opener
-
క్రికెట్ ‘మనసు’ చదివింది!
చిన్నప్పటి నుంచి చదువులో చురుకైన అమ్మాయి... మరోవైపు అంతే స్థాయిలో క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం... ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడం అంత సులువు కాదు కాబట్టి ఏదో ఒకదానిని ఎంచుకోమని సన్నిహితులు చెప్పారు. కానీ ఇష్టంలో కష్టం ఉండదని ఆ అమ్మాయి నమ్మింది. అందుకే ఒకవైపు చదువులో ఉత్తమ విద్యారి్థనిగా ఉంటూనే తనకు నచ్చిన రీతిలో క్రికెట్లో కూడా సాధనను కొనసాగించింది. ఫలితంగా ప్లస్ టు స్థాయిలో మంచి మార్కులు సాధించడం మాత్రమే కాదు... ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కూడా మారింది. ఇప్పుడు సైకాలజీ చదువుతూనే ఏకంగా భారత సీనియర్ జట్టులోకి ఎంపికైంది. ఓపెనర్‌గా భారత్ తరఫున ఆడిన 4 వన్డేల్లో 2 అర్ధసెంచరీలు సాధించిన ఢిల్లీ అమ్మాయి ప్రతీక రావల్ భవిష్యత్తులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. –సాక్షి క్రీడా విభాగం భారత జట్టులో స్మృతి మంధానతో పాటు మరో ఓపెనర్‌గా షఫాలీ వర్మ ఐదేళ్ల పాటు రెగ్యులర్‌గా జట్టులో ఉంది. 16 ఏళ్లు పూర్తి కాక ముందే జట్టులోకి వచ్చిన షఫాలీ సంచలన బ్యాటింగ్, దూకుడైన శైలితో దూసుకుపోయింది. అయితే వరుస వైఫల్యాల తర్వాత సెలక్టర్లు షఫాలీపై వేటు వేసి కొత్త ఓపెనర్‌గా ప్రతీక రావల్‌ను ఎంపిక చేశారు. షఫాలీ స్థానంలో వచ్చిన ప్లేయర్ నుంచి సహజంగానే అలాంటి ధాటిని అంతా ఆశిస్తారు. ఇప్పుడు నిలకడైన ప్రదర్శనతో 24 ఏళ్ల ప్రతీక తాను అందుకు తగిన దానినే అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. ఆడిన 4 వన్డేల్లో ఆమె 82 స్ట్రయిక్‌రేట్‌తో వరుసగా 40, 76, 18, 89 పరుగులు సాధించి కెరీర్లో శుభారంభం చేసింది. దేశవాళీలో నిలకడైన ప్రదర్శన ఆమెకు ఈ అవకాశం కల్పించింది. మూడేళ్ల క్రితం వన్డే టోర్నీలో 155 బంతుల్లో 161 పరుగులు చేసి ఢిల్లీని నాకౌట్ చేర్చడంతో ప్రతీకకు తొలిసారి గుర్తింపు లభించింది. ఆ తర్వాత బీసీసీఐ అండర్–23 టోర్నీలో 7 ఇన్నింగ్స్‌లలో 411 పరుగులతో టోర్నీలో రెండో అత్యధిక స్కోరర్‌గా నిలవడంతో పాటు ఢిల్లీ సెమీఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. తండ్రి అండదండలతో... ఢిల్లీలోని పశ్చిమ పటేల్ నగరంలో ఉండే ప్రదీప్ రావల్ కుటుంబం కేబుల్ టీవీ వ్యాపారంలో ఉంది. ప్రదీప్ అటు బిజినెస్‌లో భాగం కావడంతో పాటు ఢిల్లీ క్రికెట్ సంఘంలో బీసీసీఐ సర్టిఫైడ్ అంపైర్‌గా కూడా పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తండ్రితో కలిసి చాలాసార్లు మైదానానికి వెళ్లిన ప్రతీకకు సహజంగానే క్రికెట్‌పై ఆసక్తి ఏర్పడింది.దాంతో 10 ఏళ్ల వయసు ఉన్న తన కూతురిని కోచ్ శ్రవణ్ కుమార్ వద్ద శిక్షణ కోసం ప్రదీప్ చేరి్పంచారు. భారత ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, నితీశ్ రాణా తదితరులకు కోచ్‌గా వ్యవహరించిన శ్రవణ్‌కు మంచి గుర్తింపు ఉంది. శ్రవణ్ శిక్షణ ఇచి్చన తొలి అమ్మాయి ప్రతీకనే కావడం విశేషం. ఆ తర్వాత స్కూల్ స్థాయి నుంచి కాలేజీ వరకు వేర్వేరు చోట్ల చక్కటి ప్రదర్శనలతో ఆమె ఆకట్టుకుంది. క్రికెట్‌తో పాటు బాస్కెట్‌బాల్ కూడా బాగా ఆడుతూ వచ్చిన ప్రతీక 2019 జాతీయ క్రీడల్లో స్వర్ణం గెలిచిన ఢిల్లీ జట్టులో సభ్యురాలిగా కూడా ఉంది. సీబీఎస్ఈ ప్లస్ 2 పరీక్షల్లో 92.5 శాతం మార్కులతో ఆమె ఉత్తీర్ణురాలు కావడం విశేషం. నిలకడైన ప్రదర్శనతో... భిన్న రంగాల్లో సత్తా చాటుతున్నా... ప్రతీక అసలు లక్ష్యం మాత్రం క్రికెట్ వైపే సాగింది. దాంతో అండర్–17 స్థాయిలో మరింత మెరుగైన శిక్షణ అవసరమని భావించిన ఆమె రైల్వే కోచ్ ధ్యాని వద్ద చేరి తన ఆటకు మరింత మెరుగులు దిద్దుకుంది. 2022–23 దేశవాళీ వన్డే సీజన్లో 14 మ్యాచ్‌లలో కలిపి 552 పరుగులు చేయడం ద్వారా తన స్థాయిని పెంచుకుంది. మరోవైపు ఢిల్లీ మహిళల జట్టు కోచ్, మాజీ ఆటగాడు దిశాంత్ యాజ్ఞిక్ కూడా ఆమె ఆటను తీర్చిదిద్దడంలో సహకరించాడు. బీసీసీఐ అండర్–23 స్థాయి టి20 టోర్నీలో కూడా రాణించిన ప్రతీక ఢిల్లీ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ ప్రదర్శనలు చూస్తే జాతీయ జట్టుకు ఎంతో దూరంలో లేదని అందరికీ అర్థమైంది. మానసికంగా దృఢంగా... ‘నేను ఒకప్పుడు క్రికెటర్ కావాలని కలగన్నాను గానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు నా కూతురి రూపంలో నా కోరిక తీరింది’ అని ప్రదీప్ రావల్ గర్వంగా చెప్పుకుంటున్నారు. బీసీసీఐ విధుల్లో భాగంగా తండ్రి వడోదరలో ఉన్న సమయంలోనే ఆమెకు తొలి వన్డే ఆడే అవకాశం రావడం యాదృచ్చికం. తన కళ్ల ముందు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రతీకను చూస్తూ ఆ తండ్రి పుత్రికోత్సాహంతో కన్నీళ్లపర్యంతమయ్యారు. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతీక... తన చదువు క్రికెట్ కెరీర్‌కూ ఉపయోగపడుతోందని చెప్పుకుంది. ‘మనుషుల మనస్తత్వాలను చదవడం గురించి నాకు బాగా తెలుసు. దానిని అర్థం చేసుకోగలిగితే అటు మైదానంలో, మైదానం బయట కూడా పని సులువవుతుంది. మ్యాచ్‌కు ముందు ఇప్పుడు ఏం చేయాలో, తర్వాత ఏం చేయాలో అనే విషయంపై నాతో నేను సానుకూలంగా మాట్లాడుకుంటా. బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా నేను అత్యుత్తమ ప్లేయర్‌గా, ఏదైనా చేయగలనని భావించుకుంటా. అది నాకు సైకాలజీనే నేర్పింది’ అని ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుత జోరును కొనసాగించి ఈ ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో భాగం కావాలని ప్రతీక ప్రస్తుత లక్ష్యంగా పెట్టుకుంది. -
ఖరీదైన ఫ్లాట్ కొన్న క్రికెటర్.. ‘డ్రీమ్ హౌజ్’ చూశారా? (ఫోటోలు)
-
హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ మృతి
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ క్రికెట్లో దూకుడైన ఓపెనర్‌గా పేరొందిన హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ మంగళవారం కన్నుమూశారు. 62 ఏళ్ల అజీమ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. 80, 90 దశకాల్లో హైదరాబాద్ మేటి ఓపెనర్‌గా వెలుగొందారు. 1986లో తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో అజీమ్ ట్రిపుల్ సెంచరీ సాధించారు. 1980 నుంచి 1995 వరకు క్రికెట్ కెరీర్ కొనసాగించిన ఆయన 73 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 4644 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలున్నాయి. అనంతరం హైదరాబాద్ జట్టుకు కోచ్‌గా, సెలక్టర్‌గా సేవలందించారు. -
‘కోహ్లి ప్రత్యామ్నాయ ఓపెనర్’
మొహాలి: ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. దాంతో టి20ల్లో రోహిత్‌తో కలిసి కోహ్లి ఓపెనింగ్ చేయాలనే సూచనలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయిు. కేఎల్ రాహుల్ వేగంగా ఆడలేడనే కారణం కూడా దానికి జోడించారు. అయితే దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి స్పష్టతనిచ్చాడు. రాహుల్‌కు మద్దతుగా నిలుస్తూ అతనే ప్రధాన ఓపెనర్ అని, కోహ్లిని తాము మూడో ఓపెనర్‌గానే చూస్తున్నామని వెల్లడించాడు. అవసరమైతే కొన్ని మ్యాచ్‌లలో కోహ్లికి ఓపెనింగ్ అవకాశం ఇస్తామని, అయితే రాహుల్ విలువేంటో తమకు బాగా తెలుసని చెప్పాడు. ‘ప్రపంచకప్‌లాంటి టోర్నీకి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉండటం మంచిదే. ఏ స్థానంలోనైనా ఆడేందుకు ఎవరైనా సిద్ధంగా ఉండాలి. అయితే ఒకసారి ఏదైనా ప్రయోగం చేశామంటే అదే శాశ్వతమని కాదు. మెగా టోర్నీకి ముందు ఆరు మ్యాచ్‌లు ఆడతాం కాబట్టి కోహ్లి ఓపెనింగ్ చేయవచ్చు కూడా. కానీ అతడిని మేం మూడో ఓపెనర్‌గానే చూస్తున్నాం. నాకు తెలిసి ప్రపంచకప్‌లో రాహుల్ ఓపెనర్‌గానే ఆడతాడు. అతనో మ్యాచ్ విన్నర్. గత రెండేళ్లుగా అతని రికార్డు చూస్తే రాహుల్ ఎంత కీలక ఆటగాడో తెలుస్తుంది. ఒక మ్యాచ్‌లో ఒకరు బాగా ఆడారని మరో బ్యాటర్‌ను తక్కువ చేస్తే ఎలా. బయట ఏం మాట్లాడుకుంటున్నారో మాకు బాగా తెలుసు. ఓపెనింగ్ గురించి మేం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎలాంటి గందరగోళం లేదు’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఆసియాకప్‌లో కొన్ని వ్యతిరేక ఫలితాలు ఎదురైనా...కొత్త తరహాలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించామని, ఇకపై కూడా అదే శైలిని కొనసాగిస్తామని కూడా రోహిత్ అన్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లతోపాటు టి20 ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీని ఆదివారం బీసీసీఐ ఆవిష్కరించింది. -
టీమిండియాకు ఓపెనర్ల కొరత.. జట్టులోకి టి20 స్పెషలిస్ట్
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు కరోనా బారిన పడడం కలకలం రేపింది. ఓపెనర్ శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, నవదీప్ సైనీ, శ్రేయాస్ అయ్యర్ సహా పలువురు సిబ్బందికి పాజిటివ్ అని తేలింది. దీంతో తొలి వన్డేకు టీమిండియాకు ఓపెనర్ల కొరత ఎదురైంది. ధావన్, రుతురాజ్‌లు కరోనాతో.. వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్ తొలి వన్డేకు దూరమయ్యారు. దీంతో మయాంక్ అగర్వాల్‌లు ఉన్న పళంగా మయాంక్ అగర్వాల్‌కు పిలుపిచ్చారు. టీమిండియా గురువారం నుంచి ప్రాక్టీస్ ఆరంభించింది. అయితే నిబంధనల ప్రకారం మయాంక్ మూడురోజులు ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. దీంతో మ్యాచ్ జరగనున్న ఆదివారం రోజున అందుబాటులోకి రానున్నాడు. చదవండి: హార్దిక్ పాండ్యాపై నిప్పులు చెరిగిన కోహ్లి చిన్ననాటి కోచ్ ఒకవేళ మయాంక్ ఆడని పరిస్థితి వస్తే ఎలా అని బీసీసీఐ యోచన చేసింది. దీంతో బ్యాకప్ ఓపెనర్‌గా టి20 స్పెషలిస్ట్ ఇషాన్ కిషన్‌ను వన్డే జట్టులోకి తీసుకుంది. ఈ ఎంపికకు ముందు ఇషాన్ కిషన్ టి20 సిరీస్‌కు మాత్రమే జట్టులో చోటు దక్కించుకున్నాడు. తొలి వన్డే వరకు రోహిత్, మయాంక్‌లకు బ్యాకప్ ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఉంటాడని తెలిపింది. రెండో వన్డేకు కేఎల్ రాహుల్ అందుబాటులోకి వస్తే.. ఇషాన్‌ను టి20 జట్టులోకి తిరిగి పంపించనున్నారు. ఒకవేళ తొలి వన్డే సమయానికి మయాంక్ ఆడకపోతే.. ఇషాన్ కిషన్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఇప్పటికే బయోబబూల్‌లో ఉంటున్నాడు. ఇక ఇషాన్ కిషన్ శ్రీలంక గడ్డపై జరిగిన వన్డే సిరీస్ ద్వారా అరంగేట్రం చేశాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే 42 బంతుల్లో 59 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన వన్డే మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఇషాన్ కిషన్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఇక 5 టి20 మ్యాచ్‌ల్లో 113 పరుగులు చేశాడు. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! -
స్టార్ హీరోపై మండిపడుతున్న నెటిజన్లు
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా వైరల్ అవుతుంది. మంచి పోస్ట్ అయితే ఏ రేంజ్లో ప్రశంసిస్తారో.. చెడు పోస్ట్‌ను కూడా అదే రేంజ్లో ట్రోల్స్ చేస్తారు. మీమ్స్, ట్రోలింగ్‌ల పేరుతో తాట తీసేస్తారు. తాజాగా బాలీవుడ్ స్టార్ రిషీ కపూర్ చేసిన పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. విజయదశమి సందర్బంగా హిందువులు ఆయుద పూజ చేస్తారు. వాహనాలకు, ఇంట్లో ముఖ్యమైన వస్తువులకు పూజలు నిర్వహిస్తారు. అయితే దసరా రోజు తన ఆయుదం అంటూ ఓపెనర్ కు రిషి కపూర్ ఆయుద పూజ చేయడంతో పాటు ఆ ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ‘ఫెస్టివ్ సీజన్ బిగిన్స్.. బాధ్యతగా వాడండి’ అంటూ ఓపెనర్‌కి పసుపు కుంకుమ రాసి ఉన్న ఫోటోని పోస్ట్ చేశారు. ఇంకేముంది ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఓ రేంజ్లో తగులుకున్నారు. ‘సీనియర్ నటుడిగా బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు పండుగ నాడు ఇలాంటి పోస్టులు చెయ్యడమేంటి’, ’ఆయుధానికీ, పరికరానికీ తేడా తెలియదా?’ ఒక సెలబ్రిటీ నుంచి ఇలాంటి పోస్ట్‌ను ఊహించలేదు’, అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు పండుగ రోజు ఇలాంటి పోస్ట్ లు పెట్టేందుకు కనీసం నీకు బుద్ది లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి కాంట్రవర్షియల్ ఫోటోలను పోస్ట్ చేయడం రిషికపూర్‌కు కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటివి పోస్ట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. గత ఏడాది క్యాన్సర్ బారిన పడ్డ రిషి కపూర్ అమెరికాలో దాదాపు 11 నెలల పాటు చికిత్స పొంది ఇటీవలే ఇండియాకు వచ్చాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో విహార యాత్రలో ఉన్న రిషి కపూర్ తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ నటించేందుకు సిద్దం కాబోతున్నట్లుగా సమాచారం. Happy Dusserah! Festive season begins. Use weapon responsibly 😊 pic.twitter.com/69YFNGvtJQ — Rishi Kapoor (@chintskap) October 8, 2019 -
ఓపెనింగ్ చేస్తానని వేడుకున్నా: సచిన్
న్యూఢిల్లీ : మార్చి 27... 1994... భారత క్రికెట్ గతిని మార్చిన రోజుల్లో ఇది అత్యంత ప్రధానమైనది. ఇదే రోజున క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తొలిసారి ఓపెనర్‌గా వచ్చాడు. న్యూజిలాండ్‌పై ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో కేవలం 49 బంతుల్లో 82 పరుగులు చేసి దుమ్మురేపాడు. ఆ తర్వాతదంతా తెలిసిన చరిత్రే. అప్పటివరకు మిడిలార్డర్లో ఆడిన తాను అనూహ్యంగా ఓపెనింగ్‌కు దిగేందుకు జట్టు మేనేజ్మెంట్ను తీవ్రంగా ప్రాధేయపడినట్లు చెప్పాడు. నాటి మ్యాచ్‌లో తన బ్యాటింగ్ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తూ అనుభవాలు పంచుకున్నాడు. ‘అప్పటివరకు వన్డేల్లో వికెట్లను కాపాడుకుంటూ పరుగులు చేసేవారు. ఓపెనింగ్‌కు దిగి నేను ఈ పద్ధతి మార్చాలనుకున్నా. ఇందుకోసం ఒక్క అవకాశం ఇమ్మంటూ, విఫలమైతే మళ్లీ అడగనంటూ జట్టు మేనేజ్మెంట్ను వేడుకోవాల్సి వచ్చింది. మ్యాచ్‌లో ప్రదర్శనతో నా ఓపెనింగ్‌పై మరో మాటకు తావు లేకపోయింది. అందుకనే... అభిమానులకు ఒక్కటే చెబుతున్నా. విఫలమవుతామనే భయంతో ప్రయోగాలకు వెనుకాడొద్దు’ అని సచిన్ చెప్పుకొచ్చాడు. -
‘షూస్‌కి ఓపెనర్ ఏంటిరా బాబు’
సాధారణంగా కూల్‌డ్రింక్, బీర్ సీసాల మూత తీయడానికి ఓపెనర్లు ఉపమోగిస్తాము. అవీ కూడా మార్కెట్లో వివిధ రూపాల్లో లభిస్తాయన్న విషయం తెలిసిందే. కానీ, షూస్ తయారు చేసే ఓ సంస్థ వినూత్నంగా ఓపెనర్లను బూటు మడమ మీద ఏర్పాటు చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ సంస్థ షూస్ మడమ మీద వెండిపూతతో దీన్ని రూపొందించింది. ఈ షూస్‌కి ‘పార్టీ పంప్స్’ అనే పేరును పెట్టింది. దీంతో నెటిజన్లు ఓ రేంజ్లో కామెంట్లు చేస్తున్నారు. ఈ వింత షూపై ప్రముఖ డిజైనర్ మార్క్ జాకబ్స్ ‘తెలివైన ఆలోచన’గా పేర్కొంది. ‘ఎంతో వినూత్నమైన ఆలోచన’అని ఒకరు, ‘పురుషుల ఎంపిక?’ అని మరొకరు ‘షూస్‌కి ఓపెనర్ ఏంటిరా బాబు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. కాగా ఈ షూ ధరను రూ. 98,995 గా నిర్ణయించింది. -
ధావన్ ఔట్
సౌతాంప్టన్: ఊహించినంతా అయింది. వరుస విజయాలతో ప్రపంచ కప్‌లో జోరు మీదున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో బాధపడుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్... టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. బుధవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆస్ట్రేలియాతో ఈ నెల 9న జరిగిన మ్యాచ్‌లో పేసర్ కమిన్స్ వేసిన బంతి బలంగా తాకడంతో ధావన్ ఎడమ బొటన వేలిలో చీలిక వచ్చింది. నొప్పితో బాధపడుతూనే ఆడిన అతడు మ్యాచ్‌లో సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మున్ముందు జట్టు అవసరాలరీత్యా ధావన్ కోలుకునే వరకు చూడాలని మేనేజ్మెంట్ భావించింది. అందుకని ఓపెనర్ మూడు మ్యాచ్‌ల వరకు అందుబాటులో ఉండడని ప్రకటిం చింది. అయితే, తాజా పరిస్థితి ప్రకారం జూలై రెండో వారం వరకు కూడా ధావన్ పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో అతడి స్థానాన్ని యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిష భ్ పంత్‌తో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే స్టాండ్‌బైగా ఎంపిక చేసిన పంత్... పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌కు ముందే జట్టుతో చేరాడు. రోహిత్, కోహ్లిపై భారం ఫామ్‌లో ఉండీ ప్రతిష్టాత్మక టోర్నీకి అనూహ్యంగా దూరం కావడం వ్యక్తిగతంగా ధావన్‌ను తీవ్రంగా నిరాశకు గురిచేసే అంశమైతే, కీలకమైన అతడి సేవలు కోల్పోవడం కోహ్లి సేనను కలవరపాటుకు గురిచేసేదే. జట్టులో ఏకైక ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన ధావన్‌కు ఐసీసీ టోర్నీల్లో అద్భుత రికార్డుంది. మొత్తం ఆరు సెంచరీలు (చాంపియన్స్ ట్రోఫీలో 3, ప్రపంచ కప్‌లలో 3) బాదాడు. అన్నింటికి మించి ధావన్–రోహిత్ శర్మ ప్రపంచ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ. వీరిద్దరు ఎన్నో చక్కటి ఆరంభాలు ఇచ్చారు. ఒకరు విఫలమైనా మరొకరు రాణిస్తూ... వన్‌డౌన్‌లో వచ్చే కెప్టెన్ కోహ్లికి అండగా నిలుస్తున్నారు. కొన్నేళ్లుగా భారత విజయ యాత్రలో ఈ త్రయానిదే ప్రధాన వాటా. ఇప్పుడు ధావన్ దూరమవడం కచ్చితంగా ప్రభావం చూపేదే. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లిపై మరింత భారం పడుతుంది. రెండో ఓపెనర్‌గా రాహుల్ ముందు పెద్ద బాధ్యతే ఉంది. జట్టు కూర్పుపై ప్రభావం ధావన్ బదులుగా ఎంపిక చేసిన పంత్‌కు తుది జట్టులో చోటు మాత్రంఅనుమానమే. అతడిని తీసుకుంటే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలి. హార్డ్ హిట్టర్ అయిన పంత్... మిడిలార్డర్‌కు తగిన రీతిలో స్ట్రయిక్ రొటేట్ చేయలేడు. రాహుల్‌పై భరోసా లేకుంటే ఓపెనర్‌గా పంత్‌ను పరీక్షించవచ్చు. అలాగైతే అది పెద్ద ప్రయోగమే అవుతుంది. ఎలాగూ స్కోరు పెంచే ఉద్దేశంలో నంబర్–4గా పాండ్యాను పంపుతున్నందున పంత్ అవసరం ఎంత అనేది చూడాలి. మరోవైపు పేసర్ భువనేశ్వర్ కండరాల నొప్పితో బాధపడుతున్న వేళ, బౌలింగ్ ప్రత్యామ్నాయంగానూ పనికొచ్చే ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ వైపే జట్టు మొగ్గు చూపే వీలుంది. రాబోయే రెండు మ్యాచ్‌లు బలహీన అఫ్గానిస్తాన్, విండీస్‌పైనే కాబట్టి వాటిపై జట్టు కూర్పును పరీక్షించుకుంటే తర్వాత తప్పొప్పులను సరిచేసుకునే వీలుంటుంది. 2019 ప్రపంచ కప్‌లో ఇకపై భాగం కాలేకపోతున్నాననే ప్రకటన చేయడానికి భావోద్వేగానికి గురయ్యా. దురదృష్టవశాత్తు గాయం సమయానికి నయం కావడం లేదు. కానీ, మన జట్టు విజయ పరంపర ముందుకు సాగాలి. జట్టు సభ్యులు, క్రికెట్ ప్రేమికులు, భారత దేశం నుంచి దక్కిన ప్రేమ, మద్దతుకు నేను ధన్యుడిని. జై హింద్! – ట్విట్టర్లో శిఖర్ ధావన్ పంత్‌కు జాక్‌పాట్! సరిగ్గా రెండు నెలల క్రితం రిషభ్ పంత్‌ను ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేయకపోవడాన్ని దిగ్గజాలు సహా అందరూ తప్పుబట్టారు. స్వయంగా పంత్ తీవ్ర నిరాశ చెందాడు. ఇప్పుడు మాత్రం అదృష్టం అతడిని మరో రూపంలో వరించింది. అన్నింట్లోనూ చోటు దక్కకున్నా పరిస్థితులు కలిసొస్తే కనీసం ఒకటి, రెండు మ్యాచ్‌ల్లోనైనా పంత్ తుది జట్టులో ఉండే వీలుంది. తద్వారా ప్రపంచ కప్ జట్టు సభ్యుడిగా చిరస్థాయిగా పేరు నిలిచే అవకాశం లభించింది. -
రాజకీయాల్లోకి రాను!
న్యూఢిల్లీ: రెండు ప్రపంచకప్ ఫైనల్స్ (టి20, వన్డే)లో జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌లాడిన భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆటకు తెరపడింది. ఇటీవలే అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన గౌతీ ఆంధ్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో చివరి సారిగా బరిలోకి దిగాడు. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో సెంచరీతో తన కెరీర్‌కు బైబై చెప్పాడు. అయితే రాజకీయాల్లోకి వస్తున్నాడనే వార్తల్ని 37 ఏళ్ల గంభీర్ కొట్టిపారేశాడు. మీడియాతో అతను మాట్లాడుతూ ‘అవన్నీ వదంతులే. నేను ట్విట్టర్ వేదికగా సామాజిక, వర్తమాన వ్యవహారాలపై చురుగ్గా స్పందించడం వల్లే బహుశా కొందరు రాజకీయాల్లోకి వస్తాడేమోనని అనుకోవచ్చు. కానీ నాకు ఆ ఆలోచన లేదు. నేను ఏ పార్టీలో చేరను, ఎన్నికల్లో పోటీ చేయను. నాకు క్రికెట్లోనే సుదీర్ఘ అనుభవం ఉంది. రాజకీయాలనేవి పూర్తిగా భిన్నం. ఆటతో అనుబంధం కొనసాగించాలంటే క్రికెట్ వ్యాఖ్యాతగా ఏసీ గదుల్లో కూర్చొని కామెంట్రీ చేయడం మాత్రమే కాదనేది నా అభిప్రాయం. నేనో ముక్కుసూటి మనిషిని. నన్నెవరూ క్రికెట్ సంఘంలో సభ్యుడిగా కోరుకోరు. కోచింగ్‌పై మాత్రం ఆసక్తి ఉంది. కొంత విశ్రాంతి తర్వాత యువకులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతా’ అని అన్నాడు. -
ఓపెనర్‌గా వరల్డ్ రికార్డు..
-
ఓపెనర్‌గా వరల్డ్ రికార్డు..
న్యూఢిల్లీ:రంజీ ట్రోఫీలో వరల్డ్ రికార్డు నమోదైంది. గుజరాత్ ఓపెనర్ సమిత్ గోయెల్ విశ్వరూపం ప్రదర్శించి వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. ఒడిశాతో జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో సమిత్ ట్రిపుల్ సెంచరీతో రికార్డులెక్కాడు. 723 బంతుల్లో 45 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 359 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో ఓపెనర్ గా 117 ఏళ్ల వరల్డ్ రికార్డును బద్ధలు కొట్టాడు. అంతకుముందు 1899 లో ఓవల్ లో సర్రే ఆటగాడు బాబీ అబెల్ నమోదు చేసిన 357 పరుగులే ఇప్పటివరకూ ఓపెనర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు. గుజరాత్ రెండో ఇన్నింగ్స్ లో భాగంగా సమిత్ 964 నిమిషాల పాటు క్రీజ్‌లో నిల్చుని ఈ రికార్డు సాధించాడు. చివరి రోజు ఆటలో భాగంగా మంగళవారం 261 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన సమిత్ ఆద్యంతం సమయోచితంగా ఆడాడు. సుమారు 180 పరుగులను ఫోర్ల రూపంలో సమిత్ సాధించడం ఇక్కడ విశేషం. సమిత్ గోయెల్ ట్రిపుల్ తో గుజరాత్ 227.4 ఓవర్లలో 641 పరుగులు చేసింది. దాంతో గుజరాత్ 706 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి ఒడిశా వికెట్ నష్టానికి 81 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
ఓపెనర్ దొరికాడా?
రాజ్‌కోట్:ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టుకు సరైన ఓపెనర్ కావాలి. దాదాపు నాలుగేళ్లుగా ఇంగ్లండ్ నిరీక్షణ ఇది. ఆండ్రూ స్ట్రాస్ వీడ్కోలు తరువాత ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సరైన ఓపెనింగ్ భాగస్వామ్యం లేక తంటాలు పడుతుంది. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ తో ఎంతో మంది జత కట్టినా వారు అంతగా విజయవంతం కాలేదు. తాజాగా దానికి పుల్ స్టాప్ పడినట్లే కనబడుతోంది. ఇంగ్లండ్ జట్టు సుదీర్ఘ అన్వేషణకు దాదాపు ముగింపు దొరికినట్లుగానే ఉంది. భారత్ తో జరుగుతున్న రాజ్ కోట్ టెస్టు ద్వారా ఇంగ్లండ్ జట్టులో అరంగేట్రం చేసిన హసీబ్ హమీద్.. అలెస్టర్ కుక్ సరైన జోడి అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత లేకపోయినా, హమీద్ ఆడిన ఇన్నింగ్స్ తో ఒక అంచనాకు వచ్చారు. తొలి ఇన్నింగ్స్ లో 82 బంతుల్లో 6 ఫోర్లతో 31 పరుగులు చేసిన హమీద్.. రెండో ఇన్నింగ్స్ లో మరింత ఆకట్టుకున్నాడు. 177 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 82 పరుగులు చేశాడు. తన అరంగేట్రం మ్యాచ్‌లోనే రాణించిన హమీద్.. ఇంగ్లండ్ భవిష్య ఆశాకిరణంగా పేర్కొంటున్నారు. అలెస్టర్ కుక్ కు 10వ భాగస్వామిగా తెరపైకి వచ్చిన ఈ 19 ఏళ్ల హమీద్‌ను ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జెఫ్రీ బాయ్ కాట్ తో పోలుస్తున్నారు. అతని బ్యాటింగ్ శైలి బాయ్ కాట్ ను పోలి ఉండటంతో హమీద్ ను బేబీ బాయ్ కాట్ గా పిలుచుకుంటున్నారు. సచిన్ స్ఫూర్తితోనే.. భారత్ తో బుధవారం ఆరంభమైన తొలి టెస్టు ద్వారా హసీబ్ హమిద్ అంతర్జాతీయ కెరీర్ ను ఆరంభించాడు. అయితే భారత్ మూలాలున్న ఈ క్రికెటర్ కు మాస్టర్ బ్లాస్టర్ సచినే స్ఫూర్తి అట. 2004లో ముంబైకు వచ్చినప్పుడు ఎంఐజీ క్లబ్లో సచిన్‌ను తొలిసారి చూశాడట. అప్పుడే సచిన్ గురించి అడిగి తెలుసుకున్న హమిద్.. తాను కూడా ఏదొక రోజు ఇంగ్లండ్ జట్టుకు ఆడాలని భావించినట్లు అతని తండ్రి ఇస్మాయిల్ హమీద్ తెలిపాడు. ఆ సమయంలో సచిన్ గురించి అడగ్గా, అతనొక ప్రపంచం గర్వించే ఆటగాడని చెప్పినట్లు తెలిపాడు. ఈ రోజు కుమారుడు ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్‌గా వెళుతున్నప్పుడు తాను ఒకింత ఉద్వేగానికి లోనైనట్లు హసిబ్ తండ్రి పేర్కొన్నాడు. క్రీజ్‌లోకి వెళ్లి కుమారుడు కుదురుకున్నాక కానీ తన మనసులో ఆందోళన తగ్గలేదన్నాడు. అయితే హమిద్ కుటుంబం ఏనాడో భారత్ నుంచి ఇంగ్లండ్ కు వెళ్లిపోయింది. గుజరాత్ నుంచి ఇంగ్లండ్‌కు వలస వెళ్లి అక్కడ పౌరసత్వాన్ని పొందింది. అయితే కుమారున్ని క్రికెటర్ గా చూడాలని తండ్రికి కోరిక ఉండటంతో అతన్ని అదే దిశలో నడిపించాడు. ఈ క్రమంలోనే అక్కడ లీగ్‌ల్లో అనేక మ్యాచ్‌లు ఆడిన హమీద్.. ఈ సీజన్ లో లాంక్ షైర్ తరపున ఆడి తన సత్తా చాటుకున్నాడు. 16 మ్యాచ్‌ల్లో 49.91 సగటుతో 1,198 పరుగులు చేశాడు. ప్రత్యేకంగా యార్క్‌షైర్‌పై అతను సాధించిన పలు సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. ఇదే హమిద్ అత్యంత చిన్నవయసులో ఇంగ్లండ్ తరపున ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మరొకవైపు ఇంగ్లండ్ తరపున పిన్న వయసులో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన రెండో క్రికెటర్ హమీద్. -
సచినే మేటి ఓపెనర్...
29 శాతం ఓట్లు సాధించిన ‘మాస్టర్’ - ప్రపంచ దిగ్గజ వన్డే జట్టు ఎంపిక మెల్బోర్న్: ప్రపంచ దిగ్గజ వన్డే జట్టుకు ఓపెనర్‌గా ఎవరుండాలనే దానిపై జరిగిన ఓ సర్వేలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అత్యధిక ఓట్లు గెలుచుకున్నాడు. ఇన్నింగ్స్‌ను మాస్టరే ప్రారంభించాలని 29 శాతం మంది బ్రిటన్ వాసులు కోరుకుంటున్నారు. క్రిస్ గేల్ (వెస్టిండీస్-25 శాతం), గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా-20 శాతం), ఆమ్లా (దక్షిణాఫ్రికా-12 శాతం), జయసూర్య (శ్రీలంక-8 శాతం) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. బ్యాటింగ్ ఆర్డర్లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డివిలియర్స్, బ్రియాన్ లారా, వివియన్ రిచర్డ్స్‌లకు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలను కట్టబెట్టారు. ఆరో స్థానం కోసం ఆల్‌రౌండర్ కలిస్ పేరును ప్రతిపాదించారు. కెరీర్లో 463 వన్డేలు ఆడిన సచిన్ 18,426 పరుగులు చేశాడు. వికెట్ కీపర్‌గా గిల్‌క్రిస్ట్ 54 శాతం ఓట్లు సాధించాడు. పాక్ స్వింగ్ కింగ్ వసీమ్ అక్రమ్‌తో పాటు గ్లెన్ మెక్‌గ్రాత్, బ్రెట్ లీ, షేన్ వార్న్ ఈ జట్టులో చోటు సంపాదించారు. స్పోర్ట్స్ డే పాఠకులతో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, ఆష్లే గేల్స్, జాసన్ గిలెస్పీలు ఈ జట్టును ఎంపిక చేసిన వారిలో ఉన్నారు.