Ireland reporter
-
ప్లీజ్..!అలా కొరక్కే అందరు మనవైపే చూస్తున్నారు
డుబ్లిన్: విశ్వాసానికి, ప్రేమకు మారుపేరు శునకం. ఇంటా, బయట యజమానికి తోడుగా ఉంటూ తన విశ్వాసాన్ని చాటుకుంటుంది. ఒక్క క్షణం కూడా విడిచి ఉండనంటూ అల్లరి చేస్తుంది. ఐర్లాండ్ ప్రెసిడెంట్ మైఖేల్ డి. హిగ్గిన్స్ కు కుక్కలంటే ప్రాణం. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంటారు. ప్రెసిడెంట్ హోదాలో ఉన్న ఆయనతో భేటీ అయ్యేందుకు ఇతర దేశాధినేతలు వచ్చినా, వారితో చర్చలు జరుపుతున్నా కుక్కల్ని ముద్దు చేస్తుంటారు. తాజాగా మైఖేల్ పెంచుకుంటున్నమిస్నీచ్ అనే కుక్క మీడియా కాన్ఫరెన్స్ లో చేసిన అల్లరి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐర్లాండ్ కు చెందిన ప్రముఖ నటుడు టామ్ హిక్కీకి అనారోగ్య కారణంగా మరణించారు. ఆయన మరణం పట్ల నివాళులర్పించేందుకు మైఖేల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే మీడియా సమావేశం జరుగుతుండగా కుక్క మిస్నీచ్ మైఖేల్ ను తెగ ఇబ్బంది పెట్టింది. నటుడు టామ్ హిక్కీ గురించి, మాట్లాడే సమయంలో ప్రెసిడెంట్ మైఖేల్ చేతిని ప్రేమతో కొరికేందుకు ప్రయత్నించింది. దీంతో మిస్నీచ్ ప్రయత్నానికి అడ్డు చెబుతూ ప్లీజ్ అలా కొరక్కే అందరు చూస్తున్నారంటూ చేతులతో సైగ చేసి ..తన చేతిని పక్కకి తీసుకున్నాడు. మళ్లీ ఆడుకునేందుకు చేయందించాడు.ఈ ఫన్ని ఇన్సిడెంట్ అంతా మీడియా సమావేశంలో జరగ్గా.. ప్రస్తుతం ఆ వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంన్నాయి. -
సైగ చేసి మరీ.. ట్రంప్ బిత్తిరి చర్య!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన బిత్తిరి వేషాన్ని బయటపెట్టుకున్నారు. ఐర్లాండ్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ పట్ల ఆయన విచిత్రంగా ప్రవర్తించారు. తన గదిలో విలేకరులతోపాటు కూర్చున్న ఆమెను సైగ చేసి పిలుచుకొని మరీ.. ‘నీ నవ్వు బాగుంది’ అంటూ అందరిముందు కితాబిచ్చారు. ఐర్లాండ్ నూతన ప్రధానమంత్రి తావోయైసెచ్ లీయో వరద్కర్‌ను ఫోన్‌చేసి అభినందిస్తూ.. మధ్యలో ట్రంప్ ఈ విధంగా ప్రవర్తించడంతో బిత్తరపోవడం ఆమె వంతు అయింది. మంగళవారం ఓవల్ ఆఫీస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐర్లాండ్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన వరద్కర్కు అభినందనలు తెలిపేందుకు ట్రంప్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ.. ‘ఎంతోమంది ఐరీష్ మీడియా ప్రతినిధులు మనల్ని చూస్తున్నారు. వాళ్లు ఇప్పుడు గది నుంచి వెళుతున్నారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడికి రా.. అందమైన ఐరీష్ మీడియా ప్రతినిధులు’ అంటూ ట్రంప్ ఆర్టీఈ రిపోర్టర్ కైట్రియానా పెర్రీని చేతితో సైగ చేసి మరీ తన దగ్గరికి పిలిపించుకున్నారు. ఐరీష్ ప్రధానితో ఫోన్లో మాట్లాడుతూనే ఆమెను ఉద్దేశించి ‘నీ నవ్వు బాగుంది’ అంటూ కితాబిచ్చారు. మొహమాటానికి ట్రంప్ దగ్గర నిలబడిన పెర్రీ అనంతరం ఈ ఘటనపై ట్విట్టర్లో స్పందిస్తూ ట్రంప్ చర్య ‘వికృతంగా’ ఉందని మండిపడింది. అమెరికా నెటిజన్లు కూడా ఆమెకు మద్దతు పలికారు. ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన వారు ట్రంప్ తరఫున ఆమెకు సోషల్ మీడియాలో క్షమాపణలు తెలిపారు.