సాధారణంగా కూల్‌డ్రింక్, బీర్ సీసాల మూత తీయడానికి ఓపెనర్లు ఉపమోగిస్తాము. అవీ కూడా మార్కెట్‌లో వివిధ రూపాల్లో లభిస్తాయన్న విషయం తెలిసిందే. కానీ, షూస్ తయారు చేసే ఓ సంస్థ వినూత్నంగా ఓపెనర్లను బూటు మడమ మీద ఏర్పాటు చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ సంస్థ షూస్ మడమ మీద వెండిపూతతో దీన్ని రూపొందించింది.
ఈ షూస్‌కి ‘పార్టీ పంప్స్’ అనే పేరును పెట్టింది. దీంతో నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్లు చేస్తున్నారు. ఈ వింత షూపై ప్రముఖ డిజైనర్ మార్క్ జాకబ్స్ ‘తెలివైన ఆలోచన’గా పేర్కొంది. ‘ఎంతో వినూత్నమైన ఆలోచన’అని ఒకరు, ‘పురుషుల ఎంపిక?’ అని మరొకరు ‘షూస్‌కి ఓపెనర్ ఏంటిరా బాబు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. కాగా ఈ షూ ధరను రూ. 98,995 గా నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment