
యోగా శారరక ఆరోగ్యానికే కాక ముఖ సౌందర్యానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు సమస్యలను నివారించుకోవచ్చు. పలు ఆసనాలు ముఖంపై పేరుకుపోయిన జిడ్డుని చెమట రూపంలో బయటకు పంపించి ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. దీనివల్ల శరీరంలో సక్రమంగా రక్త సరఫరా జరిగి శరీరం, ముఖం ఉత్సాహభరితంగా ఉండటమేగాక, ఏదో తెలియని అందం దాగుంది అనిపించేలా ఉంటుంది. అందువల్ల దయచేసి ఇక్కడ చెప్పేవాటిని తప్పక ట్రై చేయండి
ముందుగా ఫేస్ యోగా..
ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోమ్ యోగా చేయాలి. ముందుగా నిటారుగా కూర్చోవాలి. బుగ్గలను బూరా ఊదినట్టుగా ఊది రెండు వేళ్లతో నోటిని మూసేయాలి. బూరలాగా ఉబ్బిన బుగ్గలపై చేతితో కొట్టాలి. ఒక్కో బుగ్గను ముఫ్పై సెకన్ల పాటు కొట్టాలి. రెండు బుగ్గలను కొట్టడం పూర్తయిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా రోజూ చేయడం వల్ల ముఖం మెరుస్తుంది.
ముఖ సౌందర్యాన్ని ఇనుమడింప చేసే ఆసనాలు
ప్రాణయామం: ఇది శ్వాసను నియంత్రించేలా చేసే ఆసనం. అంటే పద్మాసనంలో కూర్చోని ఎడమ చేతి బొటని వేలుతో ఎడమ ముక్కు రంధ్రిని మూసి కుడివైపు రంధ్రం నుంచి వీలైనంత గాలి పీల్చి అలా పట్టి ఉంచాలి. ఇలా ఎడమ రంధ్రం వైపు కూడా చేయాలి. ఆ తర్వాత రెండు రంధ్రాల నుంచి గాలి పీల్చుకుని వీలైనంత సేపు పట్టి ఉంచి వదలాలి ఇది ముఖంలో మొటిమలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందకంటే శ్వాసను నియంత్రిచగలిగేత రక్తం మంచిగా సరఫరా అయ్యి శరరం మొత్తాన్ని యాక్టివ్‌గా ఉంచుతుంది. తద్వారా మొటిమలు సమస్యలు ఉండవు
మత్యాసనం: శరీరాన్ని అచ్చం చేప మాదిరిగానే వచ్చి శ్వాసను నియంత్రించాలి
సర్వాంగాసనం: మొత్తం శరీరాన్ని గాల్లోకి లేపి కేవలం చేతిపై బ్యాలెన్స్ చేసుకోవాలి.
భుజంగాసనం: ఇది అచ్చం కోబ్రాలాంటి ఆసనం. బెల్లిఫ్యాట్‌ని ఈజీగా కరిగించేస్తుంది
చక్రాసనం: శరీరాన్ని చక్రంలా వంచినట్లుగా వేయాల్సి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
పద్మాసనం: సుఖాసనంలో కూర్చొని శ్వాసపై ధ్యాస ఉంచి ధ్యానం మాదిరిగా శరీరాన్ని రిలాక్స్‌డ్ పొజిషన్‌లో ఉంచాలి. ఇది మొటిమల సమస్యలకు ఈజీగా చెక్‌పెడుతుంది
హలాసనం: నాగలి భంగిమలో ఉండే ఆసనం. దీనివల్ల తలభాగంలో చక్కగా రక్తప్రసరణ జరుగుతుంది. ఫలితంగా మొటిమలు తగ్గుముఖం పడతాయి.
Comments
Please login to add a commentAdd a comment