Yoga Therapy
-
ప్రెగ్నెన్సీలో యోగా, నటి సొన్నల్లి సెగల్ వీడియో వైరల్
గర్భం దాల్చినపుడు వ్యాయామాలు చేస్తూ,యోగాసనాలు వేస్తూ (నిపుణుల సలహాతో) సహజ ప్రసవం కోసం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. సెలబ్రిటీల దగ్గరనుంచి సామాన్యుల దాకా దీనిపై అవగాహన పెంచుకుంటున్నారు. తాజాగా నటి సొన్నల్లి సెగల్ ఏకంగా శీర్షాసనాలు వేస్తూ మరో అడుగు ముందుకేసింది.సొన్నల్లి సెగల్ మరికొన్ని రోజుల్లో మాతృత్వాన్ని రుచి చూడబోతోంది. ఇంతలో గర్భధారణ మధురిమలను ఆస్వాదిస్తోంది. సోషల్‌మీడియాలో ఫోటోలతో ఫ్యాన్స్ ఆకట్టుకోవడంలో సొన్నల్లి ముందుంటుంది. తాజాగా తన ప్రెగ్నెన్సీలో ప్రతిదశను షేర్ చేస్తూ, ఫిట్నెస్పైన తన ఆసక్తిని తెలియజేస్తోంది. ఇటీవల, సొన్నల్లి తన భర్త అశేష్ ఎల్ సజ్నానీతో కలిసి స్విట్జర్లాండ్‌లోని ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలలో రిలాక్సింగ్ బేబీమూన్ను ఆస్వాదించింది.తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో, అంత్యంత క్లిష్టమైన శిర్షాసనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. అత్యంత జాగ్రత్తగా ,నిపుణుల పర్యవేక్షణలో దీన్ని సాధన చేసింది. సంవత్సరాల నుండి యోగాభ్యాసంలో తలకిందులుగా వేసే ఆసనాలు ఇవి ఒక భాగం. అయితే గర్భం దాల్చినప్పుడు దీన్ని కొనసాగించగలనా? లేదా? అని భయపడ్డాను. కానీ యోగా గురువు, వైద్యుల సలహా మేరకు దీన్ని కొనసాగించగలను అని నిర్ధారించుకున్నాను. View this post on Instagram A post shared by Sonnalli A Sajnani (@sonnalliseygall) గర్భధారణకు ముందు ఎలాంటి ఆసనాలు వేసానో అవి చేయొచ్చని తనకు అర్థమైంది అంటూ ఆసనాలపై తనకున్న ప్రేమను వ్లెలడించింది. గర్భధారణ సమయంలో దీని వల్ల అపారమైన ప్రయోజనాలుంటాయని కూడా పేర్కొంది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ గర్బంతో ఉన్నపుడు వీటిని మొదలు పెట్టకూడదని స్పష్టం చేసింది. ఇలాంటి యోగాలసనాలతో ప్రసవ సమయంలో బేబీకి పెల్విస్ మరింత విశాల మవుతుందట. నాడీ వ్యవస్థ శాంతపర్చి, పాదాల వాపును తగ్గించడం, తిరిగి వచ్చే రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం లాంటి అనే ప్రయోజనాలు ఉన్నాయని తెలిపింది. కాగా సొన్నాల్లి సెగల్ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. యోగాతో పాటు, జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేయడం ఆమెకు అలవాటు. ఈక్రమంలో గతంలో గర్భంలో ఉన్నపుడే యోని ముద్ర అనే యోగా ఆసనం చేస్తున్న వీడియోను షేర్ చేసింది. -
వైమానిక యోగా!
బిజీ లైఫ్ స్టైల్లో తీవ్ర ఒత్తిడి, కోపం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో భాగ్యనగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యోగా, ధ్యానం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ఇవన్నీ పూర్వకాలం నుంచి తరతరాలుగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నగరంలో వయసుతో సంబంధం లేకుండా యోగా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం యోగాలో కూడా కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే ఏరియల్ యోగా.. దీన్నే రోప్ యోగా అని కూడా అంటారు. సాధారణంగా కింద కూర్చుని యోగాసనాలు వేయడం కామన్.. కానీ గాల్లో వేలాడుతూ వివిధ యోగాసనాలు చేయడమే ఏరియల్ యోగా స్పెషల్ అన్నమాట. గాల్లో యోగాసనాలు ఎలా వేస్తారనే కదా మీ అనుమానం. దీని గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.. ఏరియల్ యోగాలో చీర పరిమాణంలో ఉన్న ఒక వస్త్రాన్ని పైనుంచి ఊయల మాదిరిగా వేలాడదీస్తారు. ఆ వస్త్రాన్ని శరీరం చుట్టూ చుట్టుకోవాలి. ఇక, వస్త్రాన్ని శరీరానికి చుట్టుకున్న తర్వాత వివిధ యోగాసనాలు వేస్తుంటారు. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరగడంతో పాటు శరీరానికి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకూ పరిష్కారంగా నిలుస్తోంది.జీర్ణక్రియకు తోడ్పాటు.. ఏరియల్ యోగాతో జీర్ణక్రియ ఎంతో మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. శరీరాన్ని సాగతీయడంతో పొత్తికడుపు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. పేగు సంబంధ సమస్యలు దరి చేరకుండా చూస్తుంది. కడుపు నొప్పి లేదా గ్యాస్ ఉంటే ఏరియల్ యోగాతో తగ్గించుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది..ఏరియల్ యోగా శరీర కండరాలు సాగేలా చేస్తుంది. గాల్లో ఉంటారు కాబట్టి.. శరీరాన్ని మరింత స్ట్రెచ్ చేసేందుకు వీలు కలుగుతుంది. కొద్ది రోజులకు శరీరం మరింత ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. ఇలా చేయడం వల్ల కండరాలు కూడా బలంగా తయారవుతాయి. వెన్నెముక, భుజం శక్తివంతంగా తయారయ్యేందుకు దోహదపడుతుంది.ఒత్తిడిని తగ్గించే ఆయుధం.. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతుంటే.. ఏరియల్ యోగా చాలా ఉత్తమమైన వ్యాయామం అని చెప్పొచ్చు. మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు ప్రవర్తనలో కూడా మంచి మార్పులు తీసుకొస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గి స్తుంది. గాల్లో తల్లకిందులుగా వేలాడుతూ.. ధ్యానం చేస్తుంటే మంచి ఆలోచనలపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఏరియల్ యోగాతో మెదడులో రక్త ప్రసరణ పెరిగి మానసిక ఆరోగ్యం మన సొంతమయ్యేలా చేస్తుంది.వెన్నునొప్పి హుష్‌కాకి.. వెన్నెముకపై ఎలాంటి ఒత్తిడీ పడకుండా వెన్నెముక, దాని సంబంధిత సమస్యలను నయం చేయడంలో ఏరియల్ యోగా ఎంతో ప్రభావం చూపుతుంది. వస్త్రంలో పడుకుని వెనక్కి అలా వంగి కాసేపు ఆసనం వేస్తే వెన్నెముక సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. ఏరియల్ యోగాతో శరీర తీరుతో పాటు వెన్నెముకను సరిచేసుకోవచ్చు. నడుము నొప్పి కూడా తగ్గుతుంది.బరువు తగ్గిపోతుంది.. ఏరియల్ యోగా బరువు తగ్గించడంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. 50 నిమిషాల పాటు ఏరియల్ యోగా చేస్తే దాదాపు 320 కేలరీలు బర్న్ చేయగలదు. శరీర కొవ్వును బర్న్ చేసేటప్పుడు ఇది టోన్డ్, లీన్ కండరాలను పొందడానికి సహాయం చేస్తుంది. సమర్థవంతమైన ఫలితాల కోసం వారానికి ఒకసారి దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు.నిపుణుల పర్యవేక్షణలో ..యోగా చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. సొంతంగా చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందు ఎవరైనా గురువు దగ్గర నేర్చుకుని ఆ తర్వాతే అభ్యాసం చేయాలి. కొన్ని యోగాసనాలు చేస్తే పర్వాలేదు. అన్ని ఆసనాలు అందరూ చేయకూడదు. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా క్రమపద్ధతిలో చేయాలి. – శ్రీకాంత్ నీరటి, యోగా ట్రైనర్యోగాతో ఎన్నో ప్రయోజనాలుయోగా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పతంజలి సూచించిన అష్టాంగ మార్గాల్లోని యమ, నియమను పాటిస్తూ యోగా సనాలు వేయాలి. అప్పుడే మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకూరతాయి. స్థితప్రజ్ఞత సాధించేందుకు యోగా అత్యున్నత మార్గం. – నెతికార్ లివాంకర్, యోగా ట్రైనర్, రామకృష్ణ మఠంకాని్ఫడెన్స్ పెరుగుతుంది.. ఏరియల్ యోగా లేదా యాంటీ గ్రావిటీ యోగా ద్వారా శరీరం చాలా బలంగా తయారవుతుంది. అలాగే మనపై మనకు కాన్ఫిడెన్స్తోపాటు జ్ఞాపకశక్తి, రక్త ప్రసరణ పెరుగుతుంది. మైండ్ రిలాక్సేషన్ అవుతుంది. కాకపోతే సాధారణ యోగాలో కొంతకాలం అనుభవం ఉన్న వారు మాత్రమే దీనిని చేయాలి. ముఖ్యంగా గురువుల సమక్షంలో చేస్తే మంచిది. – కొండకళ్ల దత్తాత్రేయ రావు, అద్వైత యోగా సెంటర్ -
International Yoga Day 2024: స్ఫూర్తినిచ్చే గొప్ప ప్రయాణం
యోగా అంటే బరువు తగ్గడం కాదు. అంతకుమించిన మానసిక వికాసం. అనేకానేక ఆరోగ్య ప్రయోజనాల సమ్మేళనం. యోగ సాధన శారీరక, మానసిక ఆరోగ్యానికి సమతుల్యతకు మూలం. యోగా నేర్చుకోవాలనుకుని అనుకుంటున్నారా? యోగ మొదలు పెట్టాలనుకునే వారు, ఎలా మొదలు పెట్టాలో తెలియని వారు మార్గదర్శకాలు తెలుసుకోవడం చాలా అవసరం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అసలు యోగా అంటే ఏమిటి? ఎలా ఆచరించాలి? తెలుసుకుందాం.యోగాని జాతి, మత, కుల, లింగ భేదాలు, చిన్నా పెద్దా లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు. యోగా సాధనకు సంక్పలం, చక్కటి గురువు ఉంటే చాలు. ఐదు నిమిషాల్లో నేర్చుకోవచ్చు. అలాగే దీన్ని పట్టుదలగా కొనసాగిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం.యోగ అనేది కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాదు. అదొక అనిర్వచనీయ అనుభూతివైపుగా తీసుకెళ్లే శక్తి. విభిన్నమైన ఆసనాల ద్వారా మనల్ని మనం తెలుసుకుంటూ, మన శరీర తత్వాన్ని, లక్షణాలను అవయవాల తీరును తెలుసుకొనే శాస్త్రం కూడా.మరోవిధంగా చెప్పాలంటే...మనుషుల్లోని కోపం, ఆవేశం, ఉల్లాసం, ఆందోళన ఇలాంటి భావోద్వేగాల్ని, శరీర భంగిమల్ని ఇట్టే పసిగడతాం. ఇలాంటి మానసిక భావోద్వేగ పరిస్థితులను గమనిస్తూ మన శరీరాన్ని వివిధ భంగిమల ద్వారా కావలసిన స్థితిని తీసుకువచ్చేదే ఆసన విద్య. అలా మనుషులకు చైతన్యాన్ని, కొత్త శక్తిని అందించాలనేదే యోగాసనాల ఉద్దేశ్యం. అయితే ఇది అందరికీ ఒకేలాగా పనిచేయకపోవచ్చు. వ్యక్తుల స్వభావాన్ని బట్టి, సాధన ఎలా చేస్తున్నారు అనేదాన్ని బట్టి ఫలితాలు వేరు వేరుగా ఉంటాయి. అవగాహన, అనుభవం, ఆచరణ కూడా చాలా ముఖ్యం. ఆధునిక కాలంలో కొంతమంది నిపుణులు సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా, ఇతర సామాజిక మాధ్యమాల యెగా శిక్షణ అందిస్తున్నారు. ఫలితంగా ఇలాంటి ఇంట్లోనే ఉండి అభ్యాసం చేసే వెసులుబాటునిస్తాయి. నిపుణుల సమక్షంలో జరిగే ఇలాంటి శిక్షణ శారీరక , మానసిక ప్రయోజనాలను చేకూర్చుతుంది. అయితే మరిన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం యోగా గురువుల సమక్షంలో భౌతిక శిక్షణ అవసరం. సముద్రంలాంటి యోగ జీవితకాలం స్ఫూర్తినిచ్చే ఒక నిరంతర ప్రయాణం. దైవాన్ని నమ్మేవారికి ఆధ్యాత్మిక తాదాత్మ్యం. మిగిలినవారికి భౌతిక మానసికోల్లాసం.యోగాసనాలలో , 84 ప్రాథమిక ఆసనాలు ఉన్నాయని చెబుతారు. శ్వాసపై దృష్టి పెడుతూ శరీరం , మనస్సు ఎలా పని చేస్తాయో అన్వేషించడమే దీని ఉద్దేశం. ఇందులో సుఖాసన మొదలు, తడసానా లేదా పర్వత భంగిమ, అధోముఖ స్వనాసన , ధనుర్ ఆసనం, శవాసనం, మొదలు, హనుమనాసన, అస్తావక్రాసన , యోగనిద్రాసన, ద్విపద విపరిత దండాసనా, ,కపోతాసా , వృశ్చికా, పింఛ మయూరాసన, బకాసనా లాంటి ఎన్నో క్లిష్టమైన ఆసనాలున్నాయి. కఠోర శ్రమతో వీటిని ఆచరిస్తే ఆరోగ్యం మన సొంతమవుతుంది. -
మనస్ఫూర్తిగా జీవించే యోగం కోసం...
ప్రస్తుతం మానసిక ఒత్తిడి, సమస్యలు లేని జీవితం లేదంటే అతిశయోక్తి కాదు. పని ఒత్తిడి, ఆర్థికపరమైన సమస్యలు, ఇతర ఇబ్బందుల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతిరోజూ కనీసం ఓ అర గంటయినా శారీరక శ్రమ చేయాలంటారు నిపుణులు. అందుకు యోగా చక్కని మార్గం. ఆరోగ్యకరమైన జీవితానికి యోగా ఎంతో సహాయపడుతుంది. చాలామందికి, వారి అస్తవ్యస్తమైన, బిజీ జీవితాల నుండి యోగా ఉపశమనాన్ని ఇవ్వగలదు. యోగా చేయడం వల్ల శరీరానికి నూతనోత్సాహం కలుగుతుంది. బలాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. భంగిమను మెరుగుపరుస్తుంది. మనసు, శరీరం, ఆత్మను నియంత్రించడంలో యోగా సహాయపడుతుంది. యోగా ఒక శక్తిమంతమైన మైండ్‌ఫుల్‌నెస్ సాధన. యోగా ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండేట్లు చేస్తుంది. యోగా చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. యోగ శ్వాసక్రియ శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. యోగా సాధన సాగదీసినట్లు అనిపించవచ్చు. కానీ శరీరానికి మంచి అనుభూతి అందించడం, కదిలే విధానంలో చాలా మార్పు చూపుతుంది. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల బరువు తగ్గడం, ఒత్తిడిని తగ్గించుకోవడం సాధ్యమవుతాయి. యోగ అభ్యాసం వలన కలిగే ప్రయోజనాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చాయి. యోగాలో చాలా రకాలు ఉన్నాయి, హఠ (అనేక శైలుల కలయిక) అత్యంత ప్రాచుర్యం పొందిన శైలులలో ఒకటి. హఠ యోగం ప్రాణాయామాలపై (శ్వాస నియంత్రిత వ్యాయామాలు) దృష్టి పెడుతుంది. వీటి తర్వాత వరుసలో ఆసనాలు (యోగా భంగిమలు) ఉంటాయి. అవి శవాసనంతో (విశ్రాంతి కాలం) ముగుస్తాయి. యోగశాలల్లో సాధారణంగా అద్దాలు ఉండవు. సాధకులు తమను చుట్టుపక్కల వ్యక్తులు ఎలా చూస్తారనే దాని కంటే ముఖ్యంగా తమ పట్ల తమకు ఏకాగ్రత అవసరం. యోగా సాధన చేయని వ్యక్తుల కంటే యోగా సాధన చేసేవారికి తమ శరీరాల గురించి ఎక్కువ అవగాహన ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. యోగాసనాలు వేసేవారు ఎక్కువ సంతృప్తిగా ఉన్నారు. తమ శరీరాలపై తక్కువ ఫిర్యాదులు చేశారు. అందుకే సానుకూల శరీర ఆకృతి, ఆత్మగౌరవాలను ప్రోత్సహించే కార్యక్రమాలు యోగా చికిత్సలో భాగం అవుతున్నాయి.యోగాను అభ్యసించడం ద్వారా, ఒక వ్యక్తి జీవితంలోని ఇతర రంగాలలో కూడా అవగాహన మెరుగవుతుంది. తినే రుగ్మతలను యోగా పోగొడుతుంది. బుద్ధిపూర్వకంగా తినడం, శారీరక భావోద్వేగ అనుభూతులను అవగాహనకు తెచ్చుకోవడంలో యోగా సాయపడుతుంది. విచారంలో ఉన్నప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు పరధ్యానంగా తింటారు. అదే యోగాను అభ్యసించే వ్యక్తులు ఒక పద్ధతి ప్రకారం మనస్ఫూర్తిగా భుజిస్తారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి యోగా సాధన ఉత్తమం. బుద్ధిపూర్వకంగా తినేవారు తమ శరీరాన్ని ఆరోగ్యాంగా చూసుకుంటారు. యోగా సాధన చేసేవారిలో కండరాల బలం, స్థితప్రజ్ఞత, ఓర్పు, కార్డియో–రెస్పిరేటరీ ఫిట్నెస్ మెరుగవుతాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. యోగా, మంచి ఆహార అలవాట్లు మనిషి మనుగడను మెరుగుపరుస్తాయి. మనిషి ప్రశాంతతకు, ఆనందమయ జీవితానికి యోగా మంచి ఉపకరణం.– డా‘‘ ఎం. అఖిల మిత్ర ‘ ప్రకృతి వైద్యులు(నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం) -
ముఖానికి ఫేస్ యోగా! దెబ్బకు మొటిమలు, మచ్చలు మాయం!
యోగా శారరక ఆరోగ్యానికే కాక ముఖ సౌందర్యానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు సమస్యలను నివారించుకోవచ్చు. పలు ఆసనాలు ముఖంపై పేరుకుపోయిన జిడ్డుని చెమట రూపంలో బయటకు పంపించి ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. దీనివల్ల శరీరంలో సక్రమంగా రక్త సరఫరా జరిగి శరీరం, ముఖం ఉత్సాహభరితంగా ఉండటమేగాక, ఏదో తెలియని అందం దాగుంది అనిపించేలా ఉంటుంది. అందువల్ల దయచేసి ఇక్కడ చెప్పేవాటిని తప్పక ట్రై చేయండి ముందుగా ఫేస్ యోగా.. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోమ్ యోగా చేయాలి. ముందుగా నిటారుగా కూర్చోవాలి. బుగ్గలను బూరా ఊదినట్టుగా ఊది రెండు వేళ్లతో నోటిని మూసేయాలి. బూరలాగా ఉబ్బిన బుగ్గలపై చేతితో కొట్టాలి. ఒక్కో బుగ్గను ముఫ్పై సెకన్ల పాటు కొట్టాలి. రెండు బుగ్గలను కొట్టడం పూర్తయిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా రోజూ చేయడం వల్ల ముఖం మెరుస్తుంది. ముఖ సౌందర్యాన్ని ఇనుమడింప చేసే ఆసనాలు ప్రాణయామం: ఇది శ్వాసను నియంత్రించేలా చేసే ఆసనం. అంటే పద్మాసనంలో కూర్చోని ఎడమ చేతి బొటని వేలుతో ఎడమ ముక్కు రంధ్రిని మూసి కుడివైపు రంధ్రం నుంచి వీలైనంత గాలి పీల్చి అలా పట్టి ఉంచాలి. ఇలా ఎడమ రంధ్రం వైపు కూడా చేయాలి. ఆ తర్వాత రెండు రంధ్రాల నుంచి గాలి పీల్చుకుని వీలైనంత సేపు పట్టి ఉంచి వదలాలి ఇది ముఖంలో మొటిమలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందకంటే శ్వాసను నియంత్రిచగలిగేత రక్తం మంచిగా సరఫరా అయ్యి శరరం మొత్తాన్ని యాక్టివ్‌గా ఉంచుతుంది. తద్వారా మొటిమలు సమస్యలు ఉండవు మత్యాసనం: శరీరాన్ని అచ్చం చేప మాదిరిగానే వచ్చి శ్వాసను నియంత్రించాలి సర్వాంగాసనం: మొత్తం శరీరాన్ని గాల్లోకి లేపి కేవలం చేతిపై బ్యాలెన్స్ చేసుకోవాలి. భుజంగాసనం: ఇది అచ్చం కోబ్రాలాంటి ఆసనం. బెల్లిఫ్యాట్‌ని ఈజీగా కరిగించేస్తుంది చక్రాసనం: శరీరాన్ని చక్రంలా వంచినట్లుగా వేయాల్సి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది పద్మాసనం: సుఖాసనంలో కూర్చొని శ్వాసపై ధ్యాస ఉంచి ధ్యానం మాదిరిగా శరీరాన్ని రిలాక్స్డ్ పొజిషన్లో ఉంచాలి. ఇది మొటిమల సమస్యలకు ఈజీగా చెక్‌పెడుతుంది హలాసనం: నాగలి భంగిమలో ఉండే ఆసనం. దీనివల్ల తలభాగంలో చక్కగా రక్తప్రసరణ జరుగుతుంది. ఫలితంగా మొటిమలు తగ్గుముఖం పడతాయి. (చదవండి: తమలపాకులతో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టండిలా!) -
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. సక్సెస్ సీక్రెట్
సవాలక్ష ఒత్తిళ్లతో నిండిపోయి ఉంటుంది కార్పొరేట్ వరల్డ్. ఇక గూగుల్ లాంటి బడా కంపెనీలను నడిపించే సుందర్ పిచాయ్లాంటి వాళ్లపై అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అంత ఒత్తిడిని ఎలా డీల్ చేస్తాను, పని చేసేందుకు కావాల్సిన శక్తిని తిరిగి ఎలా తెచ్చుకుంటాననే విషయాలను వాల్ స్ట్రీట్ జర్నల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల వెల్లడించారు సుందర్ పిచాయ్. పని ఒత్తిడి మధ్య రిలాక్స్ అయ్యేందుకు చాలా మంది సీఈవోలో టూర్లకు వెళ్తుంటారు. ప్రకృతిలో విహార యాత్రలు చేస్తుంటారు. కానీ సుందర్ పిచాయ్ బయట ఎక్కడా అడుగు పెట్టరట. తాను ఉన్న చోటులోనే ప్రత్యేకమైన పద్దతిలో విశ్రాంతి తీసుకుంటారట. దీన్ని నాన్ స్లీపింగ్ డీప్ రెస్ట్ (ఎన్ఎస్డీఆర్)గా పేర్కొంటారట. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన న్యూరోసైన్స్ ప్రొఫెసర్ ఆండ్ర్యూ హ్యుబర్ ఈ ఎన్ఎస్డీఆర్ టెక్నిక్‌ని అమెరికాలో విస్త్రృతం చేశారు. ఒక చోట కదలకుండా ఉండి ఆలోచనలను ఒకే అంశంపై నియంత్రిస్తూ ఉండటం వల్ల ఒత్తిడిని త్వరగా జయించవచ్చంటూ ఎన్ఎస్డీఆర్ టెక్నిక్‌ని అమెరికన్లలో పాపులర్ చేశారు. ఎన్ఎస్డీఆర్కి సంబంధించిన విధానాలను యూట్యూబ్ ద్వారా చూస్తూ సుందర్ పిచాయ్ సుందర్ పిచాయ్ ఒత్తిడిని దూరం చేసుకుంటారట. నేలపై ఒక చోట పడుకుని ఆలోచనలను నియంత్రిస్తూ.. క్రమంగా ఆలోచనా రహిత స్థితికి చేరుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు బ్రెయిన్ మరింత షార్ప్‌గా పని చేస్తుందంటున్నారు సుందర్ పిచాయ్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రతిపాదిన నాన్ స్లీపింగ్ డీప్ రెస్ట్ మెథడ్‌ని మన భారతీయులు ఎప్పుడో కనిపెట్టారు. శ్వాసమీద ధ్యాస, యోగ నిద్ర పేరుతో ప్రాచీన మహర్షులు మెదడుపై ఒత్తిడిని తగ్గించి ఉత్తేజపరిచే మార్గాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. చదవండి: Sundar Pichai: ఆఖరిసారి అప్పుడే ఏడ్చాను -
ఆరోగ్య ‘యోగా థెరపీ’
ఇన్నాళ్లు పగలు జాబ్‌తో పోటీపడిన సిటీవాసులు ఇప్పుడు రాత్రి ఉద్యోగాలతోనూ క్షణం తీరిక లేకుండా లైఫ్ సక్సెస్ వైపు పరుగులు పెడుతున్నారు. సాఫ్ట్వేర్, బీపీవో, కాల్ సెంటర్, పాత్రికేయ వృత్తిలో.. ఇలా చాలా రంగాల్లో నైట్‌షిఫ్ట్ జాబ్‌లు చాలా మందే చేస్తున్నారు. రాత్రిపూట విధులు నిర్వర్తిచడం వల్ల అనేక మందికి వారికి తెలియకుండానే అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా నిద్రలేమి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కుర్చీలో తదేకంగా కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తోంది. పని టెన్షన్లో మానసిక ఒత్తడికి గురవుతున్నారు. మహిళలకైతే మరీ ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటివారికి ఎలాంటి మందులు వాడకుండానే వ్యాధులు నయం చేసేందుకు యోగా థెరపీ విధానం సిటీవాసుల ముందుకు వచ్చింది. మామూలుగా డాక్టర్లు ఇచ్చే మెడిసిన్ వల్ల అప్పటికప్పుడు ఉపశమనం ఉంటుందేమో గానీ పూర్తి స్థాయిలో కంట్రోల్ కాదు. అరుుతే, యోగా థెరపీ ద్వారా వ్యాధులను జీవితాంతం దరి చేరకుండా చేయవచ్చంటున్నారు హిమాయత్‌నగర్‌లో ఉంటున్న సుమన పోతుగుంటల. నాన్న పండిట్ డాక్టర్ పీవీ సీతారామయ్య ప్రోత్సాహంతో యోగాను ఎంచుకున్నానన్న ఈమె నగరవాసుల ఆరోగ్య సమస్యలకు యోగా థెరపీతో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. షట్క్రియాతో ఎంతో మేలు... షట్క్రియా చేయడం సిటీవాసుల ఆరోగ్యానికి ఎంతో మంచిది. జలనేతి, సూత్రానేతి క్రియల ద్వారా ఆస్థవూ, సైనసైటిస్, టీబీ, జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, కంటినొప్పి, చెవినొప్పి, గొంతునొప్పి, టాన్సిల్స్, మూర్చ, నిద్రలేమి, నిమోనియాలను నియంత్రింవచ్చు. అలాగే ముక్కు దిబ్బడ, కఫం, ముక్కు లోపల దుమ్ము ధూళిని పొగొట్టి శ్వాసక్రియ బాగా జరిగేలా షట్క్రియా విధానం మేలు చేస్తుంది. జలినేతి విధానంలో కాచి చల్చార్చిన గోరువెచ్చని నీరు, ఉప్పు వాడాలి. యోగనిద్రతో నిద్రలేమికి చెక్... ‘రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగులు శవాసనం, యోగ నిద్ర ద్వారా నిద్రలేమిని అధిగమించొచ్చు. కేవలం 15 నిమిషాలు పాటు ఈ యోగ చేస్తే రెండు గంటల నిద్రతో సమానం. బాడీ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. హర్మోన్స్ చక్కగా పనిచేస్తాయ’ని సుమన వివరించారు. పని ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాణయామ చేస్తే సరిపోతుంది. జాబ్ చేస్తూనే ఇది ఎప్పుడైనా చేయవచ్చు. చాలా మంది సిటీవాసుల వెంటబడుతున్న ఒబేసిటీని కపాలాభాతి ద్వారా నియంత్రించొచ్చు. పొట్టను లోపలికి లాగి గాలిని త్వరత్వరగా వదలాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని మలినాలు గాలి ద్వారా బయటకు వస్తాయి. మామూలు ఫుడ్ తీసుకున్న గంట తర్వాత, భోజనం చేస్తే నాలుగు గంటల తర్వాత ఈ కపాలాభాతి చేయాలి. కనీసం ఐదు నిమిషాలు పాటు చేయాలి. అలాగే ఒకే కుర్చీలో నిరంతరాయంగా కూర్చొని ఉండటం, నిటారుగా కూర్చకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. కటి చక్రాసనం, అర్ధ చక్రాసనం, అర్ధకటి చక్రసనం చేయడం ద్వారా ఈ నొప్పిని నియంత్రించొచ్చు. బద్ధకోణాసనంతో నార్మల్ డెలివరీ.. అమ్మాయిలు గర్భవతిగా ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మంచి ఫుడ్‌తో పాటు నార్మల్ డెలివరీ అయ్యేందుకు బద్ధకోణాసనం, ఉపవిష్టకోణాసనం, పశ్చిమోత్తనా సనం వేయాలి. తాడాసనంతో మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. సిటీవాసులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను యోగా థెరపీతో నియంత్రించవచ్చు’ అని సుమన వివరించారు. వాంకె శ్రీనివాస్