
అందంతో పాటు ఫిట్నెస్‌కు ఫ్రిఫరెన్స్ ఇచ్చే హీరోయిన్స్‌లో ఒకరు రకుల్ ప్రీతి సింగ్. రకరకాల యోగాసనాలను వేయడంలో ఆమె దిట్ట. దీనికి సంబంధించి గతంలో చాలా వీడియోను ఇన్‌స్టా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇటీవల ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన రకుల్ భర్తతో కలిసి రకరకాల భంగామల్లో యోగాసనాలను అదరగొట్టేసింది. ఈ కొత్త జంట యోగాసనాలు ఇపుడు ఇన్‌స్టాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఆరోగ్యంలోనూ, అన్నింటిలోనే కలిసి ఉంటే ఆనందం.. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వరుస ఫోటోలను షేర్ చేశారు ఈ లవ్‌బర్డ్స్.

"పార్ట్‌నర్ స్ట్రెచెస్"తో ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ జంట ఆసనాలో ఇంటర్నెట్‌లో ఆకర్షణీయంగా మారాయి. మొదటి భంగిమగా భాగస్వామి సహాయంతో బడ్డీ బోట్ భంగిమ అంటే నౌకాసనంలో కనిపించారు.

ఇంకా లెగ్ ఫార్వర్డ్ బెండ్, కోబ్రా పోజులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment