ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం చాలా ఉత్సాహంగా జరిగింది. ముఖ్యంగా మన దేశంలో జమ్ము కశ్మీర్‌లో 50 వేల మందితో నిర్వహించిన యోగా కార్యక్రమం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతోందని, ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అలాగే దేశ వ్యాప్తంగా నిర్వహించిన యోగా డే వేడుకల్లో పలువురు రాజకీయ, సినీ, క్రీడారంగ ప్రముఖులు యోగాసనాలతో సందడి చేశారు.
ప్రముఖ యాంకర్ సుమ కనకాల అందరికీ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ముఖ్యంగా మహిళలు ఎలాంటి ఆసనాలు వేయాలి? వాటి లాభాలను వివరిస్తూ ఇన్‌స్టాలో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేసింది. ప్రతీ పండుగకు ఏదో ఒక విశేషమైన వీడియోను పంచుకునే సుమ యోగా డేనుకూడా అలా వినియోగించుకుందన్న మాట.
యోగాసనాలతో విన్యాసాలు చేస్తూ హిల్లేరియస్ రీల్‌పై నెటిజన్లు కూడా ఫన్నీగా కమెంట్స్ చేశారు. అయితే ‘‘ఎందుకొచ్చిన తిప్పలు అక్కా..హాయిగా మూడు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు, 6 ఇంటర్వ్యూలు చేసుకోక’’ అని ఒకరు, ‘ఈ వయసులో ఈ ప్రయోగాలు అవసరమా, లైక్స్ కోసం కాకపోతే’ అని మరొకరు, ‘‘ఇంత టైం ఎక్కడ దొరకుతుందక్కా నీకు’’ అంటూ మరొక అభిమాని వ్యాఖానించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ వయసులో ఉన్నవారైనా యోగాను సాధన చేయవచ్చు. కాకపోతే నిపుణుడైన గురు సమక్షంలో చేయడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment