ఆరోగ్య ‘యోగా థెరపీ’ | Health 'yoga therapy' | Sakshi
Sakshi News home page

ఆరోగ్య ‘యోగా థెరపీ’

Published Mon, Oct 20 2014 2:58 AM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM

ఆరోగ్య ‘యోగా థెరపీ’ - Sakshi

ఆరోగ్య ‘యోగా థెరపీ’

ఇన్నాళ్లు పగలు జాబ్‌తో పోటీపడిన సిటీవాసులు ఇప్పుడు రాత్రి ఉద్యోగాలతోనూ క్షణం తీరిక లేకుండా లైఫ్ సక్సెస్ వైపు పరుగులు పెడుతున్నారు. సాఫ్ట్‌వేర్, బీపీవో, కాల్ సెంటర్, పాత్రికేయ వృత్తిలో.. ఇలా చాలా రంగాల్లో నైట్‌షిఫ్ట్ జాబ్‌లు చాలా మందే చేస్తున్నారు. రాత్రిపూట విధులు నిర్వర్తిచడం వల్ల అనేక మందికి వారికి తెలియకుండానే అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా నిద్రలేమి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కుర్చీలో తదేకంగా కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తోంది. పని టెన్షన్‌లో మానసిక ఒత్తడికి గురవుతున్నారు. మహిళలకైతే మరీ ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

ఇలాంటివారికి ఎలాంటి మందులు వాడకుండానే వ్యాధులు నయం చేసేందుకు యోగా థెరపీ విధానం సిటీవాసుల ముందుకు వచ్చింది. మామూలుగా డాక్టర్లు ఇచ్చే మెడిసిన్ వల్ల అప్పటికప్పుడు ఉపశమనం ఉంటుందేమో గానీ పూర్తి స్థాయిలో కంట్రోల్ కాదు. అరుుతే, యోగా థెరపీ ద్వారా వ్యాధులను జీవితాంతం దరి చేరకుండా చేయవచ్చంటున్నారు హిమాయత్‌నగర్‌లో ఉంటున్న సుమన పోతుగుంటల. నాన్న పండిట్ డాక్టర్ పీవీ సీతారామయ్య ప్రోత్సాహంతో యోగాను ఎంచుకున్నానన్న ఈమె నగరవాసుల ఆరోగ్య సమస్యలకు యోగా థెరపీతో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు.
 
షట్క్రియాతో ఎంతో మేలు...
షట్క్రియా చేయడం సిటీవాసుల ఆరోగ్యానికి ఎంతో మంచిది. జలనేతి, సూత్రానేతి క్రియల ద్వారా ఆస్థవూ, సైనసైటిస్, టీబీ, జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, కంటినొప్పి, చెవినొప్పి, గొంతునొప్పి, టాన్సిల్స్, మూర్చ, నిద్రలేమి, నిమోనియాలను నియంత్రింవచ్చు. అలాగే ముక్కు దిబ్బడ, కఫం, ముక్కు లోపల దుమ్ము ధూళిని పొగొట్టి శ్వాసక్రియ బాగా జరిగేలా షట్క్రియా విధానం మేలు చేస్తుంది. జలినేతి విధానంలో కాచి చల్చార్చిన గోరువెచ్చని నీరు, ఉప్పు వాడాలి.
 
యోగనిద్రతో నిద్రలేమికి చెక్...
‘రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగులు శవాసనం, యోగ నిద్ర ద్వారా నిద్రలేమిని అధిగమించొచ్చు. కేవలం 15 నిమిషాలు పాటు ఈ యోగ చేస్తే రెండు గంటల నిద్రతో సమానం. బాడీ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. హర్మోన్స్ చక్కగా పనిచేస్తాయ’ని సుమన వివరించారు. పని ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాణయామ చేస్తే సరిపోతుంది. జాబ్ చేస్తూనే ఇది ఎప్పుడైనా చేయవచ్చు. చాలా మంది సిటీవాసుల వెంటబడుతున్న ఒబేసిటీని కపాలాభాతి ద్వారా
 
నియంత్రించొచ్చు. పొట్టను లోపలికి లాగి గాలిని
త్వరత్వరగా వదలాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని మలినాలు గాలి ద్వారా బయటకు వస్తాయి. మామూలు ఫుడ్ తీసుకున్న గంట తర్వాత, భోజనం చేస్తే నాలుగు గంటల తర్వాత ఈ కపాలాభాతి చేయాలి. కనీసం ఐదు నిమిషాలు పాటు చేయాలి. అలాగే ఒకే కుర్చీలో నిరంతరాయంగా కూర్చొని ఉండటం, నిటారుగా కూర్చకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. కటి చక్రాసనం, అర్ధ చక్రాసనం, అర్ధకటి చక్రసనం చేయడం ద్వారా ఈ నొప్పిని నియంత్రించొచ్చు.
 
బద్ధకోణాసనంతో నార్మల్ డెలివరీ..
అమ్మాయిలు గర్భవతిగా ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మంచి ఫుడ్‌తో పాటు నార్మల్ డెలివరీ అయ్యేందుకు బద్ధకోణాసనం, ఉపవిష్టకోణాసనం, పశ్చిమోత్తనా సనం వేయాలి. తాడాసనంతో మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. సిటీవాసులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను యోగా థెరపీతో నియంత్రించవచ్చు’ అని సుమన వివరించారు.
  వాంకె శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement