photography
-
రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ఆరాధ్య దేవి 'వైల్డ్' ఫోటోగ్రఫీ.. (ఫొటోలు)
-
వెడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ అటెన్షన్! (ఫొటోలు)
-
Younus Farhan: క్లౌడ్ ఫొటోగ్రఫీ.. ఓ మేఘ సందేశం
ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉండే మేఘాన్ని ఎప్పుడైనా పలకరించారా..?? ఒంటరిగా ఉండే ఆకాశంతో ఫ్రెండ్షిప్ చేశారా..?? అసలు ఆకాశం మేఘాల ఆకారంలో మనతో మాట్లాడుతుందని మీకు తెలుసా..? ప్రకృతి పంపిన సందేశం మేఘాలని మీకసలు తెలుసా...?? అయితే ఇవన్నీ నాకు తెలుసు అంటున్నారు నగరానికి చెందిన ప్రముఖ క్లౌడ్ ఫొటోగ్రాఫర్ యూనస్ ఫర్హాన్. మేఘంలో అమోఘం కనిపిస్తుంది అతడికి. స్కై కాన్వాస్‌పై నేచర్ చేసిన సిగ్నేచర్‌ను అతడి కెమెరా ఇట్టే బంధిస్తుంది. తను క్లిక్‌మనిపించే మేఘాల ఫొటోల్లో ఓ సందేశం ఉంటుంది. ఆత్మీయత, పర్యావరణం, సమానత్వం, జంతువులు, వింతలు, విశేషాలు.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.. అతడి క్లౌడ్ ఫొటోగ్రఫీలో నిక్షిప్తమై ఉంటాయి. 2011లో మన భారత దేశానికి క్రికెట్ వరల్డ్ కప్ వస్తుందనే మేఘ సందేశాన్ని 3 నెలల ముందే క్లిక్‌మనిపించి అందరితో ఔరా అని అనిపించుకున్నారు. స్కూల్ కిటికీలోంచి కనిపించిన మేఘంతో మొదలైన తన ఫ్రెండిషిప్ ప్రకృతి సందేశానికి మేఘాలు వారధులని నిరూపించే వరకు వచి్చందని యూనస్ ఫర్హాన్ అంటున్నారు. ఇప్పుడు అతడి మనసంతా మేఘావృతమైంది. అసలు అతని ప్రయాణమేంటో.. ఆయన చెప్పే మేఘ సందేశమేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందామా..!? మేఘంతో నా సాన్నిహిత్యంచిన్నతనంలో 3 నుంచి 7వ తరగతి వరకు నల్లగొండలోని ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు నాకున్న ఏకైక ఫ్రెండ్ మేఘం. అలా కదులుతూ వెళ్లే మేఘాలు నన్ను ఆకర్షించేవి. వాటి ప్రయాణంలో ఏదో అర్థం ఉందనిపించేది. వాటితో అలా మొదలైన నా స్నేహం 8వ తరగతిలో నాన్నకు ఉన్న చిన్న కీప్యాడ్ ఫోన్‌తో ఫొటోలు తీయడం నుంచి మరింత పెరిగింది. హాబీగా మొదలైన క్లౌడ్ ఫొటోగ్రఫీ కెరీర్‌గా మారింది. మొదట్లో మేఘాల్లో దాగి ఉన్న జంతువుల ఆకారాలను గుర్తించి క్లిక్మనిపించేవాడిని. అనంతరం అవే మేఘాలు నాకు చెప్పే కథలను ఫొటోలు తీయడం వరకూ సాగింది. ముఖ్యంగా 2011లో భారత్ వరల్డ్ కప్ గెలిచే కన్నా 3 నెలల ముందే.. వరల్డ్ కప్ ఆకారమున్న మేఘాలు నాకు ఆకాశంలో కనిపించాయి. వాటిని క్లిక్‌మనిపించాను. ఆ తరువాత అదే నిజమైంది. భారత్ వరల్డ్ కప్ గెలిచింది. అప్పుడు నా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నాకు గుర్తింపునిచ్చాయి. ఆ సమయంలో నన్ను మొదట గుర్తించింది ‘సాక్షి’దినపత్రికనే. సాక్షి టీవీ స్టూడియోకు ఆహ్వానించి నా అభిరుచిని అభినందించింది. అనంతరం తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కొనసాగుతున్న సమయంలో, 2013 జూన్ 27న ఆకాశంలో తెలంగాణ రాష్ట్రాన్ని పోలిన మేఘం కనిపిస్తే, ఫొటో తీశాను. నాకు ముందే అందించిన మేఘ సందేశంలా దానిని భావించాను. ఇలా ఎన్నో విషయాలను నేను మేఘంలోనే వెతుక్కుంటాను. నార్కోటిక్స్ డే ప్రచారంగా.. నేను మొదటిసారి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రకృతిలోని ప్రతీ జీవి సమానం అనే సందేశాత్మకంగా ఉన్న మేఘాన్ని బంధించాను. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సందేశమున్న క్లౌడ్ షేప్‌ను కూడా ఫొటో తీశాను. వరల్డ్ నార్కోటిక్స్ డే రోజు నేను తీసిన ఫొటోను సంబంధిత శాఖ అధికారులు అధికారికంగా ఆవిష్కరించారు. అంతేకాకుండా పోలీసు శాఖకు చెందిన వీసీ సజ్జనార్, సీవీ ఆనంద్, మహేష్ భగత్ వంటి అధికారులు ఈ ఫొటో పోస్టర్లను ప్రత్యేకంగా ఆవిష్కరించి అభినందించారు. బయోడైవర్సిటీ, పర్యావరణం, జంతువులకు సంబంధించి నేను తీసిన పలు మేఘాల ఫొటోలు నన్ను ప్రపంచానికి పరిచయం చేశాయి. భాషా సాంస్కృతిక శాఖ ప్రోత్సాహం సోషల్ మీడియాలో నా క్లౌడ్ ఫొటోగ్రఫీ గురించి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నా ఫొటోలకు సముచిత స్థానాన్ని కలి్పంచారు. రవీంద్ర భారతిలో మొదటి క్లౌడ్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహం అందించారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లిటరరీ ఫెస్టివల్లో, ఇతర కాలేజీల్లో ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాను. మేఘాల్లో దాగి ఉన్న జంతువుల ఫొటోలు నచ్చి నగరంలోని జవహర్లాల్ నెహ్రూ జులాజికల్ పార్క్ వారు ఆహా్వనించగా అక్కడ కూడా ప్రదర్శించాను. మైసూర్ యూనివర్సిటీ, బెంగుళూరు యూనివర్సిటీలో కూడా క్లౌడ్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చేరాలి2009 నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 వేల సందేశపు మేఘాలను నా కెమెరాలో బంధించాను. నేను ఫొటోగ్రఫీలో ఎలాంటి కోర్సులు చేయలేదు. ప్రకృతి తన సందేశాన్ని సమాజానికి అందించడానికి నన్నొక వారధిలా మార్చుకుందని నమ్ముతాను. ప్రస్తుతం మాస్టర్స్ హిస్టరీ చేస్తున్నాను. తెలంగాణతోపాటు అరబ్ దేశాలు, అమెరికా వంటి దేశాలను పర్యటించి క్లౌడ్ ఫొటోలను తీయాలి. ఈ మేఘసందేశాన్ని ఒక సబ్జెక్ట్ లేదా థియరీలా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆవిష్కృతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. – యూనస్ ఫర్హాన్ క్లౌడ్ ఫొటోగ్రాఫర్ -
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.. ‘సాక్షి’ స్పెషల్ ఫొటోలు
-
హార్ట్ ఆఫ్ ఆదివాసి..
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నగరంలోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా ప్రారంభించిన ఫొటో ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ సతీష్ లాల్ దాదాపు 14 ఏళ్లు దేశంలోని 20 రాష్ట్రాల్లో తిరిగి 40కి పైగా ఆదివాసి తెగలపై తీసిన అద్భుత డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు.ఆదివాసి సంస్కృతులు, వారి జీవన విధానం, వేషధారణ, పండుగలు, మేళాలు తదితర అంశాలపై తీసిన పరిశోధనాత్మక ఫొటోల సమాహారమని సతీష్ లాల్ తెలిపారు. ఈ డాక్యుమెంటరీకి గత సంవత్సరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రశంసలు అందుకున్నానని గుర్తు చేశారు. తను తీసిన 65 ఆదివాసి ఫొటోలు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఆదివాసి ఆర్ట్ మ్యూజియంలో శాశ్వతంగా కొలువుదీరాయని అన్నారు. -
ఫుడ్ ఫోటోగ్రఫీ పోటీ, అద్భుతమైన పోటోలు
-
పాస్ట్ కు పోదాం చలో చలో!
వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్బలమైన పునాది΄ాత ఫ్యాషన్లు కొత్త ట్రెండ్ కావడం మనకు కొత్తకాదు. డిజిటల్ ఫొటోగ్రఫీ ఒక రేంజ్లో ఉన్న ఈ కాలంలోనూ యువత కాలం వెనక్కి వెళ్లి పాత కెమెరాలను పలకరిస్తోంది. ఫిల్మ్ ఫోటోగ్రఫీపై మనసు పారేసుకుంటుంది. పాత కెమెరాలు కొత్తతరం చేతుల్లోకి వస్తున్నాయి. యూట్యూబ్‌లో అనలాగ్ ఫొటోగ్రఫీ ట్యుటోరియల్స్‌కు ఆదరణ పెరుగుతోంది. పాత ఇల్‌ఫర్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్‌లు కొత్తగా దిగుమతి అవుతున్నాయి. ఈ రీసర్జెన్స్ ధోరణి గురించి..పాస్ట్ కు పోదాం చలో చలో! హైయర్ రిజల్యూషన్స్, తక్కువ వెలుతురులో కూడా బెటర్ పర్ఫార్మెన్స్, స్మార్ట్ ఫోకసింగ్,షేక్ రిడక్షన్... లేటెస్ట్ డిజిటల్ కెమెరాల గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ యువతలోని ఫొటోగ్రఫీ ప్రేమికులు కొందరు కాలం వెనక్కి వెళుతున్నారు. తాము పుట్టని కాలంలో ఉపయోగించిన కెమెరాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. డిజిటల్ కెమెరా ఇండస్ట్రీ శిఖరస్థాయిలో ఉన్న ఈ కాలంలో ΄ాత కెమెరాలకు ఆదరణ, అది కూడా యూత్ నుంచి ఆనేది ఆశ్చర్యకరమైన విషయమే. దిల్లీలోని చాందిని చౌక్‌లో రెండు దశాబ్దాలుగా కెమెరాలను రీపేర్ చేస్తున్నాడు కపిల్ ఇంద్రజిత్ వోహ్ర. ఇతడి పేరు ఫిల్మ్–ఫొటోగ్రఫీ ప్రేమికులలో ΄ాపులర్ అయింది. కొంతకాలం వరకు వయసు మళ్లిన వారే తమ దగ్గరకు ΄ాత కెమెరాలను పట్టుకువచ్చేవారు. ఇప్పుడు యూత్ ఎక్కువగా వస్తున్నారు. కెమెరాల గురించి తమ సందేహాలను అడుగుతుంటారు.యూత్ పాత కెమెరాలను పట్టుకొని తన దగ్గరకు రావడం, వింటేజ్ కెమెరాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం వోహ్రాకు చెప్పలేనంత ఆనందం కలిగిస్తోంది. ‘ఇదొక వేవ్’ అంటాడు వోహ్ర. కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి ΄ాత కెమెరా పట్టుకొని వోహ్ర దగ్గరికి వచ్చాడు. 22 వేలకు కెమెరాను అమ్మాలని చె΄్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ మాట వింటే ‘ఆశ–దోశ–అప్పడం వడ’ అనే మాట కచ్చితంగా వచ్చి ఉండేది. అయితే ఇప్పుడు పాత కెమెరా కొనుగోలు విషయంలో డబ్బు గురించి చాలామంది ఆలోచించడం లేదు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా అనలాగ్ ఫొటోగ్రఫీకి సంబంధించిన విషయాలు హల్చల్ చేస్తున్నాయి. యూట్యూబ్‌లో అనలాగ్ ఫొటోగ్రఫీ ట్యుటోరియల్ చానల్స్‌కు ఆదరణ లభిస్తోంది. గత రెండు మూడేళ్లుగా దేశవ్యాప్తంగా ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీలు, వాట్సప్ గ్రూప్‌లలో ΄ాత కెమెరాలకు సంబంధించిన విషయాలు, విశేషాలు, టిప్స్ అండ్ ట్రిక్స్‌ను షేర్ చేసుకుంటున్నారు. డిజిటల్ కెమెరాలో ఆటోమేటిక్ మోడ్‌లో యాంత్రికంగా షూట్ చేయడం చాలా సులభం. అయితే సృజనాత్మక ఫొటోగ్రఫీ లోతు΄ాతులు తెలుసుకోడానికి ΄ాత కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. పాతతరం ఫోటోగ్రఫీపై యూఎస్, యూరప్‌లలో కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆసక్తి ఇప్పుడు ఇండియా వరకు వచ్చింది. ‘ఆసియా–పసిఫిక్లలో ఫిల్మ్ ఫొటోగ్రఫీలో గణనీయమైన పెరుగుదల కనిపించింది’ అంటున్నాడు కొడాక్ అలారిస్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ క్లారా లో. వినియోగదారులలో 18–26 సంవత్సరాల వయసు మధ్య వారు కూడా ఉన్నారు. ‘ఫిల్మ్ ఫొటోగ్రఫీపై ఆసక్తి, ఆదరణ భారీగా పెరిగాయి. అసలు సవాలు ఏమిటంటే ఫిల్మ్, కెమికల్స్ చాలామందికి అందుబాటులో లేవు. డిస్ట్రిబ్యూటర్లు లేరు’ అంటున్నాడు చెన్నైకి చెందిన ఫొటోగ్రాఫర్ వరుణ్ గు΄్తా. అయితే ఇప్పుడు పరిస్థితులలో మార్పు వస్తోంది. కోల్‌కతాకు చెందిన ఫొటోల్యాబ్ ‘ఈస్టర్న్ ఫొటోగ్రాఫిక్స్’ ఇల్‌ఫర్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ స్టాకును మన దేశానికి తీసుకురావడం మొదలుపెట్టింది. చెన్నైలోని ‘సృష్టి డిజిటల్ లైఫ్’ ఇండియాలో ‘ఇల్‌ఫర్డ్’ అధికారిక పంపిణీదారుగా మారింది. ‘లాభాలను ఆశించి తీసుకున్న నిర్ణయం కాదు ఇది. భావోద్వేగాలతో కూడిన నిర్ణయం’ అంటున్నాడు ‘సృష్టి డిజిటల్ లైఫ్’ డైరెక్టర్, సీయీవో ఆర్.విజయ్ కుమార్. చివరాఖరికి చెప్పొచ్చేదేమింటంటే... ఫోటో తీయడానికి ఇప్పటి డిజిటల్ కెమెరాలలోని మీట నొక్కితే సరి΄ోతుంది. మనం ఫొటోగ్రాఫర్ అయి΄ోయినట్లే. అయితే ఎనలాగ్ షూటింగ్‌కు ఏ మీట ఎక్కడ ఉందో మాత్రమే తెలిసుంటే చాలదు. గ్లామర్ తెలియాలి. గ్రామర్ తెలియాలి. అందుకు పాత కెమెరాలే కొత్త ΄ాఠశాలలు. ఫొటోగ్రఫీకి సంబంధించిన ్ర΄ాథమిక శిక్షణ ఏ యూనివర్శిటీలోనూ తీసుకోలేదు. అయితే యూట్యూబ్ వీడియోల నుంచి ్ర΄÷ఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ వరకు నేర్చుకునే అవకాశం ఎక్కడ ఉన్నా నేర్చుకున్నాను. ఫొటోగ్రఫీలోని అత్యాధునిక టెక్నాలజీ గురించి మాత్రమే కాదు గత కాలపు టెక్నాలజీ గురించి తెలుసుకున్నాను. గతకాలపు ఫొటోగ్రఫీ సాంకేతికత గురించి అవగాహన చేసుకోవడం అంటే బలమైన పునాది ఏర్పాటు చేసుకోవడం లాంటిది. ఫొటోగ్రఫీ అభిరుచి ఉన్న వారు చదువు, ఉద్యోగం వదులుకోకుండానే ఎంజాయ్ చేయవచ్చు. ΄్యాషన్ను కెరీర్‌గా మలుచుకోవాలనుకుంటే మాత్రం రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలి. – అపురూప వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ -
ఎన్విరాన్మెంటల్ ఫోటోగ్రాఫర్లు.. ఈ ఏడాది విజేతలు వీళ్లే (ఫోటోలు) PHOTO CREDITS- EPOTY
-
ఎన్విరాన్మెంటల్ ఫోటోగ్రాఫర్లు.. ఈ ఏడాది విజేతలు వీళ్లే
పర్యావరణ కాలుష్యం. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఇది ఒకటి. ప్రపంచానికి పెద్ద విపత్తుగా మారిన పర్యావరణ కాలుష్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడమే పర్యావరణ ఫోటోగ్రఫీ. పర్యావరణం ఎదుర్కొంటున్న సమస్యల్ని హైలైట్ చేయడమే కాకుండా, తమ కెమెరా పనితీరుతో పర్యావరణ సంరక్షణ గురించి అనుక్షణం గుర్తు చేస్తారు. అలా ఈ ఏడాది కూడా అంతర్జాతీయ పర్యావరణ ఫోటోగ్రాఫర్ ఆప్ ది ఇయర్ విజేతలను ప్రకటించారు. చార్టర్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ (CIWEM) ఆద్వర్యంలో గత 16 ఏళ్లుగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 159 దేశాల నుంచి ప్రతిభావంతులైన ఫోటోగ్రాఫర్లు ఇందులో పాల్గొన్నారు. వారిలో ఆరుగురిని విజేతలుగా ప్రకటించారు. వాళ్లు తీసిన ఫోటోలు ఏంటి అన్నది తెలియాలంటే ఫోటోగ్యాలరీని క్లిక్ చేయండి. (ఫోటోగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇవిగివిగో... అవిగవిగో!
తాజాగా ఫోర్బ్స్ ఇండియా ‘డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించింది 24 సంవత్సరాల ఆకాంక్ష మోంగ. కన్సల్టెన్సీ జాబ్‌ను వదిలేసి ఫుల్‌టైమ్ ట్రావెలర్‌గా మారింది. పుణెకు చెందిన ఆకాంక్ష ట్రావెల్ అండ్ ఫొటోగ్రఫీ విభాగంలో మంచి పేరు తెచ్చుకుంది. ‘కంటెంట్‌ను ప్రేక్షకులకు వేగంగా చేరువ చేయడానికి సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయం లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి’ అంటుంది ఆకాంక్ష. డిజిటల్ క్రియేటర్లు నిలువ నీరులా, గోడకు కొట్టిన మేకులా ఉండకూడదు అనే స్పృహతో యువ క్రియేటర్లు ఎప్పటికప్పుడు కొత్త టాపిక్స్‌పైనే కాదు టూల్స్ గురించి కూడా అవగాహన చేసుకుంటున్నారు. క్రియేటర్–ఫ్రెండ్లీ టూల్స్‌కు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల అప్డేట్స్ను వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. కంటెంట్ మేకింగ్‌లో మరింత క్రియేటివిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.... రెండు నెలల క్రితం ‘మీ షార్ట్స్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకు వెళ్లండి’ అంటూ యూట్యూబ్ కొత్త క్రియేషన్ టూల్స్‌ను తీసుకువచ్చింది. అందులో ఒకటి కొలాబ్. ఈ టూల్‌తో సైడ్–బై–సైడ్ ఫార్మట్‌లో ‘షార్ట్’ను రికార్డ్ చేయవచ్చు. క్రియేటర్లు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవడానికి మల్టిపుల్ లే ఔట్ ఆప్షన్లు ఉంటాయి.గత నెలలో జరిగిన ‘మేడ్ ఆన్ యూట్యూబ్’ కార్యక్రమంలో క్రియేటర్స్‌కు ఉపకరించే కొత్త టూల్స్‌ను ప్రకటించింది కంపెనీ. ‘క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కు కొత్త టూల్స్ తీసుకురానున్నాం. క్లిష్టం అనుకునే వాటిని సులభతరం, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసే టూల్స్ ఇవి. క్రియేటివ్ పవర్‌కు దగ్గర కావడానికి ఉపకరిస్తాయి’ అన్నాడు యూ ట్యూబ్ సీయీవో నీల్ మోహన్.యూ ట్యూబ్ ప్రకటించిన కొన్ని టూల్స్.... డ్రీమ్ స్క్రీన్ యూట్యూబ్ షార్ట్స్ కోసం రూపొందించిన న్యూ జెనరేటివ్ ఫీచర్ ఇది. దీని ద్వారా తమ షార్ట్స్‌కు ఏఐ జనరేటెడ్ వీడియో లేదా ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేయడానికి వీలవుతుంది. పెద్దగా కష్టపడనక్కర్లేకుండానే పాప్ట్ ఇస్తే సరిపోతుంది. ‘డ్రీమ్ స్క్రీన్’ ద్వారా క్రియేటర్లు తమ షార్ట్స్‌కు న్యూ సెట్టింగ్స్ జ నరేట్ చేయవచ్చు. యూట్యూబ్ క్రియేట్ వీడియోలు క్రియేట్ చేయడానికి షేర్ చేయడానికి ఉపకరిస్తుంది. యూట్యూబ్ క్రియేట్ యాప్ ద్వారా ఖచ్చితత్వం, నాణ్యతతో కూడిన ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ కాప్షనింగ్, వాయిస్ వోవర్, యాక్సెస్ టు లైబ్రరీ ఆఫ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, రాయల్టీ–ఫ్రీ మ్యూజిక్... మొదలైనవి క్రియేటర్లకు ఉపయోగపడతాయి. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కాంప్లెక్స్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో పని లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకునేలా వీడియోలను సులభంగా క్రియేట్ చేయవచ్చు. క్రియేటర్ల నోట ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ అనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. ప్రస్తుతం దీన్ని ఫీచర్‌గా మలచనున్నారు. ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ వినిపిస్తున్నప్పుడు ఈ బటన్లను సింక్‌లోని విజువల్ క్యూతో హైలైట్ చేస్తుంది. ఏఐ ఇన్సైట్స్ యూట్యూబ్‌లో ప్రేక్షకులు చూస్తున్న కంటెంట్ ఆధారంగా వీడియో ఐడియాలను తయారు చేసుకోవడానికి వీలవుతుంది. అలౌడ్ ఆటోమేటిక్ డబ్బింగ్ టూల్ ద్వారా కంటెంట్‌ను ఎక్కువ భాషల్లో క్రియేట్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్తో ముందుకు వస్తోంది. వాటిలో ఒకటి క్రియేటర్లు ‘రీల్స్’లో టాప్ ట్రెండింగ్ సాంగ్స్ గురించి తెలుసుకునే అవకాశం. ఆ ఆడియోనూ ఎన్నిసార్లు ఉపయోగించారో తెలుసుకోవచ్చు. సేవ్ చేసి అవసరమైన సందర్భంలో వాడుకోవచ్చు. ట్రెండింగ్ టాపిక్స్ ఏమిటో కూడా తెలుసుకోవచ్చు. ‘ప్రస్తుతం పాపులర్ ఏమిటి?’ అనేది తెలుసుకోవడానికి కొత్త డెడికేటెడ్ సెక్షన్ క్రియేటర్లకు ఉపకరిస్తుంది’ అని చెబుతుంది కంపెనీ.‘రీల్స్’ను ఎడిట్ చేయడాన్ని సులభతరం చేయడానికి వీడియో క్లిప్‌లు, ఆడియో, స్టిక్కర్స్, టెక్ట్స్‌ను ఒకేచోటుకు తీసుకువచ్చింది. తమ కంటెంట్ పెర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవడానికి కొత్తగా తీసుకువచ్చిన ‘రీల్స్ ఇన్సైట్స్’తో యాక్సెస్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్తగా యాడ్ చేసిన ‘టోటల్ వాచ్ టైమ్’ మెట్రిక్, ‘యావరేజ్ టైమ్’ మెట్రిక్‌తో క్రియేటర్లు యాక్సెస్ కావచ్చు. రీల్స్‌లో ‘స్ట్రాంగర్ హుక్’ క్రియేట్ చేసి వీడియోను ఆకట్టుకునేలా చేయడానికి ఇది ఉపకరిçస్తుంది. అయిననూ... టెక్నాలజీ మాత్రమే సర్వస్వం, విజయ సోపానం అనుకోవడం లేదు యువ క్రియేటర్లు. ‘టెక్నాలజీ అంటే టూల్స్ మాత్రమే కాదు క్రియేటర్ పనితీరు. ప్రత్యేకత. సృజనాత్మకత’ అనే విషయంపై అవగాహన ఉన్న యువ క్రియేటర్లు నేల విడిచి సాము చేయడం లేదు. కంటెంట్, టెక్నాలజీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. -
ప్రపంచంలో ప్రతీది ప్రకృతితో ముడిపడి ఉంటుంది: జి.వి. ప్రసాద్
ఒక ఫొటో వెయ్యి పదాలకు సమానం. పక్షులు, వన్య్రప్రాణల ఫొటోలు తీయాలంటే, గంటల కొద్దీ వేచి చూడాలి. వాటి ప్రశాంతతకు భంగం కలగకుండా ఫొటోలు తీయడం కత్తిమీద సాములాంటిదే. పారిశ్రామికవేత్త, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.వి. ప్రసాద్‌కి మాత్రం అది ఆటవిడుపు. ఆయన దేశ విదేశాల్లో పర్యటించి తీసిన ఫొటోలతో ఇటీవల ‘ది బర్డ్స్ అండ్ బిలీఫ్స్’ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా... సాక్షితో సంభాషణ. ►ఔషధాల తయారీ రంగంలో తీరిక లేకుండా ఉండే మీకు, పక్షుల కోసం పర్యటనలు, ఫొటోగ్రఫీ హాబీ ఎప్పటి నుంచి? గత పది, పదిహేనేళ్లుగా ఫొటోగ్రఫీ చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి, స్వయంగా తీసిన ఫొటోల సమాహారమే ఈ పుస్తకం. కొన్ని ఫొటోలతో పుస్తకాన్ని తీసుకురావాలని, మరికొన్నింటితో ప్రదర్శన ఏర్పాటు చేయాలని నా ఆలోచన. గతంలో రెండు పుస్తకాలు ప్రచురించాను. ఒకటి అలాస్కా మీద, మరొకటి స్పితి వ్యాలీ. ఇది మూడో పుస్తకం. ► ‘బర్డ్స్ అండ్ బిలీఫ్స్’ లో మంచి కొటేషన్లు కూడా కనిపిస్తున్నాయి! నన్ను ప్రభావితం చేసే సూక్తులు కనిపించినప్పడు, విన్నప్పుడు పుస్తకంలో రాసుకోవడం నాకు పాతికేళ్లుగా అలవాటు. వాటిలో కొన్నింటిని ఇందులో పొందుపరిచాను. ఈ పుస్తకం నా అభిరుచికి, జ్ఞాపకాలకు నిలువుటద్దం. ►ఇందులో ఏఏ ప్రదేశాల పక్షులున్నాయి? మనదేశంలో దక్షిణాదిలో హైదరాబాద్, ఉత్తరాది నుంచి భరత్పూర్, కాన్హా నేషనల్ పార్క్. ఆఫ్రికా ఖండంలో కెన్యా, టాంజానియా, బొట్సువానా, నార్త్ ఆర్కిటిక్, అంటార్కిటికా తదితర ప్రాంతాల పక్షుల ఫొటోలున్నాయి. ఆంటార్కిటికాలో పెంగ్విన్స్ కూడా తీశాను. నార్త్ అమెరికాలో అలాస్కా కూడా కవర్ చేశాను. ఈ ప్రాంతాలలో కనిపించే పక్షులతో పాటు క్షీరదాలు, ప్రకృతి ఫొటోలూ తీశాను. కానీ, ఈ పుస్తకాన్ని మాత్రం పక్షుల కోసమే కేటాయించాను. ►వలస పక్షులు భారీగా వచ్చే ఆంధ్రప్రదేశ్, పులికాట్ సరస్సుకు వెళ్లారా? వెళ్లాను, ఫ్లెమింగో ఫొటోలు తీశాను. కానీ ఈ పుస్తకంలో ప్రచురించలేదు. ► బర్డ్ వాచింగ్ కోసం విభిన్నమైన అనేక ప్రాంతాలను సందర్శించారు. మీకు బాగా నచ్చిన ప్రదేశం, సందర్భం, ఫొటో ఏది? అలాస్కాలో ల్యాండ్ స్కేప్‌లు, మంచినీటి సరస్సులు, ఉప్పు నీటి చెరువులు, పొరలు పొరలుగా పేరుకుపోయిన మంచు... మొత్తంగా చూస్తే ప్రకృతి అద్భుతంగా స్ఫూర్తిదాయంగా అనిపిస్తుంటుంది. పెద్ద ఎలుగుబంట్లు, బాల్డ్ ఈగల్స్, సాల్మన్ చేపలతో పాటు రకరకాల చేపలుంటాయి. సముద్రం నుంచి మంచి నీటి సరస్సుల వైపుకు గుంపులుగా వచ్చే చేపల్ని చూడడం వర్ణించలేనటువంటి అనుభూతి. అలాగే మరొకటి... ఆఫ్రికాలో ప్రాణులు వలస వెళ్లడం. వైల్డ్ బీస్ట్ పెద్ద సంఖ్యలో నదిని దాటుతున్న దృశ్యం ఇప్పటికీ కళ్లముందు కదలాడుతోంది. ► ఆర్నిథాలజిస్టు ఆశిష్, కెమెరా మెళకువలు నేర్పిన సురేశ్ చిత్తూరి గురించి మీ పుస్తకంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు! ఆశిష్‌తో చాలా ఏళ్ల పరిచయం. వాళ్ల పిల్లలు, మా పిల్లలు క్లాస్మేట్స్. బర్డ్ వాచింగ్‌ను పరిచయం చేసింది ఆయనే. ఇక శ్రీనివాస హ్యాచరీస్ సురేశ్ చిత్తూరి కూడా నాకు మంచి మార్గదర్శి. ► ఎన్నిరకాల పక్షులను ఫొటో తీశారు? రెండువందలకు పైగా పక్షి జాతులను ఫొటో తీశాను. ► మీ పుస్తకంలో పాలపిట్ట, కాకి, కోకిల కనిపించాయి. కానీ రామచిలుక కనిపించలేదు! అలాగే కొల్లేటి కొంగలు, చిల్కా సరస్సులో విహరించే పక్షులను మేము తర్వాతి పుస్తకంలో చూడవచ్చా? రామచిలుకల ఫొటో తీశాను. కానీ, పుస్తకానికి ఫొటోల ఎంపికలో వదలిపెట్టాను. కొల్లేరు వెళ్లలేదు. చిల్కా సరస్సుకు వచ్చే ఏడాది వెళదామనుకుంటున్నాను. ► మీ నేపథ్యం మొత్తం హైదరాబాదేనా? లేదు, పాక్షిక హైదరాబాదీని. నాల్గవ తరగతి వరకు హైదరాబాద్‌లో చదివాను. తర్వాత నెల్లూరులో 12వ తరగతి వరకు, రెండున్నరేళ్లు చెన్నై అన్నా యూనివర్సిటీ, ఆ తర్వాత చికాగోలో ఇలినాయీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజినీరింగ్, మాస్టర్స్ పర్డ్యూ (Purdue University) యూనివర్సిటీలో పూర్తి చేసి హైదరాబాద్‌కి వచ్చాను. ► పుస్తకం విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని వన్య్ర΄ాణుల సంరక్షణ కోసం విరాళమని ప్రకటించారు. వన్య్రప్రాణుల సంరక్షణలో ప్రభుత్వం తగినంత శ్రద్ధ చూపట్లేదని అనుకుంటున్నారా? ప్రభుత్వం వన్య్రప్రాణుల సంరక్షణకు పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తోంది. కానీ, ప్రభుత్వం ఒక్కటే అన్నింటినీ పరిష్కరించలేదు. వ్యక్తుల విరాళాలు చాలా ఉపయోగ పడతాయి. పర్యావరణం, వన్య్రప్రాణుల పరిరక్షణ ముఖ్యమైన అంశం అని నేను మద్దతు ఇస్తున్నాను. ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తున్నాం. పుస్తక విక్రయాలతో వచ్చే డబ్బు నాకవసరం లేదు. ఉచితంగా ఇస్తే పుస్తకం గౌరవం తగ్గిపోతుంది. అందుకే విక్రయాలను మంచి పనికి విరాళంగా ఇవ్వాలనుకున్నాను. ► అంజిరెడ్డి (డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ వ్యవస్థాపకులు)గారు చెప్పినట్లుగా మన కుండ నిండిన తర్వాత, అదనంగా వచ్చి పడుతున్న నీటిని మరొకరికి ఉపయోగపడేలా చేయాలి అనే సూత్రాన్ని పాటిస్తున్నారా? ఆయన నుంచి అలాగే మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్నదేమిటి? మా నాన్నగారు (గ్రీన్ పార్క్ హోటల్ వ్యవస్థాపకులు) చాలా డీటెయిల్ ఓరియెంటెడ్. మనం చేస్తున్న పని గురించి సూక్ష్మ స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని చెబుతారు. వివరాలన్నీ సమగ్రంగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడేవారు. మా మామగారు (అంజిరెడ్డి) విజన్ చాలా విస్తృతమైనది. వారిద్దరినీ ఒకే ’ఫ్రేమ్’లో చె΄్పాలంటే... ‘అడవి అందులో చెట్లు’ అని చెప్పవచ్చు. అంజిరెడ్డి గారి ద్వారా అడవిని చూస్తే, మా నాన్న గారి ద్వారా అందులో వృక్షాలను చూశాను. ► పాఠకులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ‘ప్రపంచంలోని ప్రతిదీ ప్రకృతితో ముడిపడి ఉంటుంది. మన ఆరోగ్యం అడవి ఆరోగ్యంతో ముడిపడి ఉంది. మన శ్రేయస్సు కోసం ప్రకృతి పరిరక్షణ తప్పనిసరి’ అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ ‘కొంతవరకైనా ప్రకృతితో మమేకమవుదాం’ అనుకుంటే... ప్రకృతి పరిరక్షణ కోసం చేయగలిగిన చిన్న చిన్న పనులు అందరమూ చేయగలుగుతాం. శాస్త్రీయతకు గౌరవం డాక్టర్ రెడ్డీస్ సంస్థలో 1990 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్న జీవీ ప్రసాద్ ఆ సంస్థ ఎదుగుదల, 66 దేశాలకు విస్తరణలో తనవంతుగా విశేషమైన కృషి చేశారు. సశాస్త్రీయమైన పరిశోధనల పరంపరలో ఆయనను వరించిన కొన్ని ప్రత్యేక గుర్తింపులు... పురస్కారాలివి. వైపీఓ గ్లోబల్ ఇంపాక్ట్ అవార్డు– 2020 వి. కృష్ణమూర్తి అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ బై ద సెంటర్ ఫర్ ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్, 2019 బౌండరీ బ్రేకర్ లీడర్ అవార్డ్, సీఈఓ అవార్డ్స్ 2018 ఇండియా బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ బై సీఎన్‌బీసీ ఆసియా, 2015 ఇండియాస్ బెస్ట్ సీఈవో బై బిజినెస్ టుడే, 2014 ఇండియా టాలెంట్ మేనేజ్మెంట్ అవార్డ్ బై సీఎన్‌బీసీ ఆసియా, 2014 ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
అట్లుంటది మన యాక్టింగ్.. పోలా అదిరిపోలా!
ఈ కోతికి కొంచెం యాక్టింగ్ పిచ్చి.. ఎప్పటికైనా సినిమాల్లో స్టార్ అయిపోవాలని కలలుగంటోంది..పైగా.. చావు సీన్లలో యాక్ట్ చేయడంలో స్పెషలైజేషన్ కూడా ఉంది. ఎంతలా అంటే యాక్టింగా.. లేక నిజంగానే చచ్చిందా అన్నది సాటి కోతులు కూడా కనిపెట్టలేవు. ఫొటోగ్రాఫర్ ఫెడ్రికా(ఇటలీ) కూడా చనిపోయిందనే అనుకున్నారు. ఇంతలో ఎవరు కట్ అన్నారో తెలియదుగానీ.. చటుక్కున లేచి కూర్చుందట. కామెడీ వైల్డ్ లైఫ్ అవార్డ్స్ జ్యూరీ మెచ్చిన చిత్రమిది. ఇట్స్ ఏ గోల్.. ఈ గద్ద.. మెస్సీ ఫ్యాన్ అట. ఈ మధ్యే ఫిఫా వరల్డ్ కప్ చూసొచ్చింది. అప్పటి నుంచీ ఇదే వరుస. గోల్ మీద గోల్ కొట్టేస్తోంది. ఏమో.. ఎప్పుడైనా తమ గద్దల్లోనూ ఫుట్ బాల్ పోటీపెడితే.. పనికివస్తుందని ఇప్పటి నుంచే తెగ ప్రాక్టీస్ చేస్తోంది. జియా చెన్ తీసిన ఈ చిత్రం కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పోటీల్లో అమేజింగ్ ఇంటర్నెట్ పోర్ట్‌ఫోలియో పురస్కారాన్ని గెలుచుకుంది. సాక్షి సెంట్రల్‌డెస్క్ -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జనవరి 01- 08)
-
పాలపుంతతో ప్రాణానికి నిశ్చింత
పాలపుంత చిత్రాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి.. అలాంటిదే ఇది కూడా.. ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన ఆస్ట్రోఫొటోగ్రాఫర్ డెరెక్, కొలరాడోలోని మరూన్ బెల్స్ పర్వతాల వద్ద తీశాడు. ఇంతకీ మానసిక చింతకు పాలపుంతకు కనెక్షన్ ఏమిటి అనే కదా మీ డౌట్. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న డెరెక్‌కు ఈ నక్షత్రాలే ఓదార్పునిచ్చాయట. డెరెక్‌కు ఆస్ట్రోఫొటోగ్రఫీ మీద ఆసక్తి ఉండేది కాదట. 20 ఏళ్ల వయసులో హృదయ సంబంధిత వ్యాధి వల్ల గుండెపోటు వచ్చింది. అప్పటినుంచి తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడేవాడు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వెంటాడేవి. అలాంటి టైంలో వాటి నుంచి బయటపడటానికి, మనసును వేరేపని మీద లగ్నం చేయడానికి ఆకాశంలోని నక్షత్రాలను చూడటం అలవాటు చేసుకున్నాడు. ఆసక్తి పెరిగింది. తర్వాత ఓ రోజు తన కెమెరాను పట్టుకుని.. పాలపుంతల చిత్రాలను తీయడానికి బయల్దేరాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రొఫెషనల్ ఆస్ట్రోఫొటోగ్రాఫర్గా ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీస్తూ.. శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇదీ చదవండి: LOFTID: ‘రక్షణ కవచం’ సక్సెస్.. గంటకు 20వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి.. -
Oskar Barnack: ఫొటోజర్నలిజం పితామహుడు
జర్మనీ దేశస్థుడైన ఆస్కార్ బర్నాక్ కెమెరా డిజైనర్, కంటి అద్దాల ఇంజనీర్, పారిశ్రామిక వేత్త కూడా. ఆయన రూపొందించిన ‘లైకా’ కెమెరా అనేక మార్పులతో ఇప్పటికీ అన్నిదేశాల్లో వాడకంలో ఉంది. మొదట డాగురే 183 సంవత్సరాల క్రితం ‘కెమెరా’ను కనుగొన్నారు. తొలుత తయారైన కెమెరాలు పెద్దసైజులో ఉండేవి. ఫొటోలు తీయడం కూడా చాలా ఖర్చుతో కూడి ఉండేది. ఆ తర్వాత 75 ఏళ్లకు ఆస్కార్ బర్నాక్ అతిసూక్ష్మమైన సైజులో ఉండే కెమెరాను రూపొందించి మొదటి ప్రపంచ యుద్ధం (1914) సంఘటనలను కళ్ళకు కట్టినట్లుగా చిత్రీకరించి పత్రికా రంగానికి ప్రాణం పోశాడు. అందుకే వీరిని ‘ఫొటోజర్నలిజం పితామహుడు’ అంటారు. వారు తీసిన చిత్రాలు 1916లో ప్రచురింపబడి ప్రపంచ మానవాళికి యుద్ధం వల్ల జరిగే నష్టాలను తెలియ చెప్పటంలో కీలకపాత్ర పోషించాయి. ఆస్కార్ బర్నాక్ జన్మదినం నవంబర్ 1ని ‘ప్రపంచ ఫొటోజర్నలిజం’ దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ఎన్నో కొత్త కంపెనీల చిన్న కెమెరాలు ఎన్ని వచ్చినా ఈనాటికీ డిజిటల్ యుగంలో కూడా ఆస్కార్ బర్నాక్ సృష్టించిన లైకా విధాన కెమెరా అత్యంత పరిపూర్ణమైంది. 1914 తర్వాత వార్తలు, సమాచార ఫొటోగ్రఫీ జర్నలిజం ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపచేయటంలో ఆయన ఆవిష్కరణ కీలక పాత్ర వహించింది. 1932లో ఓ అడుగు ముందుకువేసి బర్నాక్ కెమెరా లోపల ఒక చిన్న మోటారు అమర్చి ఒక దృశ్యాన్ని తీయగానే ఫిలిం ముందుకు జరిగే విధానానికి నాందిపలికి 1937లో ప్రపంచానికి పరిచయం చేశారు. (క్లిక్ చేయండి: ‘అనంత’ సాంస్కృతిక సేనాని) ఈమధ్య ఆ కెమెరాను వేలంవేయగా దాదాపుగా 19కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. బర్నాక్ 57వ ఏట 16 జనవరి 1936న అకాల మరణం చెందారు. 1979 నుంచీ ఆయన శత జయంతి సందర్భంగా ‘లైకా ఆస్కార్ బర్నాక్’ అంతర్జాతీయ అవార్డును ప్రతి ఏటా ఫొటో జర్నలిజంలో విశేషంగా కృషిచేసిన వారికి లైకా సంస్థ అందిస్తోంది. – టి. శ్రీనివాసరెడ్డి, ఫొటోజర్నలిస్ట్ ఫెలో ఆఫ్ రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ, గ్రేట్ బ్రిటన్ (నవంబర్ 1న ప్రపంచ ఫొటోజర్నలిజం దినోత్సవం) -
వెంటాడే దృశ్యం
హేమంతం! చుట్టూరా ఎత్తైన కొండలు.. మధ్యలో పచ్చటి లోయ.. ఆకు పచ్చటి కొండల మీద తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లు ఆలోయ కనిపిస్తోంది.. నేను తెల్లవారి బయలుదేరి ఆ లోయకి చేరుకున్నాను. నాతోపాటు నా స్నేహితుడు జగదీష్ కూడా వచ్చాడు.ఇలా ఈ లోయకి రావడానికి కారణం.. వారం రోజుల క్రితం నేను ఏనిమల్ ప్లానెట్ చానెల్లో చూసిన ఓ గగుర్పాటు కలిగించిన దృశ్యం. అది ఇంకా నన్ను వెంటాడుతోంది.‘ఒక లోయలో ఓ గద్ద ఆకాశంలోంచి వాయువేగంతో ఎగురుతూ వచ్చి మేకపిల్లను ఎత్తుకు పోయే దశ్యం’ అది. ఆ దృశ్యం చూసి స్థాణువయ్యాను... నమ్మలేకపోయాను. గద్దలు సాధారణంగా కోడిపిల్లలను, పాముల్ని నోటకరచుకొని పోవడం నేను చూశాను. కానీ దానికన్నా ఆకారంలో, బరువులో పెద్దదైన ఓ మేక పిల్లను గద్ద కాళ్ళతో ఎత్తుకుపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పట్నుంచీ నాలో ఆందోళన మొదలైంది. ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించిన ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఆ మర్నాడు గ్రంథాలయానికి వెళ్ళి ఆ ఫొటోని తీసిన ఫొటోగ్రాఫర్ గురించి పేపర్లలో చదివాను. ఆ ఫొటోని ఏనిమల్ ప్లానెట్ చానెల్ కోసం ప్రపంచంలోని అతి గొప్ప ఫొటోగ్రాఫర్ స్టీవ్ మెకర్రీ తన డిజిటల్ కెమెరాతో తీశాడు. అందుకోసం అతను లోయలోకి వెళ్ళి చాలా పెద్ద సాహసమే చేశాడు. ఆ ఫొటోని చూసిన తరువాత నాక్కూడా అటువంటి ఫొటోని నా కెమెరాలో బంధించాలన్న కోరిక కలిగింది. అందుకే ఈరోజు ఈ లోయకి వచ్చాం. దేశంలోని అతి గొప్ప కెమేరా అయిన నికోన్ డిజిటల్‌ని నాతో తెచ్చాను. ఈ లోయకే ప్రత్యేకంగా రావడానికి ఓ ముఖ్యకారణం ఉంది. నా స్నేహితుడు జగదీష్ తండ్రి ప్రముఖ ఫొటోగ్రాఫర్... నేను చెప్పిన ఫొటో గురించి వినీ అతను ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పాడు. ‘గద్ద మేకపిల్లని ఎత్తుకుపోతున్న దృశ్యాన్ని మెకర్రీ మనదేశంలో అందునా మన రాష్ట్రంలోని తూర్పు కనుమల్లో గాలికొండ లోయలో తీశాడనీ చెప్పడంతో ఆ లోయని చూడటానికి ఈ రోజు వచ్చాం. సూర్యుడు తూర్పు దిక్కు నుదుటన సిందూర తిలకంలా మెరిసిపోతున్నాడు. రాను రాను నీహారికా బిందుసమూహాలు కరిగి లోయంతా హరిత వర్ణంగా పరావర్తనం చెందుతున్న దృశ్యం మనోహరంగా కనిపిస్తోంది. నేను, జగదీశ్ ఇద్దరం లోయలోకి దిగాం. చుట్టూ ఎల్తైన సిల్వర్ ఓక్ వృక్షాలు, వాటి మీద పక్షుల కిలకిలారావాలు సంగీతాన్ని ఆలపిస్తున్నాయి. ఎక్కడి నుంచో కోకిల కలకూజితం లోయలో ప్రతిధ్వనిస్తోంది. సూర్యుడు వెలుగు రేఖలు లోయలో పరుచుకుంటున్నాయి. ఆ సమయంలో నేనూ జగదీశ్ లోయలోకి దిగి ఓ చెట్టు కింద నిలబడ్డాం. ఇప్పుడా లోయని చూస్తుంటే ఆ రోజు నేను చూసిన ఫొటో గుర్తుకు వచ్చింది. ఆకాశం నీలంగా స్వచ్ఛగా ఉంది. లోయలో తెల్లటి కొంగలు ఎగురుతూ మల్లెదండని గుర్తుకు తెస్తున్నాయి. ఇప్పుడు నా చూపులన్నీ ఆకాశం వైపు గద్దల కోసం ఆశగా చూస్తున్నాయి. జగదీశ్ కెమెరాని బయిటకు తీసి నాకు అందించాడు. ‘వంశీ! మొన్న నువ్వు చూపించిన గద్ద మేక పిల్లని ఎత్తుకుపోతున్న ఫొటో లాంటి వాటిని మన వాళ్ళు తీయ్యలేరా?’ అని అడిగాడు. ‘ఎందుకు తియ్యలేరు? మనదేశంలో కూడా అద్భుతమైన ఫొటోగ్రాఫర్లున్నారు! ఉదాహరణకు సుధీర్ శివరాం, రఘునా«థ్ చౌదరి లాంటి గొప్ప ఫొటోగ్రాఫర్లున్నారు! వాళ్ళు ఎన్నో అద్భుతమైన ఫొటోలు తీసి ఎన్నో అంతర్జాతీయి బహుమతులు గెల్చుకున్నారు’ అని చెప్పాను. అప్పటికి సమయం 7 గంటలైంది. చలి కాస్త తగ్గుముఖం పట్టింది. జగదీశ్ ఫ్లాస్క్‌లో తెచ్చుకున్న టీని నాకిచ్చాడు. అది తాగిన తరువాత శరీరం కాస్త వేడెక్కి ఉత్సాహం వచ్చింది. సమయం గడిచిపోతున్నా ఆకాశంలో గద్దలు కనిపించటం లేదు. ఫొటోగ్రఫీలో ఈ సమస్యలు తప్పవు. మంచి ఫొటో కోసం నిరీక్షించక తప్పదు. ఒక మంచి అద్భుతమైన ఫొటో కోసం ఎంతో నిరీక్షణ అవసరం. రెండు గంటలు గడిచాయి. ఎండ తీక్షణ ఎక్కువైంది. నేను మాత్రం నిరాశ చెందకుండా ఆకాశం వైపు చూస్తునే ఉన్నాను. సరిగ్గా తొమ్మిదిన్నర సమయానికి ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. ఒక విమానం చిన్నగా కదులుతూ వస్తోంది. నేను ఆశ్చర్యంతో దాని వైపే చూస్తున్నాను. క్రమక్రమంగా అది దగ్గర కాసాగింది. అదే విమానం అయితే లోయంతా దాని ‘ధ్వనితో ప్రతి ధ్వనించేది. కానీ ఏవిధమైనా శబ్దమూ వినిపించటం లేదు. రానురాను అది కిందకు దిగుతోంది. నాలో ఉత్కంఠ పెరిగింది. నేను జగదీశ్ వైపు తిరిగి దానివైపు చూపించాను. అతను కూడా ఉద్విగ్నతతో ఆకాశంలోకి చూడసాగాడు. కొద్ది నిమిషాల తరువాత ఆ దిగుతున్న దేమిటో నాకు స్పష్టత వచ్చింది. అది విమానం అయితే కాదు. విమానం అలా ఓ లోయలో కిందకు దిగదు. అది ఎత్తులో సమాంతరంగా ప్రయాణిస్తుంది. కచ్చితంగా అది గద్దపక్షే అయి ఉంటుందనీ నా సిక్త్‌సెన్స్ చెప్పింది. ‘జగదీశ్! ఆ కిందకు దిగుతున్నదేమిటో పోల్చుకున్నావా?’ అది గద్ద. ఆ పక్షి తప్ప అంత ఎత్తున ఏ పక్షీ ఎగురలేదు’ అని వాడికి చెప్పి కెమెరాని మెడలో నుంచి తీశాను. అది హై మేగ్నిఫైడ్ లెన్స్ జపాన్ తయారీ కెమెరా. కిలోమీటరు దాకా జూవ్ు చేసి స్పష్టమైన ఫొటో తియ్యవచ్చు. ‘వంశీ! ఎంత గద్దపక్షి అయితే మాత్రం అంత ఎత్తు నుంచి కింద లోయలో ఏ జంతువుందో చూడగలదా? అసలే దాని కళ్ళు చిన్నవి’ అన్నాడు జగదీశ్. జగదీశ్ ప్రశ్నలు నాలో అసహనాన్ని కలిగించాయి. ‘గద్ద అంటే ఏమనుకున్నావ్? దాని చూపు చాలా తీక్షణమైనది. కిలో మీటరు ఎత్తు నుంచి అది భూమి మీద చిన్న కోడిపిల్లను కూడా స్పష్టంగా చూడగలదు. అంతటి మహత్తర చూపు గల కళ్ళు దానివి. దేవుడు దాని కళ్ళకు అంతటి తీ„è ణతని వరంగా ఇచ్చాడు. అందుకే ఎక్కడ నుంచి వస్తుందో తెలియకుండా వేగంగా వచ్చి కోళ్ళను, పాముల్ని నోట కరుచుకొని వెళ్ళిపోగలదు. దాని రెక్కల్ని టెలాన్స్ అంటారు. దాని రెక్కల్లో గొప్ప శక్తి ఉంటుంది. అందువల్ల వాయు వేగంతో కిందకు దిగి వాటిని నోట కరుచుకొని మళ్ళీ ఎగిరిపోగలదు’ అంటూ వాడికి చెప్పాను. కొద్ది నిమిషాల తరువాత అది మాకు స్పష్టంగా కనిపించేటంతటి ఎత్తుకు దిగింది. ఇప్పుడది మాకు స్పష్టంగా కనిపిస్తోంది. నిశ్చయంగా అది గద్దపక్షే. అది లోయలోకి దిగుతుంటే మా ఇద్దరిలో చెప్పలేని ఉత్కంఠత. మేము లోయకి ఒక వైపున ఉండటం వల్ల లోయ పూర్తిగా కనిపించటం లేదు. రానురాను అది కిందకు దిగి పోతోంది... నేను కెమెరాని చేతిలోకి తీసుకొని ఫొటో కోసం ఎదురు చూస్తున్నాను. గద్దపక్షి లోయలోకి దిగుతోందంటే అది ఏ జంతువునో చూసి ఉంటుంది. అది జంతువో లేక కోడి పిల్లో కావచ్చు. సమయం గడుస్తోంది. లోయంతా నిశ్శబ్దంగా ఉంది. గద్దపక్షి కిందకు దిగుతూ కనిపించకుండా పోయింది. కొద్దిసేపటి దాకా ఏ జరుగుతోందో తెలియటం లేదు. ఇంతలో ఎగురుతూ వస్తున్న గద్దపక్షి కనిపించింది. నా దగ్గర ఉన్న బైనాక్యులర్‌తో ఆ దృశ్యాన్ని చూశాను. మొదట్లో అస్పష్టంగా, కొన్ని క్షణాల తరువాత స్పష్టంగా కనిపిస్తోంది అది. వాయువేగంతో ఎగురుతూ అది మావైపే వస్తోంది. దాని రెండు కాళ్ళ మధ్య గిలగిలా కొట్టుకుంటూ చిరుత పులి పిల్ల! ఆ దృశ్యాన్ని చూడగానే ఆశ్చర్యంతో పాటు అనుమానం కలిగింది నాకు! అంత పెద్ద చిరుత పిల్లను ఒక చిన్న గద్దపక్షి.. అంత ఎత్తుకి తీసికెళ్ళడమా? అది సాధ్యమా? అన్న సందేహం వచ్చింది. వెంటనే ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించాలని కెమెరా తీశాను. రానురాను ఆ గద్దపక్షి మా వైపే వస్తూ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతలో గగుర్పాటు కలిగించే ఒక సంఘటన జరిగింది. గద్దపక్షి కాళ్ళ మధ్య కొట్టుకుంటున్న చిరుత పిల్ల తప్పించుకొని కిందకు జారిపోసాగింది. గద్దపక్షి కాళ్ళ పట్టు తప్పడం వల్ల అలా జరిగి ఉంటుంది. గాల్లో ఎగురుతున్న ఆ పక్షి లోయలోకి జారిపోతున్న చిరుతపిల్ల. ఆ దృశ్యం కనిపిస్తోంది. అంతలోనే గద్దపక్షి తేరుకుంది. ఒక్కసారిగా రెక్కలను టపటపలాడిస్తూ కిందకు దిగడం మొదలు పెట్టింది. వెంటనే నేను కెమెరాని క్లిక్ మనిపించాను. ఒకటి కాదు.. రెండు కాదు.. పదిసార్లు క్లిక్ మనిపించాను. అలా నేననుకున్న ఫొటో తీయగలిగాను. వారం రోజుల తరువాత స్టూడియో నుంచి ప్రింట్లు వచ్చాయి. కేబినెట్ సైజులో ఆ ఫొటోలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. గాల్లో ఎగురుతున్న గద్దపక్షి.. దాని కింద లోయలోకి జారిపోతున్న చిరుత పిల్ల. ‘సార్! ఎక్కడ తీశారు ఈ ఫొటోల్ని. అద్భుతంగా, గగుర్పాటు కలిగించేటట్లున్నాయి’ అన్నాడు ఆ ఫొటోలను తెచ్చిన స్టూడియో కుర్రాడు. అతనికి ఏం చెప్పాలో తెలియక ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాను. వారం రోజుల తరువాత ఆ ఫొటోలు అన్ని దిన, వార, పత్రికల్లోనూ వచ్చాయి. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ పాఠకుల నుంచి వచ్చింది. ఆ రెస్పాన్స్ చూసి నాకు చాలా ఆనందం కలిగింది. ఈ ఫొటోతో నా చిరకాల వాంఛ తీరిందనిపించింది. అద్భుతమైన ఫొటోలను ఎక్కడ చూసినా నేనూ ఇలాంటి వాటిని తియ్యాలనీ కలలు కనేవాడిని. ఆ కల ఈ రూపంలో తీరింది. నెల రోజుల తరువాత ఢిల్లీలోని ‘బర్డ్స్ ఆఫ్ ఇండియా’ సంస్థ వారు ఒక పోటీని ప్రకటించి అద్భుతమైన నమ్మలేని ఫొటోలను పంపాలనీ కోరారు. ప్రథమ బహుమతి 10 లక్షలు. నేను ఆ పోటీకి నా ఫొటోని పంపాను. ఇంకా ఫలితాలు ప్రకటించలేదు. నెల రోజుల తరువాత ఓ అనుకోని సంఘటన జరిగింది. ఒక రోజు నేను మా వూళ్ళోనే ఉంటున్న మా అక్కను చూద్దామని బయలుదేరాను. ఈ మధ్యన అక్కకు ఒంట్లో బాగుండటం లేదు. వీధికి కొద్ది దూరంలో అక్క రెండేళ్ళ కూతురు మృదుల ఇంటి ముందర ఆడుకుంటోంది. నేను నడక వేగం పెంచాను. ఇంతలో ఆకాశంలో ఏదో అలజడి. నా దృష్టి ఆకాశంవైపు మళ్ళింది. ఆకాశంలో ఒక పెద్ద గద్దపక్షి ఒకటి వాయువేగంతో కిందకు దిగుతోంది. ఆ వేగానికి గాల్లో శబ్దం కలుగుతోంది. నేను దాన్ని గమనిస్తూ నిలబడ్డాను. కొద్ది క్షణాల తరువాత అది మా అక్క కూతురు మృదుల వైపు దిగడం కనిపించింది. నాకు వెంటనే నేను తీసిన ఫొటో ఆ ఘటన గుర్తుకు వచ్చింది. ఆ లోయలో చూసిన ఆ బీభత్స దృశ్యం నా కళ్ళ ముందు కదలాడి ఒక్కసారిగా పరుగు మొదలెట్టాను. రెండు క్షణాల్లో ఒక అద్భుతం జరిగింది. నేను అక్కడకు చేరి బృదులను ఎత్తుకొని ఇంట్లోకి పరిగెత్తడం, ఆ గద్దపక్షి భూమి మీదకు దిగడం ఒకేసారి జరిగాయి. నేను మృదులను ఇంట్లోకి తీసికెళ్ళి తలుపేసి వీధిలోకి వచ్చాను. గద్దపక్షి నిరాశతో మళ్ళీ ఎగిరిపోతూ కనిపించింది. అది ఇప్పుడు గట్టిగా అరవడం వినిపించింది. నాకు ఆ దృశ్యం చాలా ఆనందం కలిగించింది. నేనే గాని ఆ లోయకి ఫొటో కోసం వెళ్ళకపోయి ఉంటే ఈ రోజు మృదుల ఆ గద్దపక్షికి బలైపోయి ఉండేది. ఆ విషయం తలపునకు రాగానే నా ఒంట్లో వణుకు మొదలైంది. పెళ్ళైన పదేళ్ళకు పుట్టిన మృదులకు ఏం జరిగినా అక్క తట్టుకోలేదు. ఇంక నా ఫొటోకి పోటీలో బహుమతి రాకపోయినా నేను బాధపడను. కానీ మృదులను కాపడినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మృదులను కాపాడిన దృశ్యం పదేపదే నా కళ్ళముందు కదలాడసాగింది. -గన్నవరపు నరసింహమూర్తి -
రవీంద్రభారతిలో ఘనంగా ఫొటో ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
సాక్షి ఫొటోగ్రాఫర్లకు జాతీయ స్థాయి అవార్డులు (ఫొటోలు)
-
సాక్షి ఫొటోగ్రాఫర్లకు జాతీయ స్థాయి అవార్డులు
సాక్షి, అమరావతి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ నిర్వహించిన జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో తొమ్మిదిమంది సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు లభించాయి. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ మధ్యలో తీసిన ఫొటోలను పోటీలకు ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా 463 మంది 826 ఫొటోలను పంపించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, సోషల్ ఆంత్రోపాలజిస్ట్ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి, సోషల్ హిస్టోరియన్ డాక్టర్ కొంపల్లి హెచ్.హెచ్.ఎస్.సుందర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి 75 ఉత్తమ ఛాయాచిత్రాలను ఎంపికచేశారని అకాడమీ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. అకాడమీ ఆవిర్భావ దినోత్సవం (ఆగస్టు 18వ తేదీ) సందర్భంగా విజేతలకు గురువారం విజయవాడలో ‘ప్లాటినం జూబ్లీ ఇమేజ్ అవార్డులు’ ఇవ్వనున్నట్లు చెప్పారు. 75 చిత్రాలతో ఫొటో ప్రదర్శన ఏర్పాటుచేసి, ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరిస్తామని తెలిపారు. అవార్డులు పొందిన సాక్షి ఫోటోగ్రాఫర్లు: వి.రూబెన్ బెసాలియల్ (విజయవాడ), ఎన్.కిషోర్ (విజయవాడ), ఎస్.లక్ష్మీపవన్ (విజయవాడ), పి.ఎల్. మోహనరావు (వైజాగ్), ఎండీ నవాజ్ (వైజాగ్), వడ్డే శ్రీనివాసులు (కర్నూలు), కె.మోహనకృష్ణ (తిరుపతి), మహబూబ్ బాషా (అనంతపురం), శివ కొల్లోజు (తెలంగాణ). ఇదీ చదవండి: YSR Kadapa: రిజిస్ట్రేషన్లపై నిఘా నేత్రం -
ఉత్తమ అవార్డుకు సాక్షి ఫొటోగ్రాఫర్ ఎంపిక
భువనగిరి: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలో ‘వన్ నేషన్ వన్ ఫ్లాగ్’పై నిర్వహించిన పోటీల్లో సాక్షి దినపత్రిక యాదాద్రి భువనగిరి జిల్లా ఫొటోగ్రాఫర్ కోల్లోజు శివకుమార్ పంపిన చిత్రం ఎంపికైంది. ఈనెల 19న విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో శివకుమార్ అవార్డు అందుకోనున్నారు. -
ఫొటోగ్రాఫర్ నుంచి సీఎం దాకా..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అనూహ్యంగా రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే పదవి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఫొటోగ్రఫీపై మంచి అభిరుచి కలిగిన ఉద్ధవ్ ప్రస్థానం ఆసక్తికరం. తండ్రిచాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చి, ఓనమాలు నేర్చుకున్న ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగారు. మరాఠా పులి బాలాసాహెబ్ బాల్ ఠాక్రే–మీనా ఠాక్రే ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే 1960 జూలై 27న జన్మించారు. ముంబైలో బాలమోహన్ విద్యామందిర్‌లో పాఠశాల విద్య అభ్యసించారు. ‘సర్ జె.జె.ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్’లో ఫొటోగ్రఫీ ప్రధాన సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2002లో ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ జీవితం ప్రారంభమయ్యింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన ప్రచార బాధ్యుడిగా సేవలందించారు. ఈ ఎన్నికల్లో శివసేన మెరుగైన ఫలితాలు సాధించడంతో పార్టీలో ఉద్ధవ్ ప్రతిష్ట పెరిగింది. 2003లో శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2006లో పార్టీ పత్రిక ‘సామ్నా’ చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2019లో రాజీనామా చేశారు. మోస్టు పాపులర్ సీఎం 2012లో బాల్ ఠాక్రే మరణించడంతో, 2013లో శివసేన అధినేతగా ఉద్ధవ్ ఠాక్రే పగ్గాలు చేపట్టారు. ఉద్ధవ్ నాయకత్వంలో మహారాష్ట్రలో 2014లో ఎన్డీయే ప్రభుత్వంలో శివసేన భాగస్వామిగా చేరింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీచేశాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవి అప్పగించేందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో ఉద్ధవ్ కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపారు. మహా వికాస్ అఘాడీ పేరిట మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎం పదవి ఉద్ధవ్‌ను వరించింది. మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా 2019 నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. ఠాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి అయిన తొలి నాయకుడు ఉద్ధవ్ కావడం విశేషం. 2021లో 13 పెద్ద రాష్ట్రాల్లో నిర్వహించిన ఓ సర్వేలో ‘మోస్టు పాపులర్ సీఎం’గా ఉద్ధవ్‌కు అత్యుత్తమ ర్యాంకు దక్కడం గమనార్హం. సర్వేలో పాల్గొన్న ఓటర్లలో సగం మంది మళ్లీ ఉద్ధవ్‌కే ఓటు వేస్తామని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రేకు చిన్నప్పటి ఫొటోగ్రఫీపై అమితాసక్తి. ఆయన తీసిన ఎన్నో ఫొటోలను ఎగ్జిబిషన్లను ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రకృతి అందాలను, కోటలను ఆయన కెమెరాల్లో చక్కగా బంధించారు. ఉద్ధవ్ 1989లో రష్మీ పటాంకర్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఆదిత్య, తేజస్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శివసేన యువజన విభాగం అధ్యక్షుడైన పెద్ద కుమారుడు ఆదిత్య ఠాక్రే మహారాష్ట్ర కేబినెట్లో పర్యాటకం, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. చిన్నకుమారుడు తేజస్ ఠాక్రే పర్యావరణ పరిరక్షకుడిగా, వైల్డ్‌లైఫ్ పరిశోధకుడిగా కొనసాగుతున్నారు. వివాదాలు.. ఆరోపణలు ► మహారాష్ట్ర ప్రభుత్వంపై ఠాక్రే కుటుంబ పెత్తనంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. పరిపాలనలో ఉద్ధవ్ భార్య, కుమారుడి జోక్యం మీతిమీరుతోందంటూ సాక్షాత్తూ శివసేన ఎమ్మెల్యేలే రచ్చకెక్కారు. ► మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరన్న అభియోగాలు ఉద్ధవ్‌పై ఉన్నాయి. ► పార్టీలో సంక్షోభం ముదురుతున్నా గుర్తించకపోవడం, నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడం ఉద్ధవ్ పదవికి ఎసరు తీసుకొచ్చింది. ► అనైతిక పొత్తులను శివసేన నేతలు, ప్రజా ప్రతినిధులు జీర్ణించుకోలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలతో తలపడి, ఫలితాల తర్వాత అవే పార్టీలతో జతకట్టడం చాలామందికి నచ్చలేదు. ► బలమైన నాయకుడైన ఏక్నాథ్ షిండేను పక్కనపెట్టి, సంజయ్ రౌత్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఎమ్మెల్యేలు సహించలేకపోయారు. -
క్లిక్ ట్రెండ్: యోగా ఫొటో
జ్ఞాపకాల పదిలానికి ఫొటోని మించిన సాధనం లేదన్నది మనకు తెలిసిందే. ప్రీ వెడ్డింగ్, మెటర్నిటీ, న్యూ బోర్న్.. అంటూ ఫొటోగ్రఫీలో రకరకాల ట్రెండ్స్‌ను మనం చూస్తూనే ఉన్నాం. వీటితోపాటు యోగా, ఫిట్నెస్ పోజెస్ ఫొటోగ్రఫీ ఇప్పుడొక ట్రెండ్ అయ్యింది. దీనికి సామాజిక మాధ్యమం కూడా ఓ కారణం. ఈ వేడుకకు ఆ ఫొటో తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం చాలా సహజంగా జరుగుతుంటుంది. అందుకు అందమైన, అద్భుతం అనిపించే ఫొటోలు కావాలని కోరుకోని వారుండరు. యోగా సాధనలో తాము సాధించిన విజయాలను నలుగురితో పంచుకోవడానికి ఇప్పుడు యోగా ఫొటోగ్రఫీ కళ తప్పనిసరి అవసరంగా మారిందంటున్నారు నిపుణులు. యోగా క్లాసులు ఇవ్వడానికి, యోగాలో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి ఫొటోలే ఆధారం. అలాగే, కొత్తగా ఫొటోగ్రఫీ నేర్చుకోవడానికి యోగా ఫొటోలు తీయడం అత్యంత సమర్థవంతమైన మార్గాలలో ఒకటి. ఫిట్నెస్ మీద ఆసక్తి కనబరుస్తున్నవారు తమ శరీరాకృతిని యోగా భంగిమల్లో చూపడానికి ఈ ఫొటోగ్రఫీ ఒక అద్భుతమైన వాహికగా పనిచేస్తుంది. గతంలో యోగా, వ్యాయామం వంటివి చేసి ఆ తర్వాత వదిలేసినవారు ఎప్పుడైనా వీటికి సంబంధించిన ఫొటోలు చూసుకున్నప్పుడు ఒక ప్రేరణగా ఉపయోగపడతాయి. మొట్టమొదటి డాక్యుమెంటరీ యోగా సాధన చేయడానికి యోగా క్లాసుల్లో చేరచ్చు. యూట్యూబ్‌లో వీడియోలు చూడచ్చు. ఆన్లైన్ కోర్సులు, పుస్తకాలు చదివి కూడా ప్రయత్నించవచ్చు. అయితే, యోగా ఫొటోగ్రఫీలో పర్ఫెక్ట్ అవ్వాలంటే యోగా మీద తీసిన ‘ఆన్ యోగా ది ఆర్కిటెక్చర్ ఆఫ్ పీస్’ డాక్యుమెంటరీ చూడాల్సిందే. దీనికి ఫొటోగ్రాఫర్‌గా వర్క్ చేసిన ‘మైఖేల్ ఓ నీల్’ అద్భుతమైన చిత్రణను అందించాడు. పదేళ్లపాటు ఇండియా, టిబెట్, న్యూయార్క్‌లలోని గొప్ప గొప్ప యోగా గురువులతో మాట్లాడి, తీసిన డాక్యుమెంటరీ ఇది. యోగా ఫొటోలు తీయడానికి, తీయించుకోవడానికి ఈ డాక్యుమెంటరీ మంచి పుస్తకంలా ఉపయోగపడుతుంది. ప్రకృతిలో క్లిక్స్... యోగా ఫొటోషూట్ కోసం అందమైన ప్రకృతిని మించిన వేదిక మరొకటి లేదు. మనసు, శరీరం ఆహ్లాదంగా ఉండటానికి చేసే యోగా, ఆ ఆనందాన్ని ఒక్క క్లిక్‌తో బంధించడానికి ప్రకృతి దృశ్యాలు అనువైన స్థలాలు. అడవి, బీచ్, పార్క్ ఫొటో సెషన్‌కు మంచి వేదికలు. అనువైన సంధ్యాసమయాలు... సూర్యోదయ, అస్తమయ సమయాలను బేస్ చేసుకుంటూ తీసే యోగా ఫొటోలు ఒక కళాత్మకమైన అందాన్ని కళ్లకు కడతాయి. ఈ సమయంలో సాధారణ ఆసనాలను వేస్తూ కూడా ఫొటోలు తీసుకోవచ్చు. మ్యాట్ నీట్... మిగతా వాటితో పోల్చితే యోగా ఫొటో సెషనల్లో శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ధరించే డ్రెస్ అయినా, యోగా మ్యాట్ అయినా శుభ్రంగా ఉండాలి. యోగా ఫొటోలా కాకుండా ఓ కథ చెప్పే విధంగా ఉండాలి. యోగా ఫొటోలు తీయడమంటే ముఖాన్ని షూట్ చేయడం కాదు... మెడలో ధరించే పూసలు, పచ్చబొట్టు, వంపులుగా తిరిగిన చేతులు, శరీరం.. ఇలా యోగా అని తెలిసే విధంగా ఫొటో తీయాల్సి ఉంటుంది. యోగా ఫొటోలు తీయాలని ఆ ఒక్కరికే క్లిక్ మనిపించ కూడదు. చుట్టూ నేపథ్యాన్ని కూడా కెమెరా కన్నుతో బంధించాల్సి ఉంటుంది. యోగా ఫొటోగ్రఫీ అనేది ఒక ఆధ్యాత్మికానుభవాన్ని దగ్గర చేస్తుంది. ఇతరులు స్ఫూర్తి పొందేలా చేస్తుంది. యోగా చిత్రకళా విభాగం మిమ్మల్ని ప్రసిద్ధులను చేస్తుంది. యోగా మెటర్నిటీ మెటర్నిటీ ఫొటోస్ కోసం వచ్చినవారు యోగా ఫొటోస్ కూడా తీసుకోవడంలోనూ ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు ఔట్లొకేషన్స్ని ఇష్టపడుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో సెలబ్రిటీలు తీయించుకున్న యోగా ఫొటోలు మా వద్దకు తీసుకువచ్చి, అలాంటి పోజులతో ఫొటోలు తీయమని అడుగుతుంటారు. ఫిట్నెస్ ట్రెయినర్స్లోనూ ఇలాంటి ఆసక్తి ఎక్కువ. – మనోజ్ఞ, న్యూ బోర్న్ బేబీ ఫొటో గ్రాఫర్ – నిర్మలారెడ్డి -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 20 - జూన్ 27)
-
సినిమాను తలపించేలా ఫొటోషూట్స్
కరీంనగర్ (జగిత్యాలటౌన్) : గతంలో పెళ్లి, ప్రత్యేక సందర్భాలకే పరిమితమైన ఫొటోలు.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా పోస్ట్ వెడ్డింగ్, ప్రివెడ్డింగ్, ఫొటోషూట్స్, హల్దీ, మెహందీతో పాటు సినిమా సాంగ్స్‌కు అనుగుణంగా అపురూపమైన ఫొటోలను కరిజ్మా, క్యాన్వెరా అల్బమ్లతో ముస్తాబు చేసి అందిస్తున్న ఫొటోలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌ను తమ ఉపాధిగా మల్చుకుంటున్నారు యువత. లెన్స్ కెమెరాలతో పాటు డ్రోన్, క్రేన్ కెమెరాలతో ఓవైపు షూట్ చేస్తూనే మరోవైపు జరుగుతున్న షూటింగ్‌ను లైవ్ ద్వారా వీక్షించేలా ఫంక్షన్ హాల్ నలువైపులా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రీవెడ్డింగ్ సాంగ్స్‌తో పెళ్లిల్లకు కొత్త అందాలు అద్దుతూ ఔరా అనిపిస్తున్నారు. షూట్ చేసిన ఫొటోలను ఆకర్షణీయమైన ఆల్బమ్స్ తయారు చేస్తూ పెళ్లిళ్లు, శుభకార్యాలు, సంబరాలను చిరకాలం గుర్తుండే మధుర స్మృతిగా మలుస్తున్నారు. యువతకు ఉపాధి.. ఫొటోగ్రఫీలో వస్తున్న కొత్త ట్రెండును పట్టణ జిల్లా ప్రజలు ఆహ్వానిస్తుండటంతో ఫొటోగ్రఫీని స్థానిక యువత ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. ప్రివెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి ఫొటో షూట్లతో కలిపి సినిమా ఫొటోగ్రఫీ, వీడియో క్యాన్వెరా, ఎల్ఈడీ స్క్రీన్స్, క్యాండెట్ ఫొటోగ్రఫీ అల్బమ్‌తో సహా కస్టమర్ రిక్వైర్మెంట్ను బట్టి రూ.20వేల నుంచి రూ.2లక్షల వరకు చార్జ్ చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో దాదాపు 240మంది ఫొటోగ్రాఫర్లు ఉండగా 40 నుంచి 50కి పైగా ఫొటో స్టూడియోలు, మిక్సింగ్ సెంటర్లు, అల్ఫా డిజైనర్స్ ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఔట్‌డోర్ ఫొటో షూట్.. పెళ్లికి ముందు జరిపే ప్రివెడ్డింగ్ షూట్ల ను ఔట్డోర్లలో అత్యాధునిక లెన్స్ కెమెరాలు, డ్రోన్, క్రేన్ కెమెరాలను వినియోగిస్తూ సినిమా షూటింగ్‌ను తలపించేలా షూట్ చేయడం ట్రెండ్‌గా మారింది. ఔట్‌డోర్ ఫొటోషూట్లకు నగర శివారు ప్రాంతాలతో పాటు హైదరా బాద్, నిజామాబాద్(డిచ్పల్లి), సిద్దిపేట లాంటి దూర ప్రాంతాలకు వెళ్లి ఫొటోషూట్ చేస్తున్నా రు. ఈ షూటింగ్‌ను చూస్తున్న చాలామంది సినిమా షూటింగ్ అని భ్రమపడుతున్నారు. ఉపాధి కల్పిస్తున్నాను టీనేజ్‌లో ఫొటోగ్రఫీ నా హాబీగా ఉండేది. సొంత ఫొటోలను మాత్రమే తీసుకునే నేను ప్రస్తుతం ఫొటోగ్రఫీని ఉపాధిగా మార్చుకుని వెడ్డింగ్ షూటింగ్, వీడియో మిక్సింగ్, ఆల్బమ్ మేకింగ్ చేస్తూ నాతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నాను. – శ్రీనివాస్, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ ఆల్బమ్ మేకింగ్ చేసిస్తాం జిల్లా కేంద్రంలో ఎడిట్ పాయింట్ నిర్వహిస్తున్నాను. కొత్త జంటల తొలి కలయికలకు సంబంధించిన మధురమైన స్మృతులను పదికాలాల పాటు దాచుకునేలా షూటింగ్, ఎడిటింగ్‌తో పాటు, ఆల్బమ్ మేకింగ్ కూడా చేసిస్తాం. ఒక్కో వెడ్డింగ్‌కు అన్ని ఫార్మాలిటీస్ కలుపుకుని రూ.20వేల నుంచి రూ.2లక్షల వరకు చార్జ్ చేస్తాం. – గంటె మహేశ్, ఎడిట్ పాయింట్ -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 13 - జూన్ 20)
-
Photos of the Week: ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 06 - జూన్ 12)
-
ఫొటోగ్రాఫర్ రాలేదా? గిట్లయితే ఎట్ల! నమ్మకం పోయింది.. పెళ్లి బంద్!
ఈ మధ్య పెళ్లిళ్లన్నీ పీటల మీద ఆగిపోతున్నాయి. బట్టతల ఉందని ఒకరు, తాగుతున్నాడని మరొకరు అబ్బాయిలను తిరస్కరిస్తే, ఈ అమ్మాయి మాత్రం... పెళ్లికి అబ్బాయి వాళ్లు ఫొటోగ్రాఫర్‌ను పెట్టలేదని పీటల మీదనుంచి వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఓ అమ్మాయికి అదే జిల్లాకు చెందిన భోగ్నిపూర్‌కు చెందిన అబ్బాయితో పెళ్లి కుదిరింది. ఏర్పాట్లు పూర్తయిపోయాయి. పెళ్లి వేడుక మొదలైంది. అబ్బాయి బరాత్‌తో వేడుకగా వచ్చాడు. వేదిక కూడా ఎక్కాడు. ఇక పూల మాల వేయడమే తరువాయి. ఆ క్షణాలను పట్టి బంధించడానికి ఫొటోగ్రాఫర్ లేడన్న విషయాన్ని వధువు గుర్తించింది. వెంటనే వేదిక దిగి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఎవ్వరు ఎంత చెప్పినా ససేమిరా అంది. ‘పెళ్లి వేడుకనే సరిగ్గా పట్టించుకోనివాడు... రేపు పెళ్లయ్యాక తనను బాగా చూసుకుంటాడన్న నమ్మకమేంటి’ అంటూ తిరస్కరించింది. ఇక చేసేదేం లేక అప్పటిదాకా ఇచ్చిపుచ్చుకున్న డబ్బు, నగలు, వస్తువులు ఎవరివి వాళ్లకు ఇచ్చేసి... రెండు కుటుంబాలు వెనుదిరిగాయి. తరువాత తేలిందేమంటే అబ్బాయివాళ్లు ముందే మాట్లాడి పెట్టినా... ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ మధ్య పొసగక ఇద్దరూ రాలేదు. చదవండి👉🏼మూడొంతుల మందికి మంచి తిండి కలే -
Photos of the Week: ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 30 - జూన్ 05)
-
Photos of the Week: ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 22 - మే 29)
-
ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 15 - మే 22)
-
వ్యాలీ పులికి.. పులిట్జర్!
కశ్మీర్ అందాలను చూసి తనివితీరా ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అంతటి అందమైన లోయలో పుట్టిన ఓ చిన్నారికి తను చూసిన ప్రతిదృశ్యాన్నీ ఫొటో తీయడమంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే నేడు ఆమెకు ఎంతో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ చిన్నారి మరెవరో కాదు 28 ఏళ్ల సనా ఇర్షాద్ మట్టూ. తాజాగా ప్రకటించిన పులిట్జర్ అవార్డుల లిస్టులో ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో డానిష్‌తోపాటు రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన ఆద్నన్ అబిది, సనా ఇర్షాద్ మట్టూ, అమిత్ దావేలను ఈ అవార్డు వరించింది. శ్రీనగర్‌కు చెందిన సనాకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చుట్టుపక్కల ఏం జరిగినా వాటిని కెమెరాలో బంధించాలనుకునేది. ఆ ఆసక్తితోనే జర్నలిజంను కెరీర్‌గా ఎంచుకుంది. కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో జర్నలిజంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. చదువయ్యాక కశ్మీర్ మీద డాక్యుమెంటరీలు, విజువల్ స్టోరీలు తీయడం మొదలుపెట్టింది. కశ్మీర్లో చోటుచేసుకుంటోన్న అనేకరకాల పరిస్థితులపై స్పందిస్తూ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా దాదాపు మూడేళ్లపాటు పనిచేసింది. సనా ఆర్టికల్స్ బావుండడంతో.. ఆల్జజీరా, ద నేషన్, టైమ్ టీఆర్టీ వరల్డ్, పాకిస్థాన్ టుడే, సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు, కర్వాన్ మ్యాగజీన్ వంటి జాతీయ అంతర్జాతీయ మీడియా పబ్లికేషన్స్‌లో ప్రచురితమయ్యాయి. దీంతోపాటు ఆమె వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఫొటోజర్నలిస్టుగా కూడా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై ఆల్‌జజీరాకు స్టోరీలు అందించేది. క్యాలిఫోర్ని యా కేంద్రంగా పనిచేసే జుమా ప్రె ఏజెన్సీలో ‘కశ్మీరీ వాలా’.. స్థానిక వార్తలను ఇచ్చేది. సనా తీసిన అనేక ఫొటోలు జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లలోకూడా ప్రదర్శింపబడ్డాయి. ప్రస్తుతం రాయిటర్స్‌లో పనిచేస్తోన్న సనా 2021లో మ్యాగ్నమ్ ఫౌండేషన్‌లో ‘ఫొటోగ్రఫీ అండ్ సోషల్ జస్టి్టస్ ఫెలోస్‌లో ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తోంది. ఆడపిల్ల అయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా ఫొటోలు తీస్తూ, క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఆడపులిలా దూసుకుపోతూ మంచి ఫొటోజర్నలిస్టుగా ఎదిగింది. కాలేజీ రోజుల నుంచే.. యూనివర్సిటీలో ఉండగా సనా ఏవీ ప్రొడక్షన్లో స్పెషలైజేషన్ చేసింది. పీజీ ప్రాజెక్టులో భాగంగా ‘ద లేక్ టౌన్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. దీన్ని 2018 ముంబై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దీనికి కశ్మీర్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. ‘ఏ గ్రేవ్ డిగ్గర్’ అనే మరో ట్రామా డాక్యుమెంటరీకి కూడా సనాకు మంచి పేరు వచ్చింది. కోవిడ్ సమయంలో కశ్మీర్ వ్యాలీలోని మారుమూల ప్రాంతంలో వ్యాక్సిన్లు ఇస్తోన్న ఫొటోలను తీసేందుకు ఆరుగంటల పాటు ట్రెక్కింగ్ చేసి మరీ ఆక్కడకు చేరుకుని ఫొటోలు తీసి పంపింది. ఇలా ఎంతో డెడికేషన్‌తో తీసిన ఫొటోలు ఆమెకు ఫొటోజర్నలిస్ట్ ఫీచర్ విభాగంలో పులిట్జర్ అవార్డును తెచ్చిపెట్టాయి. జర్నలిజం, లిటరేచర్, మ్యూజిక్‌లలో ఉత్తమ ప్రతిభ, పనితీరు కనబరిచిన వారికి ఇచ్చే పులిట్జర్ అవార్డు దక్కించుకుంది సనా ఇర్షాద్. ఈ అవార్డుని జర్నలిజంలో నోబెల్ అవార్డుగా పరిగణిస్తారు. -
ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 01 - మే 08)
-
ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్24 - ఏప్రిల్30)
-
ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్11 - ఏప్రిల్17)
-
ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి27 - ఏప్రిల్03)
-
క్లిక్ 'మని' సంపాదిస్తున్నారు!
ఫొటోలు దిగడమే కాదు.. ఫొటోలు తీయడాన్ని కూడా యువత ట్రెండ్‌గా మార్చేస్తోంది. ఖాళీ దొరికినప్పుడల్లా ఖరీదైన కెమెరాలను భుజాన వేసుకుని బైక్‌లపై ఫొటోషూట్‌కు పరుగెడుతోంది. తమలోని అభిరుచులను ఎప్పటికప్పుడు కొత్తగా ప్రదర్శిస్తూ ఔరా అనిపిస్తోంది. ఒకవైపు చదువుకుంటూనే..మరోవైపు కెమెరాలు క్లిక్‌మనిపిస్తూ అనుభూతితో పాటు ఆదాయాన్ని కూడా ఆర్జిస్తోంది. సాక్షి, అమరావతి: ఇటీవల కాలంలో యువత ఫొటోగ్రఫీపై మక్కువ పెంచుకోవడంతో పాటు సొంత కెమెరా కొనుక్కోవడం కోసం విలాసాలకు దూరంగా ఉంటోంది. ఖరీదైన సెల్ఫోన్లు, బైక్‌ల వాడకాన్ని తగ్గించుకుని ఆ డబ్బుతో మంచి కెమెరాను కొనుగోలు చేసి తనలోని ప్రతిభ అందులో బంధిస్తోంది. ఇంటర్ మొదలు ఇంజనీరింగ్ వరకు చాలా మంది విద్యార్థులు ఫొటోగ్రఫీని హాబీగా మార్చుకుంటున్నారు. వాయిదా పద్ధతుల్లో రూ.40 వేల నుంచి రూ.లక్షకు పైగా వెచ్చించి కెమెరాలు కొనుగోలు చేస్తున్నారు. సాయంత్ర సమయాలు, వారాంతాల్లో స్నేహితులకు ఫొటో షూట్లు చేస్తూ పాకెట్‌మనీని సంపాదించుకుంటున్నారు. ఒక్కో కాపీకి రూ.60 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. సరాసరి నెలకు రూ.6,000 నుంచి రూ.10,000 వరకు ఆర్జిస్తున్నారు. కొందరైతే చదువును కొనసాగిస్తూనే ఫొటోగ్రఫీపై పూర్తిగా ఆధారపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంటి వద్దనే ఎడిటింగ్ వర్క్ చేస్తూ నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు సంపాదిస్తున్నారు. డబ్బు సంపాదన లక్ష్యం కాకుండా కూడా ఫ్రీలాన్సర్లుగా నేచర్, వైల్డ్ ఫొటోగ్రఫీని ఆస్వాదిస్తూ..స్నేహితులు, కళాశాలల్లో కార్యక్రమాలకు ఫొటోలు తీస్తున్న యువత కూడా ఉంది. సోషల్ మీడియా మేనియా.. యువత రోడ్లు, పార్కులు, పర్యాటక ప్రాంతాలు, జలాశయాలు, పురాతన కట్టడాలు, హిల్ స్టేషన్లలో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా దిగిన ఫొటోలను వెంటనే ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్, డీపీ ఇలా నచ్చిన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ మురిసిపోతున్నారు. ఇందుకోసమే విద్యార్థులు కళాశాలల్లో జట్టుగా ఏర్పడి ప్రతి వారాంతంలో ఫొటో షూట్లకు వెళ్లడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో అందరూ కలిసి కెమెరాను కొనుగోలు చేయడమో..అద్దెకు తీసుకోవడమో చేస్తున్నారు. ప్రతిభకు మెరుగులు ఇలా.. తొలుత తోటి విద్యార్థులు, తెలిసిన వాళ్లకు ఫొటోలు తీస్తూ తమలోని ప్రతిభకు పదును పెడుతున్నారు. పనితనం నచ్చిన వాళ్లు ఈవెంట్, ఔట్ డోర్ ఫొటోషూట్లకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పట్టణాల్లోని ప్రముఖ స్టూడియోలు, ఫొటోగ్రాఫర్లు సదరు యువతను స్టిల్ ఫొటోగ్రఫీకి పార్ట్‌టైమర్లుగా నియమించుకుంటున్నారు. అద్దెకు కెమెరాలు సొంత కెమెరాలు లేని వారు అద్దె ప్రాతిపదికన కెమెరాలను తీసుకువచ్చి ఫొటోషూట్లు చేస్తున్నారు. 8 గంటలు, 12 గంటల వ్యవధిలో సెమీ ప్రొఫెషనల్ కెమెరాలకు రూ.600 నుంచి రూ.1,000, డీఎస్ఎల్ఆర్ ప్రొఫెషనల్ కెమెరాలకు రూ.1,000 నుంచి రూ.2,000, మిర్రర్ లెస్ హైలీ ఫ్రొఫెషనల్ కెమెరాలకు రూ.2,500 నుంచి రూ.5,000 వరకు అద్దె చెల్లిస్తున్నారు. ఈవెంట్‌ను బట్టి కెమెరాలను తీసుకుంటూ తమ ప్యాకేజీలను ఫిక్స్ చేస్తున్నారు. సరదాగా నేర్చుకున్నా.. కుటుంబాన్ని పోషిస్తోంది! నేను సరదాగా ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను. ఇప్పుడది నా కుటుంబాన్ని పోషించే మార్గాన్ని చూపించింది. ఆరేళ్ల కిందట మా నాన్న మాకు దూరమయ్యారు. అప్పుడు నేను ఇంటర్లో ఉన్నాను. అప్పటి నుంచి మా అమ్మ, తమ్ముడి బాధ్యత నేనే చూసుకుంటున్నాను. ఇప్పుడు నేను బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాను. వారాంతాల్లో కాలేజీ స్టూడెంట్స్‌కు ఫొటో షూట్లు చేస్తూనే..బయట నుంచి వచ్చిన వీడియో ఎడిటింగ్ వర్క్స్ చేస్తూ నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు సంపాదిస్తున్నాను. నాకు సొంతంగా రెండు ఫొటో, ఒక వీడియో కెమెరాలు ఉన్నాయి. – బి.నవీన్, సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా -
మిర్చి.. అందం ఏరికూర్చి..
పచ్చని పంట పొలాలు అంటారు.. ఈ టైంలో బంగ్లాదేశ్‌లోని పంచ్గఢ్కి వెళ్తే మాత్రం మీకు ఇలాంటి ఎర్రని పంట పొలాలు కనిపిస్తాయి. చూశారుగా.. ఎంత అద్భుతంగా ఉందో ఈ చిత్రం.. మిర్చిని ఎండబెట్టడానికి ప్లాస్టిక్ షీట్ల మీద పరిచిన ఓ యువ రైతు తన ఇంటికి తిరిగి వెళ్తున్న ఈ దృశ్యాన్ని ఇమ్రాన్ అలీ అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించారు. 2021 న్యూయార్క్ ఫొటోగ్రఫీ పురస్కారాల్లో పీపుల్స్ ఫొటోగ్రఫీ–లైఫ్‌స్టైల్ విభాగంలో ఈ చిత్రం రెండో స్థానాన్ని దక్కించుకుంది. 50 దేశాల నుంచి 3 వేల ఎంట్రీలు రాగా.. 5 విభాగాల్లో విజేతలను ఇటీవల ప్రకటించారు. (క్లిక్: మండే సూర్యుడి నేలను.. మంచు ముద్దాడితే!) -
కామెడీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ: చెవులు పిండేస్తూ.. ఫ్లూటు ఊదేస్తూ..
చెప్పిన మాట వినని బిడ్డ చెవిని మెలేస్తున్న తల్లిని తలపిస్తున్న ఈ చిత్రం ‘అండర్ ద సీ’ కేటగిరీలో ప్రథమ బహుమతిని గెలుచుకుంది. సరదాగా కాసేపు.. అవార్డులెప్పుడూ సీరియస్ అంశాలకే పరిమితమైతే ఏం బాగుంటుంది? అప్పుడప్పుడూ ప్రకృతిలోని సహజ హాస్యాన్ని పట్టి బంధించాలి. అలాంటి ప్రయత్నమే చేశారీ ఫొటోగ్రాఫర్స్. ఆ ప్రపంచవ్యాప్త చిత్రాలకు కామెడీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ–2021 వేదికయ్యింది. అందులో అవార్డులు అందుకున్న, ఫైనల్‌కు చేరిన కొన్ని ఫొటోలను వెబ్సైట్లో పెట్టిందా సంస్థ. ‘‘కోకిలమ్మ పెళ్లికి కోనంతా సందడి.. చిగురాకుల తలంబ్రాలు.. ఉడతమ్మ సన్నాయి’’ తరహాలో ఓ కర్రపుల్లను నోట్లో పెట్టుకుని వాయిస్తున్నట్టుగా ఉన్న ఈ ఉడత ఫొటో ఫైనల్‌కు చేరింది. -
Adivasi Girl: కెమెరామెన్‌గా రాణిస్తున్న ఆదివాసీ యువతి
సాక్షి, కుమురం భీం: ఫోటోగ్రఫీ అంటే మగవాళ్ల సామ్రాజ్యం!ఎక్కువగా పురుషులే ఈ రంగంలో ఉంటారు. అయితే మగవాళ్లకు తానేం తక్కువ కానంటుంది ఓ ఆదివాసి యువతి. ఫోటోగ్రఫీలో రాణిస్తూ శభాష్ అనిపించుకుంటుంది. అద్బుతమైన ఫోటోలు తీస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. కుమురం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రానికి చెందిన ఆత్రం మాధవరావు ముగ్గురు కుమార్తెల్లో చివరి అమ్మాయి మమత. ఆమె సిర్పూర్ యూ మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతోంది. అయితే ఆమె చదువకుంటునే ఫోటోగ్రఫర్, వీడియో గ్రాఫర్‌గా రాణిస్తోంది. రోడ్లు కూడా సరిగాలేని మారుమూల గ్రామాలకు వెళ్లి ఫోటోలు తీస్తోంది మమత. ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు, ఇతర శుభకార్యలకు కూడా ఆమె ఫోటోలు తీస్తోంది. తనకు చదువుకుంటూ ఫోటోలు తీయటం సంతోషంగా ఉందని పేర్కొంది. -
అతడు అడవిని ప్రేమించాడు! ఎందుకీ తారతమ్యం..
వాషింగ్టన్ డీసిలోని నేచరల్ హిస్టరీ మ్యూజియం గురించి తరగతిగదిలో ఎన్నోసార్లు విని ఉన్నాడు సుయాస్. అక్కడ మొక్కల నుంచి జంతువుల వరకు, శిలల నుంచి శిలాజాల వరకు ఎన్నో కళ్లకు కడతాయి. మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకువెళతాయి. అలాంటి మ్యూజియంను జీవితంలో ఒక్కసారైనా చూడాలనేది సుయాస్ కల. చిత్రమేమిటంటే...పదిహేడేళ్ల వయసులో సుయాస్ తీసిన ఆరు మాసాల పులిపిల్ల ఫొటోను ఆ మ్యూజియంలో సంవత్సరం పాటు ప్రదర్శించారు. ఈ ఫొటో నేచర్స్ విభాగంలో బెస్ట్ ఫొటోగ్రఫీ ఏషియా అవార్డ్ అందుకుంది. ఎంత సంతోషం! భోపాల్(మధ్యప్రదేశ్)కు చెందిన సుయాస్ కేసరికి చిన్నప్పటి నుంచి వైల్డ్‌లైఫ్‌పై అంతులేని ఆసక్తి ఉండేది. తాను విన్న మృగరాజు, పులి, కుందేలు, నక్క...మొదలైన కథలు జంతుజాలంపై తనకు ఆసక్తిని కలిగించాయి. తన వయసు పిల్లలు టామ్ అండ్ జెర్రీలాంటి కార్టూన్ సీరియల్స్ చూస్తుంటే తాను మాత్రం జంతుజాలం, పర్యావరణానికి సంబంధించిన చానల్స్ చూసేవాడు. తాను చూసిన విశేషాలను స్నేహితులతో పంచుకునేవాడు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోనే కాకుండా వేసవి సెలవులకు కోల్‌కతాకు వెళ్లినప్పుడు...బెంగాల్‌లోని జూపార్క్లను చూసేవాడు. చదవండి: Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా.. తన బాల్యంలో ఒకసారి... ఒక జూలో కటకటాల వెనకాల ఉన్న పులులను చూసి సంతోషంతో చప్పట్లు కొట్టాడు. ‘నువ్వు సంతోషంగా ఉన్నావు కాని అవి సంతోషంగా లేవు’ అన్నది అమ్మమ్మ. ‘ఎందుకు?’ అని ఆశ్చర్యంగా అడిగాడు సుయాస్. ‘వాటి నివాసస్థలం అడవులు. అక్కడే అవి సంతోషంగా, స్వేచ్ఛగా ఉండగలవు. జూ వాటికి జైలు మాత్రమే’ అని చెప్పింది అమ్మమ్మ. ఇక అప్పటి నుంచి అడవుల్లో జంతుజాలానికి సంబంధించిన జీవనశైలిని తెలుసుకోవాలనే ఆసక్తి అంతకంతకూ పెరిగింది. చిన్నప్పటి ఆసక్తులు వేరు పెదయ్యాక కెరీర్ గురించి ఆలోచనల వేరు. చాలా సందర్భాల్లో చిన్నప్పటి ఆసక్తి బాల్యంలోనే ఆగిపోతుంది. అయితే సుయాస్ విషయంలో అలా జరగలేదు. కాలేజీ రోజుల్లో, అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కూడా తన ఆసక్తి తనను విడిచి పెట్టలేదు. అందుకే యూఎస్‌లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి అడవులను వెదుక్కుంటూ ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇక్కడ... అడవులు ఎన్నో తిరుగుతూ కన్జర్వేటర్లు, ఫారేస్ట్ రేంజ్ ఆఫీసర్లతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. అడవులన్నీ తిరుగుతున్న క్రమంలో తనకొక విషయం అర్థమైంది. మనుషులు అడవులకు వస్తున్నారు, జంతుజాలం మనుషులను చూస్తుంది...కాని ఇద్దరికీ మధ్య ఎక్కడో గ్యాప్ ఉన్నట్లు అనిపించింది. జంగిల్ పర్యటన వినోదానికి మాత్రమే పరిమితమైపోతుంది. అలా కాకుండా అడవిలో ప్రతి జీవి గురించి మనసుతో తెలుసుకోవాలి. అవి మనలో ఒకటి అనుకోవాలి.... ఇలా ఆలోచిస్తూ, తన ఆలోచనకు వేదికగా సోషల్ మీడియాను ఎంచుకున్నాడు. రకరకాల జంతువుల గురించి చిన్న చిన్న మాటలతోనే లోతైన పరిచయం చేయడం మొదలుపెట్టాడు. ఊహించని స్థాయిలో ఫాలోవర్స్! అందులో యూత్ ఎక్కువ. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. అందుకే ‘20 సంవత్సరాల వ్యక్తి దృష్టికోణంలో ‘అడవి’ అనే టాపిక్‌ను తీసుకొని ఫిల్మ్సిరీస్ చేశాడు. మంచి స్పందన వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ ఫర్ నేచర్) స్వచ్ఛంద సంస్థ చేయూత ఇచ్చింది. తమ పంటలను ధ్వంసం చేస్తున్నాయి అనే కారణంతో ఛత్తీస్‌గఢ్ నుంచి మధ్యప్రదేశ్‌కు వస్తున్న 18 అడవి ఏనుగులపై దాడి చేయడానికి కొందరు రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సమయంలో వారి నుంచి ఏనుగులను రక్షించడమే కాదు, వారి పంటలు దెబ్బతినకుండా తన బృందాలతో కలిసి కంచెలు ఏర్పాటు చేశాడు సుయాస్. జంతుజాలం సంక్షేమం గురించి అడవంత విశాలమైన పనులు చేయాలనేది సుయాస్ కల. అందులో ఒకటి వైల్డ్‌లైఫ్ గురించి సొంతంగా వోటీటీ ప్లాట్‌ఫామ్ మొదలుపెట్టాలని! విజయోస్తు సుయాస్. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! -
ఫోటో ఫీచర్: చిన్న మంచు ఫలకంపై ఎలుగుబంటి..
వెయ్యి పదాలలో చెప్పలేని భావం.. ఒక్క ఫొటోతో చెప్పవచ్చట.. ఇది కూడా అలాంటిదే.. చిన్న మంచు ఫలకంపై ఎలుగుబంటి ముడుచుకుని పడుకున్న ఈ చిత్రం.. చూడ్డానికి మామూలుగా కనిపిస్తోంది కదూ.. అయితే నిశితంగా పరిశీలిస్తే.. ప్రకృతికి మనిషి చేస్తున్న కీడును ఈ చిత్రం తెలియజెప్పుతోంది.. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్.. దాని వల్ల మంచు ఖండాలు కరుగుతున్న తీరుకు ఇది అద్దం పడుతోంది.. అందుకే ఈ చిత్రానికి పర్యావరణంలో జంతువుల కేటగిరీలో ఇంటర్నేషనల్ గోల్డెన్ టర్టిల్ ప్రథమ పురస్కారం లభించింది. మరెక్ జకోవ్స్కి ఈ చిత్రాన్ని తీశారు. మనిషి ప్రకృతికి చేస్తున్న మరో నష్టం.. ప్లాస్టిక్ కాలుష్యం.. అందుకు సముద్రాలనూ మనం వదిలిపెట్టడం లేదు.. అందుకు నిదర్శనమే ఈ చిత్రం. ఇది మాల్స్‌లో ఇచ్చే ప్లాస్టిక్ నెట్. ఇప్పుడు ఈ చేపకు మృత్యుపాశంగా మారింది.. అలాంటి నెట్లో చిక్కుకుని బయటపడటానికి ఇబ్బందులు పడుతున్న ఈ మత్స్యం చిత్రాన్ని పాస్క్వేల్ వాజెల్లో అనే ఫొటోగ్రాఫర్ తీశారు. హ్యూమన్స్ అండ్ నేచర్ కేటగిరీలో ద్వితీయ బహుమతిని గెలుచుకుంది ఈ చిత్రం. ఒకరిది ఆకలి ఆరాటం, మరొకరిది బతుకు పోరాటం. పర్వతపు మేకపిల్లను వేటాడుతున్న తోడేలు చిత్రాన్ని తీసిన ఫొటోగ్రాఫర్ హయువాన్ టాంగ్. జంతువుల ప్రవర్తన కేటగిరీలోప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. -
తాబేలును చుట్టేస్తూ.. మొప్పలతో భయపెడుతూ..
గుండ్రంగా తిరుగుతున్న బుజ్జి బుజ్జి పారదర్శక (గ్లాస్) చేపల మధ్య అమాయకంగా చూస్తున్న ఆకుపచ్చ తాబేలు భలే బాగుంది కదా. అమీ జాన్ అనే మహిళా ఫొటోగ్రాఫర్ ఆస్ట్రేలియా సముద్ర తీరంలో తీసిన చిత్రమిది. ‘‘సముద్రంలో డైవింగ్ చేస్తుండగా.. ఓ చోట పెద్ద సంఖ్యలో గ్లాస్ చేపలు కనిపించాయి. దగ్గరికి వెళ్లి చూస్తే.. అవన్నీ ఓ పెద్ద తాబేలు చుట్టూ వలయంలా తిరుగుతున్నాయి. వెంటనే క్లిక్‌మనిపించా..’’ అని అమీజాన్ తెలిపింది. ప్రఖ్యాత ఓసియన్ ఫొటోగ్రఫీ అవార్డ్స్–2021లో ఈ ఫొటో ఓవరాల్‌గా ప్రథమ బహుమతి కొట్టేసింది. ‘నా జోలికి వస్తే ఖబడ్దార్..’ అన్నట్టుగా భయపెడుతున్నది ఓ చేప పిల్ల. ఎదిగీ ఎదగని (లార్వా) దశలో ఉన్న కస్క్ ఈల్ రకం చేప ఇది. ఆ సమయంలో దాని రెక్కలు, మొప్పలు ఇలా వేలాడుతూ, కాంతికి మెరుస్తూ ఉంటాయి. శరీరం కూడా చాలా వరకు పారదర్శకంగా ఉండి, అవయవాలన్నీ బయటికి కనిపిస్తుంటాయి. సముద్రపు లోతుల్లో జీవించే ఈ అరుదైన చేపపిల్లను స్టీవెన్ కోవాక్స్ అనే ఫొటోగ్రాఫర్ చిత్రీకరించారు. ఈ ఫొటోకు ఓసియన్ ఎక్స్‌ప్లోరేషన్ విభాగంలో రెండో బహుమతి వచ్చింది. పై ఫొటోలు రెండూ చేపలవి అయితే.. ఈ ఫొటో వాటిని వేటాడి తినే సముద్ర పక్షులది. గాల్లో వేగంగా ఎగురుతూనే ఉన్నట్టుండి ఒక్కసారిగా గంటకు 60 కిలోమీటర్లకుపైగా వేగంతో సముద్రంలోకి డైవ్ చేసి, వేగంగా దూసుకెళ్లడం వీటి ప్రత్యేకత. ఈ పక్షులు అంత వేగంగా, అదీ సముద్రంలో డైవ్ చేసేప్పుడు ఇలా ఫొటో తీయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ ఫొటో తీసిన మహిళా ఫొటోగ్రాఫర్ హెన్లీ స్పీర్స్కు ఓసియన్ ఫొటోగ్రఫీ అవార్డ్స్‌లో ఓవరాల్‌గా రెండో బహుమతి వచ్చింది. -
అడోబ్ అప్డేట్స్ అదుర్స్
ఇప్పుడు... ఫోన్ ఉన్న చోట ఫొటోగ్రఫీ ఉంది. అలా అని ‘టిక్’ అని నొక్కగానే సరిపోదు.మార్పులు, చేర్పులు చేసి ‘మహా అద్భుతం’ అనిపించాలి కదా! ‘మరింత బాగా సొగసులు అద్దాలి’ అని ఆశించే వారి కోసం అప్డేట్లతో ముందుకు వచ్చింది అడోబ్ ఫొటోషాప్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్... క్రియేటివ్‌గా ఆలోచించేవాళ్లను మూడు దశాబ్దాలకు పైగా అలరిస్తోంది అడోబ్. రస్టర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్‌లోనే కాదు, డిజిటల్ ఆర్ట్‌లోనూ ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా నిలిచింది. పెన్టూల్, క్లోన్ స్టాంప్ టూల్, షేప్ టూల్,కలర్ రిప్లేస్మెంట్టూల్... మొదలైన టూల్స్‌తో ఆకట్టుకుంటూనే ఉంది. ఇక అప్డేట్ (ఐపాడ్ వెర్షన్) విషయానికి వస్తే... పెర్ఫెక్షన్ సరిగ్గా లేని ఇమేజ్‌లను సరిదిద్దడానికి ఫొటోషాప్ టూల్‌బాక్స్‌లోని ‘హీలింగ్ బ్రష్’ పరిచితమే. ఇప్పుడు ఇది ఐపాడ్ వెర్షన్‌కు వచ్చేసింది. డెస్క్‌టాప్ వెర్షన్‌కు తీసిపోని విధంగా ఉంటుంది. లైటింగ్, టెక్చర్,షేడింగ్...మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. డెస్క్‌టాప్ వెర్షన్‌లోని ఆల్సెట్టింగ్స్ ఇందులో ఉంటాయి. మోస్ట్ రిక్వెస్టెడ్ టూల్‌గా చెప్పుకునే ‘మ్యాజిక్ వాండ్’తో ఏంచేయవచ్చు? క్రమరహిత రూపాలు(ఇర్రెగ్యులర్ షేప్స్), ప్లాట్బ్యాక్గ్రౌండ్ ఇమేజ్‌లలోని అబ్జెట్స్ లేదా ఏరియాలను టోన్, కలర్ ఆధారంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ సెలక్షన్, రిఫైన్ ఎడ్జ్టూల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా పనిచేస్తాయి.ఇక డెస్క్‌టాప్ వెర్షన్‌కి వస్తే స్కైరీప్లెస్మెంట్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ అనే టూల్ వచ్చింది. నైట్సీన్స్, ఫైర్వర్క్స్, సూర్యాస్తమయం... ఇలా హై క్వాలిటీతో కూడిన 5000 రకాల ‘స్కై’లను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కాస్త సరదాగా.... ఇంకాస్త ప్రొఫెషనల్‌గా! ‘ఫొటోషాప్’తో గేమ్స్ అనేది మీ సరదాకు మాత్రమే పరిమితమైన విషయం కాదు. మీరు గట్టిగా కృషి చేస్తే ప్రొషెషనల్ గ్రాఫిక్ డిజైనర్ స్థాయిని చేరుకోవడం కష్టమేమీ కాదు. మార్కెటింగ్, బ్రాండింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోని అన్ని బ్రాండ్స్ చేయి తిరిగిన గ్రాఫిక్ డిజైనర్లను కోరుకుంటున్నాయి. చేయి తిరగాలంటే కంటికి పని కనిపించాలి. అనగా అప్డేట్స్ను ఎప్పటికప్పుడూ స్టడీ చేస్తుండాలి. ట్రెండింగ్ ఆర్ట్ మూమెంట్స్, డిజైనింగ్ స్ట్రాటజీలు, కస్టమర్ ప్రాధాన్యతల గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఉరుము లేదు మెరుపు లేదు...ఉత్త మాయ! యూకే నుంచి యూఎస్‌కు వచ్చి స్థిరపడిన జేమ్స్ ఫ్రిడ్మన్ తన క్రియేటివ్ ఫొటోషాప్ స్కిల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో జేమ్స్‌కు 2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ‘హాయ్ జేమ్స్! నా ఫొటోను మార్చి చూపించవా’ అని అడిగితే చాలు ‘ఇది నా ఫొటోనా!’ అనేంత భారీ ఆశ్చర్యాన్ని కళ్లకు ఇస్తాడు. -
మొదటి ట్రాన్స్‌జెండర్ ఫొటో జర్నలిస్ట్ కథ చెప్పే క్లిక్
ఇండియాలో ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ ఫొటో జర్నలిస్ట్‌గా జోయా థామస్ లోబో ఇటీవల వార్తల్లో నిలిచారు. ముంబైలో ఉంటున్న 27 ఏళ్ల జోయా యాచకురాలి నుంచి ఫొటోజర్నలిస్ట్‌గా ఎలా మారిందో తెలుసుకుంటే సాధనమున ఎవరికైనా ఏ పనైనా సాధ్యమే అనిపించకమానదు. ‘రకరకాల జీవన శైలులను బంధించడానికి నా కెమెరాతో వీధుల్లో నడవడం అంటే నాకు చెప్పలేనంత ఇష్టం’ అంటుంది జోయాను కదిలిస్తే. ‘చిత్రం’గా మలుపు ఇంట్లో చుట్టుపక్కలవారి నిరాదరణకు గురైన జోయా 18 ఏళ్ల వయసులో తన కుటుంబంనుంచి బయటకు వచ్చి, ముంబైలోని తన లాంటివారిని వెతుక్కుంటూ వెళ్లింది. కొంతమంది హిజ్రాల బృందంతో కలిసి, వారితో చేరి స్థానిక రైళ్లలో యాచించేది. ప్రతీ ఒక్కరినీ అవకాశాలు పలకరిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకున్నవారే విజేతలుగా నిలుస్తారు. అలాంటి విజేతల జాబితాలో జోయా నిలుస్తుంది. ‘‘2018లో ఒక రోజు నా జీవితం అకస్మాత్తుగా మలుపుతీసుకుంది. ఒక షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ ట్రాన్స్‌జెండర్ నటుల కావాలని వెతికారు. నటులు ఎవరూ లేకపోవడంతో నాకు అందులో ఓ పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మరో చిత్రం ట్రాన్స్జెండర్ల సమస్యల మీద తీశారు. అందులోనూ నటించాను’’ అని తనకు వచ్చిన అవకాశం గురించి ఆనందంగా వివరిస్తుంది జోయా. ఆ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమం లో కుటుంబాలు, సమాజం ట్రాన్స్‌జెండర్స్‌ని దూరంగా ఉంచడం అన్యాయమని పలువురు వక్తలు ప్రసగించారు. అప్పుడు జోయా తను ఎదుర్కొన్న సమస్యలను సభాముఖంగా వివరించింది. ఆమె ఉచ్ఛారణ ఆకట్టుకునే విధంగా ఉండటంతో స్థానిక పత్రికా సంపాదకుడు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా ఉద్యోగావకాశం ఇచ్చాడు. అలా మొదటిసారి పత్రికా ఆఫీసులో అడుగుపెట్టింది జోయా. అక్కడ ఉపయోగించే కెమెరాలు ఆమెను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సాధనమున ఫొటోగ్రీఫీ కొన్ని నెలల్లో సాధన చేసి, సన్నివేశాన్ని కళ్లకు కట్టే క్లిక్‌ను ఔపోసన పట్టింది. కిందటేడాది ఏప్రిల్ లాక్డౌన్ సమయంలో ముంబైలోని బాంద్రా స్టేషన్ సమీపంలో చిక్కుకున్న వలస కార్మికుల నిరసనల ఫొటోలను అన్ని పత్రికలు కవర్ చేశాయి. అందులో జోయా తీసిన ఫొటోలు ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాయి. జోయా ఓ కెమరా తీసుకొని, కరోనా మహమ్మారి మధ్య తన పని కోసం కష్టపడుతూ తిరిగింది. ‘ముందు జర్నలిజం గురించి చాలా తక్కువ తెలుసు. కెమెరాతో వర్క్ చేస్తున్నప్పుడు సంఘటనలను ఎలా ఒడిసిపట్టుకోవాలో, వార్తలో ఫొటో ప్రాధాన్యత ఎంతో వర్క్ చేస్తున్నప్పుడు నెమ్మదిగా అర్ధమైంది’ అంటూ తను నేర్చుకున్న పని గురించి వివరిస్తుంది. యాచన డబ్బుతో కెమెరా సాధనకు మరింత మెరుగులు పెట్టాలంటే అందుకు తగిన వనరులు కూడా ఉండాలి. ‘‘సొంతం గా నా దగ్గర ఒక కెమరా ఉండాలనుకున్నాను. కానీ, అంత డబ్బు నా దగ్గర లేదు. ఫ్రీలాన్సింగ్ జాబ్‌కి పెద్ద ఆదాయమూ లేదు. అందుకే, రైళ్లలో యాచిస్తూనే ఉండేదాన్ని. అలా వచ్చిన డబ్బు నుంచి కొంత మొత్తాన్ని దాచిపెట్టేదాన్ని. కానీ, అది కూడా చాలా తక్కువ. 2019 దీపావళి సమయంలో మాత్రం డబ్బు కోసం చాలా కష్టపడ్డాను. అలా వచ్చిన దానితో చివరికి నికాన్ డి–510ను కొన్నాను’’ అంటూ జోయా తన పోషణతో పాటు కెమెరా కొనుగోలుకోసం పడిన కష్టాన్ని తెలియజేస్తుంది. ఒక్క క్లిక్‌తో కథ స్కూల్ దశలోనే వదిలేసిన చదువు. పనిని ఎలా అర్ధం చేసుకుంటారు అని ఎవరైనా అడిగితే– ‘నేను పనిలోకి వెళ్లేటప్పుడు జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలు, దానికి సరైన సమాధానం చెప్పగలిగే ఫొటో తీయడంపై దృష్టి పెడతాను. ఒక కథ చెప్పగలిగే ఫొటో ప్రయత్నిస్తాను. వలసకార్మికుల చిత్రాలకు మంచి ప్రశంసలు వచ్చాయి. సీనియర్ ఫొటో జర్నలిస్టులు నా పనిని మెచ్చుకున్నారు. లైసెన్స్, ఇతర సాంకేతిక విషయాలపై నాకు అవగాహన కల్పించారు. దీంతో నాకు తగినన్ని పనులు వచ్చాయి. డబ్బు గురించి పక్కన పెడితే ఫొటో జర్నలిస్టుగా నా వర్క్‌ని నేను అమితంగా ఆనందిస్తున్నాను. కథల గురించి వెతకనప్పుడు పక్షులు, జంతువుల ఫొటోలు తీస్తాను. ఇటీవల అమరావతి పర్యటనకు వెళ్లినప్పుడు కింగ్‌ఫిషర్‌ను క్లిక్ చేయగలిగాను. కిందటేడాది వరకు ఆర్థికంగా మార్పేమీ లేదు. రైళ్లలో యాచించవలసి వచ్చేది. లాక్డౌన్ కావడంతో కెమెరాను కూడా అమ్మాల్సి వస్తుందేమో అని భయపడ్డాను. కానీ, అలా జరగలేదు. నాకు మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతిచోటా ట్రాన్స్‌జెండర్స్ చేయలేని పని ఏదీ లేదంటూ చెబుతూనే ఉన్నాను. వారి కుటుంబాల నుండి వారిని తిరస్కరించడం మానేస్తే, మంచి విద్య లభిస్తే, మిగ™ éవారిలాగే మంచి జీవితాలను గడుపుతారు. అన్ని ఉదోగ్యాలలో ట్రాన్స్జెండర్లు పనిచేస్తారు. యాచించరు’’ అని వివరిస్తుంది జోయా. -
వైరల్: చావోరేవో అన్నట్లు.. గట్టిగా అరుస్తూ హంగామా
బుల్లి హమ్మింగ్ బర్డ్ పాముకు సమఉజ్జీ కానేకాదు.. కానీ.. గుండె ధైర్యం ఎక్కువలాగుంది.. అందుకే తన గూటి జోలికి.. అందులో ఉన్న పిల్లల జోలికి రావడానికి ప్రయత్నిస్తున్న ఈ గ్రీన్ పిట్ వైపర్‌కు ఎదురెళ్లింది.. చావోరేవో అన్నట్లు తెగించింది.. గట్టిగా అరుస్తూ.. దాని చుట్టూ తిరుగుతూ హంగామా చేసింది.. ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించింది.. ఏమనుకుందో ఏమో.. చివరికి ఈ పాము వెనక్కి తగ్గింది. పిట్టదే పైచేయి అయింది.. ఈ చిత్రాన్ని బెన్స్మేట్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. ఇది మనకు తెలిసిందేగా.. అయితే.. ఇక్కడ విడవలేదు.. అలాగని కరవనూలేదు.. ఇదో చాలా చిత్రమైన పరిస్థితి. ఫొటో చూస్తున్నారుగా.. తనను కరవడానికి వచ్చిన పాము గొంతును ఈ కప్ప ఎలా పట్టుకుందో.. ఈ ట్రీ స్నేక్ కప్పను అమాంతం మింగేద్దామని వచ్చినా.. అది తెలివిగా పక్కకు తప్పుకోవడంతో ఈ మాత్రమే నోటికి చిక్కింది. దీంతో కప్ప విజృంభించేసింది.. పట్టు బిగించింది.. ఇలా ఇవి కొన్ని గంటలపాటు ఉండిపోయాయట. అలా ఉండిఉండి నీరసించి.. చివరికి దేనిదారిన అవి వెళ్లిపోయాయట. ఈ చిత్రాన్ని బెలీజ్ దేశ అడవుల్లో డేవిడ్ మైట్‌ల్యాండ్ అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించారు. చదవండి: ఈ హెరిటేజ్ సైట్స్‌లోకి వెళ్లలేం.. ఇదొకటే దారి! -
60 ముక్కలుగా శరీరం, పరిశీలించేందుకు రెండు రోజులు
పురుషులు మాత్రమే పనిచేయగలరనే ఫోరెన్సిక్ విభాగంలో మహిళగా ఆమె రికార్డు సాధించింది. ఎంచుకున్న పనిని ఏళ్లుగా సమర్థంగా నిర్వర్తించడంతో పాటు అందమైన ప్రకృతిని తన కెమరా కన్నుతో పట్టేస్తోంది డాక్టర్ గీతారాణి గుప్తా. మధ్యప్రదేశ్ ఫోరెన్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఏకైక మహిళగానే కాదు, 32 ఏళ్ల వైద్య వృత్తిలో 9,500 మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన రికార్డు కూడా డాక్టర్ గీతారాణి గుప్తా సొంతం. 63 ఏళ్ల వయసులోనూ భోపాల్‌లోని మెడికో లీగల్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్‌గా విధులను నిర్వహిస్తున్నారు. మగవాళ్లే చేయగలరు అనే విభాగంలో పనిచేయడంతో పాటు, రికార్డు సృష్టించిన గీతారాణి గుప్తా ఇన్నేళ్ల వైద్యవృత్తిలో తన అనుభవాలను ఆమె ఇటీవల పంచుకున్నారు. ఇప్పటికీ మధ్యప్రదేశ్‌లో ఫోరెన్సిక్ మెడిసిన్‌లో ఎం.డి చేసిన ఏకైక మహిళగా గీతారాణి పేరే ఉంటుంది. తను పుట్టి పెరిగిన వాతావరణం, ఎంచుకున్న మెడికల్ విభాగం, వృత్తి అనుభవాలతో పాటు, అభిరుచులనూ తెలియజేశారు. కళ్ల ముందు కదలాడే కథలు ‘‘ఎనిమిదేళ్ల క్రితం జరిగిన సంఘటనే అయినా ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంది. అది అంత దారుణమైనది. 60 ముక్కలుగా కట్ అయి ఉన్న ఉన్న ఒక శరీరం పోస్ట్ మార్టం కోసం షాజాపూర్ నుండి వచ్చింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, బోర్‌వెల్‌లో వేశారు హంతకులు. పోలీసులు మృతదేహాన్ని, వెలికి తీసి తరలించడానికే మూడు రోజులు పట్టింది. దీన్ని పరీక్షించడానికి నాకు రెండు రోజులు పట్టింది. నాలుగేళ్ల క్రితం, మూడు నాలుగు ముక్కలు చేసిన పుర్రె, అస్థిపంజరం తీసుకొచ్చారు. ఇది పరీక్షించడం ఓ సవాల్ అయ్యింది. పుర్రెను పరీక్షించినప్పుడు, బుల్లెట్ పుర్రెలో చిక్కుకున్నట్లు కనుక్కున్నాను. అతని కుటుంబ సభ్యులే ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఎన్ని కేసులు... ప్రతీ రోజూ మృతదేహాల మీద పరీక్షలే. ఏకైక మహిళగా తొలి అడుగు మా నాన్నగారు ఉపాధ్యాయుడు. నేను కూడా మెడికల్ కాలేజీలో లెక్చరర్ కావాలనుకున్నాను. అంతే పట్టుదలగా చదివాను. ఫోరెన్సిక్ విభాగంలో లెక్చరర్ షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దానికి నా వయస్సు రెండు నెలల 8 రోజులు ఎక్కువ. లెక్చరర్‌గా వెళ్లకుండా ఈ విభాగంలో చేరిపోయాను. అలా ఫోరెన్సిక్ మెడిసి¯Œ లో ఎమ్‌డి చేసిన రాష్ట్రంలో తొలి మహిళా వైద్యురాలిని అయ్యాను. పీహెచ్‌డి చేయాలనుకున్నాను. కానీ, ప్రభుత్వ పనికి అంతరాయం కలిగించడం నాకిష్టం లేదు. అందుకే, ఎంచుకున్న వృత్తిలో అలాగే కొనసాగాను. మాటలు రాని క్షణాలు నా మొదటి రోజు ఉద్యోగంలో నేను గమనించిన విషయం.. నోరు, ముక్కుపై క్లాత్ అడ్డుపెట్టుకొని మృతదేహాన్ని చూడటానికి ఆ కుటుంబసభ్యులు వచ్చినప్పుడు మనిషి చనిపోయాక ఇక విలువ లేదని అర్ధం చేసుకున్నాను. ఆ క్షణంలో మాటలు రాకుండా అలాగే ఉండిపోయాను. మొదటిరోజే 20 మృతదేహాలను చూశాను. ఆ రోజు రాత్రంతా నిద్రపోలేకపోయాను. కాని నా మనస్సుకు తెల్లవార్లు బలంగా ఉండాలంటూ నాకు నేను నచ్చజెప్పుకుంటూ గడిపాను. ఇది నాకు అంతర్గత ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తరువాత ఇక నేను నా విధిని నిర్వర్తిస్తున్నాను అనే అనుకున్నాను. అలా ఆ ఏడాది 20 మృతదేహాలకు పోస్టుమార్టం చేశాను. ఎంపీ మెడికల్ లీగల్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ ఆఫీసర్‌గా 1989లో ఎంపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపిపిఎస్సి) నుంచి ఎంపిక చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ నా పని శవపరీక్ష. ఇదే కాకుండా మెడికో లీగల్ కేసుల పరిష్కారానికి కోర్టుకు హాజరు కావడం. ఖాళీ సమయంలో ఫోటోగ్రఫీ.. ఫోరెన్సిక్ విభాగంలో శవపరీక్ష ఛాయాచిత్రాలను తీయిస్తూ ఉండేవాళ్లం. ఆ ఫొటోలను పరిశీలించడానికి ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ రాకేశ్ జైమిని, ప్రశాంత్ సక్సేనా ఫోటోగ్రఫీని నేర్పించారు. అలా ఫొటోగ్రఫీ నా అభిరుచిగా మారిపోయింది. నేను ఒంటరిగా ఉంటాను. కానీ, నాకు నచ్చిన అన్ని పనులు చేస్తాను. మరో నచ్చిన పని లాంగ్ డ్రైవింగ్. నా దగ్గర కారు, ల్యాప్‌టాప్, కెమెరా ఉన్నాయి. జంతువులు, పక్షుల ఫోటోలు తీయడానికి సిటీ నుంచి అడవుల వరకు దూరంగా వెళ్లిపోతాను. ఎంపిక మనది అవ్వాలి.. నేను ప్రతి రంగంలో అమ్మాయిలు రాణిస్తున్నారు. పురుషు ఆధిపత్య సమాజంలో మహిళలు చోటు సంపాదిస్తున్నారు. అమ్మాయిలూ ధైర్యంగా ఉండండి. సవాళ్లను స్వీకరించి ముందుకు సాగండి. మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో ఈ ఎంపికను మీరే చేసుకోండి. ఏదో ఒక అభిరుచిని మీలో ఎప్పుడూ ఉంచుకోండి. అది మిమ్మల్ని నిరంతరం జీవించేలా చేస్తుంది’’ అని నవతరం అమ్మాయిలకు వివరిస్తారు డాక్టర్ గీతారాణి గుప్తా. -
ఎలుగుబంటి విత్ పింఛం
కొన్ని చాలా సడెన్‌గా జరుగుతాయి.. కన్నార్పేలోపే మాయమైపోతుంటాయి కూడా.. ఇక్కడ కనిపించే చిత్రం కూడా అలాంటిదే.. బైజూపాటిల్ అనే ఫొటోగ్రాఫర్ కాస్త చురుకు కాబట్టి.. వెంటనే ఇలా క్లిక్మనిపించేశాడు.. చూశారుగా.. ఎలుగుబంటి విత్ పింఛం.. రాజస్తాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్కులో పర్యాటకులు జీప్‌లో వెళ్తుండగా.. నెమలి పింఛం విప్పి ఆడటం మొదలుపెట్టింది.. వారు చూస్తున్నారు.. అంతలో ఒక ఎలుగుబంటి అలా వచ్చి.. నిల్చుని చూడటం.. బైజూపాటిల్ తన కెమెరా కంటిలో దీన్ని బంధించేయడం చకచకా జరిగిపోయాయి. -
ఫోటో గ్రాఫర్ ఓవరాక్షన్.. వరుడి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: పుట్టినరోజు, పెళ్ళి..శుభకార్యమేదైనా, వేడుక ఏదైనా, సందర్బం ఏదైనా ఆ మధుర జ్ఞాపకాలను పదికాలాలపాటు పదిలపర్చుకునేందుకు ఫోటోలు, వీడియోలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మారుతున్న కాలానికనుగుణంగా ఫోటోగాఫర్లు తమని తాము అప్డేట్ చేసుకుంటున్నారు. వినూత్నంగా సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ, పలు టెక్నిక్‌లతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇవి చాలావరకు ఆకర్షణీయంగానూ, ఆసక్తికరంగానూ ఉంటాయి కూడా. ముఖ్యంగా పెళ్ళిళ్లలో ఫోటోలు, వీడియోల సందడి లేని సందర్భాన్ని అస్సలు ఊహించలేం..అయితే రాను రాను ఈ ముచ్చట కాస్త.. వెర్రి తలలు వేస్తోంది. మరీ ఇంత అవసరమా అన్న అభిప్రాయం కలుగుతోంది. వేలంవెర్రి అంటూ విసుక్కున్న సందర్భాలు మనలో చాలామందికి అనుభవంలోకి వచ్చి ఉంటాయి. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజనులను కడుపుబ్బ నవ్విస్తోంది. ‘అతి సర్వత్రా వర్జయేత్’ అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక పెళ్లి వేడుకలో ఫోటోగ్రాఫర్ మరీ అతి చేసి భంగపడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వరుడి రియాక్షన్ చూసి...వధువు పొట్ట పట్టుకుని పగల బడి నవ్వుతుండటం హైలైట్. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ వీడియోను చూసి సరదాకా నవ్వుకోండి..!! ఈ వీకెండ్లో మాంచి టైం పాస్.... -
ప్రతి దృశ్యం అంతులేని కవిత్వం!
ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో తాజా కెరటం లౌకిక్దాస్. కోల్‌కతాకు చెందిన దాస్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డిప్లొమా చేశాడు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2020లో ఇతడికి ఎనిమిది షోలు కవర్ చేసే ఛాన్స్ దొరికింది. ప్రస్తుతం కోల్‌కతా కేంద్రంగా తన పాషన్ కొనసాగిస్తున్న లౌకిక్దాస్ మాటలు కొన్ని... ∙నేను ఎప్పుడూ ఫాలో అయ్యే ఏకైక రూల్... ఏ రూల్ ఫాలో కావద్దని! ఎందుకంటే ఫొటోగ్రఫీ అనేది సృజనాత్మకమైనది. దానికి హద్దులు, పరిమితులు లేవు ∙ఫొటోగ్రఫీలోని రకరకాల జానర్స్‌లో ఎన్నో గొప్ప అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా మన కోసం ఎదురుచూస్తున్నాయి ∙ఏ పుస్తకమో ఎందుకు? ‘ప్రకృతి’ అనే అందమైన పుస్తకాన్ని చదివితే ఎంతో జ్ఞానం మన సొంతమవుతుంది. అది మన వృత్తికి ఇరుసుగా పనిచేస్తుంది ∙‘ఈ దృశ్యంలో ఏదో మ్యాజిక్ ఉంది’ అని పసిగట్టే నైపుణ్యాన్ని మన కంటికి నేర్పాలి. -
ఐఫోన్ యూజర్లకు శుభవార్త : ఫ్రీ సెషన్లు
సాక్షి, న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ యూజర్లకు శుభవార్త అందించింది. ముందుగా ప్రకటించినట్టుగానే సంగీతం, ఫోటోగ్రఫీ, ఆర్ట్ పై ఆసక్తి ఉన్నవారి కోసం ఉచిత వర్చువల్ సెషన్లను షురూ చేసింది. ఇటీవల భారతదేశంలో ఆపిల్ స్టోర్ ఆన్లైన్ ప్రారంభించిన ఆపిల్ తన ఐఫోన్ వినియోగదారులలో అప్ కమింగ్ కళాకారులకు ఈ సెషన్లలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ వర్చువల్ సెషన్‌కు మీ ఐఫోన్ సిద్ధంగా ఉండండి అని ఆపిల్ పేర్కొంది. నవంబర్ 29 వరకు ఉచిత వర్చువల్ సెషన్లను ప్రకటించింది. ప్రముఖ స్థానిక ఫోటోగ్రాఫర్లు, ప్రసిద్ధ సంగీతకారులు వారి వారి విజయ గాథలను పంచుకుంటారు. ఈ ఆపిల్ ఈవెంట్ల కోసం నమోదు చేసుకున్న వినియోగదారులకు చిట్కాలు , సలహాలు అందిస్తారు. ఈ క్రమంలో ముందుగా ఫోటోగ్రఫీ సెషన్ల వివరాలను ఆపిల్ ప్రకటించింది. (ఆపిల్‌పై శాంసంగ్ సెటైర్లు) ఫోటోగ్రఫీ సెషన్లు ఉచిత వర్చువల్ ఫోటోగ్రఫీ సెషన్లు అక్టోబర్ 22 నుండి ప్రారంభం. వీటిని ఫోటో ల్యాబ్ అంటారు. ప్రధానంగా సిద్దార్థ జోషి, అవని రాయ్ వంటి ప్రముఖులు అక్టోబర్ 22, అక్టోబర్ 27 తేదీల్లో ఉదయం 7 నుండి 8 గంటల వరకు పాల్గొంటారు. డీఎస్ఎల్ఆర్, మిర్రర్‌లెస్ కెమెరాలను ఎలా ఉపయోగించాలో చెబుతారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ చిట్కాలను అందిస్తారు. ప్రసిద్ధి చెందిన డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శిస్తారు. అక్టోబర్ 29 న, అనురాగ్ బెనర్జీ నాన్-ఫిక్షన్ ఫోటోగ్రఫీపై ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, నవంబర్ 3 న, పోర్ట్రైట్ ఫోటోగ్రఫీపై ప్రార్థనా సింగ్ ఒక సెషన్ తీసుకోనున్నారు. ఆపిల్ అక్టోబర్ 28, నవంబర్ 1, నవంబర్ 2 న ఐఫోన్లలో ఫోటోగ్రఫీపై మూడు సెషన్లను ఉంటాయి. నవంబర్ 5 న హషీమ్ బదాని నిర్వహించే ఫోటోగ్రాఫిక్ సెషన్ ఉంటుంది. ఇందులో తన ప్రాజెక్టుల ప్లానింగ్, పరిశోధనలను వివరిస్తారు. ఈ సెషన్లకు రిజిస్టర్ చేసు కోవాలంటే ఆపిల్ కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టాబ్లెట్, ఇంటర్నెట్ కనెక్షన్, ఉచిత సిస్కో వెబెక్స్ సమావేశాల యాప్ ఉండాలి. అలాగే యూజర్లు18 ఏళ్లలోపు వారైతే, తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఆమోదం కావాలని ఆపిల్ వెల్లడించింది. -
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లుకు అవార్డుల పంట
-
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సాక్షి అందిస్తున్న అద్బుతమైన ఫోటోలు
-
ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగష్టు 03–09)
-
ఇంటి పేరు క్లిక్.. ఇళ్లు తళుక్కు
సాక్షి, బెంగళూరు : కొందరికి రేడియో వినడం అంటే ఇష్టం..మరికొందరికి పాటలంటే ఇష్టం..ఇంకొకరికి వంటల పిచ్చి....ఇంకా సంగీతం, నృత్యం ఇలా రకరకాల కళల్లో ఎవరి అభిరుచి వారికి ఉంటుంది. ఆ ప్రతిభతో ఆయా రంగాల్లో రాణించిన పేరు ప్రఖ్యాతులు గడించిన వారు చాలామందే ఉన్నారు. అయితే ఆ ప్రేమ కాస్త పిచ్చిగా మారి, దాన్ని చాలా భిన్నంగా, హృద్యంగా మల్చుకోవడం దాదాపు అరుదు అనే చెప్పాలి. కర్ణాటకలోని బెల్గాంకు చెందిన రవి హోంగల్ (49) ఇదే కోవకు చెందుతారు. చిన్నప్పటి నుంచీ ఆయనకు ఫోటోగ్రఫీపై మక్కువ ఎక్కువ. అలా ‘పెంటాక్స్’ కెమెరాతో కనిపించిన దృశ్యాలను క్లిక్ చేస్తూ ఎదిగారు. చివరికి దాన్నే వృత్తిగా ఎంచుకుని తన భార్య రాణితో కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. అంతేకాదు ప్రముఖ డిజిటల్ కెమెరాలు ఎప్సన్, కానన్, నికాన్ పేర్లను తన ముగ్గురు కుమారులకు పెట్టారు. ఇక్కడితో అయన అభిమానం ఆగిపోలేదు. కెమెరా ఆకారంలో బెల్గావ్లో మూడంతస్థుల భవనాన్ని నిర్మించుకోవడం విశేషం. సుమారు 71 లక్షల రూపాయలతో ప్రేమగా నిర్మించుకున్న తన కలల సౌధానికి ‘క్లిక్’ అని పేరు పెట్టుకోవడం మరో విశేషం. -
భలే ఉన్నాయి సారూ!
పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలను చూడగానే మమ్ముట్టి మనసు గతంలోకి వెళ్లిపోయింది. అప్పట్లో ఆయనకున్న హాబీల్లో ‘ఫొటోగ్రఫీ’ ఒకటి. ఈ లాక్డౌన్ వేళ అది గుర్తొచ్చింది. అంతే.. కెమెరా తీశారు. తన ఇంటి గార్డెన్లో తీగ మీద సేద తీరుతున్న పక్షులను క్లిక్‌మనిపించారు. ‘‘ఉషోదయపు అతిథులు (పక్షులను ఉద్దేశించి), ఫొటోగ్రఫీ.. నా పాత హాబీ’’ అంటూ తాను తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు మమ్ముట్టి. ఆ ఫొటోలను చూసి, ‘ఫొటోగ్రఫీలో మీకు చాలా నైపుణ్యం ఉంది సారూ. భలే ఉన్నాయి’’ అని నెటిజన్లు ప్రశంసించారు. -
వైరల్: చెంప ఛెళ్లుమనిపించిన విగ్రహం!
ఫొటోలు జ్ఞాపకాలకు గుర్తు. కానీ ఇప్పుడు ప్రతీ పనికి కూడా ఫొటోలు క్లిక్‌మనిపించేస్తున్నారు. అయితే ఫొటోలు తీయడం కూడా ఓ కళేనండోయ్. దానికి కాస్త క్రియేటివీ జోడిస్తే ఇంక తిరుగే ఉండదు. అలా కొందరు విగ్రహాలు తమను ఆటాడేసుకుంటున్నట్లు కనిపిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి అద్భుతంగా ఉన్నాయంటూ నెటిజన్లు కన్నార్పకుండా ఆ ఫొటోలపై లుక్కేస్తున్నారు. విగ్రహాలు కదిలి విన్యాసాలు చేస్తున్నాయా? అనిపించేలా ఉండటమే ఆ ఫొటోల ప్రత్యేకత. మచ్చుకు కొన్నింటి గురించి చెప్పుకుందాం. స్పైడర్ మ్యాన్‌లా రెడీ అయిన మనిషి ఓ విగ్రహం తన గొంతు పిసికి చంపుతున్నట్లు స్టిల్ ఇచ్చాడు. (‘ఆ ఫోటో ఇంత పని చేస్తుందని అనుకోలేదు’) Good grief! They’re fighting back! #worldsgonemad pic.twitter.com/YAHlAQYikM — Mark Leneve✍🏼🎨🖌 (@MarkLeneve) June 12, 2020 మరో చోట రోడ్డుపై నడుస్తున్నట్టుగా ఓ విగ్రహం ఉండగా.. అది ఓ కుర్రాడి కాలు పట్టుకుని లాక్కు వెళుతున్నట్లు మ్యాజిక్ చేశారు. ఇంకో ఫొటోలో ఓ బుడ్డోడు పిడికిలి బిగించి గుద్దుతా అని కోపంగా మొహం పెట్టిన విగ్రహం ముందు నిజంగానే తనను కొడుతున్నాడనేలా ఓ వ్యక్తి మొహంలో భయాన్ని ప్రదర్శించాడు. ఇంకో ఫొటోలో ఓ యువతిని విగ్రహమే నిజంగా వచ్చి చాచి చెంప చెళ్లుమనిపించినట్లు ఉంది. ఇలాంటి ఎన్నో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (‘ఈ ఫోటోలకు అరెస్ట్ కాదు.. అవార్డు ఇవ్వాలి’) pic.twitter.com/lRdh0HXazT — I'm Smaggy😁 I don't like Smirky🤥 Trump💩 Boris🤪 (@Murdochcrazy) June 13, 2020 -
మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు..
సాక్షి, న్యూఢిల్లీ : ఫీచర్ ఫోటోగ్రఫీలో పులిట్జర్ అవార్డును పొందిన ముగ్గురు భారత ఫోటో జర్నలిస్టులను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభినందించారు. ‘మీ ముగ్గురు దేశాన్ని గర్వపడేలా చేశారు’ అంటూ మంగళవారం ట్వీట్ చేశారు. ఇక భారత్‌కు చెందిన ముగ్గురు ఫోటోగ్రాఫర్స్ యాసిన్, చన్నీ ఆనంద్, ముక్తార్ ఖాన్ ఫీచర్ ఫోటోగ్రఫీ అవార్డుల అందుకున్న విషయం తెలిసిందే. వీరు ముగ్గురు అసోసియేటెడ్ ప్రెస్‌తో కలిసి పనిచేశారు. గతేడాది కశ్మీర్లో ఆర్టికల్ 370ను తొలగించిన సమయంలో జరిగిన నిరసనలను, భద్రతా దళాలు, హింసాకాండలకు చెందిన పలు చిత్రాలను వీరు తమ కెమెరాల్లో బంధించి ప్రపంచానికి చూపారు. ఈ నేపథ్యంలో స్థానిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించినందుకు వీరికి పులిట్జర్ ఫీచర్ ఫోటోగ్రఫీ అవార్డులు వరించాయి. (ఢిల్లీలో జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం ) Congratulations to Indian photojournalists Dar Yasin, Mukhtar Khan and Channi Anand for winning a Pulitzer Prize for their powerful images of life in Jammu & Kashmir. You make us all proud. #Pulitzer https://t.co/A6Z4sOSyN4 — Rahul Gandhi (@RahulGandhi) May 5, 2020 దార్ యాసిన్, ముక్తార్ ఖాన్ కశ్మీర్‌కు చెందిన వ్యక్తులు కాగా ఆనంద్ మాత్రం జమ్మూలో నివసిస్తున్నాడు. న్యూయార్క్ టైమ్స్, ఎంకరేజ్ డైలీ న్యూస్, ప్రో పబ్లికాలకు పులిట్జర్ బహుమతి లభించింది. కాగా జర్నలిజం రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైదనది పులిట్జర్ అవార్డు. దీనిని వార్తాపత్రికలు, సాహిత్యం, ఆన్లైన్ పత్రికారచన, సంగీతం వటి రంగాలలో విశేష కృషి చేసిన వారికి ప్రధానం చేస్తారు. (అడ్వకేట్లకు అండగా నిలిచిన ప్రభుత్వం) -
ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15–22)
-
స్మరిత ఫొటోగ్రఫీ.. సెలబ్రిటీల ఫిదా
శ్రీనగర్‌కాలనీ: యూకేలో ఎంఎస్, యూఎస్ఏలో కుటుంబంతో సెటిల్ అయ్యింది. కానీ ఫొటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం. ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే ఆమెకు ప్రాణం. ఆ ఇష్టంతోనే న్యూ బార్న్ ఫోటోగ్రఫీలో మెళకువలు నేర్చుకుంది. అమెరికాలో ఆమె పోటోలకు ఫిదా అయిన అనేక మంది హైదరాబాద్ రావాలని పట్టుబట్టడంతో సిటీకి వచ్చి న్యూబార్న్ పొటోగ్రఫీలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుతుంది నగరానికి చెందిన స్మరిత విన్నకోట. ఇక్కడే ఇంజనీరింగ్ చదివిన స్మరిత సెలబ్రిటీస్ పిల్లలకు పొటోగ్రఫీ చేసి వారి మన్ననలు పొందుతూ న్యూ బార్న్ ఫొటోగ్రఫీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తన గురించి, ఫొటోగ్రఫీ విషయాలను సాక్షికి వివరించింది. పిల్లలంటే ఇష్టం.. నగరానికి చెందిన అమ్మాయినే..జేబీఐటీలో ఇంజనీరింగ్ చేశాను. తర్వాత యూకేలో ఎంఎస్ చేశాను. చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే అప్పుడప్పుడు పొటోలను తీసేదాన్ని. పెళ్ళయ్యాక భర్త నవీన్‌తో కలిసి యూఎస్ఏలో సెటిలయ్యాం. కానీ ఎక్కడో వెళితిగా ఉండేది. ఫొటోగ్రఫీ చేయాలని గట్టిగా అనుకున్నాను. అందులోనూ న్యూ బార్న్ చిన్నారులకు ఫొటోగ్రఫీ చేయాలనుకున్నాను. ఆన్లైన్లో కోర్సులను, బేబీ సేఫ్టీ వర్క్ షాప్ నేర్చుకున్నాను. యూఎస్‌లో ఇంటర్నేషనల్ న్యూ బార్న్ ఫొటోగ్రఫీలో మెంబర్ని. బ్యూటీ అండ్ లైఫ్‌స్టైల్ మామీ మ్యాగ్జీన్– పేరెంట్స్ ఛాయిస్ అవార్డు లభించింది. అలా న్యూ బార్న్ ఫొటోగ్రఫీ నాకు మరో భాగస్వామిగా మారింది. జస్ట్ బార్న్ ఫొటోగ్రఫీకి మంచి రెస్పాన్స్ 2014 నుండి న్యూ బార్న్ ఫొటోగ్రఫీ చేస్తున్నాను. పుట్టిన 14 రోజుల్లో జస్ట్‌బార్న్ ఫొటోగ్రఫీ చేయాలి. యూఎస్‌లో ఈ ఫొటోగ్రఫీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడి ఇండియన్స్‌తో పాటు విదేశీయులు సైతం జస్ట్‌బార్న్ ఫొటోగ్రఫీని ఇష్టపడేవారు. అలా అక్కడ ఫొటోగ్రఫీకి చాలా అద్బుతమైన స్పందన వచ్చింది. మన తెలుగువారు చాలా మంది హైదరాబాద్ నుండి మెయిల్స్, సోషల్‌మీడియాలో మెసేజెస్, ఫోన్లు చేసి ఇక్కడి రావాలని పట్టుబట్టారు. కొంత మంది సెలబ్రిటీస్ ఫొటోగ్రఫీకి కితాబివ్వడం ఆనందాన్నిచ్చేది. సుమారుగా 500 న్యూబార్స్ బేబీస్‌కి ఫొటోగ్రఫీ చేశాను. అలా సొంత నగరానికి రావాల్సి వచ్చింది. ప్రముఖుల పిల్లలకు ఫొటోలు బేబీ బార్న్ ఫొటోగ్రఫీని నగరంలోని చాలా మందికి చేశాను. అందులో మంచు విష్ణు కుమార్తె, మెగాస్టార్ మనవరాలు, శ్రీజ–కళ్యాణ్‌దేవ్ కుమార్తెకు, దిల్‌రాజు మనవరాలికి, అశ్వనీదత్ మనవరాలికి బేబీ బార్న్ ఫొటోగ్రఫీ చేశాను. -
51వ వారం మేటి చిత్రాలు
-
పల్లె అందం చూద్దామా..
సాక్షి, నిజామాబాద్: పల్లె అంటేనే అందం.. పచ్చని పంట పొలాలు.. కల్మషం లేని మనుషులు.. పంట భూములు.. పైరగాలులు.. లేగెదూడల అంబా..అంబా అనే పిలుపులు.. పక్షుల రాగాలు.. బాగున్నావా బిడ్డా అంటూ ఆప్యాయంగా పలకరింపులు.. ఇలా అచ్చమైన సంప్రదాయాలకు నిలువుటద్దంలా పల్లెలు నిలుస్తాయి. మనిషి సాంకేతికతను పెంచుకుంటూ ఆధునిక జీవనానికి అలవాటు పడుతున్నప్పటికీ పల్లెల్లో ఇప్పటికీ ఒకే మాట.. ఒకే బాట. ప్రేమపూర్వక పిలుపులు.. ఆప్యాయమైన ఆదరణ తగ్గలేదు. ఇప్పటికీ పల్లె సంప్రదాయాలు మారలేదు.. వారి పద్ధతులూ మారలేదు. అందుకే పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు. ఈ సందర్భంగా పచ్చని పల్లెలో గ్రామీణుల దినచర్య దృశ్యమాలిక రూపంలో.. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్.. -
ఎంతందంగా ఉన్నానో..!
ఎంత అందంగా ఉన్నానో నేను.. అనుకుంటూ మురిసిపోతోంది ఈ పిచ్చుక. ఒకప్పుడు పొద్దున లేవగానే కిచ్‌కిచ్ అంటూ చప్పుడు చేస్తూ అల్లరి చేసే పిచ్చుకలు పెరిగిన పర్యావరణ కాలుష్యం దృష్ట్యా కనుమరుగైపోయాయి. చాలా తక్కువ సంఖ్యలో అవి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అలాంటి ఓ పిచ్చుక గాల్లో వెళ్తూ వెళ్తూ ఓ బైక్‌కు ఉన్న అద్దంను చూసి దాని ముందు వాలి హొయలొలికించింది.. మళ్లీ మళ్లీ చూసుకుంటూ సంబురపడిపోయింది. నిజామాబాద్ జిల్లాలోని కుర్నాపల్లి గ్రామ శివారులో ఓ బైక్ వద్ద పిచ్చుక చేసిన అల్లరి ఇది.. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
పర్యాటకులు పన్ను చెల్లించక్కర్లేదు
గోవా: షారుఖ్ ఖాన్ నటించిన డియర్ జిందగీ సినిమాలో ఓ అందమైన ప్రదేశం అందరినీ కట్టిపడేసింది. ఆ ఒక్క సినిమాలోనే కాదు, పలు సినిమాలు కూడా ఆ లొకేషన్లో చిత్రీకరించబడ్డాయి. ఇంతకీ ఆ ప్రదేశం.. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పూర్వీకుల గ్రామమైన పారా గ్రామం. చూపు తిప్పుకోలేని అందాలు సొంతం చేసుకున్న ఆ పర్యాటక గ్రామం పర్యాటకులు తీసుకునే ఫొటోలపై పన్ను విధించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి గ్రామప్రజలు తీసుకున్న నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి విధానాలు అమలు చేస్తే పర్యాటకుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరించారు. పర్యాటకశాఖ సహా పలువురు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కు తగ్గిన పారా గ్రామపంచాయితీ ప్రస్తుతానికి ఫొటోగ్రఫీ పన్నును నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దారిపొడవునా స్వాగతం పలికే కొబ్బరి చెట్లు, ప్రకృతి అందాలతో విరసిల్లే ఆ ప్రాంతంలో ఫొటోలు తీసుకోవాలన్నా, వీడియోలు చిత్రీకరించాలన్నా స్వచ్ఛ పన్ను కింద రూ.100 నుంచి రూ.500 చెల్లించాల్సి వచ్చేది. గ్రామపంచాయితీ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమై ఫొటోగ్రఫీ పన్నును నిషేధించటంతో పర్యాటకులకు ఊరట లభించింది. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ డెలిలా లోబో మాట్లాడుతూ.. ఆదాయం కోసం పన్ను విధించట్లేదని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌ను తగ్గించడానికి, పర్యాటకులు రోడ్లపై చెత్త పడేయకుండా నివారించడానికి స్వచ్ఛ పన్ను ఆలోచన చేశామన్నారు. అయితే దీన్ని ఇప్పుడు అమలు చేయమని వెల్లడించారు. -
ఇటువంటి ఫోటోలు మీరు ఎప్పుడు అయినా చూసారా
-
35వ వారం మేటి చిత్రాలు
-
లైటింగ్ + షాడో = సాహో
లార్జర్ దాన్ లైఫ్ సినిమాలను ‘విజువల్ వండర్’ అని సంబోధిస్తుంటారు. దర్శకుడు మెదడులో అనుకున్న కథను సినిమాటోగ్రాఫర్ తన కెమెరాతో స్క్రీన్ పై చూపిస్తాడు. మన కంటే ముందే తన లెన్స్‌తో సినిమా చూసేస్తాడు కెమెరామేన్. ‘సాహో’ లాంటి భారీ సినిమాని తన కెమెరా కన్నుతో ముందే చూసేశారు చిత్ర ఛాయాగ్రాహకుడు మది. ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’కి మది ప్రత్యేకంగా చెప్పిన ‘మేకింగ్ ఆఫ్ సాహో’ విశేషాలు. ► 350 కోట్ల భారీ బడ్జెట్ సినిమా చేసే చాన్స్ తరచు రాదు. ప్రభాస్‌తో గతంలో ‘మిర్చి’ చేశాను. స్వతహాగా ఆయన హ్యాండ్సమ్గా ఉంటారు. ‘మిర్చి’లో స్టైలిష్‌గా చూపించే అవకాశం నాకు దక్కింది. ఇప్పుడు ‘సాహో’లో మరిన్ని షేడ్స్‌లో ప్రభాస్‌ని చూపించాను. దర్శకుడు సుజీత్ తీసిన ‘రన్ రాజా రన్’కి వర్క్ చేశాను. యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నాకు మంచి స్నేహితులు. ‘సాహో’ లాంటి విజువల్ వండర్‌కి పని చేయడం అద్భుతమైన అవకాశం. విజువల్‌గా ఈ సినిమా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ► ఇలాంటి భారీ సినిమాకు హోమ్ వర్క్ లేకుండా డైరెక్ట్‌గా సెట్లో దిగలేం. ‘సాహో’ సినిమాకు ప్రీ–ప్రొడక్షన్ వర్క్, ప్రీ–డిజైన్ వర్క్ చాలా ఎక్కువ చేశాం. అవుట్‌పుట్ ఎలా వస్తుందో? అని ముందే రఫ్‌గా చూసుకున్నాం. కెమెరామేన్, యాక్షన్ డైరెక్టర్, వీఎఫ్ఎక్స్ టీమ్ అందరం కలిసి టీమ్‌గా వర్క్ చేశాం. ► ‘సాహో’ బహుభాషా చిత్రం. ఒక భాషలో ఓ సన్నివేశం తీయగానే అదే సన్నివేశాన్ని యాక్టర్స్ అందరూ వేరే భాషలో నటించాలి. దానికి లైటింగ్ చాలా ముఖ్యం. అందుకే సన్నివేశానికి సంబంధించిన వాతావరణాన్ని మొత్తం లైటింగ్‌తో సృష్టించాం. అప్పుడు కంటిన్యూటీ మొత్తం మా కంట్రోల్లోనే ఉంటుంది. కొన్ని సన్నివేశాలకు లైటింగ్ సృష్టించడానికి రెండు మూడు రోజులు పట్టేది. ► ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పలు షేడ్స్‌లో ఉంటుంది. కథకు తగ్గట్టు క్యారెక్టర్ మారినప్పుడల్లా లైటింగ్ కూడా మార్చాలి. మామూలుగా ఏ సినిమాకైనా 4కెడబ్లు్య (కిలో వాట్స్), 6కెడబ్లు్య లేకపోతే 9కెడబ్లు్య లైటింగ్ వాడతాం. కానీ, ‘సాహో’కి మాత్రం హై ఇంటెన్సిటీ లైటింగ్ వాడాం. 16కెడబ్లు్య నుంచి 18కెడబ్లు్య లైటింగ్ వాడాం. దాన్నిబట్టి ఈ కథ మైలేజ్‌ని ఊహించుకోవచ్చు. చెప్పాలంటే సినిమా మొత్తం లైటింగ్, షాడో ఓరియంటెడ్‌గా ఉంటుంది. కథకు, సినిమాటోగ్రఫీకి వారధిలా లైటింగ్ నిలిచిందని చెప్పొచ్చు. ► ఈ సినిమాకు ఒకటి రెండు కాదు కొత్త కొత్త కెమెరా పరికరాలు చాలా ఉపయోగించాం. సుమారు 7–8 కెమెరా హెడ్స్‌ను వాడాం. ఈవో కార్, స్కార్పియో రిమోట్ హెడ్ కెమెరాలు, స్పెషల్ జీఎఫ్8 కెమెరాలు, 2 జిమ్మీ జిబ్స్, మాక్సిమస్ కెమెరా హెడ్ (అన్నింటి కంటే కొంచెం ఖరీదైన పరికరం ఇది). వెబ్రేషన్స్‌ను అదుపులో ఉంచే జింబల్ హ్యాండ్ కెమెరాలు, చాప్‌మ్యాన్ డాలీ, జీఎఫ్ఎమ్ క్రేన్ ఇవన్నీ ఉపయోగించాం. హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ కెన్నీ బేట్స్‌తో సంభాషించి కొన్ని పరికరాలను జర్మనీ నుంచి తీసుకువచ్చాం. సన్నివేశానికి అనుగుణంగా, క్వాలిటీకి రాజీపడకుండా కెమెరాలు వాడాం. ► అబుదాబిలో షూట్ చేసిన యాక్షన్ సన్నివేశాలకు ప్రతిరోజు సెట్లో 14 కెమెరాలు వరకూ ఉండేవి. మెయిన్ కెమెరాలు 7, ఇతర కెమెరాలు 7. సుమారు 25 రోజులు ఆ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించాం. నా టీమ్ మొత్తం 60 మంది. అబుదాబి షెడ్యూల్లో దాదాపు 80మంది కెమెరా డిపార్ట్‌మెంట్‌కే వర్క్ చేశారు. ఫోకస్ పుల్లర్స్, లైటింగ్ డిపార్ట్మెంట్, క్రేన్స్ ఇలా ఒక్కో విభాగం చూసుకున్నారు. అందులో 20 శాతం ఫారిన్ వాళ్లు కూడా పని చేశారు. ఫారిన్ వాళ్లతో పని చేసే సమయంలో ఓ ఇబ్బంది ఉంది. అదేంటంటే కమ్యూనికేషన్. ఒక్కో డిపార్ట్మెంట్కు టెక్నికల్ పదాలు ఒక్కోలా ఉంటాయి. యాక్షన్ వాళ్ల టెక్నికల్ పదాలు ఒకలా ఉంటాయి. కెమెరా వాళ్లవి ఒకలా ఉంటాయి. వాళ్లకు అర్థం అయ్యేలా చెప్పడం కూడా చిన్న చాలెంజే (నవ్వుతూ). ► ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో నలిగిపోయినవన్నీ ఒరిజినల్ ట్రక్కులు, కార్లు. ముందు డమ్మీలతో ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఒరిజినల్ కార్స్, ట్రక్స్‌ని బద్దలు కొట్టారు. సినిమాలో ఎంత మోతాదులో యాక్షన్ ఉందో.. అంతే ప్రాముఖ్యత లవ్‌స్టోరీకి కూడా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలకు ఒక మూడ్ ఉంటుంది. ప్రేమ సన్నివేశాలు ఒక మూడ్. ఈ వ్యత్యాసాన్ని స్క్రీన్ మీద చూపించడం చాలా ఎంజాయ్ చేశాను. ప్రభాస్, శ్రద్ధాకపూర్ ► అబుదాబి ఫైట్ ఎపిసోడ్ కాకుండా గన్‌ఫైట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. డమ్మీ బులెట్స్‌తో షూట్ చేసినప్పటికీ ఈ ఎఫెక్ట్ కొత్తగా ఉంటుంది. కెమెరా మూమెంట్స్ అన్నీ గన్ పాయింట్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. అటు కెమెరాకి ఇటు మాకు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ ఫైట్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ► భారీ యాక్షన్ సినిమా చేస్తున్నప్పుడు ప్రమాదాలు అనివార్యం. కానీ మే మాత్రం ఎవరి లైఫ్‌నీ రిస్క్ చేయదలచుకోలేదు. యాక్షన్ సన్నివేశాల్లో కారు 150 కి.మీ. ల వేగంతో వెళ్తుందంటే అంత స్పీడ్‌తో కెమెరా ఫాలో కానక్కర్లేదు. మనకు టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఉపయోగించుకున్నాం. అలా టెక్నాలజీ హెల్ప్‌తో ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. 225 రోజులు వర్కింగ్ డేస్ ఉన్నప్పటికీ ఒక్క కెమెరా పరికరానికి డ్యామేజ్ జరగలేదు. అదే పెద్ద విశేషం. పెద్ద పెద్ద ట్రక్కులను, కార్లను మాత్రమే డ్యామేజ్ చేశాం (నవ్వుతూ). టోటల్‌గా ‘సాహో’ మాకో మంచి అనుభూతి. రేపు ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతి అవుతుంది. ► అబుదాబి వాతావరణం భిన్నంగా ఉంటుంది. అక్కడ ఎండ 45 డిగ్రీలు పైనే. అబుదాబి షెడ్యూల్లో చాలామంది వడదెబ్బకు గురయ్యారు. మాలో కొంతమందికి చర్మం ఊడొస్తుండేది. అనూహ్యంగా ఇసుక తుఫానులు కూడా వస్తుండేవి. అలాంటి సమయాల్లో మమ్మల్ని మేం కాపాడుకుంటూనే మా ఖరీదైన కెమెరాలను కూడా జాగ్రత్త చేసేవాళ్లం. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించడానికి చాలా కష్టపడతాం. అవుట్‌పుట్ చూశాక ఆ కష్టాలన్నీ మర్చిపోతాం. ► ఈ సినిమా చిత్రీకరణకు 230 రోజులు పట్టింది. అది కూడా 8 రోజులు టెస్ట్ షూట్, 50 రోజుల లైటింగ్ అరేంజ్‌మెంట్‌ను మినహాయించి. ► ‘సాహో’ కోసం సుమారు 60 సెట్లను ఏర్పాటు చేశారు. ఈ సెట్లన్నీ హైదరాబాద్, పూణే, ముంబై, అబుదాబి, యూరోప్‌లో వేశారు. ► 350 కోట్ల బడ్జెట్లో కెమెరా డిపార్ట్మెంట్కు కేటాయించిన బడ్జెట్ సుమారు 25 కోట్లు (కెమెరామేన్ల రెమ్యూనరేషన్లు మినహాయించి). – గౌతమ్ మల్లాది -
25వ వారం మేటి చిత్రాలు
-
24వ వారం మేటి చిత్రాలు
-
12వ వారం మేటి చిత్రాలు
-
52వ వారం మేటి చిత్రాలు
-
ఈ చలేంట్రా బాబూ...
-
45వ వారం మేటి చిత్రాలు
-
44వ వారం మేటి చిత్రాలు
-
‘సాక్షి’ ఫొటో ఎడిటర్‌కు లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ‘సాక్షి’ పత్రిక ఫొటో ఎడిటర్ రవికాంత్‌రెడ్డి లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అందుకున్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ జర్నలిజం దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలో 2018–ఇండియా ప్రెస్ ఫొటో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మంత్రి దేవినేని ఉమా జ్యోతి ప్రజ్వలన చేసి మూడో జాతీయ స్థాయి ఫొటో ప్రదర్శనను ప్రారంభించి తిలకించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. చెప్పలేని భావాలు, సందర్భాలను కళ్లకు కట్టినట్లుగా చెప్పేవి ఫొటోలేనన్నారు. ఫొటో జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది జాతీయ స్థాయి పోటీలు నిర్వహించి అవార్డులు అందజేయడం అభినందనీయమన్నారు. ఏపీ ఫొటోగ్రఫీ అకాడమీ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈ పోటీకి మొత్తం 1,890 ఫొటోలు వచ్చాయని చెప్పారు. ఫొటోగ్రాఫర్లల్లో సృజనాత్మకతను పెంచడానికి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ‘సాక్షి’ ఫొటో ఎడిటర్ రవికాంత్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి పత్రిక మాజీ ఎడిటర్ దండమూడి సీతారామ్‌కు లైఫ్ టైమ్ ఎఛీవ్మెంట్ పురస్కారం అందజేశారు. అలాగే పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఫొటోగ్రాఫర్లకు కూడా అవార్డులు అందజేశారు. వీరిలో ‘సాక్షి’కి చెందిన పలువురు ఫొటోగ్రాఫర్లున్నారు. స్పాట్ న్యూస్ పిక్చర్ విభాగంలో జి.వీరేష్ (అనంతపురం), కె.చక్రపాణి (విజయవాడ), ఎండీ నవాజ్ (విశాఖ)కు కన్సోలేషన్ బహుమతులు.. వి.రూబెన్ బెసాలియేల్ (విజయవాడ), వీరభగవాన్ తెలగరెడ్డి (విజయవాడ), ఐ.సుబ్రమణ్యం (తిరుపతి), పి.విజయకృష్ణ (విజయవాడ), ఎం.వెంకటరమణ (గుంటూరు)కు స్పాట్ న్యూస్, జనరల్ న్యూస్ విభాగాల్లో శ్యాప్ ఎచీవ్మెంట్ అవార్డులు దక్కాయి. ఎన్.కిశోర్ (విజయవాడ), ఎం.మనువిశాల్ (విజయవాడ)కు ఎఫ్ఐసీ హానర్‌బుల్ మెన్షన్ అవార్డులు.. తెలంగాణకు సంబంధించిన శివ కొల్లోజు(యదాద్రి)కు బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఎం.రవికుమార్ (హైదరాబాద్), దశరథ్ రజ్వా (కొత్తగూడెం)కు స్పాట్ న్యూస్ పిక్చర్ విభాగంలో కన్సోలేషన్ బహుమతి లభించింది. గుంటుపల్లి స్వామి (కరీంనగర్)కి జనరల్ న్యూస్ విభాగంలో ‘మారుతీరాజు మెమోరియల్’ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు, కల్చరల్ సెంటర్ చైర్మన్ వైహెచ్ ప్రసాద్, సీఈవో శివనాగిరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే నాయకుడు అంబటి ఆంజనేయులు, చందు జనార్ధన్, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, స్టేట్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సీహెచ్‌వీఎస్ విజయభాస్కర్, ప్రధాన కార్యదర్శి వై.డి.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
మన నటుల్లో మహానేతలు
ఫొటోగ్రఫీ కొంత పుంతలు తొక్కడం ప్రారంభమై ఎంతోకాలమైంది. ఫొటోమేజిక్ కూడాఏమాత్రం తగ్గకుండా ఫొటోగ్రఫీతో పోటీపడుతోంది. ఇక మార్ఫింగ్ ఫొటోలు పక్కదోవపట్టి పలువురిని బజారుకీడుస్తున్న సంగతి చెప్పనక్కరలేదు. అయితే ఈ మూడింటివరుసలో నాలుగో రకం సామాజిక మాధ్యమాల్లో సరదా సరదాగా సందడి చేస్తోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: బ్రిటీషు పాలకుల కబంధ హస్తాల నుంచి భారతదేశానికి విముక్తి కల్పించిన మహానేతలు మనకెందరో ఉన్నారు. తెల్లదొరలను దేశం నుంచి తరిమికొట్టి స్వాతంత్య్రాన్ని సముపార్జించిపెట్టిన సమరయోధులు నేటికీ ఏనాటికీ చిరస్మరణీయులే. జయంతి, వర్ధంతి రోజుల్లో వారిని స్మరించుకుంటూనే ఉన్నాం. ఆయా మహానేతల పేరు చెబితే చాలు ప్రతి పౌరునిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. దేశభక్తులుగా భారతీయులపై మహానేతల ప్రభావం అంతా ఇంతా కాదు.ఇక వెండితెర రారాజుల విషయానికి వస్తే వీరంతా వినోద ప్రపంచాన్ని ఏలడం కూడా ఏనాడో ప్రారంభమైంది. అభిమాన జనాన్ని నటీనటులు ఆకట్టుకుంటే, నటీనటులను ఆకట్టుకునే స్థాయిలో తమ హీరో తెరపైకి వస్తే తన్మయులై పోతారు. భారీ కటౌట్లు, వాటికి గజమాలలు, పాలాభిషేకాలు చేసేస్తుంటారు. ఈ భూలోకంలో సినిమారంగం మరో లోకమనే స్థాయిలో సమాజంపై ప్రభావం చూపుతోంది. వారిలో వీరు.. వీరిలో వారు మహానేతలది దేశసేవ, నటీ నటులది కళామతల్లి సేవ. దేశానికి అంకితమైన వారిని కళామతల్లి ముద్దుబిడ్డల్లో చూసుకుంటే ఎలా ఉంటుంది. అలాగే కళామతల్లి ముద్దుబిడ్డలను దేశభక్తుల ముఖ కవళికలతో పోల్చుకుంటే మరెంత గమ్మత్తుగా ఉంటుందనే ప్రయత్నం జరిగింది. సృజనాత్మకశీలి అయిన ఓ ఔత్సాహిక కళాకారుడు వారిలో వీరిని చూపించి మురిపించాడు. వీరిలో వారిని మిళితం చేసి మెప్పించాడు. ఎందరో మహానుభావులు.. మరెందరో మంచినటులు.. అందరికీ వందనాలు అని స్మరిస్తూ సరదా సరదాగా ఈ ఫొటోలను ఎంజాయ్ చేద్దాం. అజిత్‌లో అన్నాదురై ఈ ఫొటో చూడగానే చప్పున స్పురించేది అన్నాదురై. తమిళనాడులో ద్రవిడ పార్టీలకు ఆద్యుడు, స్ఫూర్తిదాత. అయితే గట్టిగా పరిశీలిస్తే ఆ వేషంలో మనల్ని ఔరా అనిపించేది తమిళులచేత ‘తల’ అంటూ ముద్దుగా పిలిపించుకునే హీరో అజిత్. విజయ్‌లో వివో చిదంబరనాథ్ వివో చిందరనాథ్ పేరు చెప్పగానే ప్రముఖ దేశభక్తుడు, కప్పలోట్టి తమిళన్ (బ్రిటీష్ దొరల కాలంలోనే నౌకను నడిపిన తమిళుడు) అని గర్వంతో ఉప్పొంగిపోతారు. మరి ఆ మహానేతను మన ముందుకు తెచ్చిన నటుడు మరెవరో కాదు ‘ఇళయ దళపతి’ విజయ్. రజనీలో రవీంద్రనాథ్ ఠాగూర్ పశ్చిమ బెంగాల్ జన్మించి తన రచనలతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కర్ణాటకలో జన్మించి తమిళనాడులో నటుడిగా మారి సూపర్‌స్టార్‌గా ఎదిగిన వ్యక్తి రజనీకాంత్. వారివారి రంగాల్లో ఇద్దరూ లబ్దప్రతిష్టులే. ఈ ఫొటోమేజిక్తో ఇద్దరూ ఒకటై ముచ్చటగొలిపారు. కమల్‌హాసన్‌లో సుభాష్ చంద్రబోస్ దేశభక్తి అంటే ఇదీ అని లోకానికి చాటిన నేతల్లో సుభాష్ చంద్రబోస్ స్థానం మరువలేనిది. ఆయన మరణం నేటికీ నిర్ధారణ కాకున్నా చరిత్ర పుటల్లో ఆయన సుస్థిర స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక కమల్‌హాసన్‌లో కళాపిపాసి గురించి చెప్పాలంటే మాటలు చాలవు. అందుకే వీరిద్దరినీ ఒకే బొమ్మలో చూసుకుందాం. శింబులో వివేకానందుడు రామకృష్ణ పరమహంస శిష్యునిగా స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకున్న విశిష్టమైన వ్యక్తి స్వామి వివేకానందుడు. దేశ కీర్తికిరీటంలో కలికితురాయిగా నిలిచిపోయాడు. మరి తమిళ సినీరంగంలో లవర్‌బాయ్‌గా పేరు గడించిన శింబు క్రమశిక్షణకు మారుపేరైన వివేకానందుడుగా ఇట్టే ఇమిడిపోయాడు. తాత రూపంలో మనుమడు తమిళ రాజకీయాల్లో అపరచాణుక్యుడు ఎవరంటే సంకోచించకుండా కరుణానిధి పేరు చెబుతారు. సభావేదికపై ఆయన వాగ్ధా్దటిని వింటే నాగస్వరం ఊదినపుడు నాగుపాములా నాట్యమాడాల్సిందే. ఆ మహారాజకీయవేత్తను తన ముఖంలో ఇముడ్చుకుని తాతకు వారసుడు మనుమడేగా అనిపించుకున్నాడు స్టాలిన్ కుమారుడైన వర్దమాన హీరో ఉదయనిధి స్టాలిన్. నెహ్రూగా మారిన శివకార్తికేయన్ చాచా నెహ్రూకు చిన్నారులంటే ప్రీతి. పిల్లలకు సైతం చాచా అంటే అభిమానం. తలపై తెల్లని టోపీ ఎదపై ఎర్ర గులాబీ ఆయన హాబీ. నేటి తరం బాలబాలికల అభిమానాన్ని చూరగొన్న నటుడు శివకార్తియేన్ సృజనశీలైన చిత్రకారుని చేతిలో చాచా నెహ్రూగా మారిపోయాడు. కామరాజనాడార్ కాదు మన విజయ్సేతుపతే తమిళనాడు రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా జేజేలు కొట్టించుకునే నేత ఎవరంటే కామరాజనాడార్ అని చెప్పకతప్పదు. కాంగ్రెస్ నేతైనా మానవతావాదిగా అందరి మన్నలను అందుకున్న మహనీయుడు. అన్ని పార్టీల వారికి ఆదర్శనీయుడైనాడు. మరి అంతటి గొప్పనేత రూపంలో లీనమై పోయాడు మన తాజా క్రేజీస్టార్ విజయ్‌సేతుపతి. ఉక్కు మహిళగా త్రిష భారతదేశ ఉక్కుమహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ జాతి మరచిపోలేని చరిత్ర సృష్టించారు. పురుషాధిక్య సమాజాన్ని సమర్థవంతంగా ఢీకొని తొలి మహిళా ప్రధానిగా నిలిచారు. సంస్కరణలతో దేశాన్ని పరుగులు పెట్టించారు. మరి ఇందిర రూపంలో ఇమిడిపోయిన నటి త్రిష కూడా తక్కువేమీ కాదు. ఏళ్లు గడిచిపోతున్నా చెక్కుచెదరని క్రేజుతో ముందుకు సాగుతున్నారు. ‘సూర్య’ కాంతిపుంజంలో భగత్‌సింగ్ దేశభక్తి చిరునామాగా నిలిచి స్వాతంత్య్ర సమరపోరాటంలో మెరుపులు మెరిపించినవారు భగత్‌సింగ్. వీరోచిత నైజానికి భగత్‌సింగ్ పెట్టిందిపేరు. అలాగే వెండితెరపై ప్రతినాయకుడిని మట్టికరిపించేందుకు వీరోచిత పోరాటాలతో ఆకట్టుకోవడం నటుడు సూర్య ప్రత్యేకత. అందుకే అంతలా భగత్‌సింగ్ రూపంలా ఐక్యమైపోయాడు. -
41వ వారం మేటి చిత్రాలు
-
జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ‘సాక్షి’కి అవార్డులు
సాక్షి, అమరావతి: స్టేట్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ఏపీ, తెలంగాణకు చెందిన ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టులు పలు అవార్డులు గెలు పొందారు. స్పాట్ న్యూస్ పిక్చర్ విభాగంలో జి.వీరేశ్(అనంతపురం), కె.చక్రపాణి(విజయవాడ), ఎండీ.నవాజ్ (విశాఖపట్నం)కు కన్సులే షన్ బహుమతులు లభించాయి. వి.రూబెన్ బెసాలి యన్(విజయవాడ), వీరభగవాన్ తెలగా రెడ్డి (విజయవాడ), ఐ.సుబ్రమణ్యం (తిరుపతి), పి. విజయకృష్ణ (విజయవాడ), ఎం.వెంకట రమణ (గుంటూరు)లకు స్పాట్ న్యూస్, జనరల్ న్యూస్ విభాగాల్లో శ్యాప్ ఎచీవ్ మెంట్ అవార్డులు దక్కా యి. ఎన్.కిషోర్ (విజయవాడ), ఎం.మను విశా ల్ విజయవాడ)లకు ఎఫ్ఐసీ హానర్‌బుల్ మెన్షన్ అవార్డులు వరించాయి. తెలంగాణలో శివకోల్లొజు(యాదాద్రి)కు బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ఇయర్ అవార్డు లభించగా, ఎం.రవికుమార్ (హైదరాబా ద్), దశరథ్ రజ్వా (కొత్తగూడెం)కు స్పాట్ న్యూస్ పిక్చర్ విభాగంలో కన్సులేషన్ బహుమతి దక్కింది. గుంటుపల్లి స్వామి(కరీంనగర్)కు జన రల్ న్యూస్ విభాగం లో మారుతి రాజు మెమోరి యల్ అవార్డు లభించింది. వీరికి నవంబర్ 1న విజయవాడలో అవార్డులు ప్రదానం చేయనున్న ట్లు కాంటెస్ట్ చైర్మన్ టి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
39వ వారం మేటి చిత్రాలు
-
38వ వారం మేటి చిత్రాలు
-
37వ వారం మేటి చిత్రాలు