కేరళ పంచకర్మ చికిత్సతో వెన్నునొప్పి మాయం
వెన్నునొప్పి ప్రాణాలేమీ తీయకపోవచ్చు కానీ, శరీరాన్ని ఎందుకూ పనికిరానంత నిర్జీవంగా మార్చేస్తుంది. దీనికి పెయిన్ కిల్లర్స్, సర్జరీ, బెడ్‌రెస్ట్, ఫిజియోథెరపీ శాశ్వత పరిష్కారం కాదు. ఆయుర్వేదంలో సూచించిన కేరళ పంచకర్మ, మర్మ చికిత్సల ద్వారా వెన్ను నొప్పికున్న మూల కారణాలను శాశ్వతంగా శరీరం నుంచి బయటకు పంపవచ్చు. అంతే కాకుండా వెన్నెముకని ఉక్కు స్తంభంలా మారుస్తుందంటున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్
పి.కృష్ణప్రసాద్.
భవనానికి పిల్లర్స్ ఏవిధంగా బలాన్నిస్తాయో, అదేవిధంగా మానవుని శరీరానికి వెన్నెముక మూల స్తంభం. అలాంటి వెన్నెముకలో ఏ సమస్య వచ్చినా శరీరమంతా ప్రభావం చూపుతుంది. వెన్ను సమస్యలకు శాశ్వత పరిష్కారం ఒక్క ఆయుర్వేద చికిత్సలోనే ఉంది.
వెన్నెముక వర్సెస్ పవర్‌హౌస్
వెన్నెముక పవర్ హౌస్ లాంటిది. ఇది కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడను స్థిరంగా నిలబడేలా చేస్తుంది. వివిధ కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్‌హౌస్ శక్తిహీనంగా మారుతుంది. సరైన సమయంలో వైద్య చికిత్సలేవీ అందకపోతే భుజం నొప్పులు, మెడ నొప్పులు, కళ్ల నొప్పులు మొదలౌతాయి. వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీన పడినట్లు, చురకలు, పోట్లు, మంటలు మొదలౌతాయి. ఎవరికైనా వెన్నుపాములోని డిస్క్‌లు, నరాలు ఒత్తిడికి గురైతే.. కాళ్లు, చేతులు పక్షవాతానికి కూడా తలెత్తవచ్చు.
సర్జరీతో ఒరిగేది శూన్యం...
వెన్నునొప్పితో వెళితే వైద్యులు మొట్టమొదటగా సూచించేది పెయిన్ కిల్లర్లే. అవి వాడితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది గానీ, అందుకు గల కారణాలను మాత్రం తగ్గించలేదు. సర్జరీ చేయించుకొంటే.. పెద్ద మొత్తంలో ఖర్చు అవడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం శూన్యం. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందా అంటే.. చెప్పలేం. ఆ తరువాత మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు.
ఆయుర్వేదం ఏం చేస్తుంది..?
ముందుగా వెన్ను నొప్పి రావడానికి గల మూల కారణాన్ని సమూలంగా ఆయుర్వేదం కనిబెడుతుంది. అస్థిధాతుక్షయం, మార్గావరోధాల వల్లే శరీరంలో వాతం పెరుగుతుంది. ఆ వాతమే వెన్ను నొప్పికి, కాలంతా పాకే సయాటికా నొప్పికి మూలం అవుతుంది. చికిత్స క్రమంలో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరాలను సమస్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం. అదే సమయంలో నరాల వ్యవస్థను కూడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నొప్పిని తగ్గించడమే కాదు.. మరోసారి ఆ నొప్పి రాకుండా చేస్తాయి. ఈ విధానంలో మర్మ, పంచకర్మ చికిత్సల ద్వారా వెన్నునొప్పికి మూలకారణాన్ని కనుగొని ఆ నొప్పిని సమూలంగా తగ్గించి వేస్తుంది. కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సల ద్వారా మీ వెన్నెముకను కాపాడుకోండి. అది జీవితాంతం మిమ్మల్ని కాపాడుతుంది.
అడ్రస్
శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్
బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నం.17, హైదరాబాద్, వివరాలకు:
డా॥పి.కృష్ణ ప్రసాద్. 9030013688/ 9440213688/ 040- 65986352
E mail: krishnaprasad.6600@gmail.com