యోగా అంటే బరువు తగ్గడం కాదు. అంతకుమించిన మానసిక వికాసం. అనేకానేక ఆరోగ్య ప్రయోజనాల సమ్మేళనం. యోగ సాధన శారీరక, మానసిక ఆరోగ్యానికి సమతుల్యతకు మూలం.
యోగా నేర్చుకోవాలనుకుని అనుకుంటున్నారా? యోగ మొదలు పెట్టాలనుకునే వారు, ఎలా మొదలు పెట్టాలో తెలియని వారు మార్గదర్శకాలు తెలుసుకోవడం చాలా అవసరం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అసలు యోగా అంటే ఏమిటి? ఎలా ఆచరించాలి? తెలుసుకుందాం.
యోగాని జాతి, మత, కుల, లింగ భేదాలు, చిన్నా పెద్దా లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు. యోగా సాధనకు సంక్పలం, చక్కటి గురువు ఉంటే చాలు. ఐదు నిమిషాల్లో నేర్చుకోవచ్చు. అలాగే దీన్ని పట్టుదలగా కొనసాగిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం.
యోగ అనేది కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాదు. అదొక అనిర్వచనీయ అనుభూతివైపుగా తీసుకెళ్లే శక్తి. విభిన్నమైన ఆసనాల ద్వారా మనల్ని మనం తెలుసుకుంటూ, మన శరీర తత్వాన్ని, లక్షణాలను అవయవాల తీరును తెలుసుకొనే శాస్త్రం కూడా.
మరోవిధంగా చెప్పాలంటే...మనుషుల్లోని కోపం, ఆవేశం, ఉల్లాసం, ఆందోళన ఇలాంటి భావోద్వేగాల్ని, శరీర భంగిమల్ని ఇట్టే పసిగడతాం. ఇలాంటి మానసిక భావోద్వేగ పరిస్థితులను గమనిస్తూ మన శరీరాన్ని వివిధ భంగిమల ద్వారా కావలసిన స్థితిని తీసుకువచ్చేదే ఆసన విద్య. అలా మనుషులకు చైతన్యాన్ని, కొత్త శక్తిని అందించాలనేదే యోగాసనాల ఉద్దేశ్యం.
అయితే ఇది అందరికీ ఒకేలాగా పనిచేయకపోవచ్చు. వ్యక్తుల స్వభావాన్ని బట్టి, సాధన ఎలా చేస్తున్నారు అనేదాన్ని బట్టి ఫలితాలు వేరు వేరుగా ఉంటాయి. అవగాహన, అనుభవం, ఆచరణ కూడా చాలా ముఖ్యం. ఆధునిక కాలంలో కొంతమంది నిపుణులు సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా, ఇతర సామాజిక మాధ్యమాల యెగా శిక్షణ అందిస్తున్నారు. ఫలితంగా ఇలాంటి ఇంట్లోనే ఉండి అభ్యాసం చేసే వెసులుబాటునిస్తాయి. నిపుణుల సమక్షంలో జరిగే ఇలాంటి శిక్షణ శారీరక , మానసిక ప్రయోజనాలను చేకూర్చుతుంది. అయితే మరిన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం యోగా గురువుల సమక్షంలో భౌతిక శిక్షణ అవసరం. సముద్రంలాంటి యోగ జీవితకాలం స్ఫూర్తినిచ్చే ఒక నిరంతర ప్రయాణం. దైవాన్ని నమ్మేవారికి ఆధ్యాత్మిక తాదాత్మ్యం. మిగిలినవారికి భౌతిక మానసికోల్లాసం.
యోగాసనాలలో , 84 ప్రాథమిక ఆసనాలు ఉన్నాయని చెబుతారు. శ్వాసపై దృష్టి పెడుతూ శరీరం , మనస్సు ఎలా పని చేస్తాయో అన్వేషించడమే దీని ఉద్దేశం. ఇందులో సుఖాసన మొదలు, తడసానా లేదా పర్వత భంగిమ, అధోముఖ స్వనాసన , ధనుర్ ఆసనం, శవాసనం, మొదలు, హనుమనాసన, అస్తావక్రాసన , యోగనిద్రాసన, ద్విపద విపరిత దండాసనా, ,కపోతాసా , వృశ్చికా, పింఛ మయూరాసన, బకాసనా లాంటి ఎన్నో క్లిష్టమైన ఆసనాలున్నాయి. కఠోర శ్రమతో వీటిని ఆచరిస్తే ఆరోగ్యం మన సొంతమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment