Socialmedia
-
బంగ్లాదేశ్ సోషల్‌మీడియా పోస్టుపై భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీ:ఇటీవల భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సన్నిహితుడు మహఫుజ్ ఆలం సోషల్ మీడియా వేదికగా ఇటీవల భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.‘బంగ్లాదేశ్ ప్రభుత్వం వద్ద మేం ఈ విషయాన్ని లేవనెత్తాం. ఆలం పోస్టును తర్వాత తొలగించారు. బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బంగ్లా ప్రజలు, తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత్ ఆసక్తితో ఉన్నప్పటికీ ఇలాంటి చర్యలు నిరాశ కలిగిస్తున్నాయి’ అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత్‌లోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలంటూ ఆలం కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్లో పోస్టు పెట్టి కొన్ని రోజుల తర్వాత తొలగించాడు.బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు..2200 కేసులు కాగా, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్కడ హిందువులపై దాడులకు సంబంధించి ఏకంగా 2200 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. షేక్‌హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత హిందువులపై దాడులు పెరిగిన విషయం తెలిసిందే. -
నాగ చైతన్య- శోభిత మాంగల్యం తంతునానేనా ఫోటోలు
-
ఈజీగా విదేశీ భాష, క్రేజీగా కొరియన్ నేర్చుకుందామా!
విదేశీ భాషని అధ్యయనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మన రెస్యూమ్‌ను బలోపేతం చేయడంతో పాటు పర్యాటక రంగంలో, గైడ్స్‌గా ఇతరత్రా రంగాల్లో రాణించడానికి, ట్రావెల్, బ్లాగులను తయారు చేయడం తదితర ఎన్నో రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిస్తోంది. అంతేకాకుండా ప్రపంచం నలుమూలలకూ కమ్యూనికేట్ చేయగలిగేలా చేస్తుంది. విదేశీ విశ్వవిద్యాలయలో ప్రవేశాలకు కూడా ఉపయుక్తం అవుతున్నాయి.. ప్రస్తుతం వర్క్ కల్చర్, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు మారడంతో విదేశీ భాషా నైపుణ్యాలతో ఫ్రీలాన్సర్‌గా అవకాశాలు పెరిగాయి. ఓటీటీ తదితర వేదికల విజృంభణతో అనువాదకులకు భారీగా డిమాండ్ పెరగడం కూడా విదేశీ భాషలను క్రేజీగా మార్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలతో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు దేశ విదేశాలలో రాయబార కార్యాలయాలు, హై–కమిషన్లలో విదేశీ భాషా ఉపాధ్యాయులుగా కొనసాగడానికి వీలైన కోర్సులకు డిమాండ్ సంతరించుకుంటున్నాయి. డిమాండ్‌లో ఫ్రెంచ్.. క్రేజీగా కొరియన్.. కొత్త భాషలు నేర్చుకోవడం కొన్నేళ్ల క్రితం వరకూ కేవలం హాబీగా భావించేవారు. అయితే, ప్రపంచీకరణతో విదేశీ భాషా నైపుణ్యం ఆదాయమార్గంగా కూడా అవతరించింది. దీంతో వయసుతో సంబంధం లేకుండా నగరవాసుల్లోనూ విదేశీ భాషలపై ఆసక్తి పెరుగుతోంది. సంపాదన కోసమో, మరేదైనా లక్ష్యాలతోనో సీరియస్‌గా ఫారిన్ లాంగ్వేజెస్‌కు జై కొడుతున్నారు. ప్రస్తుతం ఫ్రెంచి, రష్యన్, స్పానిష్, చైనీస్ అరబిక్ వంటి అనేక విదేశీ భాషలు బాగా డిమాండ్‌లో ఉన్నాయి. ఇటీవలే కొరియన్ వెబ్‌సిరీస్, మ్యూజిక్కూ పెరిగిన ఆదరణ కొరియన్ భాషా పరిజ్ఞానంపై యువత ఆసక్తిని పెంచింది. – సాక్షి, హైదరాబాద్ఈ నేపథ్యంలో విదేశీ భాష నేర్చుకోవడంలో సహాయపడే అనేక అకాడమీలు, సంస్థలు నగరంలో వెలుస్తున్నాయి. ఆయా భాషల కోర్సు వ్యవధి సాధారణంగా ఆరు నుంచి 12 నెలల్లో పూర్తి చేసి ప్రొఫెషనల్ డిగ్రీని అందుకుంటారు. అయితే అనర్గళంగా మాట్లాడడం, చదవడం, రాయడం అర్థం చేసుకోవడంపై పూర్తి పట్టు సాధించేందుకు మరింత వ్య«వధి అవసరం అవుతుందని శిక్షకులు అంటున్నారు. ఇవి కాకుండా ఒక విద్యార్థి ఆ భాష చరిత్ర, భాష సంస్కృతి సంబంధిత దేశాల ప్రజలు, అర్థం చేసుకునే పద్దతి, ఆ భాష యాస, డిక్షన్ గురించి కూడా నేర్చుకుంటేనే పూర్తి అవగాహన వస్తుందని సూచిస్తున్నారు. విద్యార్థులు పదో తరగతి తర్వాత సరి్టఫికెట్ డిప్లొమా స్థాయి కోర్సు లేదా పన్నెండో తరగతి పూర్తి చేసిన తర్వాత విదేశీ భాషలో డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును అభ్యసించవచ్చు. నగరంలో ఇంగ్లిష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ, హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయాలు వంటివి విదేశీ భాషల్లో సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. అలాగే పలు ఆన్లైన్ లెరి్నంగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విదేశీ భాషా కోర్సులను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. స్పానిష్ జోష్.. దాదాపు 50 కోట్ల మందికి పైగా మాట్లాడే వారితో స్పానిష్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడే భాషలలో రెండో స్థానంలో ఉంది. స్పానిష్ మాట్లాడే దేశాలతో మన దేశానికి ఇటీవల పెరుగుతున్న వాణిజ్యం దృష్ట్యా నేర్చుకోవడానికి అత్యధికులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకించి అంతర్జాతీయ వ్యాపారం, ఆతిథ్యం పర్యాటక రంగంలో ఆసక్తి ఉన్న వారికి ఇది బెస్ట్. ఫ్రెంచ్ పట్ల ఆసక్తి.. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది పైగా మాట్లాడే ఫ్రెంచ్ అత్యధికంగా మాట్లాడే భాషగా ఆరో స్థానంలో ఉంది. ఇది ఫ్రాన్స్, కెనడాతో సహా 29 దేశాల్లో అధికారిక భాష. ఫ్యాషన్, హాస్పిటాలిటీ, టూరిజంలో కెరీర్‌కు ఉపకరించే ఫ్రెంచ్ నేర్చుకోవడానికి విశ్వవ్యాప్తంగా విలువైన భాష. విన్.. జపాన్.. సాంకేతిక హబ్ హోదా, భారతదేశంతో బలమైన వాణిజ్య సంబంధాలు కలిగిన జపాన్ జపనీస్ అత్యధికులు కోరుకునే భాషగా మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల మందికి పైగా మాట్లాడే ఈ భాష సాంకేతికత, యానిమేషన్, గేమింగ్‌లో కెరీర్‌ను ఎంచుకున్న సిటీ యూత్ ఎంపికగా మారింది. మాండరిన్.. మంచిదే.. మనదేశపు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా చైనాను దృష్టిలో ఉంచుకుంటే.. అంతర్జాతీయ వ్యాపారం, దౌత్యం పర్యాటక రంగం కోసం మాండరిన్ నేర్చుకోవడం అవసరంగా మారింది. కో అంటే కొరియన్.. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల మందికి పైగా మాట్లాడే కొరియన్‌కు నగరంలో బాగా డిమాండ్ ఉంది. ఆసియాలో మనదేశానికి మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కొరియా కావడం సాంకేతిక, వినోద పర్యాటక రంగాల్లో ఈ భాషా నైపుణ్యానికి డిమాండ్ పెంచుతోంది.జర్మన్‌కు జై.. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా, యూరోపియన్ యూనియన్‌లో అత్యధికంగా మాట్లాడే భాష జర్మన్. జర్మన్ నేర్చుకోవడం ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో విభిన్న అవకాశాలకు తలుపులు తెరుస్తోంది. ఇదీ..ఇటాలియన్..యూరోపియన్ యూనియన్‌లో అత్యధికంగా మాట్లాడే నాల్గో భాష ఇది. పర్యాటక కేంద్రంగా మరియు ఫ్యాషన్ మరియు డిజైన్‌కు కేంద్రంగా ఇటలీకి ఉన్న ప్రాచుర్యంతో ఫ్యాషన్, డిజైన్, హాస్పిటాలిటీలో కెరీర్‌ను లక్ష్యంగా చేసుకున్న సిటీ విద్యార్థులకు రైట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. గ్రేస్.. పోర్చుగీస్..బ్రెజిల్ పోర్చుగల్‌తో సహా ఎనిమిది దేశాల్లో మాట్లాడేది పోర్చుగీస్. ఈ దేశాలతో మనకు విస్తరిస్తున్న సంబంధాల కారణంగా పోర్చుగీస్ భాషలో ప్రావీణ్యం అనేది భవిష్యత్తు విజయాలకు బాట వేస్తుంది.పలు భాషల్లో ప్రావీణ్యం కోసం.. విదేశీ భాషా పరిజ్ఞానం వల్ల ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో ప్రయోజనాలను యువత ఆశిస్తున్నారు. గతంలో పదుల సంఖ్యలో మాత్రమే విద్యార్థులు కనిపించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వందలకు చేరింది. కెనడాలో ఉండే భారతీయులు కూడా ఆన్లైన్ ద్వారా మాకు స్టూడెంట్స్‌గా ఉన్నారు. నేర్చుకోవడం అనేది ఇలా సులభంగా మారడం కూడా విదేశీ భాషల పట్ల ఆసక్తిని పెంచుతోంది. – ఎం.వినయ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫ్రెంచ్ భాషా విభాగం, ఉస్మానియా వర్సిటీ -
నమ్రతా భారీ వర్కౌట్స్ చూస్తే షాక్, ఫ్యాన్స్ ఫిదా!
టాలీవుడ్లో పరిచయం అవసరంలేని అందమైన జంట ప్రిన్స్ మహేష్ బాబు, నటి నమ్రతా శిరోద్కర్ది. పెళ్లి తరువాత నటనకు గుడ్ బై చెప్పి నమ్రత కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది. వీరి ముద్దుల తనయ సితార నటిగా, మోడల్‌గా ఇప్పటికే తన హవాను చాటుకుంటోంది. అయితే తాజాగా నమ్రత వర్కౌవుట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. దీంతో వదినమ్మ ఎందుకింత కసరత్తు చేస్తోందంటూ ఫ్యాన్స్ చేస్తున్న ఊహాగానాలు వైరల్‌గా మారాయి.2004 నుండి పెద్ద స్క్రీన్కు దూరంగా ఉన్నారు నమ్రత. అయితే సోషల్ మీడియా అభిమానులకు అప్డేట్స్ మాత్రం అస్సలు మర్చిపోదు. భర్త , సూపర్ స్టార్ మహేష్ బాబు, పిల్లలు సితార గౌతమ్ గురించి తరచుగా పోస్ట్ చేస్తుంది. తాజాగా మాజీ మిస్ ఇండియా ఇటీవల ఒక రీల్‌ను షేర్ చేసింది. ఆమె భారీ వర్కౌట్ సెషన్ చూసి అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు.ఫిట్నెస్ కోసం ఆమె చేస్తున్న పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ‘‘బలమైన మహిళ!!’’ ‘‘సూపర్ వుమన్’’, , ‘‘వావ్’’, ‘‘బ్యూటిఫుల్’’ , ‘‘సూపర్ మామ్’’ అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) కాగా నమ్రతా గతంలో వివిధ సందర్భాలలో వర్కౌట్ వీడియోలను షేర్ చేసింది. గత ఏడాది మేలో, ట్రైనర్ కుమార్ మన్నవతో కలిసి హార్డ్‌కోర్ వ్యాయామాలు చేస్తున్న వీడియోను పోస్ట్ చేయడంతో ఆమె మళ్ళీ నటించనుందనే ఊహాగానాలకు దారితీసిన సంగతి తెలిసిందే. -
యూట్యూబర్ క్రేజీ స్టంట్: ఏడు రోజులు సజీవ సమాధి, చివరికి...!
పాపులారిటీ కోసం, డేర్‌డెవిల్ అని నిరూపించుకునేందుకు ఏమైనా చేయడానికి యూట్యూబర్లు ఏమాత్రం తగ్గడం లేదు. 'కిల్ బిల్'లో ఉమా థుర్మాన్ పాత్ర తరహాలో తాజాగా ఒక పాపులర్ యూట్యూబర్ ఒళ్లు గగుర్పొడిచే సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా ఏడు రోజులపాటు తనను సజీవ సమాధి చేసుకున్నాడు. అవును మీరు చదివింది నిజమే. వెన్నులో వణుకు పుట్టించే ఈ స్టంట్‌కోసం ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నాడు. రెండు రోజుల్లోనే ఈ వీడియో 64 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం. వివరాలను పరిశీలిస్తే బీస్ట్‌గా పాపులర్ అయిన జిమ్మీ డొనాల్డ్సన్ ఈ క్రేజీ స్టండ్ చేశాడు. ఏడు రోజులపాటు శవపేటిక లాంటి డబ్బాలో భూగర్భంలో ఉండిపోయాడు. తన 212 మిలియన్ల యూట్యూబ్ సబ్స్క్రైబర్లను ఫిదా చేయాలనే ఆలోచనతోనే ఈ స్టంట్ చేశాడు. చివరికి అదో మానసిక వేదనరా బాబు ఇలా చేయకండి అంటూ తన ఫోలవర్లకు సూచించాడు. ఈ ఫీట్‌కు తన స్నేహితులతో కలిసి ఎక్స్‌కవేటర్‌ని ఉపయోగించి శవపేటిక పైన 20వేల పౌండ్ల మట్టిని పోయించాడు. "రాబోయే ఏడు రోజులు నా జీవితాన్ని ఈ శవపేటికకు అప్పగిస్తున్నాను." అంటూ లోపలికి వెళ్లాడు. అయితే పైన ఉన్న తన టీంతో కమ్యూనికేట్ చేయడానికి వాకీ-టాకీని ఉపయోగించాడు. ఎన్ని చేసినా ఏడు రోజుల పాటు అలా ఉండటం అంటే మాటలా. చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పనైంది. చాలా నీరసించిపోయాడు. కాళ్లలో రక్తం గడ్డకట్టి, నిలబడలేకపోయాడు. అదృష్టవశాత్తూ ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ ఎదురు కాలేదు. 2021లో 50 గంటల పాటు సజీవంగా సమాధి అయ్యి రికార్డు కొట్టాలని ప్రయత్నించాడు.2012 నుండి యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, 2018లో బీస్ట్ బాగా పాపులర్ అయ్యాడు. అనేక విన్యాసాలు చేయడంతో పాటు, డొనాల్డ్సన్ వివాదాస్పదమైన దాతృత్వ చర్యలతో వార్తల్లో నిలిచాడు. 5లక్షల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ఆఫ్రికా అంతటా 100 బావుల నిర్మాణం పేరుతో డబ్బులు వసూలు చేయడం విమర్శలకు తావిచ్చింది. దీనికి సంబంధించినవ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేశాడు.పారదర్శకమైన శవపేటికలో వీడియోను రికార్డ్ చేయడానికి కెమెరాలు సహా అవసరమైన వస్తువులతో బీస్ట్‌ని నెమ్మదిగా భూమిలోకి దిపుతారు. ఈ సందర్బంగా ఒక్కోసారి బీస్ట్ భావోద్వేగానికి లోనయ్యాడు. బాత్రూమ్, సహా తన దినచర్య వివరాలనుషేర్ చేశాడు. వీడియో చివరలో ఏడు రోజుల తరువాత సూర్యుడిని చూస్తున్నా..ఈ అనుభవాన్ని వర్ణించలేను అనడంతో వీడియో ముగుస్తుంది. -
సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలన్నా సీఎం జగన్
-
మంత్రి ఉచిత చక్కెరకు మహిళ తిరస్కారం
సాక్షి, యశవంతపుర: ఏదైనా ఉచితంగా ఇస్తామంటే ఎవరైనా ఎగబడతారు, పైగా తమకు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలని బతిమాలతారు. కానీ బాగలకోట జిల్లా బీళగిలో మంత్రి మురుగేశ్ నిరాణి అనుచరులు ఉచితంగా పంచిన చక్కెరను ఒక మహిళ ఇంటి బయట పడేసింది. ఈ వీడియో సోషల్ వీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి మద్దతుదారులు బీళగిలో ఇంటింటికీ ఉచితంగా కొంత పంచదారను పంచారు. కార్యకర్తలు ప్యాకెట్లను ఆమె ఇంట్లోకి తీసుకెళ్లి ఇవ్వగా, వద్దని తిరస్కరించింది. లేదు, తీసుకోవాల్సిందేనని వాటిని ఇంట్లో పెట్టి వెళ్లిపోయారు. ఆమె ప్యాకెట్లను తీసి ఇంటి బయట పడేసింది. ఆమె నిజాయితీని చూసిన నెటిజన్లు అభినందించారు. ఈ వీడియోను యల్లప్ప హెగ్డే అనే సామాజిక కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (చదవండి: పెళ్లికి వెళ్లి వస్తూ మృత్యు ఒడికి.. ) -
సోషల్ మీడియా ఫిర్యాదుల పరిష్కారం: కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ వేదికలు ఫిర్యాదులను తగిన విధంగా పరిష్కరించడం లేదని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అ న్నారు. ఐటీ నిబంధనలను సవరించే ముసాయిదా నోటిఫికేషన్‌పై భాగస్వాములతో మంత్రి చర్చ నిర్వహించారు. సవరించిన నిబంధనల కింద ప్రభు త్వం గ్రీవెన్స్ ప్యానెల్‌ను ప్రతిపాదించడం గమనార్హం. ‘‘గ్రీవెన్స్ ఆఫీసర్, జవాబుదారీకి చోటు కలి్పంచాం. 2021 ఫిబ్రవరికి ముందు ఇది లేదు. సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫామ్‌లు గ్రీవెన్స్ ఆఫీసర్లను ని యమిస్తున్నాయి. కానీ, నిజమైన ఫిర్యాదుల పరిష్కారం ఉండడం లేదు. దీన్ని పరిష్కరించాల్సి ఉంది’’అని మంత్రి చెప్పారు. భారత చట్టాల పరిధిలో నిబంధనల ఉల్లంఘనపై వచ్చే ఫిర్యా దులకు సామాజిక మాధ్యమ వేదికలు సరిగ్గా స్పందించాలని సూచించారు. అలాగే, వివక్ష చూపించకూడదని, మాట్లాడే స్వేచ్ఛ, గోప్యత, పౌరుల హక్కులకు వ్యతిరేకంగా పనిచేయరాదని సూచించారు. ప్రభుత్వం ఇటీవలే గ్రీవెన్స్ అప్పీలేట్ బాడీని ప్రతిపాదించడం తెలిసిందే. యూజర్లు సోషల్ మీడియా సంస్థల గ్రీవెన్స్ ఆఫీసర్లు తీసుకున్న నిర్ణయాలను ఇక్కడ అప్పీల్ చేసుకోవచ్చు. -
అవాక్కయేలా చేద్దాం అనుకుంటే అరెస్ట్ అయ్యాడు!
సోషల్ మీడియోలో ఫేమస్ అవ్వడం కోసం ఇటీవల చాలా విన్నూతనమైన రీతిలో వీడియోలు చేసి పెడుతుంటారు. అలాంటి ఒక్కోసారి వినోదంగానే కాక విషాదమైన ఉదంతాలు ఉన్నాయి. అలాగే మరికొన్ని పనులు మన ఊహకు కూడా అందకుండా కటకటాల పాలు చేస్తాయి. అట్లాంటి సంఘటనే ఒక దేశంలో జరిగింది. (చదవండి: ఎర్త్‌షాట్ ప్రైజ్ గెలుచుకున్న భారత్) ఇక్కడొక వ్యకి ఒక దుకాణం దగ్గర కెళ్లి కొన్ని వస్తువులు కొనుగోలు చేసి నేరుగా తన స్నేహితుడి కారు వద్దకు వస్తూ షర్ట్లోంచి ఒక తుపాకీ తీసి రకరకాలుగా ప్రదర్శిస్తాడు. ఆ తర్వాత కొన్ని డబ్బులు జేబులోంచి తీసి వాటిని రోడ్డుపై ఒక్కొక్కొటిగా విసిరుతాడు. అంతే ఒక్కసారిగా పోలీసులు వచ్చి గన్లు పట్టుకుని చుట్టుముట్టేస్తారు. వెంటనే అతను చేతులు పైకెత్తి లొంగిపోవడం తదనంతరం పోలీస్ అధికారి వచ్చి సంకెళ్లు వేయడం అంతా చకచకా జరిగిపోతాయి. అచ్చం సినిమాలోని సీన్ల మాదిరిగా వెంటవెంటనే జరిగిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు వినోదం కాస్త వికటించడం అంటే ఇదేనేమో అంటూ రకరకాలుగా ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: 9 గంటల్లో 51 పబ్‌లు చుట్టి.. ప్రతీ పబ్‌లోనూ డ్రింక్ తీసుకుని) View this post on Instagram A post shared by Say Cheese TV 👄🧀 (@saycheesetv) -
లవర్స్‌కు షాకిచ్చిన ఇందిరా పార్క్: వెనక్కి తగ్గిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్‌లో ప్రముఖ పార్క్‌లోకి పెళ్లికాని జంటలను నిషేధించే ఉత్తర్వుల బోర్డు కలకలం సృష్టించింది. ‘‘పెళ్లి కాని జంటలకు పార్కులోనికి ప్రవేశం లేదు” అంటూ తాజాగా ఇందిరా పార్కు యాజమాన్యం ఒక బోర్డు పెట్టింది. పార్క్ మేనేజ్మెంట్ కొత్త మోరల్ పోలీసింగ్ వ్యవహారం దుమారాన్ని రేపింది. పరోక్షంగా ప్రేమికులకు ప్రవేశం లేదన్నట్టు హుకుం జారీ చేయడంపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. తాలిబన్లు ఎక్కడో వేరే దేశంలో లేరు, మన చుట్టూనే వున్నారు, కావాలంటే వెళ్లి చూడండి హైదరాబాద్ ఇందిరాపార్క్‌కి అంటూ ఈ నిర్ణయంపై మహిళా ఉద్యమకారులు మండిపడ్డారు. పబ్లిక్ పార్క్ అనేది లింగభేదం లేని జంటలతో సహా చట్టాన్ని గౌరవించే పౌరులందరికీ అనుమతినిచ్చే ప్రదేశం. పార్క్‌లోకి ప్రవేశానికి 'వివాహం' ఎలా ప్రామాణికంగా ఉంటుందంటూ యాక్టివిస్ట్ మీరా సంగమిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి : తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!? ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్క్ అంటే చాలా ఫ్యామస్. ఈ పార్క్‌ను సందర్శించే వారిలో పిల్లలు, ప్రేమికుల సంఖ్య ఎక్కువ. మరీ ముఖ్యంగా మార్నింగ్ వాక్కు వచ్చే వారితో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. అందులోనూ ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన ప్రత్యక అభివృద్ది కార్యక్రమాలతో మరింత సందడి నెలకొంది. అయితే తాజాగా ప్రేమ జంటలకు షాక్ ఇవ్వడంపై భారీ వ్యతిరేకత రావడంతో ఈ బోర్డును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ మరో బోర్డు తగిలించింది. అయితే పార్క్ ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులు క్రమంగా తనిఖీలు నిర్వహిస్తూ తగిన శ్రద్ధ వహించాలని కోరినట్టు తెలిపింది. మరోవైపు ఇందిరా పార్కుతోపాటు, నగరంలోని ఇతర ప్రముఖ పార్కుల్లో కూడా ఇలాంటి ఆదేశాలే అమల్లోకి రానున్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తం కావడవం గమనార్హం. చదవండి : Kabul Airport: వరుస పేలుళ్ల కలకలం, 13 మంది మృతి New low & new level of moral policing by Indira Park Mgmt in Hyd! A public park is an open space for all law abiding citizens, including consenting couples across genders. How can 'marriage' be criteria for entry! @GHMCOnline & @GadwalvijayaTRS this is clearly unconstitutional. pic.twitter.com/4rNWo2RHZE — Meera Sanghamitra (@meeracomposes) August 26, 2021 -
డిజిటల్ మీడియాకు భారీ ఊరట
ముంబై: కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్–2021లో కొన్ని అంశాలపై బాంబే హైకోర్టు శనివారం మధ్యంతర స్టే విధించింది. ఆన్లైన్ ప్రచురణకర్తలంతా నైతిక నియమావళి, ప్రవర్తనా నియమావళి కచ్చితంగా పాటించాలని ఐటీ రూల్స్‌లో పొందుపర్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనలపై న్యాయస్థానం మధ్యంతర స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఐటీ చట్టంలోని క్లాజ్ 9 కింద పేర్కొన్న సబ్ క్లాజెస్ 1 అండ్ 3లపై స్టే విధిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ సబ్‌క్లాజ్‌లు పిటిషనర్ వాక్ స్వాతంత్రపు హక్కును హరిస్తున్నట్లుగా తాము ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నట్లు తెలిపింది. కొత్త ఐటీ రూల్స్‌లోని నిబంధనలను సవాలు చేస్తూ లీగల్ న్యూస్ పోర్టల్ ‘ద లీఫ్లెట్’, జర్నలిస్టు నిఖిల్ వాగ్లే బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది. పిటిషనర్ల వాదనలో ఏకీభవించింది. వివాదాస్పద కొత్త ఐటీ నిబంధనల్లోని సబ్ క్లాజ్‌లపై మధ్యంతర స్టే విధించింది. చదవండి : 53 కోట్లు దాటిన వ్యాక్సినేషన్ -
వార్నీ, వధువును పక్కన పెట్టుకుని నిద్రపోయిన పెళ్లికొడుకు: వైరల్
కరోనా వ్యాప్తి కారణంగా దేశంలో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా పలు వివాహాలు వాయిదా పడ్డాయి. ఇక వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో వివాహాల జోరు మొదలైంది. ఇటీవల ఉత్తరాన జరుగుతున్న వివాహ వేడుకలు ఏదో ఓ సంఘటన మూలాన అవి వార్తల్లోకెక్కుతున్నాయి. ఈ జాబితాలో.. ఓ వధువు స్వీటు తినిపిస్తుంటే వరుడు తినకపోవడంతో ఆమె కోపంతో విసిరి కొట్టగా, మరో ఘటనలో వరుడు గుట్కా నమిలాడని వధువు వివాహాన్నే వద్దనేసింది. ఇక తాజాగా ఓ వరుడు తన పెళ్లి రిసెప్షన్లో ఏకంగా నిద్రపోతూ కెమెరాకు కనిపించి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. భారతీయల వివాహాలంటే ఎన్నో సంప్రదాయాలు, కార్యక్రమాలు, వేడుకలంటూ అబ్బో.. చెప్పాలంటే ఓ పెద్ద జాబితానే ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాలలో పెళ్లిళ్ల కార్యక్రమాలు వింతగా కూడా ఉంటాయ్. పెళ్లికి ముందు జరిగే వేడుకల్లోనూ వధూవరులు పాలుపంచుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ ప్రక్రియలో ఆ కొత్త జంట అలిసిపోతుంటారు. అలా అలసట తీరలేదేమో.. ఓ వరుడు అతని వివాహ వేడుకలోనే రిసెప్షన్ సాగుతుండగానే నిద్రలోకి జారుకున్నాడు. దీన్ని గమనించిన బంధువులు తట్టిలేపినా ఆ పెళ్లి కొడుకు లేవక అలానే గుర్రుగా నిద్రపోతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఓ రేంజ్లో కామెంట్లు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
లాక్డౌన్ వేళ.. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఇది మీ కోసమే..
బెంగళూరు: లాక్డౌన్, కరోనా సమయంలో కోవిడ్‌తో ఇళ్లలో నుంచి బయటికి రాలేక ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారా, అలాగైతే నకిలీ అకౌంట్ల పట్ల జాగ్రత్త వహించండి. కరోనాను పెట్టుబడి చేసుకున్న సైబర్ వంచకులు నకిలీ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లను సృష్టించి ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నారు. తక్కువ ధర అని బురిడీ.. ► బెంగళూరులో ఇన్‌స్టాగ్రాంలో ఓ మహిళకు మొబైల్–డీల్.సేల్ అనే పేజీ కనబడింది. ప్రముఖ కంపెనీల మొబైల్ఫోన్లను తక్కువ ధరకు విక్రయిస్తామని ప్రకటన చూసి అక్కడఉన్న నంబర్‌కు కాల్చేసి వన్‌ప్లస్ మొబైల్ బుక్‌చేసింది. ఇందుకు రూ.14 వేలు చెల్లించింది. రెండురోజులైనా అతీగతీ లేదు. ఆ వెబ్సైట్ పేజీ, ఫోన్‌నంబర్ మాయమయ్యాయి. ► బిడదిలో ఇన్స్టాగ్రాం చూస్తున్న యువతి అక్కడ షాప్‌డ్రాప్స్.ఇన్ అనే వెబ్సైట్ లింక్ చూసి అందులో రూ.4,500 విలువచేసే గృహోపకరణాలను రాయితీ ధరలో రూ.842 కే వస్తాయని తెలిసి ఆర్డర్ చేసింది. పదిరోజులైనా స్పందన లేదు. మోసపోయింది తక్కువ మొత్తమే కదా అని ఆమె ఫిర్యాదు చేయలేదు. వెబ్సైట్లతో మోసమే.. కొందరు డబ్బు తీసుకుని వంచనకు పాల్పడే తాత్కాలిక వెబ్సైట్లు రూపొందిస్తున్నారు. అక్కడ నగదు పోగొట్టుకోవడంతో పాటు వస్తువులు చేతికి అందవు. మరికొన్ని వెబ్సైట్లలో 70 శాతం రాయితీ పేరుతో బ్రాండెడ్ వస్తువులను చూపించి నాసిరకం సామగ్రి పంపిస్తారు. అటువంటి వెబ్సైట్ల వలలో పడకపోవడమే మంచిదని పోలీసులు తెలిపారు. వీటిలో జరిగే లావాదేవీలకు ఎలాంటి భరోసా ఉండదు. డబ్బులు పడగానే వెబ్‌సైట్‌ను డిలిట్ చేసి మరోపేరుతో ఓపెన్ చేసుకుంటారు. ఇప్పుడు డిజిటల్ నేరాలే అధికం.. కరోనా లాక్డౌన్లో హత్యలు, కిడ్నాప్, స్నాచింగ్‌లు వంటి నేరకార్యకలాపాలు తగ్గుముఖం పట్టగా డిజిటల్ క్రైమ్స్ పెరిగాయి. మామూలు రోజులతో పోలిస్తే 41 శాతం సైబర్ నేరాలు పెరిగాయని క్రెడిట్ బ్యూరో ట్రాన్స్ యూనియన్, ట్రస్ట్‌చెకర్ అనే సంస్థల అధ్యయనంలో తెలిపారు. దేశంలో 41 శాతం నేరాలు ఈశాన్యరాష్ట్రాల నుంచి జరుగుతున్నట్లు నివేదికలో వెలుగుచూసింది. బెంగళూరుతో పాటు ముంబై, ఢిల్లీ, చెన్నై పారిశ్రామిక ప్రాంతాల్లో డిజిటల్ నేరాలు అధికం. కేవైసీ అప్డేట్, క్యాష్‌బ్యాక్ ప్రలోభాలు, డిజిటల్ వాలెట్, క్యూఆర్ కోడ్ స్కాన్, లాటరీ, నగదు బదిలీ, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా నేరగాళ్లు ఎక్కువగా వల విసురుతున్నట్లు తేలింది. ఆన్లైన్ షాపింగ్‌కు ప్రముఖ సంస్థల యాప్‌లను ఉపయోగించడం ఉత్తమం. పేరు తెలియని వెబ్సైట్లకు దూరంగా ఉండాలని నిపుణులు తెలిపారు. చదవండి: రాసలీలల సీడీ కేసు: అవును.. ఆమె తెలుసు..! -
అలా కొరక్కే అందరు మనవైపే చూస్తున్నారు
-
ప్లీజ్..!అలా కొరక్కే అందరు మనవైపే చూస్తున్నారు
డుబ్లిన్: విశ్వాసానికి, ప్రేమకు మారుపేరు శునకం. ఇంటా, బయట యజమానికి తోడుగా ఉంటూ తన విశ్వాసాన్ని చాటుకుంటుంది. ఒక్క క్షణం కూడా విడిచి ఉండనంటూ అల్లరి చేస్తుంది. ఐర్లాండ్ ప్రెసిడెంట్ మైఖేల్ డి. హిగ్గిన్స్ కు కుక్కలంటే ప్రాణం. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంటారు. ప్రెసిడెంట్ హోదాలో ఉన్న ఆయనతో భేటీ అయ్యేందుకు ఇతర దేశాధినేతలు వచ్చినా, వారితో చర్చలు జరుపుతున్నా కుక్కల్ని ముద్దు చేస్తుంటారు. తాజాగా మైఖేల్ పెంచుకుంటున్నమిస్నీచ్ అనే కుక్క మీడియా కాన్ఫరెన్స్ లో చేసిన అల్లరి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐర్లాండ్ కు చెందిన ప్రముఖ నటుడు టామ్ హిక్కీకి అనారోగ్య కారణంగా మరణించారు. ఆయన మరణం పట్ల నివాళులర్పించేందుకు మైఖేల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే మీడియా సమావేశం జరుగుతుండగా కుక్క మిస్నీచ్ మైఖేల్ ను తెగ ఇబ్బంది పెట్టింది. నటుడు టామ్ హిక్కీ గురించి, మాట్లాడే సమయంలో ప్రెసిడెంట్ మైఖేల్ చేతిని ప్రేమతో కొరికేందుకు ప్రయత్నించింది. దీంతో మిస్నీచ్ ప్రయత్నానికి అడ్డు చెబుతూ ప్లీజ్ అలా కొరక్కే అందరు చూస్తున్నారంటూ చేతులతో సైగ చేసి ..తన చేతిని పక్కకి తీసుకున్నాడు. మళ్లీ ఆడుకునేందుకు చేయందించాడు.ఈ ఫన్ని ఇన్సిడెంట్ అంతా మీడియా సమావేశంలో జరగ్గా.. ప్రస్తుతం ఆ వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంన్నాయి. -
భర్త చీటింగ్.. పోస్టర్లతో భార్య నిరసన!
లండన్: తన భర్త మోసం చేస్తే ఏ మహిళ అయినా ఏం చేస్తుంది. మొబైల్‌తో మెస్సెజ్ లేదా కాల్ చేసి తన కోపాన్ని తీర్చుకుంటుంది. పెద్దలకు దృష్టికి తీసుకువెళుతుంది. కొన్నిసార్లు సైలెంట్‌గా ఉండి దూరంగా వెళ్ళపోవడమో.. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచడమో చేస్తుంది. అయితే యూకేలోని ఓల్డ్ హోమ్‌కు చెందిన ఒక మహిళ తన భర్త చేసిన మోసానికి వెరైటిగా నిరసన తెలిపింది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఓల్డ్హోమ్కు చెందిన ఓ మహిళకు తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె.. తన భర్త ఫోటోను ఏ4 సైజ్‌లో ప్రింట్ తీయించి గోడలకు అంటించింది. ఆ పోస్టర్ కింద ఇతనొక పెద్ద మోసగాడు అని కూడా రాసింది. చెట్లు, కార్లు వేటిని వదలకుండా అన్నిచోట్ల అతికించి తన కోపాన్ని వెల్లగక్కింది. అంతటితో ఆగకుండా మోసాలకు పాల్పడుతున్న మగాళ్ళను ఉద్దేశించి కూడా మరికొన్ని పోస్టర్లను గోడలకు అతికించింది. ‘మీ భార్యను మోసం చేస్తున్నారా? తొందర్లోనే మీ బండారం బయట పడుతొంది’ అని కామెంట్లు కూడా రాసింది. అయితే భార్యలను ఉద్దేశించి ‘ఈరోజు మీ భర్త మీతోనే ఉన్నాడా? నిన్నరాత్రి? గతవారం కూడా మీతోనే ఉన్నాడా?’ అని రాసి ఉన్న పోస్టర్లను గోడలకు అతికించి ప్రచారం చేసింది. అయితే గుర్తు తెలియని ఈ మహిళ పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో ఎమిలీ అనే మహిళ కూడా తన లవర్ మోసం చేశాడని అతని గది చుట్టూ ఇటువంటి పోస్టర్లను అతికించి నిరసన తెలిపింది. కాగా, 2019లో ఓ యువకుడు ఏకంగా తనను మోసంచేసిన అమ్మాయి ఫోటోను పట్టుకొని రద్దీగా ఉండే వీధిలో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి తనను మోసం చేసిందని రోడ్డుకెక్కాడు. ఆమెకు తను బ్రేకప్ చెప్తున్నాను అంటూ రోడ్డుపైనే ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా! -
రతన్ టాటా ఇన్స్టాగ్రామ్ పోస్ట్.. నెటిజన్లు ఫిదా
ముంబై: ఆన్లైన్లో విద్వేషాలు, బెదిరింపులకు దూరంగా ఉండాలని నెటిజన్లకు పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పిలుపునిచ్చారు. కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు సవాళ్లను ఎదుర్కొంటున్నారని, ఇది ఒకరికి ఒకరు సాయంచేసుకోవాల్సిన సమయమని తెలిపారు. కానీ జనాలు ఆన్లైన్ వేదికగా పరస్పర దూషణలతో మనస్సులు గాయపరుచుకుంటున్నారు అన్నారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ లేఖ పోస్ట్ చేశారు. ‘ఈ ఏడాది ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సవాళ్లతో కూడుకున్నది. నెటిజన్లు తొందరపాటు నిర్ణయాలతో, దురుసుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఒకరిని ఒకరు కిందకు లాగే సమయం కాదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నెగిటివిటికి దూరంగా ఉండటంతో పాటు ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలి' అని పేర్కొన్నారు. ఇది సవాళ్లతో నిండిని సంవత్సరమని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరి పట్ల మరొకరికి దయ, అవగాహన, సహనం అవసరం అని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం అందరం కలసికట్టుగా.. ఏకతాటి పైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అసలు తాను ఆన్లైన్లో గడిపేది చాలా తక్కువ సమయమన్నారు. ద్వేషం, వ్యతిరేకతలను పక్కన పెట్టి, ఇది అందరికీ మంచి చేసే ప్రదేశంగా మారుతుందని రతన్ టాటా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరలవుతోంది. (మరో ఫేక్ న్యూస్ : రతన్ టాటా ఆందోళన) View this post on Instagram 🤍 A post shared by Ratan Tata (@ratantata) on Jun 20, 2020 at 11:40pm PDT -
వాషింగ్ మెషీన్లో దాక్కున్న యువతి
-
‘షూస్‌కి ఓపెనర్ ఏంటిరా బాబు’
సాధారణంగా కూల్‌డ్రింక్, బీర్ సీసాల మూత తీయడానికి ఓపెనర్లు ఉపమోగిస్తాము. అవీ కూడా మార్కెట్లో వివిధ రూపాల్లో లభిస్తాయన్న విషయం తెలిసిందే. కానీ, షూస్ తయారు చేసే ఓ సంస్థ వినూత్నంగా ఓపెనర్లను బూటు మడమ మీద ఏర్పాటు చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ సంస్థ షూస్ మడమ మీద వెండిపూతతో దీన్ని రూపొందించింది. ఈ షూస్‌కి ‘పార్టీ పంప్స్’ అనే పేరును పెట్టింది. దీంతో నెటిజన్లు ఓ రేంజ్లో కామెంట్లు చేస్తున్నారు. ఈ వింత షూపై ప్రముఖ డిజైనర్ మార్క్ జాకబ్స్ ‘తెలివైన ఆలోచన’గా పేర్కొంది. ‘ఎంతో వినూత్నమైన ఆలోచన’అని ఒకరు, ‘పురుషుల ఎంపిక?’ అని మరొకరు ‘షూస్‌కి ఓపెనర్ ఏంటిరా బాబు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. కాగా ఈ షూ ధరను రూ. 98,995 గా నిర్ణయించింది. -
మిత్రులకు, అభిమానులకు గుడ్‌బై..
సాక్షి, చెన్నై: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చెన్నై నుంచి ముంబై వెళ్తూ విమానంలో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. చెన్నైలో తన సొంత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడగా కోల్‌కతా ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ అనంతరం షారుఖ్ ఖాన్ ముంబై బయలు దేరాడు. తిరుగు ప్రయాణంలో కేకేఆర్ జట్టుకు చెందిన టీ షర్ట్ ధరించి ఉన్న తన సెల్ఫీని సోషల్ మీడియాలో పెట్టాడు. ‘ముంబై వెళ్లడానికి తిరుగు ప్రయాణంలో ఉన్నాను. ఈ సెల్ఫీ దిగడానికి ప్రత్యేక కారణాలేమి లేవు. దక్షిణాదిలోని నా సినీ మిత్రులకు, క్రీడా మైదానంలోని క్రికెట్ అభిమానులకు గుడ్‌బై’ అంటూ ఈ ఫోటోకు కామెంట్ పెట్టాడు. అంతేకాకుండా ‘విజిల్ పోడు’ యాష్‌ట్యాగ్ జోడించడం ద్వారా తమిళుల పట్ల తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఫోటోకు సోషల్ మీడియాలో ఏడు లక్షలకు పైగా లైకులు రాగా ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఫర్హా ఖాన్ ‘ఎంతో అందగాడు’ అంటూ ఫోటోపై స్పందించారు. దీనికి ముందు, మ్యాచ్ సందర్భంగా కెమెరాకు చిక్కిన ధోని, షారుఖ్‌ల ఫోటోను చెన్నై సూపర్ కింగ్స్ తన అఫీషియల్ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్తున్న ధోని, స్టాండ్స్‌లో నిలబడి ఉన్న షారుఖ్ పరస్పరం నవ్వుతూ పలకరించుకోవడం కనిపిస్తుంది. -
తప్పక చూడాల్సిందే..
సాక్షి, అమరావతి : చంద్రబాబు ఆనాడు ఎన్టీఆర్కే కాదు.. ఈనాడు రాష్ట్రంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమాకూ వెన్నుపోటు పొడిచారు.. సినిమా విడుదల కాకుండా అడ్డుకున్నారు.. ఆనాడు మీడియా చంద్రబాబు చేతిలో ఉంది.. అందుకే పూర్తి నిజాలు ప్రజలకు చెప్పలేదు.. అయినా ఇప్పుడు సినిమా పొరుగు రాష్ట్రాల్లో విడుదలైంది.. నిజాలు తెలుసుకోకుండా అడ్డుకోలేరు.. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న తాజా కబురు. ఎన్టీరామారావుకు 1995లో చంద్రబాబు వెన్నుపోటు పొడిచి సీఎం పదవి నుంచి తొలగించి ఆయన అధికారం చేజిక్కించుకోవడం ఇతివృత్తంగా రాంగోపాల్‌వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తీశారు. కుట్రతో మరుగు పరిచిన నిజాలను ప్రజలకు చెప్పేందుకు ఈ సినిమా నిర్మించడంతో చంద్రబాబు హడలిపోయారు. ఈ సినిమా రాష్ట్రంలో విడుదల కాకుండా అడ్డుకున్నారు. దీంతో శుక్రవారం తెలంగాణాతోపాటు ఇతర రాష్ట్రాల్లో సినిమా విడుదలైంది. అభిమానులు సరిహద్దు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లకు పరుగులు తీశారు. అనంతరం సినిమా గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులతో వైరల్ చేశారు. ప్రధానంగా కొన్ని సన్నివేశాలు బాగా హైలైట్ అయ్యాయి. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో తాను తోడు కోసం లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకుంటానని ఎన్టీఆర్ చెప్పినప్పుడు చంద్రబాబు అండ్ బ్యాచ్ వ్యతిరేకించడం.. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిలకు వ్యతిరేకంగా ఆనాడు పత్రికల్లో దుష్ప్రచారం చేసేలా ఓ పత్రికాధిపతితో చంద్రబాబు కుట్ర పన్నడం.. ఎన్టీఆర్‌ను పదవి నుంచి తొలగించి వైస్రాయ్ హోటల్ వద్ద ఆయనపై చెప్పులు వేయించడం.. చివరికి ఎన్టీఆర్ చనిపోయాక ఆయన మృతదేహం వద్దకు లక్ష్మీ పార్వతి రాకుండా చంద్రబాబు, బాలకృష్ణ తదితరలు అడ్డుకోవడం.. ఇలా ఈ సినిమాలోని సన్నివేశాలన్నీ వెబ్సైట్లలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలోని సన్నివేశాలు, డైలాగులు, పాత్రధారుల గురించి సినిమా చూసిన వారు ఇతర మిత్రులతో చర్చిస్తున్నారు. చంద్రబాబు ఎంతటి దుర్మార్గానికి పాల్పడ్డారన్నది యువతరానికి బోధపడింది. ‘టీడీపీ అనుకూల మీడియా చంద్రబాబును ఓ పరిపాలనా దక్షుడిగా చూపిస్తూ వచ్చింది.. కానీ ఆయన అసలు స్వరూపం ఏమిటో ఇప్పుడు తెలిసింది’ అని ఓ యువకుడు వ్యాఖ్యానించారు. ‘ఆనాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోవడంలో టీడీపీ మీడియా చంద్రబాబుకు ఎంతగా సహకరించిందో తమకు అర్థమైంది’ అని ఓ యువతి వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు గురించి టీడీపీ అనుకూల మీడియా అంతగా ఎందుకు అబద్ధాలు చెబుతోందన్నది కూడా తెలిసింది’అని ఆమె చెప్పడం గమనార్హం. ఈసారి తాము మోసపోమని, చంద్రబాబును ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎంతటి మోసగాడో ఈ సినిమాలో రామ్‌గోపాల్ వర్మ నేటి తరానికి తెలియజేశారని ఓ రిటైర్డ్ ఉద్యోగి చెప్పారు. ‘సినిమాలో కామెడీ సీన్లు లేవని ఎవరూ అనుకోవద్దు.. బాలకృష్ణ పాత్రధారి చెప్పిన డైలాగులతో కామెడీ బాగా పండింది’ అని ఓ ప్రేక్షకుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ఏపీలో సినిమా రిలీజ్ కాలేదని బాధపడొద్దు ఆంధ్రా బ్రదర్స్.. తెలంగాణాకు రండి.. ఈ సినిమా చూసి చంద్రబాబు నైజం ఏమిటో తెలుసుకోండి..’అని హైదరాబాద్‌వాసి ఒకరు ఆహ్వానం పలికారు. -
టీడీపీ నేతలు చెప్పినట్లు చెలరేగుతున్న పోలీసులు
సాక్షి, గుంటూరు/పట్నంబజారు (గుంటూరు): టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆగమేఘాల మీద కేసులు పెడుతున్నారు. ఏ జిల్లా పోలీసులు.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు.. అన్న కనీస సమాచారం కూడా చెప్పకుండా అరెస్ట్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్ సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా అధికార పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు టీడీపీ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజులుగా గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు నిత్యం ఏదో ఒక జిల్లాకు చెందిన యువకులను అరెస్ట్ చేయడం పరిపాటిగా మారింది. కారణం అడిగితే సోషల్ మీడియాలో సీఎంను కించపరిచేలా పోస్టింగ్‌లు పెట్టారని చెబుతున్నారు. ఏవైనా ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఎవరినైనా అదుపులోకి తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి కుటుంబసభ్యులు, బంధువులకు కనీస సమాచారం ఇవ్వాలన్న ధర్మాన్ని పోలీసులు పాటించడంలేదు. కుటుంబసభ్యులకు చెప్పకుండా యువకులను అరెస్ట్ చేసి తీసుకెళుతున్నారు. దీంతో ఆ యువకుల ఆచూకీ కోసం వారి కుటుంబసభ్యులు, బంధువులు ఒకటి, రెండు రోజులు ఇబ్బందులు పడుతున్నారు. (ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్!) సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో నలుగురిని ఆదివారం అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన వారిలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని పొందూరుకు చెందిన కాలేషావలి, గుంటూరు జిల్లా దాచేపల్లి మండలానికి చెందిన గుదిబండి గోపి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలానికి చెందిన పత్రి నరేశ్, కృష్ణాపురానికి చెందిన పెద్దిరెడ్డి రామకృష్ణ ఉన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే ఈ యువకులపై టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయించారు. అరెస్ట్ చేసిన వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన పత్రి నరేశ్ ఐదో తరగతి వరకు చదివి, గ్రామాల్లో చిలకజోస్యం చెప్పుకొంటూ జీవనం సాగిస్తుంటాడు. అతడికి స్మార్ట్ ఫోన్ కూడా లేకపోవడం గమనార్హం. (డేటా చౌర్యం కేసులో విచారణ వేగవంతం) న్యాయవాదులను హేళన చేసిన పోలీసులు సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై పోస్టులు పెట్టారంటూ కొందరిని అరెస్టు చేసిన గుంటూరు అరండల్‌పేట పోలీసులు ఆదివారం బెయిల్ కోసం వెళ్లిన బాధితుల బంధువులు, న్యాయవాదులతో అనుచితంగా ప్రవర్తించారు. బెయిల్ ఇచ్చేది లేదు.. ఇష్టం వచ్చింది చేసుకోండంటూ హేళనగా మాట్లాడారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ గుంటూరు కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు, పలువురు న్యాయవాదులు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య, సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. వీరిని చూసి రెచ్చిపోయిన పోలీసులు స్టేషన్ ఎదుట నిలబడకూడదంటూ హెచ్చరించారు. న్యాయవాదులతో అరండల్‌పేట ఎస్‌హెచ్‌వో బ్రహ్మయ్య వాగ్వాదానికి దిగారు. పోలూరి మాట్లాడుతూ టీడీపీ నేతల ఆదేశాలతో పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన నేతల రాస్తారోకో తమ పార్టీకి చెందిన పలువురు విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి, టీడీపీ నేత యామిని ఆదేశాల మేరకు తీవ్రంగా కొట్టి గాయపరిచారంటూ జనసేన నేతలు అరండల్‌పేట పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. సోదరి నిశ్చితార్థం ఉందన్నా వినలేదు.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని మా సోదరుడి కుమారుడు కాలేషావలిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం అతడి సోదరి నిశ్చితార్థం ఉందన్నా వినిపించుకోలేదు. మా అమ్మాయి నిశ్చితార్థ కార్యక్రమాలు వదిలేసి మేం ఇప్పుడు స్టేషన్ల వద్ద పడిగాపులు కాస్తున్నాం. గుంటూరు అరండల్‌పేట స్టేషన్‌కు తీసుకెళ్తున్నాం అని చెప్పి స్టేషన్లన్నీ తిప్పారు. దీంతో మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో అని తిరగని స్టేషన్ లేదు. కనీస సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం. – షేక్ మీరావలి, కాలేషావలి బాబాయి -
పూజ చేసి వెలిగించిన అగరుబత్తి కాస్త..
-
కొంపముంచిన అగరుబత్తి; వీడియో వైరల్
బీజింగ్, చైనా : ‘కొండ నాలుకకు మందేస్తే...ఉన్న నాలుక ఊడిపోయనట్ల’యింది ఓ వ్యక్తి పరిస్థితి. కొత్త బీఎమ్‌డబ్ల్యూ కార్ కొన్న ఆ వ్యక్తి దాన్ని పూజ చేసి ప్రారంభిద్దామనుకున్నాడు. అదే అతడి కొంప కాదు కాదు కారును ముంచింది. పూజ చేసి వెలిగించిన అగరుబత్తి కాస్త కారుకు కూడా అంటుకోవడంతో 50 లక్షల రూపాయల విలువ చేసే కొత్త బీఎమ్‌డబ్ల్యూ కారు చూస్తుండగానే మంటల్లో కాలిపోయింది. దీనికి సంబంధిన వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వివరాల ప్రకారం చైనాలోని జింగ్సూ పట్టణానికి చెందిన యాంగ్జు కొత్త బీఎమ్‌డబ్ల్యూ కార్ కొన్నాడు. పూజ చేసి ప్రారంభిద్దామనే ఉద్దేశంతో కారు ముందు ఒక ఎర్ర రంగు వస్త్రం పరిచి, అగరు బత్తులు ముట్టించాడు. అయితే పొరపాటున ఆ వస్త్రం కూడా అంటుకుంది. అంతటితో ఆగక ఆ వస్త్రం కాస్తా వెళ్లి కొత్త బీఎమ్‌డబ్ల్యూ కార్ మీద పడింది. ఇంకేముంది...చూస్తుండగానే క్షణాల్లోనే కారు పూర్తిగా కాలి పోయింది. ఈ తతంగమంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరలవుతుంది. -
ఇనాయాతో కలిసి తైమూర్, వైరల్
బాలీవుడ్ నటి కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ తనయుడు తైమూర్ మరుసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. ఈ బుడతడు పుట్టినప్పటి నుంచి తనకంటూ ఓ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకు వెళుతున్నాడు. తైమూర్ ఏం చేసినా, ఎక్కడ కనిపించినా అభిమానులకు మాత్రం పండుగే. దీంతో అతగాడు కనిపించడం ఆలస్యం కెమెరాలు క్లిక్ మనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ కావడం తెలిసిందే. తాజాగా తైమూర్ తన మేనత్త (సోహా అలీ ఖాన్) కూతురు ఇనాయా నౌమితో కలిసి ఉన్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. తైమూరు కూడా తన ఇంట్లోని స్మిమ్మింగ్ పూల్ వద్ద ఇనాయా నౌమితో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్‌గా మారాయి.