
గర్భం దాల్చినపుడు వ్యాయామాలు చేస్తూ,యోగాసనాలు వేస్తూ (నిపుణుల సలహాతో) సహజ ప్రసవం కోసం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. సెలబ్రిటీల దగ్గరనుంచి సామాన్యుల దాకా దీనిపై అవగాహన పెంచుకుంటున్నారు. తాజాగా నటి సొన్నల్లి సెగల్ ఏకంగా శీర్షాసనాలు వేస్తూ మరో అడుగు ముందుకేసింది.
సొన్నల్లి సెగల్ మరికొన్ని రోజుల్లో మాతృత్వాన్ని రుచి చూడబోతోంది. ఇంతలో గర్భధారణ మధురిమలను ఆస్వాదిస్తోంది. సోషల్‌మీడియాలో ఫోటోలతో ఫ్యాన్స్ ఆకట్టుకోవడంలో సొన్నల్లి ముందుంటుంది. తాజాగా తన ప్రెగ్నెన్సీలో ప్రతిదశను షేర్ చేస్తూ, ఫిట్‌నెస్‌పైన తన ఆసక్తిని తెలియజేస్తోంది. ఇటీవల, సొన్నల్లి తన భర్త అశేష్ ఎల్ సజ్నానీతో కలిసి స్విట్జర్లాండ్‌లోని ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలలో రిలాక్సింగ్ బేబీమూన్‌ను ఆస్వాదించింది.
తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, అంత్యంత క్లిష్టమైన శిర్షాసనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. అత్యంత జాగ్రత్తగా ,నిపుణుల పర్యవేక్షణలో దీన్ని సాధన చేసింది. సంవత్సరాల నుండి యోగాభ్యాసంలో తలకిందులుగా వేసే ఆసనాలు ఇవి ఒక భాగం. అయితే గర్భం దాల్చినప్పుడు దీన్ని కొనసాగించగలనా? లేదా? అని భయపడ్డాను. కానీ యోగా గురువు, వైద్యుల సలహా మేరకు దీన్ని కొనసాగించగలను అని నిర్ధారించుకున్నాను.
గర్భధారణకు ముందు ఎలాంటి ఆసనాలు వేసానో అవి చేయొచ్చని తనకు అర్థమైంది అంటూ ఆసనాలపై తనకున్న ప్రేమను వ్లెలడించింది. గర్భధారణ సమయంలో దీని వల్ల అపారమైన ప్రయోజనాలుంటాయని కూడా పేర్కొంది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ గర్బంతో ఉన్నపుడు వీటిని మొదలు పెట్టకూడదని స్పష్టం చేసింది.
ఇలాంటి యోగాలసనాలతో ప్రసవ సమయంలో బేబీకి పెల్విస్ మరింత విశాల మవుతుందట. నాడీ వ్యవస్థ శాంతపర్చి, పాదాల వాపును తగ్గించడం, తిరిగి వచ్చే రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం లాంటి అనే ప్రయోజనాలు ఉన్నాయని తెలిపింది.
కాగా సొన్నాల్లి సెగల్ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. యోగాతో పాటు, జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేయడం ఆమెకు అలవాటు. ఈక్రమంలో గతంలో గర్భంలో ఉన్నపుడే యోని ముద్ర అనే యోగా ఆసనం చేస్తున్న వీడియోను షేర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment