International Yoga Day 2024
-
డాలస్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
డాలస్, టెక్సాస్: అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద 10వ అంతర్జాతీయ యోగాదినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. గౌరవ కాన్సుల్ జెనరల్ అఫ్ ఇండియా, డి. సి. మంజునాథ్ ముఖ్యఅతిథిగా హాజరై గౌరవ భారత ప్రధాని నరేంద్రమోదీ 10 సంవత్సరాల క్రితం ఐక్యరాజ్య సమితిలో ఇచ్చిన పిలుపుననుసరించి విశ్వవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21 వ తేదీని అంతర్జాతీయ యోగాదినోత్సవంగా పాటించడం ముదావహం అన్నారు. అనునిత్యం యోగాభ్యాసం చెయ్యడంవల్ల అనేక ప్రయోజనాలున్నాయన్నారు.మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అంతర్జాతీయ యోగాదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని, ప్రతి సంవత్సరం హజరవుతున్నవారి సంఖ్య పెరుగుతున్నదని, ఇది కేవలం ఒకరోజు వేడుక కాకూడదని, అన్ని కార్పోరేట్ మరియు విద్యాసంస్థలలో ప్రతిరోజు యోగాభ్యాసం చేసే విధాననిర్ణయాలు తీసుకుని, దానికి తగిన ఏర్పాట్లుకల్పిస్తే అందరూ శారీరక, మానసిక ఆరోగ్యాలలో సత్ఫలితాలు సాధించవచ్చునని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర చెప్పారు.డా. ప్రసాద్ తోటకూర మహత్మాగాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులందరితో కలసి డా.మంజునాథ్‌కు మహాత్మాగాంధీ చిత్రపటాన్ని బహుకరించి, ఘనంగా సన్మానించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల సభను ప్రారంభించి ముఖ్యఅతిథికి, బోర్డుసభ్యులకు, పాల్గొన్న వారందరికీ స్వాగతం పలికారు.ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షురాలు, మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యురాలు సుష్మ మల్హోత్రా క్రమక్రమంగా యోగావేడుకలలో పాల్గొంటున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఈ సంవత్సరం డి.ఎఫ్.డబ్ల్యు హిందూ టెంపుల్, యోగభారతి, హార్ట్ఫుల్నెస్, ఈషా, ది యూత్ ఎక్ష్సలెన్స్ లాంటి సంస్థలు వారి సభ్యులతో పాల్గొనడం చాలా సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ తోటకూర సహా, బోర్డు సభ్యులు రావు కల్వాల, జాన్ హామండ్, రన్నా జానీ, మురళి వెన్నం, సుష్మా మల్హోత్రా, కమల్ కౌశల్, రాజీవ్ కామత్, బి. యెన్. రావు , ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ కార్యవర్గ సభ్యులు – మహేందర్ రావు, దినేష్ హూడా, ఉర్మీత్ జునేజా, దీపక్ కాల్ రా, ఆమన్ సింగ్, అమిత్ బూచె, సమర్నిక రౌత్ తదితరులు యోగావేడుకలు విజయవంతంలో కీలకపాత్ర వహించారు. విశాలమైదానంలో రెండుగంటలకు పైగా సాగిన ఈ యోగావేడుకలలో అన్ని వయస్సులవారు ఉత్సాహంగా పాల్గొని, యోగాభ్యాసం అనంతరం ‘పీకాక్ ఇండియా రెస్టారెంట్’ వారు ఏర్పాటు చేసిన ఫలాహారాలను ఆస్వాదించి ఆనందించారు. -
సుమ యోగా డే వీడియో వైరల్
ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం చాలా ఉత్సాహంగా జరిగింది. ముఖ్యంగా మన దేశంలో జమ్ము కశ్మీర్లో 50 వేల మందితో నిర్వహించిన యోగా కార్యక్రమం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతోందని, ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అలాగే దేశ వ్యాప్తంగా నిర్వహించిన యోగా డే వేడుకల్లో పలువురు రాజకీయ, సినీ, క్రీడారంగ ప్రముఖులు యోగాసనాలతో సందడి చేశారు. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma)ప్రముఖ యాంకర్ సుమ కనకాల అందరికీ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ముఖ్యంగా మహిళలు ఎలాంటి ఆసనాలు వేయాలి? వాటి లాభాలను వివరిస్తూ ఇన్‌స్టాలో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేసింది. ప్రతీ పండుగకు ఏదో ఒక విశేషమైన వీడియోను పంచుకునే సుమ యోగా డేనుకూడా అలా వినియోగించుకుందన్న మాట. యోగాసనాలతో విన్యాసాలు చేస్తూ హిల్లేరియస్ రీల్‌పై నెటిజన్లు కూడా ఫన్నీగా కమెంట్స్ చేశారు. అయితే ‘‘ఎందుకొచ్చిన తిప్పలు అక్కా..హాయిగా మూడు ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, 6 ఇంటర్వ్యూలు చేసుకోక’’ అని ఒకరు, ‘ఈ వయసులో ఈ ప్రయోగాలు అవసరమా, లైక్స్ కోసం కాకపోతే’ అని మరొకరు, ‘‘ఇంత టైం ఎక్కడ దొరకుతుందక్కా నీకు’’ అంటూ మరొక అభిమాని వ్యాఖానించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ వయసులో ఉన్నవారైనా యోగాను సాధన చేయవచ్చు. కాకపోతే నిపుణుడైన గురు సమక్షంలో చేయడం ఉత్తమం. -
ప్రపంచ దేశాల్లో యోగా దినోత్సవం
న్యూఢిల్లీ/న్యూయార్క్/టెల్అవీవ్: అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీతోపాటు న్యూయార్క్‌లో పలు కార్యక్రమాలు జరిగాయి. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి. అత్యధిక ఉష్ణోగ్రతలను లెక్క చేయకుండా జనం వేలాదిగా పాల్గొన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్లో జరిగిన కార్యక్రమంలో 300 మంది పాల్గొన్నారు. సింగపూర్‌లో ఆరోగ్య శాఖ మంత్రి రహయు మహజం ఆధర్యంలో జరిగిన కార్యక్రమంలో 200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. నేపాల్‌లోని పొఖారా, బుద్ధుడి జన్మస్థలం లుంబినిలో యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. శ్రీలంక రాజధాని కొలంబో, చైనా రాజధాని బీజింగ్, ఫ్రాన్సు రాజధాని పారిస్, మాల్దీవులు రాజధాని మాలె, ఇటలీ రాజధాని రోమ్, సౌదీ రాజధాని రియాద్, కువైట్, మలేసియా, ఇండోనేసియాలో, స్వీడన్ రాజధాని స్టాక్‌హోం, లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్‌లోనూ యోగా కార్యక్రమాలు జరిగాయి. -
యోగాసనాలతో ‘పవర్ కపుల్’ రకుల్-జాకీ ఇంటర్నెట్లో హల్చల్
అందంతో పాటు ఫిట్‌నెస్‌కు ఫ్రిఫరెన్స్ ఇచ్చే హీరోయిన్స్‌లో ఒకరు రకుల్ ప్రీతి సింగ్. రకరకాల యోగాసనాలను వేయడంలో ఆమె దిట్ట. దీనికి సంబంధించి గతంలో చాలా వీడియోను ఇన్‌స్టా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇటీవల ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన రకుల్ భర్తతో కలిసి రకరకాల భంగామల్లో యోగాసనాలను అదరగొట్టేసింది. ఈ కొత్త జంట యోగాసనాలు ఇపుడు ఇన్‌స్టాలో హల్చల్ చేస్తున్నాయి. ఆరోగ్యంలోనూ, అన్నింటిలోనే కలిసి ఉంటే ఆనందం.. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వరుస ఫోటోలను షేర్ చేశారు ఈ లవ్‌బర్డ్స్."పార్ట్నర్ స్ట్రెచెస్"తో ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ జంట ఆసనాలో ఇంటర్నెట్లో ఆకర్షణీయంగా మారాయి. మొదటి భంగిమగా భాగస్వామి సహాయంతో బడ్డీ బోట్ భంగిమ అంటే నౌకాసనంలో కనిపించారు. ఇంకా లెగ్ ఫార్వర్డ్ బెండ్, కోబ్రా పోజులిచ్చారు. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
#International Yoga day 2024 స్పెషల్ కాస్ట్యూమ్స్ (ఫొటోలు)
-
International Yoga day 2024 ప్రముఖులు, సెలబ్రిటీల యోగ పోజులు (ఫొటోలు)
-
International Yoga Day 2024 : ఈ ఆసనాలతో ఎన్నిలాభాలో తెలుసా?
యోగా సాధనతో అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే అనే అవగాహన ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. మెరుగైన జీర్ణవ్యవస్థ మొదలు, గుండె జబ్బులు దాకా, ప్రశాంతమైన నిద్ర, బరువు తగ్గడం , అందం, ఆకర్షణ లాంటి ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు యోగా నిపుణులు. నిపుణులైన యోగ గురువుల సమక్షంలో కొన్ని ఆసనాలను సాధనం చేయడం ద్వారా చాలా ఆరోగ్య సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చు.యోగా సాధన ప్రయోజనాలు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.మెదడు పనితీరును మెరుగుపరుస్తుందిఒత్తిడిని దూరం చేస్తుందిఫ్లెక్సిబిలిటీని పెంచుతుందిరక్తపోటును తగ్గిస్తుందిఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందిఆందోళనను దూరం చేస్తుందిదీర్ఘకాలిక వెన్నునొప్పిని తగ్గిస్తుందిమధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెరస్థాయిలను తగ్గిస్తుందిసంతులనం భావాన్ని మెరుగుపరుస్తుందిఎముకలకు బలాన్నిస్తుంది. ఆరోగ్యకరమైన బరువుకు తోడ్పడుతుంది.గుండె జబ్బు, ఇతర కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందివజ్రాసనంఒత్తిడి, మలబద్ధకం లాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం వజ్రాసనం. మధ్యాహ్నం, రాత్రి భోజనం లేదా ఏదైనా తిన్న తర్వాత వజ్రాసనం చేయడం ద్వారా తిన్నది త్వరగా జీర్ణమవుతుంది. మలబద్ధకం,కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. శ్రద్ధగా, ఓపిగ్గా పాటిస్తే ఒత్తిడిని తరిమి కొట్టవచ్చు. అర్ధ మత్స్యేంద్రాసన,సుప్త మత్స్యేంద్రాసన, భుజంగాసనం, మర్జర్యాసనం- ఇలాంటివెన్నో జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. సుప్త బద్ధ కోణాసనంఅలసట, నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బాడీలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను ఈజీగా కరిగిస్తుంది. ముఖ్యంగా తొడలు, మోకాళ్లను నాజూకుగా చేస్తుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను పెంచడం ద్వారా జీర్ణక్రియను సక్రియం చేస్తుంది.ఊర్ధ్వ ప్రసారిత పద్మాసనంఅవయవాల పనితీరును క్రమబద్దీకరిస్తుంది.. కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది. కండరాలను బలపరుస్తుంది. వెన్నెముకకు శక్తినిస్తుంది. కాలేయం, మూత్రపిండాల పనీతీరును మెరుగుపరుస్తుంది. మార్జాలాసనంఈ ఆసనం తుంటి, వీపు, పొత్తికడుపులోని కండరాలను ఉత్తేజితం చేసి, బలపరుస్తుంది. అంతేకాక ఇది జీర్ణశయాంతర ప్రేగులతో సహా ఇతర అవయవాలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుంది.తడాసానంభోజనం చేసిన తరువాత చేయడానికి ఇది ఉత్తమమైన ఆసనం. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది.భుజంగాసనం సయాటికా నొప్పి, ఆస్తమాకు చికిత్సలో ఇది చాలా ఉపయోగపడుతుంది. వెన్నెముకను బలపరుస్తుంది కూడా. ఛాతీ, ఊపిరితిత్తులకు బలాన్నిస్తుంది. భుజాలు, పొట్ట, పిరుదుల్లోని కొవ్వును కరిగించి, దృఢ పరుస్తుంది.వీటితోపాటు పార్శ్వ సుఖాసనం, అర్ధ మత్స్యేంద్రాసన, సుప్త మత్స్యేంద్రాసన, అపానాసన, మర్జర్యాసనం-బితిలాసనం, ధనురాసనం లాంటివి చాలా ఉన్నాయి. నిపుణుడైన యోగా గురు పర్యవేక్షణలో ఆయా అవయవాల పనితీరు కోసం ప్రత్యేకంగా ఆచరించవచ్చు. -
'ఆధునిక యోగా పితామహుడు'! ఏకంగా 60 దేశాలకు..
ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతమైన బహుమతుల్లో ఒకటి 'యోగా'. అలాంటి యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ యోగా భారతదేశం వారసత్వమే అయినా అందరికీ దీని గురించి కూలంకషంగా తెలియని కాలంలో తిరుమలై కృష్ణమాచార్య గారు దీన్ని వ్యాప్తి చేశారు. ఎంతలా అంటే మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్లు కూడా తెలుసుకునేలా ప్రజాధరణ తీసుకొచ్చారు. ఆయన తర్వాత కాలంలో ఆయన శిష్యుడిగా చెప్పుకునే బెల్లూర్ కృష్ణమచార్ సుందరరాజా అయ్యంగార్ లేదా బీకేఎస్ అయ్యంగార్‌కే ఆ ఘనత దక్కుతుంది. ఎందుకంటే..? ఆయన ఏకంగా 60 దేశాలకు యోగా అభ్యాసాన్ని గురించి తెలియజేశారు. ఇవాళ(జూన్ 20) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీకేఎస్ అయ్యంగార్ ఎలా పాశ్చాత్య దేశాలకు యోగాను పరిచయం చేయగలిగారు? ఆయన యోగా నేర్చుకోవడానికి దారితీసిన పరిస్థితులు గురించి తెలుసుకుందామా..!బీకేఎస్ అయ్యంగార్ లేదా బెల్లూర్ కృష్ణమచార్ సుందరరాజా అయ్యంగారిని 'ఆధునిక యోగా పితామహుడి'గా పిలుస్తారు. ఆయన యోగాని శారీరక అభ్యాసానికి సంబంధించిన కళ, సైన్స్, ఫిలీసపీ అని ప్రగాఢంగా నమ్మారు. 1950లలో యోగా అభ్యాసాలను ప్రచార చేసే నిమిత్తం ముంబై పర్యటనలో ఉన్నారు అయ్యంగారు. సరిగ్గా ఆ సమయంలోనే భారత్ సందర్శనకు వచ్చిన అమెరికన్ బ్రిటీష్ వయోలిన్ వాద్యకారుడు యొహూదీ మెనూహిన్ యోగా గురువు అయ్యంగార్ని కలవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా యోగా గురించిసేలా చేసే ప్రచారం చేయాలన్న అతని దృఢ సంకల్పం విని ఆశ్చర్యపోయారు. ఆయన అలవోకగా వేస్తున్న ఆసనాలన్నీ మెనూహిన్ని ఎతంగానో ఆకర్షించాయి. ఆ ఆసనాలు తాను నేర్చుకుంటే తన వయోలిన్ కళ మరింత మెరుగుపడుతుందని భావించి, అయ్యంగార్ని తనతోపాటు స్విట్జర్లాండ్, లండన్ వంటి దేశాలకు తీసుకెళ్లాడు. అలా అయిన యోగా ప్రాముఖ్యత గురించి విదేశాల్లో ప్రచారం చేసే అవకాశం లభించింది. ఆ క్రమంలో 1956లో అయ్యంగార్ న్యూయార్క్ వచ్చిన తొలినాళ్లల్లో చాలామంది యోగా పట్ల ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత నెమ్మదిగా యోగాకు క్రేజ్ లభించడం జరిగింది. ఆ విధంగా ఆయన ఆరు ఖండాల్లో యోగా ఇన్స్టిట్యూట్లను ప్రారంభించాడు. అంతేగాదు 'లైట్ ఆన్ యోగా' వంటి పుస్తకాలను కూడా రాశారు. ఇవి అంతర్జాతీయంగా అమ్ముడైన పుస్తకంగా కూడా నిలిచింది. ఎవరంటే..అయ్యంగార్ డిసెంబర్ 14, 1918న కర్ణాటక బెల్లూరులో జన్మించారు. 1937లో మహారాష్ట్రలోని పూణేకు వచ్చి అయ్యంగార్ యోగాగా పిలిచే యోగా శైలిని తీసుకొచ్చారు. ఆయన చిన్నతనంలో క్షయ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధుల నుంచి బయటపడేందుకు అతనికి యోగా ఉపకరించింది. దీంతో అప్పటి నుంచి ఎన్నో ప్రయోజనాలందించే ఈ యోగాని అందరూ తెలసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని సంకల్పించారు. ఇక ఆయన యోగా అభ్యాసన విధానంలో చాలా సులభమైన భంగామల్లో వేసేలా బ్లాక్‌లు, పల్టీలు, వంటి వాటిని వినియోగించేవారు. ఎవ్వరైనా ఇట్టే నేర్చుకునేలా బోధించేవారు. ఆ తర్వాత 1975లో తన స్వంత 'యోగవిద్య' సంస్థను స్థాపించారు. అలా దేశవ్యాప్తంగా విదేశాలలో కూడా వివిధ శాఖలకు విస్తరించాడు. అలా యోగా వ్యాప్తి కోసం చేసిన కృషికి గానూ యోగా గురువుగా, ఆధునిక ఋషిగా కీర్తించబడ్డారు. ఆయనకు విదేశాల్లో సుమారు 100కు పైగా యోగా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఆయన సామాన్యులకే గాక పలువురు ప్రముఖులకు కూడా యోగాసనాలు నేర్పారు. ఆయన వద్ద యోగాసనాలు నేర్చుకున్నవారిలో ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు జయప్రకాష్ నారాయణ్, ప్రసిద్ధ తత్వవేత్త జె కృష్ణమూర్తి వంటి వారు కూడా ఉన్నారు. ఆయన యోగాసనాల శైలికి నటి కరీనా కపూర్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి అన్నెట్ బెనింగ్, డిజైనర్ డోనా కరాంటో, రచయిత ఆల్డస్ హక్స్లీ వంటి అభిమానులు కూడా ఉన్నారు. అంతేగాదు యోగాకు ఆయన చేసిన అపారమైన కృషికి గానూ 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మవిభూషణ్ వంటి అవార్డులతో భారతప్రభుత్వ సత్కరించి, గౌరవించింది. 2004లో టైమ్ మ్యాగజైన్ ద్వారా ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేరుపొందారు. చివరిగా ఆగస్టు 20, 2014న, 95 ఏళ్ల వయసులో గుండె వైఫల్యం, మూత్రపిండ వైఫల్యంతో పూణే ఆస్పత్రిలో అయ్యంగార్ మరణించారు. (చదవండి: International Yoga Day 2024: స్ఫూర్తినిచ్చే గొప్ప ప్రయాణం) -
International Yoga Day 2024: స్ఫూర్తినిచ్చే గొప్ప ప్రయాణం
యోగా అంటే బరువు తగ్గడం కాదు. అంతకుమించిన మానసిక వికాసం. అనేకానేక ఆరోగ్య ప్రయోజనాల సమ్మేళనం. యోగ సాధన శారీరక, మానసిక ఆరోగ్యానికి సమతుల్యతకు మూలం. యోగా నేర్చుకోవాలనుకుని అనుకుంటున్నారా? యోగ మొదలు పెట్టాలనుకునే వారు, ఎలా మొదలు పెట్టాలో తెలియని వారు మార్గదర్శకాలు తెలుసుకోవడం చాలా అవసరం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అసలు యోగా అంటే ఏమిటి? ఎలా ఆచరించాలి? తెలుసుకుందాం.యోగాని జాతి, మత, కుల, లింగ భేదాలు, చిన్నా పెద్దా లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు. యోగా సాధనకు సంక్పలం, చక్కటి గురువు ఉంటే చాలు. ఐదు నిమిషాల్లో నేర్చుకోవచ్చు. అలాగే దీన్ని పట్టుదలగా కొనసాగిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం.యోగ అనేది కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాదు. అదొక అనిర్వచనీయ అనుభూతివైపుగా తీసుకెళ్లే శక్తి. విభిన్నమైన ఆసనాల ద్వారా మనల్ని మనం తెలుసుకుంటూ, మన శరీర తత్వాన్ని, లక్షణాలను అవయవాల తీరును తెలుసుకొనే శాస్త్రం కూడా.మరోవిధంగా చెప్పాలంటే...మనుషుల్లోని కోపం, ఆవేశం, ఉల్లాసం, ఆందోళన ఇలాంటి భావోద్వేగాల్ని, శరీర భంగిమల్ని ఇట్టే పసిగడతాం. ఇలాంటి మానసిక భావోద్వేగ పరిస్థితులను గమనిస్తూ మన శరీరాన్ని వివిధ భంగిమల ద్వారా కావలసిన స్థితిని తీసుకువచ్చేదే ఆసన విద్య. అలా మనుషులకు చైతన్యాన్ని, కొత్త శక్తిని అందించాలనేదే యోగాసనాల ఉద్దేశ్యం. అయితే ఇది అందరికీ ఒకేలాగా పనిచేయకపోవచ్చు. వ్యక్తుల స్వభావాన్ని బట్టి, సాధన ఎలా చేస్తున్నారు అనేదాన్ని బట్టి ఫలితాలు వేరు వేరుగా ఉంటాయి. అవగాహన, అనుభవం, ఆచరణ కూడా చాలా ముఖ్యం. ఆధునిక కాలంలో కొంతమంది నిపుణులు సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా, ఇతర సామాజిక మాధ్యమాల యెగా శిక్షణ అందిస్తున్నారు. ఫలితంగా ఇలాంటి ఇంట్లోనే ఉండి అభ్యాసం చేసే వెసులుబాటునిస్తాయి. నిపుణుల సమక్షంలో జరిగే ఇలాంటి శిక్షణ శారీరక , మానసిక ప్రయోజనాలను చేకూర్చుతుంది. అయితే మరిన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం యోగా గురువుల సమక్షంలో భౌతిక శిక్షణ అవసరం. సముద్రంలాంటి యోగ జీవితకాలం స్ఫూర్తినిచ్చే ఒక నిరంతర ప్రయాణం. దైవాన్ని నమ్మేవారికి ఆధ్యాత్మిక తాదాత్మ్యం. మిగిలినవారికి భౌతిక మానసికోల్లాసం.యోగాసనాలలో , 84 ప్రాథమిక ఆసనాలు ఉన్నాయని చెబుతారు. శ్వాసపై దృష్టి పెడుతూ శరీరం , మనస్సు ఎలా పని చేస్తాయో అన్వేషించడమే దీని ఉద్దేశం. ఇందులో సుఖాసన మొదలు, తడసానా లేదా పర్వత భంగిమ, అధోముఖ స్వనాసన , ధనుర్ ఆసనం, శవాసనం, మొదలు, హనుమనాసన, అస్తావక్రాసన , యోగనిద్రాసన, ద్విపద విపరిత దండాసనా, ,కపోతాసా , వృశ్చికా, పింఛ మయూరాసన, బకాసనా లాంటి ఎన్నో క్లిష్టమైన ఆసనాలున్నాయి. కఠోర శ్రమతో వీటిని ఆచరిస్తే ఆరోగ్యం మన సొంతమవుతుంది. -
International Yoga Day 2024: స్పెషల్ ఈవెంట్ ఫోటోలు