
ఫొటోలు జ్ఞాపకాలకు గుర్తు. కానీ ఇప్పుడు ప్రతీ పనికి కూడా ఫొటోలు క్లిక్‌మనిపించేస్తున్నారు. అయితే ఫొటోలు తీయడం కూడా ఓ కళేనండోయ్. దానికి కాస్త క్రియేటివీ జోడిస్తే ఇంక తిరుగే ఉండదు. అలా కొందరు విగ్రహాలు తమను ఆటాడేసుకుంటున్నట్లు కనిపిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి అద్భుతంగా ఉన్నాయంటూ నెటిజన్లు కన్నార్పకుండా ఆ ఫొటోలపై లుక్కేస్తున్నారు. విగ్రహాలు కదిలి విన్యాసాలు చేస్తున్నాయా? అనిపించేలా ఉండటమే ఆ ఫొటోల ప్రత్యేకత. మచ్చుకు కొన్నింటి గురించి చెప్పుకుందాం. స్పైడర్ మ్యాన్‌లా రెడీ అయిన మనిషి ఓ విగ్రహం తన గొంతు పిసికి చంపుతున్నట్లు స్టిల్ ఇచ్చాడు. (‘ఆ ఫోటో ఇంత పని చేస్తుందని అనుకోలేదు’)
Good grief! They’re fighting back!
— Mark Leneve✍🏼🎨🖌 (@MarkLeneve) June 12, 2020
#worldsgonemad pic.twitter.com/YAHlAQYikM
మరో చోట రోడ్డుపై నడుస్తున్నట్టుగా ఓ విగ్రహం ఉండగా.. అది ఓ కుర్రాడి కాలు పట్టుకుని లాక్కు వెళుతున్నట్లు మ్యాజిక్ చేశారు. ఇంకో ఫొటోలో ఓ బుడ్డోడు పిడికిలి బిగించి గుద్దుతా అని కోపంగా మొహం పెట్టిన విగ్రహం ముందు నిజంగానే తనను కొడుతున్నాడనేలా ఓ వ్యక్తి మొహంలో భయాన్ని ప్రదర్శించాడు. ఇంకో ఫొటోలో ఓ యువతిని విగ్రహమే నిజంగా వచ్చి చాచి చెంప చెళ్లుమనిపించినట్లు ఉంది. ఇలాంటి ఎన్నో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (‘ఈ ఫోటోలకు అరెస్ట్ కాదు.. అవార్డు ఇవ్వాలి’)
— I'm Smaggy😁 I don't like Smirky🤥 Trump💩 Boris🤪 (@Murdochcrazy) June 13, 2020
Comments
Please login to add a commentAdd a comment