నమ్రతా భారీ వర్కౌట్స్‌ చూస్తే షాక్‌, ఫ్యాన్స్‌ ఫిదా! | Hero Mahesh wife Namrata Shirodkar heavy workouts at gym fans loves | Sakshi
Sakshi News home page

నమ్రతా భారీ వర్కౌట్స్‌ చూస్తే షాక్‌, ఫ్యాన్స్‌ ఫిదా!

Published Thu, May 16 2024 7:34 PM | Last Updated on Thu, May 16 2024 8:53 PM

Hero Mahesh wife Namrata Shirodkar heavy workouts at gym fans loves

టాలీవుడ్‌లో పరిచయం అవసరంలేని  అందమైన జంట   ప్రిన్స్‌ మహేష్‌  బాబు,  నటి నమ్రతా శిరోద్కర్‌ది. పెళ్లి తరువాత నటనకు  గుడ్‌ బై  చెప్పి నమ్రత  కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది.  వీరి ముద్దుల తనయ  సితార నటిగా, మోడల్‌గా ఇప్పటికే తన హవాను చాటుకుంటోంది. అయితే తాజాగా నమ్రత వర్కౌవుట్‌ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది. దీంతో వదినమ్మ ఎందుకింత కసరత్తు చేస్తోందంటూ   ఫ్యాన్స్‌ చేస్తున్న ఊహాగానాలు వైరల్‌గా మారాయి.

2004 నుండి పెద్ద స్క్రీన్‌కు దూరంగా ఉన్నారు నమ్రత. అయితే సోషల్‌ మీడియా అభిమానులకు అప్‌డేట్స్‌ మాత్రం అస్సలు మర్చిపోదు. భర్త , సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, పిల్లలు సితార  గౌతమ్‌  గురించి  తరచుగా పోస్ట్‌ చేస్తుంది. తాజాగా మాజీ మిస్‌ ఇండియా ఇటీవల ఒక రీల్‌ను షేర్‌ చేసింది.  ఆమె భారీ వర్కౌట్‌ సెషన్‌  చూసి అభిమానులు తెగ  ఫిదా అవుతున్నారు.

ఫిట్‌నెస్‌ కోసం ఆమె చేస్తున్న పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ‘‘బలమైన మహిళ!!’’  ‘‘సూపర్‌ వుమన్‌’’, , ‘‘వావ్‌’’, ‘‘బ్యూటిఫుల్‌’’ , ‘‘సూపర్‌ మామ్‌’’ అంటూ  కమెంట్‌ చేశారు.

 కాగా నమ్రతా గతంలో వివిధ సందర్భాలలో వర్కౌట్‌ వీడియోలను షేర్‌ చేసింది. గత ఏడాది మేలో, ట్రైనర్‌ కుమార్‌ మన్నవతో కలిసి హార్డ్‌కోర్‌ వ్యాయామాలు చేస్తున్న వీడియోను పోస్ట్‌  చేయడంతో ఆమె మళ్ళీ నటించనుందనే ఊహాగానాలకు దారితీసిన సంగతి తెలిసిందే. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement