
ఎంత అందంగా ఉన్నానో నేను.. అనుకుంటూ మురిసిపోతోంది ఈ పిచ్చుక. ఒకప్పుడు పొద్దున లేవగానే కిచ్‌కిచ్ అంటూ చప్పుడు చేస్తూ అల్లరి చేసే పిచ్చుకలు పెరిగిన పర్యావరణ కాలుష్యం దృష్ట్యా కనుమరుగైపోయాయి. చాలా తక్కువ సంఖ్యలో అవి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అలాంటి ఓ పిచ్చుక గాల్లో వెళ్తూ వెళ్తూ ఓ బైక్‌కు ఉన్న అద్దంను చూసి దాని ముందు వాలి హొయలొలికించింది.. మళ్లీ మళ్లీ చూసుకుంటూ సంబురపడిపోయింది. నిజామాబాద్ జిల్లాలోని కుర్నాపల్లి గ్రామ శివారులో ఓ బైక్ వద్ద పిచ్చుక చేసిన అల్లరి ఇది..
– సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్