది. ఈ నేపథ్యంలోనే చెక్కతో చేసిన స్పారో హౌస్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆపార్ట్‌మెంట్స్‌లోని బాల్కనీలు, ఇళ్ల ముంగిట వీటిని అమరుస్తున్నారు. పిచ్చుకలకు కావాల్సిన ఆహారాన్ని, నీటిని సమకూరుస్తున్నారు. బియ్యం నూక, జొన్నలు, సజ్జలు వివిధ రకాల ధాన్యపు గింజలు వాటి కోసం పెడుతున్నారు. పక్షి ప్రేమికుల కోసం గడ్డితో తయారు చేసిన పిచ్చుక గూళ్లు సైతం కొన్ని మాల్స్‌లో విక్రయిస్తున్నారు. ‘స్ఫూర్తి’ నింపుతున్నారు పిచ్చుకలను రక్షించే లక్ష్యంతో విజయవాడకు చెందిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. పిల్లలకు పిచ్చుకల రక్షణపై అవగాహన కలి్పంచడం, వాటికి ఆవాసాలు ఏర్పాటుపై ఆసక్తి కల్పిస్తున్నారు. పిచ్చుకలను రక్షించుకోవడం ఎలా అనే అంశంపై వర్క్‌షాపులు, చిత్ర ప్రదర్శనలు సైతం నిర్వహిస్తోంది. అంతటితో సరిపెట్టకుండా చెక్కతో చేసిన కృత్రిమ ఆవాసాలను సైతం చిన్నారులకు అందిస్తోంది. కొందరు వ్యక్తులు పిచ్చుకలపై ప్రేమతో తమ ఇంటి పరిసరాల్లో వాటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ గిన్నెల్లో నీళ్లు నింపి, గింజలు పెడుతున్నారు. మార్కెట్లో లభించే స్పారో హౌస్‌లను తమ ఇళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరుకు చెందిన తోట శ్రీనివాసరావు తన ఇంటి పెరట్లోని చిన్న చెట్లకు 10కి పైగా స్పారో హౌస్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో చేరే పిచ్చుకలకు నీళ్లు, ఆహారం అందిస్తున్నారు. వేసవి కాలం పిచ్చుక సంతానోత్పత్తి సమయమని.. ఈ కాలంలో వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపితే మంచిదని ఆయన సూచిస్తున్నారు. పిచ్చుకలను కాపాడుకోవాలి పంటలకు హాని చేసే క్రిములను తినడం ద్వారా పిచ్చుకలు రైతులకు సహాయకారిగా ఉండేవి. చిన్న జీవి అయినా పిచ్చుకతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. మా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తమవంతుగా పిచ్చుకలకు కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – శ్రీనివాస్, వ్యవస్థాపకులు, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్, విజయవాడ -
ఇలాంటి ఏప్రిల్ ఫూల్‌ని ఎక్కడా చూసుండరు
ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్.. ఫూల్స్ డే. చిన్న చిన్న అబద్ధాలు చెప్పి స్నేహితులను ఫూల్స్ చేసి తెగ సంబరపడతాం. ఈ రోజు ఫూల్స్ డే అని మనకు తెలుసు కనక.. సరదగా ఆటపట్టిస్తాం. మరి ఈ పిట్టకు ఈ రోజు ఫూల్స్ డే అని తెలిసి ఇలా చేసిందో.. లేక ప్రాణం కాపాడుకునే ప్రయత్నమో తెలియదు కానీ ఏకంగా పిల్లితోనే ప్రాంక్ చేసింది. సమయం చూసుకుని తుర్రుమని ఎగిరిపోయింది. పిట్ట తెలివికి అవాక్కయిన పిల్లి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అది విఫలమయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో కడుపుబ్బ నవ్వించడం ఖాయం. ఏప్రిల్ ఫూల్ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో పిల్లి కాళ్ల కింద ఓ పిట్ట వుంటుంది. చూడ్డానికి అది మరణించనట్లు ఉంటుంది. దాంతో పిల్లి దాన్ని నేల మీద అటూ ఇటూ దొర్లిస్తూ ఆడుతూ ఉంటుంది. సమయం చూసుకుని ఆ పిట్ట ఒక్క ఉదుటున అక్కడ నుంచి తుర్రుమంటుంది. ఊహించని ఈ ఘటనకు షాక్ తిన్న పిల్లి.. పిట్టను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది.. కానీ అప్పటికే అది అందనంత దూరం వెళ్లి పోతుంది. April fool😊 pic.twitter.com/2lbUAkhzP1 — Susanta Nanda IFS (@susantananda3) April 1, 2021 ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు పిట్ట తెలివిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఇది మన కంటే స్మార్ట్.. తెలివైన పిట్ట గెలిచింది.. అతి విశ్వాసం ఉన్న పిల్లి ఓడింది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: పులా.. పిల్లా.. ఎందుకిలా చేస్తోంది? -
గ్రామస్తుల త్యాగంతో పిచ్చుక, పిల్లలు క్షేమం
సాక్షి, చెన్నై: అరుదైన ఓ పిచ్చుక కోసం ఓ గ్రామం నెల రోజులు అంధకారంలో మునిగింది. ప్రస్తుతం ఆ పిచ్చుక గుడ్లు పెట్టి పొదిగి పిల్లలతో బయటకు రావడంతో ఆగ్రామం ఆనందంలో మునిగింది. శివగంగై జిల్లా పోత్తకుడి ఓ కుగ్రామం. ఇక్కడ వంద మేరకు ఇళ్లు ఉన్నాయి. ఇక్కడి వీధుల్లో 35 విద్యుత్‌స్తంభాలు ఉన్నాయి. వీటిని ఆన్, ఆఫ్ చేయడం బాధ్యతల్ని ఆ గ్రామానికి చెందిన కరుప్పురాజాకు అప్పగించారు. వీటన్నింటికి ఒకే చోట అతి పెద్ద బాక్స్‌గా స్విచ్ బోర్డు ఉంది. ఈ పరిస్థితుల్లో నెల రోజుల క్రితం ఓ రోజు అరుదైన పిచ్చుకకు ఆ బాక్సు నుంచి బయటకు వెళ్లడాన్ని కరుప్పురాజా చూశాడు. మరుసటి రోజు అదే విధంగా ఆ పిచ్చుక వెళ్లడం, ఇదేదో అరుదైన జాతికి చెందినదిగా భావించాడు. క్రమంగా ఆ పిచ్చుక ఆ బాక్సులో గూడు కట్టింది. గుడ్లు పెట్టి పొదిగేందుకు ఆ బాక్సును ఆ పిచ్చుక ఎంపిక చేసుకున్నట్టుంది. ఈ సమాచారాన్ని కరుప్పురాజా గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆ పిచుక వర్ణం అంతా ఓ వింతగా, అరుదుగా ఉండడంతో దీనిని పరరిక్షించాల్సిన బాధ్యత ఉందని గ్రామస్తులు నిర్ణయించారు. దీంతో ఆ పిచ్చుకకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆ స్విచ్ బాక్స్ వైపుగా ఎవ్వరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో నెల రోజులు ఆ గ్రామంలో వీధి దీపాలు వెలగలేదు. ఆ గ్రామమే అంధకారంలో మునిగినట్టుగా పరిస్థితి మారింది. ఈ పరిస్థితుల్లో గుడ్లు పెట్టి, పొదిగిన ఆ పిచ్చుక నెల రోజుల తర్వాత తన పిల్లలతో బయటకు రావడంతో ఆ గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. ఆ పిచుకను, పిల్లలల్ని పరిరక్షించేందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. -
ఒంటరి పిచ్చుక
ఆర్ట్స్ కాలేజీ ప్లాట్ఫార్మ్ మీద నిలబడి ఉన్నాను, గంట ఆలస్యంగా రాబోయే నేనెక్కాల్సిన రైలుబండి కొరకు నిరీక్షిస్తూ. చేతిసంచిలో ఎప్పుడూ పెట్టుకునే పుస్తకం కూడా పెట్టుకోవడం మరచిపోయానేమో సమయం గడవడం కొంచెం కష్టంగానే ఉంది. ఏం చెయ్యాలో తోచక టైంపాస్ కని ప్లాట్ఫార్మ్ మీద ఆ చివరనుండి ఈ చివరకు నడవడం ప్రారంభించాను. అటూ ఇటూ చూసుకుంటూ నెమ్మదిగా అదుగులువేస్తున్న నేను ఏదో అదృశ్యశక్తి నా నడుము పట్టుకొని ఆపేసినట్టు ఆగిపోయాను, ఓ ఇరవై గజాలు నడిచాక....వీనులవిందుగా వినిపిస్తున్న పిచ్చికల కిచకిచలు చెవిన పడడంతో. ప్లాట్ఫార్మ్కి కొంచెం దిగువగా ఒక మాదిరి ఎత్తున్న ఒక తుమ్మచెట్టూ, దాని కొమ్మలనిండా కిచకిచలాడుతూ లెక్కలేనన్ని పిచ్చికలూ. అలా ఆ చెట్టుమీదే కాకుండా ప్లాట్ఫార్మ్ పక్కనకూడా ఏ మహానుభావుడో, మహానుభావురాలో ప్రేమతో తెచ్చి జల్లిన బియ్యంగింజలు ఏరుకు తింటూ అటూఇటూ హుషారుగా గెంతుతూ కిచకిచమంటున్న ఇంకొకన్ని పిచ్చికలు కూడా. ఆనందంతో అడుగు ముందుకు పడలేదు నాకు. అబ్బ ఎంతకాలమైంది ఇన్ని పిచ్చికల్ని ఒకేదగ్గర చూసి! మా చిన్నప్పుడు మేము నిద్రలేచేది ఈ పిచ్చికలు ఉదయాన్నే పాడే మేలుకొలుపు కిచకిచలకే. ఏదో పెద్ద పనున్నట్టు తూరుపు తెల్లారకముందే లేచిపోయి, మా ఇంటిచూరుకు వేలాడదీసిన ధాన్యపుకంకుల గుత్తులమీద వాలి, గోలగోలగా గింజలు పొడుచుకు తినేవి కొన్నైతే, ఇంట్లో అద్దంముందు తీరికూర్చొని దానిలో కనిపించే వాటి ప్రతిబింబాల్నే వేరే పిచ్చికలనుకొని టకటకమని చప్పుడొచ్చేలా కోపంగా అద్దాన్ని పొడుస్తూ కసితీర్చుకొనేవి కడుపునిండిన మరికొన్ని. మాది పెద్ద పెంకుటిల్లేమో, చాలా పిచ్చికలు పెంకులకింద చూరుల్లో గూళ్ళుకట్టుకొని, సంసారంచేసి, గుడ్లుపెట్టి, వాటిని పిల్లల్ని కూడా చేసి తమ జన్మ సార్థకం చేసుకొనేవి. అప్పుడప్పుడూ ప్రమాదవశాత్తూ ఏదైనా గూడు క్రిందపడిపోతే, అలా పడిపోయిన గూట్లో దురదృష్టవశాత్తూ గుడ్లుండి అవి చితికిపోతే, గూడూ గుడ్లూ కోల్పోయిన పిచ్చికల జంట చేసే హృయవిదారకమైన ఆర్తనాదాలు అంత చిన్నవయసులో కూడా మాకు కళ్ళమ్మట నీళ్ళు తెప్పించేవి. మా ఇంటిపిచ్చికలు కడుపునిండా మేయడానికి ధాన్యంకంకులు వేలాడదీయడమే కాకుండా, వేసవికాలంలో అవి మాత్రమేకాక ఇతర పక్షులు కూడా తాగడానికి వీలుగా ఇంటిముందున్న వేపచెట్టుకి రెండుమూడు మట్టి దాకలు వేలాడదీసి, అవి ఎప్పుడూ నీళ్ళతో నిండి ఉండే ఏర్పాటు, నాన్న చేసేవారేమో, వేసవికాలం మధ్యాహ్నం నీళ్ళు తాగడానికి వచ్చే రకరకాల పక్షులతో శోభాయమానంగా ఉండేది మా వేపచెట్టు. కొంచెం పెద్దవాళ్ళమయ్యాక పిచ్చికల్ని దూరం నుండి చూసి ఆనందించడం మాత్రమేకాక వాటిని పట్టుకొని ఆడుకుంటే బాగుంటుంది అనిపించేది. ∙∙ ఇప్పుడు ప్రతీరోజూ సాధ్యమైనంత సమయం పిచ్చికలతో గడపడమే ముఖ్యమైనవ్యాపకం అయిపోయింది నాకు. రైలు ఎంత ఆలస్యంగా వచ్చినా విసుగనిపించేది కాదు సరికదా, కనీసం ఒక పావుగంటైనా ఆలశ్యంగా వస్తే బాగుండునని కూడా కోరుకునేవాడ్ని. శెలవురోజుల్లో కూడా వాకింగ్ వంక పెట్టుకొని వాటిని చూడ్డానికి వెళ్ళిపోయేవాడ్ని ఉదయాన్నే లేచి. నాలాగే పిచ్చికల్ని ప్రేమించే ఇద్దరు నిత్యప్రయాణికులతో (కమ్యూటర్స్)తో పరిచయం ఏర్పడింది నాకు. అతికొద్ది రోజుల్లోనే మేం ముగ్గురం మంచి స్నేహితులమైపోయాంకూడా. రోజుకొకరి వంతున అవి తినడానికి బియ్యం గాని వేరే చిరుధాన్యాలుగాని తీసుకెళ్ళి వాటిముందు జల్లి, అవి కిచకిచలాడుతూ ఆ గింజలు తింటుంటే ఆనందంతో చూస్తూ నిలుచునేవాళ్ళం రైలు వచ్చేవరకూ. రెండుమూడు నెలల్లో అవి మాకెంత మాలిమి అయ్యాయంటే, మా ముగ్గురిలో ఎవరైనా చేతిలో కొన్ని బియ్యంగింజలు ఉంచుకొని చెయ్యి చాపి నిలబడితే, కనీసం మూడు నాలుగు పిచ్చికలు ఆ చేతిమీద వాలి దానిలో గింజలు హాయిగా తినేవి కొంచెమైనా భయంలేకుండా. గడిచిన ఆరేడు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నాను నేను పిచ్చికలతో నా సాంగత్యం మొదలైన దగ్గరనుండీ. నా భార్య అయితే ‘‘ముంబాయిలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుండే వాడివి. పచ్చని చెట్టు కనిపించినా, చిన్నపిట్ట కనిపించినా చిన్నపిల్లాడిలా ఆనందపడిపోయేవాడివి. ఈమధ్య అయితే ఎప్పుడూ అలానే ఉంటున్నావు హుషారుగా’’ అని ఎన్నిసార్లు అందో చెప్పలేను. పిల్లలూ కూడా అదే మాట. హాయిగా శిక్షణకేంద్రంలో పాఠాలు చెప్పుకోవడం, రోజూ కొంచెం సమయం పిచ్చికలతో గడపడం...ఆరునెలల కాలం ఆరు క్షణాల్లా గడిచిపోయింది. వేసవికాలం వెళ్ళిపోయి వర్షాకాలం తోసుకు వచ్చింది. ట్రైన్ టైంలో వర్షం పడుతుంటే తప్ప పిచ్చికలతో గడిపే నా టైం టేబుల్లో మాత్రం మార్పేమీ రాలేదు. కాకపోతే వర్షాలు కాస్త గట్టిగా కురుస్తుండడంతో స్టేషన్లో రకరకాల పిచ్చిమొక్కలూ, పాదులూ విపరీతంగా పెరిగిపోయి, చుట్టుపక్కలంతా చిన్నపాటి చిట్టడివిలా తయారైంది. చీకటి పడ్డాక, ‘లేట్ నైట్ ట్రైన్’ దిగి అడ్డదారిలో వెళ్ళిన ఒకరిద్దరికి పాములుకూడా తారసపడడం వారు రైల్వే అధికారులకి ఫిర్యాదు చెయ్యడంకూడా జరిగిందట. అందుకేనేమో ఒకరోజు ఉదయాన్నే మామూలుగా స్టేషన్‌కి వెళ్ళే సమయానికి కొంతమంది గేంగ్ మెన్లు అక్కడ ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కల్ని కొట్టేస్తూ కనిపించారు. అలవాటుగా పిచ్చికలకి పెట్టాల్సిన మేత వాటికి పెట్టేసి, నాదారిన నేను వెళ్ళిపోయాను పెద్దగా పట్టించుకోకుండా. సాయంత్రం శిక్షణకేంద్రంలో ఏదో ప్రత్యేకమైన కార్యక్రమం ఉండడంతో తిరిగిరావడం బాగా ఆలశ్యం అయ్యి చీకటి పడిపోయింది. మరుసటిరోజు ఉదయంనుంచే చిన్నగా తుప్పర పడడం మొదలైంది. తడుస్తూనే స్టేషన్‌కి చేరుకున్న నాకు ఎక్కడా ఒక్క పిచ్చిమొక్కగాని పాదుగాని కనబడలేదు. స్టేషన్ ఆవరణ అంతా శుభ్రంగా ఉంది. అది చూసి ఆనందించాల్సినది బదులు నా మనసు ఎందుకోగాని కీడుని శంకించింది. అదురుతున్న గుండెలతో మా పిచ్చికలచెట్టువేపు అడుగులు వేసాను. నాలుగు అంగల్లో అక్కడికి చేరుకున్న నాకు, అక్కడ కనిపించిన దృశ్యానికి గుండె ఆగిపోయినంత పనయ్యింది. నిస్సహాయంగా కూలబడిపోయాను పక్కనే ఉన్న సిమెంట్ బెంచిమీద. ఎప్పుడూ పిచ్చికలతో కళకళలాడే మాపిచ్చికలచెట్టు మొదలంటా నరికివేయబడి ఉంది. రెండడుగుల కాండం మాత్రం మిగిలిఉంది వికృతంగా కనిపిస్తూ. అలా మిగిలిఉన్న మొండిమొదలు మీద కూర్చొని ఉంది ఒకేఒక పిచ్చిక...చిన్నగా కురుస్తున్న వర్షంలో నిస్సహాయంగా తడుస్తూ....జాలిగా శూన్యంలోకి చూస్తూ... అంతే... ఆరోజు తరవాత మళ్ళీ ఎప్పుడూ ఆ స్టేషన్ లో అడుగుపెట్టిన పాపాన పోలేదు నేను. – కృపాకర్ పోతుల హైదరాబాద్ (మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం) -
ఎంతందంగా ఉన్నానో..!
ఎంత అందంగా ఉన్నానో నేను.. అనుకుంటూ మురిసిపోతోంది ఈ పిచ్చుక. ఒకప్పుడు పొద్దున లేవగానే కిచ్‌కిచ్ అంటూ చప్పుడు చేస్తూ అల్లరి చేసే పిచ్చుకలు పెరిగిన పర్యావరణ కాలుష్యం దృష్ట్యా కనుమరుగైపోయాయి. చాలా తక్కువ సంఖ్యలో అవి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అలాంటి ఓ పిచ్చుక గాల్లో వెళ్తూ వెళ్తూ ఓ బైక్‌కు ఉన్న అద్దంను చూసి దాని ముందు వాలి హొయలొలికించింది.. మళ్లీ మళ్లీ చూసుకుంటూ సంబురపడిపోయింది. నిజామాబాద్ జిల్లాలోని కుర్నాపల్లి గ్రామ శివారులో ఓ బైక్ వద్ద పిచ్చుక చేసిన అల్లరి ఇది.. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
నేచురల్ ఇంజనీర్స్
యాదగిరిగుట్ట : ఒక్కో గడ్డిపోచను నేర్పుతూ, పేర్చుతూ అందాల గూళ్లను పిచ్చుకలు అళ్లుతున్న తీరు అద్భుతం. వాటిది నేచురల్ ఇంజనీరింగ్. హోరుగాలికి, జోరువానకు సైతం తట్టుకునేలా గూడు కట్టుకుంటున్న వాటి నైపుణ్యం అబ్బురపర్చుతుంది. బంగారు వర్ణంలో తళతళలాడుతూ చూడముచ్చట గొలిపే ఈ పిచ్చుకలు గూళ్లు అళ్లుతున్న దృశ్యాలు యాదగిరిగుట్ట మండలం దాతా రుపల్లి, రాళ్లజనగాం గ్రామాల్లోన్ని వ్యవసాయ బావుల వద్ద కనిపించాయి. చూపరులకు కనువిందు చేస్తున్నాయి. -
కోతల కాలం
ఒక రైతు కష్టపడి పనిచేసేవాడు. రోజంతా పొలంలోనే ఉండేవాడు. ఆ రైతు కష్టాన్ని ఆ పొలంలోనే గూడు కట్టుకుని ఉన్న ఒక పిచ్చుకల కుటుంబం చూస్తూ ఉండేది. కొన్నాళ్లకు రైతు కష్టం ఫలించింది. పంట కోతకొచ్చింది. ఊళ్లో మిగతా రైతులు కూడా కోతలకు సిద్ధం అయ్యారు. ‘‘ఇరుగు పొరుగును తీసుకొచ్చి రేపే నేను కూడా కోతలు మొదలు పెట్టాలి’’ అని ఆ రైతు ఎవరితోనో అంటుంటే పిల్ల పిచ్చుకలు విన్నాయి. వెంటనే వెళ్లి తల్లికి చెప్పాయి. ‘‘అమ్మా.. ఇవాళే మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. కోతలు మొదలైతే మన గూడును కూడా పడగొట్టేస్తారు’’ అన్నాయి.‘‘తొందరేం లేదు. రేపు మన రైతు కోతలు మొదలవ్వవు’’ అంది పిచ్చుకల తల్లి నమ్మకంగా. అన్నట్లే మర్నాడు కోతలు మొదలవ్వలేదు. పిచ్చుకలు ఆశ్చర్యపోయాయి.రైతు మళ్లీ.. ‘‘రేపే దగ్గరి బంధువుల్ని తీసుకొచ్చి కోతలు మొదలు పెట్టాలి’’ అని అంటుంటే విని, ఆ విషయాన్ని తల్లికొచ్చి చెప్పి, ‘‘వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోదాం’’ అన్నాయి పిచ్చుకలు. ‘‘తొందరేం లేదు. రేపు కూడా మన రైతు కోతలు మొదలవ్వవు’’ అంది తల్లి పిచ్చుక. అన్నట్లే ఆ రేపు కూడా కోతలు మొదలవ్వలేదు! పిల్ల పిచ్చుకలు మళ్లీ ఆశ్చర్యపోయాయి.ఈసారి రైతు.. ‘‘రేపు నేనే కోతలకు సిద్ధమౌతున్నాను’’ అని ఎవరితోనో అంటుంటే పిచ్చుకలు విని, తల్లికి చెప్పాయి కానీ, ‘మనం వెళ్లిపోదాం’ అని అనలేదు! అయితే ఈసారి తల్లే ఆ మాట అంది.. ‘‘మనం వెంటనే గూడును ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్లిపోవాలి’’ అని! పిచ్చుకలు తల్లి వైపు ఆశ్చర్యంగా చూశాయి. ‘‘అవును. మన రైతు రేపు కోతలు మొదలు పెట్టేస్తాడు. తన కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎవరి కోసమూ ఎదురు చూడడు’’ అంది పిచ్చుకల తల్లి. -
నాకు క్యూటీ కావాలి!
పిట్ట కథ ఓ పదిహేను రోజులక్రితం... టైం ఎనిమిదవుతుంది... నేనింకా నిద్రలోనే ఉన్నా.. బాల్కనీ గోడ పక్కన ఓ కొత్త సవ్వడి.. ఇంతకు ముందు విన్నపక్షుల సవ్వడిలా లేదు. బలవంతంగా నిద్రలేచి తలుపు తీసి చూశాను. ఏం కనిపించలేదు. కానీ ఆ కొత్త సవ్వడి మాత్రం వినిపిస్తూనే ఉంది. మొహం కడుక్కుని స్నానం చేసేలోపు ఓ ఐదారుసార్లు వినిపించింది ఆ సౌండ్ పిట్ట మాత్రం కనిపించలేదు. ఇలా కాదని జాగ్రత్తగా సీతాఫలం చెట్టు ఆకుల మధ్యలోంచి నెమ్మదిగా చూశాను.. అప్పుడు కనిపించింది.. నేను ఊహించినట్టే ఓ కొత్త పక్షి. చాలా చిన్నగా... పిచ్చుకలో సగం సైజే ఉంది. బూడిదరంగు శరీరం... తోకమాత్రం భలే అందంగా ఉంది. నెమలీకను బీడీ సైజ్ లో కట్ చేసి అతికించినట్టుంది. అది సీతాఫలం చెట్టు ఆకు వెనకాల దాక్కుంది.. ఆ ఆకు దానిని పూర్తిగా కవర్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. అదెంత ఉందో. కానీ చూడ్డానికి మాత్రం భలే ముద్దుగా ఉంది. అరుపు కూడా ప్రత్యేకంగా ఉంది కాబట్టి నాకు ఆసక్తి పెరిగింది. రెండోరోజు చూస్తే సీతాఫలం చెట్టు మీదే చిన్న గూడు కట్టుకుంది.. అసలా గూడు చూస్తే హాశ్చర్యపోతారు. కేవలం మూడంటే మూడే ఆకులతో ఎంత చక్కగా గూడు కట్టిందంటే, భలే ముచ్చటగా ఉందిలే. వెంటనే మా ఆవిడను పిలిచి చూపించాను. ముచ్చటగా కట్టుకున్న దాని ఇల్లు చూసి ముక్కున వేలేసుకుంది. మా అబ్బాయికయితే ప్రపంచ వింత చూస్తున్నంత సంబరం. వాడు స్కూల్లో టాంటాం వేశాడు తనకు కొత్త ఫ్రెండ్ అని, దాని పేరు క్యూటీ అనీ, దాని గూడు బాగుందనీ ఇలా... క్యూటీతో చిక్కేంటంటే.. అలికిడి వినిపిస్తే గూట్లోంచి ఎగిరిపోయేది.. అందుకే మెల్లగా.. బెడ్ రూం డోర్ తీసి మెత్తగా అడుగులు వేస్తూ చిన్నగా మెడ పైకెత్తి చూస్తే దాని గూడు కనిపించేది. అందులో తలపైకెత్తి పడుకునేది. చిన్న మొహం.. పూసల్లాంటి కళ్లు.. చిన్నముక్కు.. పదేపదే చూడాలనిపించేది కానీ సెకనులో వెయ్యోవంతులో ఎగిరిపోయేది. కొన్ని రోజులు ఇదే తంతు. మేమైతే భలే ఎంజాయ్ చేస్తున్నాం ఇదంతా.. వారం రోజుల్లోనే దాంతో చిన్న అటాచ్మెంట్ పెరిగింది. దానికి కూడా నమ్మకం కుదిరిందేమో. ఇంతకు ముందులా మరీ వేగంగా పారిపోవడం లేదు. లేకపోతే చప్పుడు చేయకుండా చూడడం నాకు అలవాటయిందో మరి.. చెట్ల ఆకుల మధ్యలో కూర్చుని ఆ చిన్న అందమైన తోకని బోరింగ్ కొట్టినట్టు పైకీ, కిందకీ ఊపుతూ బోలెడు పాటలు పాడేది. మేం జాగ్రత్తగా తలుపు కొంచమే తెరిచి దానిని చూస్తుండేవాళ్లం. వేడివేడి టీకప్పుతో కిటీకీ దగ్గర నిల్చుని బయట దానిని చూడడం నాకు గొప్పగా అనిపించేది.ఆ మధ్య రెండు రోజులు వర్షం పడింది.అర్ధరాత్రి మెలకువొచ్చింది.. జోరున వర్షం పడుతున్న శబ్దం నా మనసులో ఏదో అలజడి. పే...ద్ద గాలి వాన. మా తలుపు సందులోంచి సన్నగా నీళ్లు లోపలికి వస్తున్నాయ్. అమ్మో.. ఇంత గాలివాన.. క్యూటీ ఎలా ఉందో... సిమెంట్‌తో కట్టిన ఇంట్లోకే నీళ్లొస్తున్నాయ్.. దాని ఆకుల గూడు ఎలా ఉందో! మనసులో ఒకటే దడదడ. ఫోన్లో టార్చ్ ఆన్ చేసుకుని నెమ్మదిగా డోర్ తెరిచి ఆకుల మధ్యలోంచి లైట్ వేసి చూశాను. ఆశ్చర్యం.. దాని గూడు ఏమాత్రం తడవలేదు.. గాలికి దాని గూడు ఊగుతుంటే ఊయల ఊగినట్టు.. లోపల హాయిగా నిద్రపోతుంది. ఈసారి మాత్రం ఎగిరిపోలేదు.. దానిని అంత స్పష్టంగా చూడడం అదే మొదలు. ఇక నాకు ఇదే అలవాటైపోయింది.. పొద్దున్నే వాటి సవ్వడితో లేవడం... ఓసారి దాని గూట్లోకి తొంగిచూడడం.. బయటికెళ్లి రాగానే దాన్నోసారి పలకరించడం... ఆ చిన్న పిట్ట పుణ్యమాని మా ఇంట్లోనూ చిన్న చిన్న మార్పులు... ‘‘ఇదిగో, పొరపాటున కూడా ఆ గోడ పక్కన ఏదీ విసిరేయకు.. దాని గూడుకి తగిలితే కష్టం. నీళ్లు.. గింజలు పెట్టావా? మరిచిపోయావా? వాడిమీద అరిచేటప్పుడు కాస్త హాల్లోకి వెళ్లు.. ఆ చిన్నప్రాణం భయపడితే కష్టం...’’ ఇలా ఉండేవి నా హెచ్చరికలు..మొత్తానికి నిద్రలేవడం మొదలు.. అర్ధరాత్రి దాకా దాని గురించి బోలెడు మాటలు. ఓ కుక్కనీ, పిల్లిని, చిలుకను పెంచుకునే వాళ్లలాగ మాకు ఓ బుజ్జి పిట్ట..! ఇలా ఇరవై రోజులు గడిచాయి.మూడు రోజుల క్రితం పొద్దున్నే దాని అలికిడి లేదు! ఏదో పోగొట్టుకున్నట్టుంది. లేచి బాల్కనీలోంచి తొంగిచూశాం. గూడు ఖాళీగా ఉంది.. ఏమైంది? పొద్దున్నే వెళ్లిపోయింటుందా?ఆ రోజు ఇలా నాలుగైదు సార్లు చూసినా ఎప్పుడూ గూడు ఖాళీగానే కనిపిస్తోంది. నా మనసేమో కాస్త సున్నితం. అందుకే దిగులుగా ఉంది.. ఇక మా అబ్బాయి నాలుగు రోజులుగా ఒకటే ప్రశ్న ‘‘నాన్నా.. క్యూటీ ఎక్కడికి వెళ్లిందీ’’ అని. వారమైనా పత్తాలేదు.. రోజు రోజుకు నాకు దిగులు పెరిగిపోతోంది. ఇలా లాభంలేదని ఓ కర్ర తీసుకొచ్చి నెమ్మదిగా ఆ గూడును కదిపి చూశాం. ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. లోపల క్యూటీ నిర్జీవంగా పడుంది. తలెత్తి మిటుకు మిటుకు మంటూ చూస్తే తల పక్కకు వాలిపోయి ఉంది... జాగ్రత్తగా గమనించాను.. గూట్లో తెల్లగా పౌడర్.. చెట్టునిండా.. ఆకుల మీదకూడా. ఏం జరిగుంటుంది..? ఎవరైనా పిండి పడేసుంటారా? ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది. మా ఆవిడ రాగానే అడిగాను ఆ తెల్లపౌడర్ ఏంటని? గుర్తు చేసుకుని చెప్పింది. నాలుగు రోజుల క్రితం మూడు ఇళ్ల అవతల ఒకరోజంతా బోర్ వేశారు.. నీళ్లు పడలేదు సరికదా.. పెద్ద శబ్దం. కింద బండ ఉందేమో.. తెల్లటి పౌడర్ కాలనీ అంతా. తను చెబుతూనే ఉంది.. బాల్కనీ తలుపుమీద.. కిటికీమీద, నేలమీద...ఒక ఇంచు మేర ఆ బూడిద పరుచుకుందనీ.. అదంతా కడిగేసరికి తల ప్రాణం కాళ్లకొచ్చిందనీ.నాకు విషయం అర్థమైపోయింది.. ఆ పేద్ద శబ్దాలు, విపరీతంగా రేగిన బూడిద దెబ్బకు ఈ చిన్న ప్రాణం తట్టుకోలేకపోయిందనీ, ఊపిరాడక ఉన్నచోటే ప్రాణమొదిలేసిందనీ... జడివానకు, సుడిగాలికి తట్టుకునేలా గూడు నిర్మించుకుందనుకుందిగానీ, పిచ్చిది. మనుషుల సంగతి దానికేం తెలుసు? తప్పెవరిది? అమాయకంగా మా మధ్యలోకొచ్చిన ఆ చిన్ని ప్రాణానిదా? మనలాంటి జీవులు కూడా ఈ ప్రకృతిలో భాగమేనని ఆలోచించని మనుషులదా? - వాసవీ మోహన్ -
కరెంటు కంకులు
సందర్భం వేసవిలో ఉన్నాం. మొన్నొక వర్షం పడింది. అకాలం! ఇప్పుడైతే మామిడి చెట్లకు పిందెలు మాత్రమే పడాలి. పండ్లే వచ్చేశాయి. స్వయంకృతం! నవంబర్‌లో బంగినపల్లి ఏమిటి? డిసెంబర్లో రసాలు ఏంటి? ఏదీ తీరుగా లేదు. ఇది వసంతం కదా. పూలూ, పక్షుల కాలం కదా! వారంలో ఉగాది పెట్టుకుని ఒక్క కోయిలా ‘కుహూ’మని కుయ్యలేదు. కూసిందేమో, రిథమ్ మారి మనమే గుర్తుపట్టలేకపోయి ఉంటాం. మరి పిచ్చుకెక్కడ? మన హౌస్ స్పారో!! బియ్యం నేరుగా బస్తాల్లోనే పండుతున్నాక ఒక్క పిచ్చుకా ఇళ్ల ముందుకు రావడం లేదు. ముంగిట్లో కంకులుంటేనా! పాపం... గింజల్లేని కరెంటు కంకులపైనే అవి ‘ట్వియ్ ట్వియ్’మని వాలుతున్నాయి. ఎండకు సోలిపోతున్నాయి. ఇవాళ పిచ్చుకల రోజు. వరల్డ్ స్పారో డే. పిచ్చుకలకు రుతువులతో, ‘రోజు’లతో పన్లేదు. మనమే... వాటిని మిస్ అవుతున్నామని చెప్పి, గుర్తుపెట్టుకుని జ్ఞాపకం చేసుకోవడానికి ఓ రోజు పెట్టుకున్నాం. సాయంత్రానికి కాస్త ఎగువన... సోమరి సంధ్యలోకి పిచ్చుకలొచ్చి వాలి, గడప దాకా గెంతి, ఇంట్లో మనుషులేం చేస్తున్నారో మెడ, ముక్కు తిప్పుకుంటూ చూసి వెళ్లే రోజులు ఇప్పుడు లేవు! ఇంట్లో జనాలే ఉండడం లేదు. ఉదయాలు, మధ్యాహ్నాలు, సాయంత్రాలు... మూడింటినీ... టప్పర్‌వేర్‌లో మిక్స్ చేసుకుని వేళాపాళా లేని చదువులకు పిల్లలు, ఓవర్‌టైమ్ కొలువులకు పెద్దలు వెళ్లిపోతుంటే... పిచ్చుకలకు ఇళ్లెక్కడ కనిపిస్తాయి? కరెంటు తీగలెక్కి చూసినా కంకులెలా కనిపిస్తాయి? ఎక్కడి రుతువును అక్కడ ఉంచుకోగలిగితేనే మనిషికైనా, పక్షులకైనా పచ్చని బతుకు. k ► బియ్యం నేరుగా బస్తాల్లోనే పండుతున్నాక ఒక్క పిచ్చుకా ఇళ్ల ముందుకు రావడం లేదు. -
పిచ్చుక.. తిరిగి రావాలిక..
జీవవైవిధ్యానికి ప్రతీకలు చిట్టి పక్షులు ఊరపిచ్చుకలపై ప్రత్యేక లెక్కింపు నేచర్ ఫరెవర్ సొసైటీ ఆధ్వర్యంలో సర్వే రేపు అంతర్జాతీయ ఊరపిచ్చుకల దినోత్సవం సాక్షి, హైదరాబాద్: ఇళ్లు, వాకిళ్లు, కిటికీలు, వెంటిలేటర్లు, కారిడార్లలో వాలి కిచకిచమంటూ సందడి చేస్తాయి. అక్కడక్కడా చెట్ల కొమ్మలపైన వాలి కనువిందు చేస్తాయి. చిన్న చిన్న రెక్కలను టపటపలాడిస్తూ పిల్లలతో దోబూచులాడుతాయి. నిత్యం మనల్ని పలకరించే ఆ చిన్ని జీవులు.. పిచ్చుకలు.. జీవవైవిధ్యానికి ప్రతీకలైన ఊరపిచ్చుకలు క్రమంగా మనుగడను కోల్పోతున్నాయి. నగరీకరణ, ఫ్లాట్ కల్చర్, రేడియేషన్ వంటివి వాటి ఉనికికి విఘాతం కలిగిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 450 పక్షి జాతులు మనుగడలో ఉంటే హైదరాబాద్‌లో ఊరపిచ్చుకలతోపాటు 40 రకాల పక్షులే ఉన్నాయి. అంతర్జాతీయ ఊరపిచ్చుకల దినోత్సవం సందర్భంగా పిచ్చుకల అధ్యయనానికి శ్రీకా రం చుట్టింది నేచర్ ఫరెవర్ సొసైటీ. అంతా ఇందులో పాల్గొని తమ ఇళ్లు, పరిసరాల్లో కనిపించే పక్షుల వివరాల ను ఆ సంస్థ వెబ్సైట్లో నమోదు చేయాలని పిలుపునిచ్చింది. తద్వారా ఊరపిచ్చుకల సంఖ్యను అంచనా వేయడంతో పాటు, అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు అవసరమనే అంశంపై సంస్థ దృష్టి సారించనుంది. ‘వరల్డ్ స్పారో డే’ (మార్చి 20) సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం ఇది. ప్రమాద ఘంటికలు... ఒక నిశ్శబ్దమైన మార్పు. మూడు దశాబ్దాల కిందట నగరంలో ఊరపిచ్చుకలు పుష్కలంగా ఉండేవి. పెరిగిన అపార్ట్మెంట్లు వాటి మనుగడను ప్రశ్నార్ధకం చేశాయి. మరోవైపు మొబైల్ టవర్స్ నుంచి వెలువడే అత్యధిక రేడియేషన్ కూడా వీటి ఉనికిని దెబ్బతీసింది. హైదరాబాద్ వంటి నగరాల్లో మనుగడ కోసం జీవన్మరణ పోరాటం సాగిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా గత 20 ఏళ్లలో 50 శాతానికి పైగా అంతరించినట్లు ‘నేచర్ ఫరెవర్ సొసైటీ’ప్రతినిధి రమాదేవి మీనన్ ‘సాక్షి’తో చెప్పారు. గత 5 ఏళ్లుగా ఆమె చేపట్టిన ఉద్యమం వల్ల సికింద్రాబాద్, మారేడుపల్లి, కార్ఖానా, సిక్‌విలేజ్, పికెట్ తదితర ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఊరపిచ్చుకలు పెరిగాయి. ఆమె స్వయంగా వందలాది గూళ్లను, నీటి బౌల్స్‌ను, గింజలను వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. ‘‘మేం మారేడుపల్లికి వచ్చినప్పుడు ఒక్క పిట్ట కూడా లేదు. ఇప్పుడు మా ఇంటి చుట్టూ 500కి పైగా కనిపిస్తున్నాయి’’అని సంతోషం వ్యక్తం చేశారు. సర్వే ఇలా... నేచర్ ఫరెవర్ సొసైటీ ఈ ఏడాది ఊరపిచ్చుకుల సంరక్షణ కోసం ప్రత్యేక ఉద్యమాన్ని చేపట్టింది. 20వ తేదీ వరకు అందరూ తమ ఇళ్ల ముందు, బాల్కనీల్లో 15 నిమిషాల పాటు బర్డ్‌వాచ్ చేయాలి. ఆ సమయంలో కనిపించే పక్షుల వివరాలను www.worldsparrowday.org అనే వెబ్సైట్లో నమోదు చేయాలి. ఈ సర్వే ద్వారా లభించిన వివరాలతో ఎక్కడ ఏ రకమైన పక్షులు ఉన్నాయి. ఊరపిచ్చుకల మనుగడ ఎలా ఉంది అనే అంశంపైన సమగ్రమైన అవగాహన లభిస్తుంది. వాటి సంరక్షణ కోసం చేపట్టవలసిన చర్యలు కూడా కచ్చితంగా అంచనా వేయవచ్చునని సంస్థ వ్యవస్థాపకుడు మహ్మద్ దిలావర్ చెప్పారు. అతిథుల్లా ఆదరించండి... ► బాల్కనీల్లో, ఇంటి నీడల్లో కనిపించే పక్షులను చేరదీసి వాటి కోసం గూళ్లు ఏర్పాటు చేయాలి. ► చిన్న నీటి తొట్టెల్లో నీటిని అందుబాటులో ఉంచాలి. ► కాలనీల్లో, ఖాళీస్థలాల్లో పక్షుల కోసం ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేయాలి. -
ఎంతందంగా ఉన్నావే.. ఎవరే నీవు
నన్ను చూడు.. నా అందం చూడు అంటున్నట్టు ఉంది కదూ ఈ పిచ్చుక. అద్దంలో తన అందచందాలను చూసుకుంటున్నట్టు ఉంది ఇది. పిచ్చుకలు కూడా అంతరించిపోతున్న పక్షు జాతుల్లో చేరాయి. తరువాతి తరాలకు పిచ్చుక కనిపిస్తే ఎంతందంగానే ఉన్నావే.. ఎవరే నీవు అనుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. జంగారెడ్డిగూడెంలో వీరా మహేష్ ఇంటి బయట ఉన్న అద్దంలో పిచ్చుక తనను తాను చూసుకుంటున్న దృశ్యమిది. – జంగారెడ్డిగూడెం రూరల్ -
జాబాలి జ్ఞానోదయం
పురానీతి పూర్వం జాబాలి అనే మహాముని ఉండేవాడు. నిష్ఠగా తపస్సు చేసుకునేవాడు. కూర్చున్న చోటు నుంచి కదలకుండా తపస్సు సాగిస్తుండటంతో, జడలు కట్టిన ఆయన తలపై పిచుకల జంట గూడు కట్టుకుని, గుడ్లు పెట్టుకుని, పిల్లాపాపలతో నిశ్చింతగా ఉండసాగాయి. భూతదయా సంపన్నుడైన జాబాలి వాటిని తరిమివేయకుండా, అలాగే తలపై ఉండనిచ్చాడు. తలపై గూడు పెట్టుకున్న పక్షులను తాను అలా ఉండనిచ్చినందునే అవి హాయిగా ఉండగలుగుతున్నాయని, లోకంలో తన కంటే దయాళువు ఇంకెవరుంటారని భావించసాగాడు జాబాలి. జపతపాదుల కంటే తన తలపై గూడు పెట్టుకున్న పక్షుల గురించే ఎక్కువగా ఆలోచించసాగాడు. తాను గనుక వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఉన్నానంటూ గర్వించసాగాడు. రోజు రోజుకూ జపతపాలపై అతడి శ్రద్ధ క్షీణించి, గర్వం పెరగసాగింది. జాబాలి గర్వానికి సమాధానంగా ఒక రోజు అశరీరవాణి ... ‘నాయనా! జాబాలి.. లోకంలో నువ్వొక్కడివే ధర్మపరాయణుడివని, దయాళువని నీకు నువ్వే అనుకోవడం సరికాదు. తులాధారుడనే వర్తకుడు నీ కంటే ఎక్కువ ధర్మపరుడు. అయితే, అతడు నీలా ఎన్నడూ గర్వించలేదు’ అని పలికింది. అశరీరవాణి పలుకులతో జాబాలికి అసూయ మొదలైంది. ‘ఎవరా తులాధారుడు..? నిత్యం జపతపాలు సాగించే నా కంటే ఘనత గలవాడా ఆ వర్తకుడు?’ అనే ఆలోచన అతడిని కుదురుగా ఉండనివ్వలేదు. తులాధారుడిని ఎలాగైనా చూసి తీరాలని, తనను మించిన ఘనత అతడిలో ఏముందో తెలుసుకోవాలని బయలుదేరాడు. తులాధారుడు ఉంటున్న గ్రామానికి వెళ్లాడు. తులాధారుడి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి ముంగిట ఏర్పాటు చేసుకున్న అంగడిలోనే వర్తకం చేసుకుంటూ బేరసారాల్లో తలమునకలైన తులాధారుడు కనిపించాడు. అతడిని చూసిన జాబాలి ‘ఈ మామూలు వర్తకుడు నా కంటే గొప్పవాడెలా అవుతాడు’ అని ఆలోచించసాగాడు. ఈలోగా బేరసారాలు ముగించుకున్న తులాధారుడు తన ముంగిట నిలుచున్న జాబాలిని గమనించాడు. ‘మహర్షీ! మీ రాకతో నా జన్మ ధన్యమైంది. పిచుకలు తలపై గూడు పెట్టుకుని, పిల్లలతో కాపురం ఉంటున్నా, తపస్సు కొనసాగించిన దయాసాగరులు మీరు. మీ పాదధూళితో నా నివాసం పావనమైంది. దయచేయండి’ అంటూ ఆహ్వానించి, ఉచిత మర్యాదలు చేశాడు. తులాధారుడి మాటలకు జాబాలి నివ్వెరపోయాడు. ‘నా సంగతంతా నీకెలా తెలిసింది?’ అని ప్రశ్నించాడు. ‘మహర్షీ! నాకు దేనిమీదా మమకారం లేదు. ఎవరిమీదా రాగద్వేషాలు లేవు. ధర్మబద్ధంగా జీవించడం మాత్రమే తెలుసు. నా మనస్సు తామరాకు మీద నీటిబొట్టులా ఉంటుంది. అందుకే మీ ఘనతను తెలుసుకోగలిగాను’ అని బదులిచ్చాడు తులాధారుడు. ‘అయితే, నేను ధర్మమార్గంలో జీవించడం లేదంటావా? నేను సాగిస్తున్న జపతపాదులు ధర్మం కాదంటావా?’ కాస్త కోపంగా ప్రశ్నించాడు జాబాలి. ‘మునివరేణ్యా! మీకు తెలియనిదేముంది? అహంకారంతో చేసిన తపస్సును, ప్రతిఫలాపేక్షతో చేసిన యజ్ఞాన్నీ దేవతలు మెచ్చరు. నిత్య తృప్తికి మించిన యజ్ఞం లేదు. దానివల్ల దేవతలతో పాటు మనమూ తృప్తి పొందుతాము’ అన్నాడు తులాధారుడు. ‘అయితే, నీ వర్తకం మానుకోవేం? నీది ధనాశ కాదా?’ అక్కసుగా అడిగాడు జాబాలి. ‘కర్తవ్యాన్ని విడిచిపెట్టడం తగదు. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను అంతే’ అని బదులిచ్చాడు తులాధారుడు. కావాలంటే ఇన్నాళ్లూ మీ తలపై ఆశ్రయం పొందిన పిచుకలను అడగండి అని అన్నాడు. వాటిని పిలిచాడు జాబాలి. వెంటనే అతడి తలపై ఉన్న పక్షులు రివ్వున పెకైగిరి ఆకాశమార్గాన నిలిచాయి. ‘మేము ధర్మదేవత భటులం. ఆయన ఆజ్ఞ మేరకు నిన్ను పరీక్షించడానికి వచ్చాం. మత్సరం వల్ల నీ తపస్సు నశించింది. మత్సరం మంచిది కాదు. అది సర్వధర్మాలనూ నాశనం చేస్తుంది’ అని చెప్పి అంతర్ధానమైపోయాయి. వాటి పలుకులతో జాబాలికి జ్ఞానోదయమైంది. ‘అనవసరంగా నీపై మత్సరం పెంచుకున్నాను. క్షమించు’ అని చెప్పి తులాధారుడి వద్ద సెలవు తీసుకుని, తిరిగి తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి బయలుదేరాడు. -
బంగారు పిచ్చుక మళ్లీ పాడుతుందా?
ఏప్రిల్ 22న ధరిత్రీ దినోత్సవం కవులు ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించడం శతాబ్దాలుగా తెలిసినదే. ప్రత్యేకించి ఆంగ్ల సాహిత్యంలో ప్రకృతి కవిత్వం అనగానే విలియం వర్డ్స్ వర్త్ (1770-1850) రాసిన ‘సాలిటరీ రీపర్’, ‘టు ది కకూ’, జాన్ కీట్స్ (1795-1821) రాసిన ‘ఓడ్ టు ఎ ఆటమ్’, ‘ఓడ్ టు ఎ నైటింగేల్’ వంటి చక్కటి కవితలు గుర్తుకొస్తాయి. కవితా ప్రపంచంలో ఇటీవల వినవస్తున్న సరికొత్త పదం ‘పర్యావరణ కవిత్వం’. ప్రకృతి, పర్యావరణం యొక్క సౌందర్యాన్ని కాక ‘పర్యావరణ పరిరక్షణ’ వస్తువుగా రాసేవి పర్యావరణ కవిత్వం (ఇకో పొయెట్రీ) కిందికి వస్తాయి. అమెరికాలో 1970లో మొదటిసారి ‘ఎర్త్ డే’ శిఖరాగ్ర సభ జరిగింది. అప్పటినుంచీ 192 దేశాలలో ఏప్రిల్ 22ను ‘ఎర్త్ డే’గా పాటిస్తూ పర్యావరణ పరిరక్షణ చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ స్ఫూర్తితో రాబిన్సన్ జెఫర్స్, మేరీ ఆలివర్, డబ్ల్యూ.యస్.మెర్విన్, వెండెల్ బెర్రీ, లిండా హోగన్ వంటి పర్యావరణ కవులు తమ తమ ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణకు ఉద్యమించారు. పితృస్వామ్య వ్యవస్థ కారణంగా స్త్రీలకూ, ప్రకృతికీ అన్యాయం జరుగుతున్నందున ఆ విషకౌగిలి నుండి ప్రకృతినీ, స్త్రీలనూ కాపాడే లక్ష్యంతో ‘ఇకో-ఫెమినిజం’ కూడా మొదలైంది. పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల ప్రభావం మన దేశం మీద కూడా పడింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51-ఎ(జి) ప్రకారం అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో కూడిన సహజ పర్యావరణాన్ని సంరక్షించి అభివృద్ధి చేసుకోవడం, ప్రాణులన్నిటి పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుని ప్రాథమిక విధి. ఈ వెలుగులో ఖమ్మం జిల్లాకు చెందిన చేకూరి శ్రీనివాసరావు ‘ఇకో పొయెట్రీ’ రాశారు. కాలుష్యం, భూతాపం, ఓజోన్‌పొర తరిగిపోవడం, ఎడారులు పెరిగిపోవడం, జీవ జాతులు అంతరించిపోవడం గురించి ఆందోళన వెలిబుచ్చారు. ఒక కవితలో వసంత మాసాన్ని ఎక్కడా కోయిలల ప్రతిధ్వనులే వినరాని నిశ్శబ్ద ఆమనిగా వర్ణిస్తారు. జీవ వైవిధ్యానికి సంకేతంగా వనమంతా ప్రతిధ్వనించే పక్షుల సుస్వరమైన కిలకిలారావాలు, కాకుల కాకలీ స్వనములు, కోతుల కిచకిచల వంటి ధ్వనులు - మొత్తంగా మటుమాయమై ప్రకృతి నీరవమయిందంటారు. వసంత రుతువులో తమ గాన మాధుర్యంతో ఓలలాడించిన పక్షులన్నీ కీటకనాశినులు వాడిన పంటలు తిని హతమయ్యాయట. ఆ వసంత రుతువులో బంగారు పిచ్చుక శ్రావ్యమైన గానం వినబడనే లేదంటారాయన. మరో కవితలో గాంధీజీని పర్యావరణ కర్మయోగిగా అభివర్ణిస్తారు. ఇంకో కవితలో మతాలన్నీ వృక్షాలను పూజించమని చెప్పాయనీ, దాని అర్థం వృక్షాల విలువ తెలుసుకుని వాటిని సంరక్షించాలనేనంటారు. ఇంకొక కవితలో తమ గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వైరా నదిలో ఇసుక మాఫియా దుశ్చర్యలను ప్రస్తావిస్తూ, ఈ దోపిడీని అరికట్టడానికి బొలీవియా, కోస్టారికా దేశాల్లో లాగా మనదేశంలోనూ సహజ వనరులకూ హక్కులు కల్పిస్తూ చట్టాలు చేయాలంటారు. ముత్తేవి రవీంద్రనాథ్ 9849131029 -
పిచ్చుక మచ్చుకైనా లేదే..!
నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఎండు పుల్లల పిచ్చుక గూళ్లు చూడటం ఎంత ముచ్చటగా ఉంటుందో, అవి పెట్టిన గుడ్లను లెక్క పెట్టడం ఎంత సంతోషాన్నిస్తుం దో..! పిచ్చుకల గురించి ఈ తరానికి కథలాగ చెప్పడం తప్ప వాటితో మనకున్న అనుబంధం, ఆ అనుభూతిని వర్ణించలేము. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో పిచ్చుకలు అంతరించిపోతున్నాయనే ఆవేదన పక్షి ప్రేమికులను ఆవేదనకు గురి చేస్తోంది. - బంజారాహిల్స్/సిటీ బ్యూరో కనుమరుగవుతున్న ఖాళీ స్థలాలు...పెరుగుతున్న ఆకాశ హర్మ్యాలు...గొడ్డలి వేటుకు నేలకొరుగుతున్న చెట్లు...సెల్పోన్ల నుండి వెలువడుతున్న రేడియోధార్మికత ఇవన్నీ కలిసి ఒకప్పుడు కిలకిలా రావాలతో కళకళలాడిన ఊరపిచ్చుకలు అంతర్ధానమయ్యాయి. మెల్లమెల్లగా ఊరపిచ్చుక అరుదైన పక్షి జాబితాలోకి చేరిపోయింది. దశాబ్దం క్రితం వరకూ నగర వ్యాప్తంగా బర్డ్ వాచర్స్ లెక్కల ప్రకారం 10 వేలకుపైగా ఊరపిచ్చుకలు కిచకిచమంటూ నగరవాసికి సరికొత్త అనుభూతిని కలిగించేవి. అయితే ఇప్పుడా జాతి దాదాపుగా అంతిమ దశకు చేరుకోవడం పట్ల పక్షి ప్రియులు, పర్యావరణ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం నగర వ్యాప్తంగా పచ్చదనం, బాగా చెట్లు ఉన్నచోట మాత్రమే 500 వరకూ పిచ్చుకలు ఉన్న ట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతరించిపోతున్న పిచ్చుకలను కాపాడుకొనేందుకు వాటి మనుగడ కొనసాగి భావితరాలకు వాటి ప్రాముఖ్యతను తెలిపేందుకు వీటిపై అవగాహన కలిగించేందుకు, చైతన్యం తీసుకురావడానికి ప్రతియేటా మార్చి 20వతేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుతున్నారు.ఇందులో భాగంగానే పర్యావరణ నిపుణులు, పక్షి ప్రియులు ఈ రోజున పిచ్చుకల అవగాహన కార్యక్రమాన్ని చేపడుతూ వీటిని రక్షించుకొనే తరుణోపాయాలు చర్చిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు. 90 శాతం కనుమరుగు... జంట నగరాల్లో 90 శాతం పిచ్చుకలు కనుమరుగయ్యాయని ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ప్రసన్న కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తలుపులు, కిటికీలు మూసి ఉంచడం, పక్షి నిలబడే చోటు లేకపోవడం ఇందుకు కారణమని తెలిపారు. జీవవైవిద్యానికి పిచ్చుక మచ్చుతునక అని ఈ రోజు దాని ఆనవాళ్ళు కోల్పోతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో శాంతినగర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, బేగంపేట ఎయిర్పోర్ట్, నాగోల్, వివేకానందనగర్, కేబీఆర్పార్క్ ప్రాంతాల్లో మాత్రమే పిచ్చుకలు కనబడుతున్నాయని వెల్లడించారు. అంతరించిపోతున్న పిచ్చుక జాతిని రక్షించడం, వాటి ఆవాసాలను గుర్తించి సదుపాయాలను ఏర్పాటుచేయడం లక్ష్యంగా సిటిజన్స్ యాక్షన్ ఫర్ లోకల్ బయోడైవర్టీస్ అండ్ కన్జర్వేషన్ (కాల్‌బ్యాక్) అనే సంస్థను పర్యావరణ నిపుణురాలు రజినీ వక్కలంక ఏర్పాటుచేశారు. అత్తాపూర్‌లోని తాను నివసిస్తున్న ఆంబియన్స్ ఫోర్ట్ కాలనీలో పిచ్చుకల కోసం గూళ్ళు ఏర్పాటు చేశారు. కాలనీ బయట ఉన్న పార్క్‌ను పూర్తిగా పిచ్చుకల రక్షిత ప్రాంతంగా జీహెచ్ఎంసీతో కలిసి తీర్చిదిద్దారు. ఎవరైనా పిచ్చుకల గూళ్ళు కావాలంటే చెక్క ముక్కలతో తయారు చేయించి ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకూ వేయి మందికి ఇలా పిచ్చుక గూళ్ళు పంపిణీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు వీటి ప్రాముఖ్యతపై అవగాహన కలిగిస్తున్నారు. అంతేకాకుండా ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ స్కూల్స్ అనే అంశంపై ఉస్మానియాలో పీహెచ్డీ కూడా చేశారు. తన స్నేహితురాలు రంజని, సుజాతతో కలిసి పిచ్చుకల రక్షణకు నడుం బిగించారు. అవగాహన కల్పిస్తూ ముందుకు.. పిచ్చుకలను రక్షించుకోవడానికి కొన్ని ఫౌండేషన్లు సిటీలోని స్కూళ్లు, మాల్స్, రద్దీ ప్రదేశాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాయి. పిచ్చుకల విలువ తెలుపుతూ, వాటిని దూరం చేసుకోవడం ద్వారా మనం ఏం కోల్పోతున్నామో వివరిస్తున్నాయి. మనకు హానికరమైన కొన్ని రకాల సూక్ష్మజీవులను, పురుగులను అవి భక్షిస్తాయని తెలుపుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటే.. ఏఆర్‌పీఎఫ్ సంస్థ. వన్యప్రాణి ప్రేమికులైన కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, గృహిణులు వలంటీర్లుగా నిలిచి నేడు ‘ప్రపంచ పిచ్చుకల దినోత్సవం’ సందర్భంగా శనివారం సైక్లోథాన్, బైకథాన్, వాకథాన్ సైతం నిర్వహించారు. రక్షించుకోవాల్సిన పక్షి ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థిని హేమలత ఊరపిచ్చుకలు ఆవాసం ఏర్పాటు చేసుకునే ప్రాంతాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా విద్యార్థులు వీటిని కాపాడాలి. తమ ఇళ్ల ముందు అట్టపెట్టెలతో చిన్న గూళ్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అంతేకాదు నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పిచ్చుకలు వాలుతాయి. సెల్ఫోన్ల వాడకాన్ని తగ్గిస్తే ఈ పక్షి జాతి అంతరించిపోకుండా ఉంటుందని బోరబండ ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థిని హేమలత పేర్కొంది. కాపాడుకుందాం బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ 40వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించారు. బోరబండలోని ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థినులకు పిచ్చుకలపై అవగాహన కలిగించారు. ఫిలింషో నిర్వహించి పిచ్చుకలు, వాటి ఆవాసాలు, అవి కనుమరుగవుతున్న తీరును ఎంసీఆర్హెచ్ఆర్డీ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్ వివరించారు. పలు అంశాల్లో పోటీ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పిచ్చుక గూళ్లను అందంగా తయారు చేసిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ డెరైక్టర్ జనరల్ వినోద్ కె. అగర్వాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిచ్చుకగూళ్ల తయారీ.. ఇంట్లో ఉండే స్క్రాప్ వేస్ట్, ఉడెన్ పీసెస్‌తో పిచ్చుకల గూళ్లు తయారు చేయొచ్చు. అలా తయారు చేసిన పిచ్చుక గూళ్లను స్నేహితులు, ఆత్మీయులకు గిప్ట్గా కూడా ఇవ్వొచ్చు. తద్వారా వారిలో పిచ్చుకలు అంతరించిపోతున్న విషయంపై ఆలోచన రేకెత్తించగలం. అంతేకాకుండా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్నిటాలజీ విభాగం లాంటివి పిచ్చుక గూళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. ప్రతి ఇంట్లో కిటికీకో, మూల చివర్లోనో, పైన వెంటిలేటర్ మీదో, చెట్టుకో ఇలా తయారు చేసిన గూళ్లను అమర్చితే.. ఒకటీ అరా ఏవైనా వస్తే అవి నివసించడానికి అవకాశం కల్పించిన వారమవుతాం. కేవలం గూళ్లను అమర్చుకోవడమే కాకుండా చిన్న చిప్పల వంటి వాటిలో మంచినీరు పోసి దాబాల పైన, వరండాలలో ఉంచడం, చిరుధాన్యాలు, జొన్నలు, నూకలను అక్కడక్కడ వెదజల్లుతుండడం చేస్తే వాటికి ఆహారం కల్పించిన వారమవుతాం. తద్వారా వాటి రాకను స్వాగతించొచ్చు. అలాగే మనకు వీలు కుదిరితే టై గార్డెన్స్ పెంచడం కూడా పిచ్చుకలను మన ఇంటివైపు ఆకర్షిస్తుంది. -
ది లాస్ట్ స్పారో
చిన్నతనంలో పిచ్చుక కనిపిస్తే మచ్చిక చేసుకోవాలన్న ఉబలాటం. అది అందీ అందకుండా తుర్రుమంటుంటే... దాంతో మనసూ ఉరకలేసేది. మరి ఇప్పుడో... ఆ పిచ్చుకలు లేక ఇంటి చూరు చిన్నబోతోంది. తన జ్ఞాపకాలతో చేదబావి బోరుమంటోంది. ఆ పికిలి పిట్టల పాదముద్రల కోసం పచ్చని చెట్లు సైతం పరితపిస్తున్నాయి. ఇప్పటి తరానికి పిచ్చుకను చూపించాలంటే గూగుల్‌ను ఆశ్రయించాల్సిందే! ఆ పిచ్చుకల కిచకిచను వినిపించాలంటే పాత టేపుల దుమ్ము దులపాల్సిందే! నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సంద ర్భంగా... - శిరీష చల్లపల్లి మనసుకు ఉల్లాసాన్నిచ్చే ప్రకృతిలో పక్షులది మొదటిస్థానం. కిచకిచమంటూ ఇంటి చూరు చుట్టూ తిరిగే పిచ్చుకలంటే ఇష్టపడనివారుండరు. గడ్డిపోచలతో అవి గూళ్లు కడుతుంటే చూడటం, గుడ్లు పెట్టాక వాటిని లెక్కపెట్టడం, ఆహారం తెచ్చి పిల్లలకు పెడుతుంటే చూసిన ఆనందం, పిచ్చుక గూడు కూలినప్పుడు... కుమిలి ఏడ్చిన అనుభవం, వ్యవసాయంలో పురుగుల మందుల వాడకం, వాతావరణంలో మార్పులు... ఏవైతేనేం పిచ్చుకలు ఎగిరిపోయాయి. అవి అల్లుకున్న గూళ్లూ చెదిరిపోయాయి. నిరాటంకంగా సాగుతున్న చెట్ల నరికివేత, తరుగుతున్న అడవులు, సెల్ టవర్ల రేడియేషన్... ఆ చిన్ని పక్షుల ఉసురు తీస్తున్నాయి. ఫలితంగా పిచ్చుకలు అంతరిస్తున్న పక్షుల జాబితాలోకి చేరుతున్నాయి. అయితే, మించిపోయిందేమీ లేదు.. ఇప్పటికైనా నిద్రలేచి పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే పిచ్చుకలను కాపాడుకోవచ్చంటున్నారు ఏఆర్‌పీఎఫ్ ఫౌండర్ నిహార్. మనమే కాపాడాలి... ‘సిటీలో పిచ్చుకలకే కాదు... 28 రకాల ఇతర జాతి పక్షుల మనుగడకు భారీ ముప్పు వాటిల్లుతోంది. పొల్యూషన్ వల్ల పిచ్చుకలకు ప్రధాన ఆహారమైన క్రిమికీటకాలు చనిపోతున్నాయి. నగరమంతా కాంక్రీట్ బిల్డింగ్స్ నిండి... చెట్లు లేకుండా పోవడంతో పిచ్చుకలు కూడా లేకుండా పోతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోగలిగితే... వాటిని కొంతమేరకైనా రక్షించుకోగలిగినవారమవుతాం. సరదాగా ఓ హాబీలాగా పనికిరాని చెక్కముక్కలు, అట్టముక్కలను గూడులాగా తయారు చేసి... ఆ బాక్సులను బంధుమిత్రులు, స్నేహితులు, ఇరుగుపొరుగుకు ఇవ్వండి. ఇంటిబయట వెంటిలేటర్కో, కిటికీల మీద పెట్టడమో, ఇంటి ముందు చెట్ల కొమ్మలకు కట్టడమో చేయమనండి. ఒక్క పిచ్చుకలకే కాదు... ఇతర పక్షుల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. మొక్కలు నాటమని చెప్పడం కాకుండా.. గిఫ్ట్‌గా మొక్కలనే ఇవ్వాలి. సజ్జలు, నూకలు, జొన్నలు వంటి చిరుధాన్యాలని కూడా డాబాలపైన వెదజల్లండి. చిన్నచిన్న పాత్రల్లో వాటికి నీళ్లు పోసి ఉంచండి. ఇలాంటి చిన్నచిన్న పనులతో పర్యావరణాన్ని కాపాడితే మనతోపాటు పిచ్చుకలకూ బతుకునిచ్చినట్లవుతుంది. బయోడైవర్సిటీని కొంతైనా కాపాడినవారమవుతాం’ అని చెబుతున్నారు వాయిస్‌లెస్ బర్డ్స్ అండ్ యానిమల్స్ కోసం వాయిస్‌గా మారిన నిహార్. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు జలగం వెంగళరావు పార్క్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
పిట్ట కొంచెం పేరు ఘనం!
ప్లే టైమ్ చూడటానికి మన ఇళ్లల్లో కనిపించే పిచ్చుకలా కనిపిస్తున్నా పేరుకైతే ఇది ‘కింగ్‌బర్డ్’. ప్రధానంగా ఉత్తర అమెరికాలో కనిపిస్తూ ఉంటుంది. ఇది వలస పక్షి. సీజన్లను బట్టి సుదూర ప్రాంతం ప్రయాణించి జీవిస్తుంటుంది. మధ్య అమెరికాను మంచు దుప్పటి కప్పేసిన సమయాల్లో ఈ పక్షి జాతి పసిఫిక్ సముద్రంవైపు వెళ్లిపోతుంది. తీర ప్రాంతాల్లో వేసవి వేడి తగలగానే ఉత్తర అమెరికా మధ్యప్రాంతంలోకి వచ్చేస్తుంది. కొన్ని వేలమైళ్ల దూరం ప్రయాణించే శక్తిసామర్థ్యాలుంటాయి కింగ్బర్డ్కి. సాధారణంగా చిన్నచిన్న పక్షి జాతులకు రాబందుల నుంచి, గద్దల నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే కింగ్‌బర్డ్ మాత్రం అలాంటి వాటి చేతచిక్కదు. ఈ బుల్లి పక్షికి అడవి పిల్లుల, కుక్కల, నక్కల నుంచి ఎదురయ్యే ప్రమాదాలు కూడా తక్కువే. వాటన్నింటి బారి నుంచి తప్పించుకొనే అరుదైన పక్షిజాతి ఇది. 20 రోజుల వయసొచ్చే వరకూ ఈ పిట్టలు గూడుకే పరిమితమై ఉంటాయి. ఆ సమయంలో ఆడ, మగ పక్షులు రెండూ తమ పిల్లల పెంపకాన్ని బాధ్యతగా తీసుకొంటాయి. కీటకాలను, తేనెటీగలను, చిన్నచిన్న పురుగులను, చెట్లకు కాసే చిన్నచిన్న పిందెలను ఆహారంగా తీసుకొంటాయి. -
పిచ్చుకపై ప్రేమాస్త్రం
అనగనగా ఓ పిచ్చుకకి ఏడు పిల్లలు. వాటిలో ఓ పిల్ల ఏడ్చింది. ‘పిల్లా పిల్లా ఎందుకేడుస్తున్నావ్?’ అంటే ‘మా అమ్మ పురుగు పెట్టలేదు’ అంది. ‘పిచ్చుకా.. పిచ్చుకా.. పురుగెందుకు పెట్టలేదు?’ అంటే ‘పురుగు నాకు దొరకలేదూ’ అంది. ‘పురుగూ.. పురుగూ.. ఎందుకు దొరకలేదూ’ అంటే ‘తుమ్మకొమ్మ కనపడలేదూ’ అంది. ‘తుమ్మా.. తుమ్మా.. ఎందుకు కనపడలేదూ’అంటే ‘మనిషి కొట్టేశాడు’ అంది. ‘మనిషీ.. మనిషీ.. ఎందుకు కొట్టేశావూ’ అంటే.. ‘నా అందాల బంగళాకి అడ్డొస్తే కొట్టేయనా మరీ’ అన్నాడట! ఓసారి దుబాయ్ ప్రయాణంలో.. అర్ధరాత్రి ఎయిర్పోర్ట్ అంతా సందడిగా ఉంది. ప్రయాణికుల ముచ్చట్లు.. ఎనౌన్స్మెంట్ల సందడి.. అంత గోలలోనూ నా చెవిన పడిందో సడి.. పిట్టల కిచకిచలు! ఎయిర్‌పోర్ట్‌లో పిట్టలెందుకుంటాయి? నేచ్యురల్ ఆంబియెన్స్ కోసం పిట్టల శబ్దాలు రికార్డు చేసి వినిపిస్తున్నారా ఏంటీ అనుకున్నా. తేరిపార చూస్తే.. ఇండోర్ ప్లాంట్స్ కొమ్మల్లో కనిపించాయి నిజమైన పిచ్చుకలు. ఆశ్చర్యం.. కుతూహలం కలిగింది నాలో! చూరు కింది గూళ్లలో, అలికిడైతే ఉలికిపడే పిచ్చుకలు.. జనారణ్యంలో గింజలు వేసే చేతుల్లేక, కాంక్రీటు శ్లాబుల్లో చూరులేక మహానగరం నుంచి మాయమై పోయాయేమో అనుకున్నా. అలాంటిది ఇన్ని పిచ్చుకలు ఒక్కచోట కిచకిచలాడుతుంటే ముచ్చటేసింది. ఫుడ్‌కోర్టులో కిందపడ్డ పిజ్జా, శాండ్విచ్ ముక్కలను చిట్టిముక్కులతో ఏరుకుంటూ అడుగుల సవ్వడికి అద్దాల చూరులోకి చేరుతూంటే.. పాపం.. వాటికి సరిపడని అసహజ పోకడలు నేర్చుకున్నాయా అనిపించింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే కాదు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లోనూ పిచ్చుకలు, గోరింకలు కనిపిస్తాయి. ఆ చిట్టి పిచ్చుకలు కేవలం కొన్నిచోట్లకే ఎందుకు పరిమితమవుతున్నాయి? సమాధానం తెల్సుకోవాలంటే రజనీ వక్కలంకను కలుసుకోవాల్సిందే! చెట్టుచెట్టుకీ పిట్టగూడు రజనీ వక్కలంక.. పిట్ట కనిపిస్తే చాలు బుట్టపట్టుకు బయలుదేరుతుంది ఈ పిచ్చితల్లి, సారీ.. పిచ్చుకలతల్లి. పిట్టల్ని బుట్టల్లో పట్టాలని కాదు ఆ బుట్టలని ప్రతిచెట్టుకు పిట్టగూళ్లని చేయాలని. తుమ్మకి, పిచుకమ్మకీ దగ్గర సంబంధం ఉందని ఆమెని కలిశాకే నాకు తెలిసింది. తుమ్మ, నిమ్మ, రేగు వంటి ముళ్లచెట్లలో ఉండే పురుగులే వాటికి జీవనాధారం. పెద్దపిచ్చుకలు పురుగులతో పాటు గింజలు, మెతుకులపై బతగ్గలుగుతాయి. కానీ పిల్లలకి మాత్రం కీటకాలే ఆహారం! పిచ్చి మొక్కలని తుమ్మను కొట్టేస్తాం.. రేగు,నిమ్మను సాగుచేయం నగరంలో! ఇక వాకిట్లో పిచ్చుకల సందడి ఏముంటుంది? ఎయిర్‌పోర్ట్‌లో పిచ్చుకలు ఎందుకున్నాయో అర్థమయింది. చుట్టూ ఖాళీ భూముల్లో తుమ్మచెట్లే మరి! కుక్క, కాకి, పావురం.. పిచ్చుక లాంటివి మానవజాతికి దగ్గరగా జీవిస్తాయ్. మనిషికి దగ్గరగా ఉంటే శతృవుల నుంచి రక్షణ పొందవచ్చని.. కానీ మనిషే ప్రమాదమైతే ఇంకెక్కడ మనగలుగుతాయ్? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే ఇదేనేమో! ఉద్యోగాన్ని సైతం వదులుకుంది వేగంగా అంతరించిపోతున్న పక్షిజాతుల్లో పిచ్చుక ఒకటి. అందుకే వాటిని ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) రెడ్‌లిస్ట్‌లో పెట్టేసింది. ఆర్నితాలజిస్టులు, ఎన్విరాన్‌మెంటలిస్టులు.. ఈ పక్షులకోసం కృషిచేస్తున్నవారిలో మన హైదరాబాద్‌కి చెందిన ‘పక్షిష్టులు’ కూడా ఉన్నారు. సికింద్రాబాద్‌కు చెందిన కీర్తిమెహతా అనే వర్తకుడు తన వ్యాపారంతో పాటు పిచ్చుకలకు చెక్కగూళ్లు తయారుచేయించే ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఇక రజని కూడా పక్షులపై అవగాహన కలిగించేందుకు స్కూళ్లు, కాలనీలు తిరుగుతూ చేస్తున్న ఉద్యోగాన్నీ వదులుకుంది. పిచ్చుకసైన్యం నగరంలోని పక్షి ప్రేమికులంతా కలిసి ఓ పిచ్చుకసైన్యంగా ఏర్పడ్డారు. తుమ్మ, నిమ్మ చెట్లున్న చోట చెక్కడబ్బాలు తగిలించేస్తారు. అందులో పుల్లాపరకా చేర్చి పిచ్చుక గూడు కట్టుకుంటే వీళ్లు సొంతింటి గృహప్రవేశంలా సంబరాలు జరుపుకుంటారు. త్రికరణశుద్ధి ఏదీ? కాప్11 సమావేశాలప్పుడు హడావుడిగా నగరాన్ని పర్యావరణానికి అనుకూలంగా ఉంచేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. కానీ కొనసాగించే త్రికరణ శుద్ధి ఏదీ? ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేయకండి’ అంటూ బోర్డులు పెట్టిన జీహెచ్ఎమ్సీ ప్రత్యేకంగా పిచ్చుకల కోసం చేసిందేమీ లేదు. వారి అధీనంలో ఉన్న పార్కులో ఖాళీస్థలాల్లో తుమ్మ మొక్కల కోసం ఒక మూలను కేటాయిస్తే చాలు! పార్కుల్లో మొక్కలన్నింటినీ అలంకరణ కోసమే నాటాలా ఏంటీ? ఆ మాటకొస్తే అందంగా కత్తెర వేస్తే తుమ్మకొమ్మ కూడా క్రోటాన్ కంటే సుందరంగా ఉంటుంది. ఈ దిశగా జీహెచ్ఎమ్సీ కదలాలంటే చాలా ప్రణాళికలు కుదరాలి. కానీ మనమంతా కలిశామంటే చిట్టిపి ట్టలకు గట్టిసాయం చేయొచ్చు. ఏం చేయొచ్చు..? జొన్నల లాంటి పెద్దగింజలను పావురాల్లాంటి పెద్ద పక్షులే తినగలుగుతాయి. సన్నగా ఉండే ర్యాల, సజ్జ వంటి చిరుధాన్యాలు పెడితే చిన్నపిట్టలూ తింటాయి. డాబాపై అక్కడక్కడా నీటి పాత్రలు పెట్టొచ్చు. పిచ్చుకల కోసం చెక్కగూళ్లను తయారు చేయించి పెడ్తున్న కీర్తిమెహతాలాంటి వాళ్లకు ఇంట్లో వాడేసిన పాత చెక్కపెట్టెలను, చెక్కముక్కలను డొనేట్ చేసి సహకరించవచ్చు. మన చుట్టుపక్కల పిచ్చుకల సందడి ఉంటే ఇఅఔఆఅఇ (సిటిజన్స్ యాక్షన్ ఫర్ లోకల్ బయోడైవర్సిటీ అవేర్నెస్ అండ్ కన్జర్వేషన్) నిర్వహిస్తున్న రజనీకి తెలియజేయొచ్చు. ఆమె పిచ్చుకల సైన్యంలో మనమూ వాలంటీర్స్‌గా చేరొచ్చు(asaveri92@yahoo.com) ఇవేవీ చేసే ఓపిక లేకపోతే కనీసం ఉదయాన్నే పక్షుల జిలిబిలి పలుకులని వినండి చాలు.. మన మనసుకూ రెక్కలొచ్చేస్తాయ్!