డుబ్లిన్: విశ్వాసానికి, ప్రేమకు మారుపేరు శునకం. ఇంటా, బయట యజమానికి తోడుగా ఉంటూ తన విశ్వాసాన్ని చాటుకుంటుంది. ఒక్క క్షణం కూడా విడిచి ఉండనంటూ అల్లరి చేస్తుంది. ఐర్లాండ్ ప్రెసిడెంట్ మైఖేల్ డి. హిగ్గిన్స్ కు కుక్కలంటే ప్రాణం. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంటారు. ప్రెసిడెంట్ హోదాలో ఉన్న ఆయనతో భేటీ అయ్యేందుకు ఇతర దేశాధినేతలు వచ్చినా, వారితో చర్చలు జరుపుతున్నా కుక్కల్ని ముద్దు చేస్తుంటారు. తాజాగా మైఖేల్ పెంచుకుంటున్నమిస్నీచ్ అనే కుక్క మీడియా కాన్ఫరెన్స్ లో చేసిన అల్లరి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐర్లాండ్ కు చెందిన ప్రముఖ నటుడు టామ్ హిక్కీకి అనారోగ్య కారణంగా మరణించారు. ఆయన మరణం పట్ల నివాళులర్పించేందుకు మైఖేల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే మీడియా సమావేశం జరుగుతుండగా కుక్క మిస్నీచ్ మైఖేల్ ను తెగ ఇబ్బంది పెట్టింది. నటుడు టామ్ హిక్కీ గురించి, మాట‍్లాడే సమయంలో ప్రెసిడెంట్ మైఖేల్ చేతిని ప్రేమతో కొరికేందుకు ప్రయత్నించింది. దీంతో మిస్నీచ్ ప్రయత్నానికి అడ్డు చెబుతూ ప్లీజ్ అలా కొరక్కే అందరు చూస్తున్నారంటూ చేతులతో సైగ చేసి ..తన చేతిని పక్కకి తీసుకున్నాడు. మళ్లీ ఆడుకునేందుకు చేయందించాడు.ఈ ఫన్ని ఇన్సిడెంట్ అంతా మీడియా సమావేశంలో జరగ్గా.. ప్రస్తుతం ఆ వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment